రానా `సమానత్వం` పాలసీకి ఫిదా అయిపోయా

మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫెమినిస్టుల మనుగడ అన్నది అంత సులువేమీ కాదు. ఇక ఫెమినిజం భావజాలం ఉన్న కథనాయికలు నాయికా ప్రాధాన్యత గురించి ఆలోచిస్తారు. ముక్కు సూటిగా ఉండే నాయికలు సైతం పూర్తిగా హీరోకి ఒదిగి ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకునేందుకు ఆసక్తిగా ఉండరు. పరిశ్రమను పరిశీలిస్తే ఇదే అవగతమవుతుంది కూడా.

ఇక అందరిలాగా రెగ్యులర్ కమర్షియల్ నాయికగా నటించేందుకు సాయి పల్లవి విరుద్ధం. తొలి నుంచి తనకంటూ ఒక పంథా ఉందని నిరూపించింది ఈ యువనటి. కమర్షియల్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన పాత్రలను ఎంచుకోని రేర్ సౌత్ నాయికగా సాయి పల్లవి పాపులరైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రానా సరసన వేణు వేణు ఉడుగుల దర్శకత్వంలోని విరాఠపర్వం చిత్రంలో నటిస్తోంది. ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది.

ఎప్పటిలానే ఇందులోనూ సాయి పల్లవి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువే. ఇక తన పాత్ర తీరుతెన్నులకు తగ్గట్టే తనకు రానా అత్యంత గౌరవం ఇచ్చారని ప్రచారంలో ప్రాధాన్యతను ఇచ్చారని ప్రశంసలు కురిపించింది. రానా సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి అని ఆమె చెప్పింది. “సాధారణంగా స్త్రీకి పెద్ద పాత్ర ఉంటే.. వేసే పోస్టర్లలో మాత్రం హీరోనే హైలైట్ అవుతాడు. కానీ విరాఠపర్వం టైటిల్ కార్డుల్లో నా పేరు తన కంటే ముందుగానే ఉండాలని రానా నాకు చెప్పారు. ఎందుకంటే నేను ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. రానా సమానత్వాన్ని నమ్ముతారు. అతనితో పనిచేయడం ఒక బ్లెస్సింగ్“ అని సాయి పల్లవి అంది. విరాటపర్వం చిత్రీకరణను పూర్తి చేసి సాధ్యమైనంత తొందర్లో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Related Images:

డాన్స్‌ కంటే శ్రద్ధ హాట్‌ క్లీవేజ్‌ షోకి యూత్ అంతా ఫిదా.!

సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన బెంగాలీ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌ ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోవడంతో హీరోయిన్‌గా కెరీర్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వస్తుంది. ఎట్టకేలకు ఈ అమ్మడు మెల్లగా కెరీర్‌లో సెట్‌ అవుతోంది. గత పుష్కర కాలంగా ఈమె చేసిన సినిమాలు చాలానే ఉన్నా ఈమెకు స్టార్‌ డం తెచ్చి పెట్టిన సినిమాలు మాