అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..!

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన ‘మేజర్’ లుక్ టెస్ట్ వీడియో కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

నేడు(డిసెంబర్ 17) హీరో అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మేజర్’ ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్.. ‘మేజర్’ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ట్వీట్ చేసాడు. తెలుగు – ఇంగ్లీష్ – హిందీ భాషల్లో రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ లో అడవి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. శత్రువులకు గన్ ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయినట్లు అర్థం అవుతోంది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Images:

పా రంజిత్ బాక్సింగ్ డ్రామాకు ఫస్ట్ లుక్ రెడీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి… కాలా వంటి చిత్రాల్ని అందించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు పా. రంజిత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించలేకపోయినా దర్శకుడిగా పా. రంజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల తరువాత పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

స్లమ్ ఏరియా యువకుడు బాక్సర్ గా ఎదిగిన క్రమాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తురు. ఇందులో హీరోగా ఆర్య నటిస్తున్నాడు. ఇందు కోసం బాడీ బిల్డ్ చేసి బాక్సర్ గా మారిపోయిన ఆర్య తన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు. ఆర్య నటిస్తున్న 30వ చిత్రం కావడంతో `ఆర్య 30` అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

కాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 2న హీరో ఆర్య ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మండే వెల్లడించాడు. ఈ మూవీకి `సాల్పేట` అనే టైటిల్ ని పెట్టనున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ విత్ టైటిల్ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నందున అందరి కళ్ళు ఇప్పుడు దీనిపైనే వున్నాయి. ప్రీ లుక్ ని షేర్ చేసిన ఆర్య `పడగొట్టడానికి సిద్ధంగా ఉండండి!.. 2.12.2020 న # ఆర్య 30 ఫస్ట్ లుక్ ` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Related Images:

ఆది సాయికుమార్ హారర్ మూవీ ‘జంగిల్’ ఫస్ట్ లుక్..!

సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అదిగుపెట్టిన ఆది సాయికుమార్.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ “జంగిల్”. ఇందులో ఆది సరసన హీరోయిన్ వేదిక నటించింది. హారర్ జోనర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ – విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా మరియు ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ – అర్చనా చందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నోయరిక – లల్లు – మధుసూదన్ రావు – జై కుమార్ తదితరులు నటించారు. తాజాగా ‘జంగిల్’ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘జంగిల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వేదిక ఓ లాంతరు పట్టుకొని ఉండగా.. ఆ వెలుగులో ఆది ఏదో చూస్తూ షాక్ కి గురవుతున్నట్లు కనిపిస్తున్నాడు. చిమ్మ చీకటిగా ఉన్న ఓ ప్రాంతంలో చుట్టూ అస్థిపంజరాలతో ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ‘జంగిల్’ టైటిల్ కి ‘ఇది శ్వాసిస్తుంది.. ఇది దాక్కొని ఉంటుంది.. ఇది వేటాడుతుంది’ అనే క్యాప్షన్ తోనే ఈ సినిమాలో ఏదో భయంకరమైన జంతువో.. దెయ్యమో ఉండబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ అందించగా శివ నందీశ్వరన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం సమకూర్చారు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ‘జంగిల్’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ మరియు సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Related Images:

బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ‘సెహరి’ ఫస్ట్ లుక్..!

హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని దిల్ రాజు – అల్లు బాబీ – ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ వంటి సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ”సెహరి” టైటిల్ పోస్టర్ సినిమాపై ఆశక్తిని కలిగించింది. ఈ క్రమంలో నేడు హీరో హర్ష బర్త్ డే సందర్భంగా ‘సెహరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. బాలకృష్ణ ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి విషెస్ అందజేశారు.

‘సెహరి’ ఫస్ట్ లుక్ లో హర్ష సెలబ్రేషన్ మూడ్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ కలర్ ఫుల్ గా అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. కాగా జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి మరో నిర్మాత శిల్పా చౌదరీ తో కలిసి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సమకూరుస్తుండగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవలే ‘సెహరి’ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

Related Images:

అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్న పాత్రలతో యువ హృదయాల్ని దోచుకుంటోన్న అనుపమ.. త్వరలో ఓ లఘు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి సందర్భంగా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ లఘు చిత్రం నుంచి అనుపమ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ చీరకట్టుతో.. కాటుక కళ్లతో కనువిందు చేస్తోంది. తన అందమైన ఉంగరాల కురులు.. నుదుటిన పెద్ద బొట్టు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆర్ జే షాన్ ఈ లఘుచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ మిధున్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ఇన్నాళ్లూ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన అను బ్యూటీ.. ఇప్పుడు షార్ట్ ఫిక్షన్ తో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Related Images:

శింబు – నిధి అగర్వాల్ ‘ఈశ్వరన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మన్మథ’ ‘వల్లభ’ ‘నవాబ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. టి. రాజేందర్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శింబు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం శింబు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ఒకటి. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ – కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి ”ఈశ్వరన్” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘ఈశ్వరన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు తమిళ్ స్టైల్ లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నాడు. అంతేకాకుండా మోషన్ పోస్టర్ లో మెడపై క్రికెట్ బ్యాట్ పట్టుకొని ‘ఇప్పుడు వేయండిరా బాలు’ అని డైలాగ్ చెప్తున్నట్లు చూపించారు. శింబు లుక్ చూస్తుంటే గతంలో కంటే చాలా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో ఇప్పటికే ‘భూమి’ అనే సినిమాలో నటించిన నిధికి ఇది రెండో ప్రాజెక్ట్. మోస్ట్ వాంటెడ్ థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

కాగా శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘ముఫ్తీ’ ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు శింబు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు చాలా రోజుల తర్వాత వరుస చిత్రాలను అనౌన్స్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Related Images:

‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఫస్ట్ లుక్…!

‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BFH’ (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్). ఈ చిత్రంలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా రామచంద్రన్ – మధునందన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ కుంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్లపై వేణు మాధవ్ పెద్ది – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోయిన్ మాళవిక హీరో విశ్వంత్ ని తన భుజాలపై మోసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఇద్దరూ చాలా ఆనందంగా కనిపిస్తాయి. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి సరైన కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే సాంగ్స్ విడుదల కానున్నాయి. బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ అందించగా విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర – హర్షవర్ధన్ – శివ నారాయణ – రూపాలక్ష్మి – నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Related Images:

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌదర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది. అయితే షూట్ చేయబడిన 17 నిమిషాల గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు.

తాజాగా ‘నర్తనశాల’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయబడింది. ఈ పోస్టర్ ద్వారా అర్జునుడిగా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ ని రిలీజ్ చేశారు. బాలయ్య ‘నర్తనశాల’ పౌరాణిక చిత్రాన్ని ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”ఎన్బీకే థియేటర్ లో ‘నర్తనశాల’ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. శ్రేయాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఎన్బీకే థియేటర్ లో సినిమా చూడవచ్చు. టికెట్ ధర మినిమమ్ రూ. 50 పెట్టాలనుకుంటున్నాం. టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కు ఇస్తామన్నారు” అని చెప్పారు.

Related Images:

‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్… వర్మ చేతులకు బేడీలు…!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు వర్మ. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇది తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా అని.. దీనికి పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ గోపాల్ వర్మ బేడీలతో ఇన్నోసెంట్ ఫేస్ తో కనిపిస్తున్నాడు. దీనికి అమాయకమైన బాధితుడు అని పేర్కొనడం ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా టీవీ బ్రేకింగ్ న్యూస్ లో ‘ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులని’ వస్తున్నట్టుగా పోస్టర్ లో చూపించారు. వర్మ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని పీకే లుక్ పోస్టర్ ను విడుదల చేస్తానని వర్మ తెలిపారు.

కాగా వర్మ ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమాని అనౌన్స్ చేస్తూ.. ”ఇదొక ఫిక్షనల్ రియాలిటీ సినిమా అని.. ఆర్జీవీ మిస్సింగ్ అని తెలిసిన కంపెనీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. మొదట్లో పోలీసులు ఇది ఆ వివాదాస్పద డైరెక్టర్ పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తారు. చివరికి అది సీరియస్ అని రియలైజ్ అవుతారు. అప్పుడు ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు.. పవర్ఫుల్ స్టార్ ఫ్యాన్స్ – ముంబై అండర్ వరల్డ్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకునే అతని కుమారుడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెడతారు” అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ – ఒమేగా స్టార్ – సీబెఎన్ (CBEN) – లాకేష్ – WHY S జగన్ – KCAR – KTAR తో పాటు పోలీసులు గ్యాంగ్ స్టర్స్ ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని చెప్పుకొచ్చాడు.

Related Images:

వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

రామ్ గోపాల్ వర్మ తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో వరుసగా సినిమాలు తీస్తూ డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేస్తూ ఉన్న వర్మ తాజాగా ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను ప్రకటించాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన దిశ గ్యాంగ్ రేప్ ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నాడు. ఆరు నెలల క్రితమే వర్మ ఈ సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. అయితే ఇన్నాళ్లు అయినా అప్ డేట్ ఇవ్వక పోవడంతో వర్మ దిశ సినిమాను పక్కకు పెట్టాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎట్టకేలకు వర్మ నుండి ఆసినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ సెప్టెంబర్ 26న టీజర్ ను విడుదల చేస్తానంటూ పేర్కొన్నాడు. అలాగే సినిమాను నవంబర్ 26న విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. 2019 నవంబర్ 26న దిశ ఘటన జరిగింది. అందుకే అదే రోజు అంటే నవంబర్ 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వర్మ ఈ సినిమాను అయినా జెన్యూన్ గా తీస్తాడా లేదా రొమాంటిక్ యాంగిల్ అని కాంట్రవర్శీ కోసం అని కొత్త తన రొటీన్ సినిమాల మాదిరిగా తీస్తాడా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను అనురాగ్ కంచర్ల నిర్మిస్తు ఉండగా వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.

Related Images:

‘మిషన్ 2020’ ఫస్ట్ లుక్…!

‘సంభవామి యుగే యుగే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన నవీన్ చంద్ర ‘అందాలరాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడు హీరోగా నటిస్తూనే విలన్ కూడా నటిస్తూ వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ”మిషన్ 2020”. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయబడింది.

”మిషన్ 2020” చిత్రాన్ని హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకటేష్ గౌడ్ మరియు రమేష్ రాజు సంయుక్తంగా నిర్మించారు. బాబ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబ్జీ ఇంతకుముందు ‘మెంటల్ పోలీస్’ ‘ఆపరేషన్ 2019’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. సమకాలీన రాజకీయ నేపథ్యంలో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి ప్రేరణతో ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. ఇప్పటికే కంప్లీట్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శ్రీకాంత్.. 2020 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి పెద్ద సంక్షోభమని.. ‘మిషన్ 2020’ సినిమా ఆ సంక్షోభాన్ని ఛేదిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో హీరో నవీన్ చంద్ర తోపాటు నాగబాబు – జయ ప్రకాష్ లు కనిపిస్తున్నారు. ఈ సినిమా బాగా వచ్చిందని.. శ్రీరాపాక తో చేసిన ఐటమ్ సాంగ్ 2020లో సెన్సేషన్ అవుతుందని.. సినిమా మంచి విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Images:

‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామరాజు రామ్ చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ పాత్ర హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో సినీ అభిమానులకి మంచి అనుభూతిని పంచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి అభిమానులు తారక్ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవలే కరోనా నుంచి బయటపడిన రాజమౌళి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు షూటింగ్ కి వెళ్లకూడదని అనుకుంటున్నాని.. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే పది రోజుల తర్వాత తారక్ కి సంబంధించిన విజువల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తారక్ అభిమానులు ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Images: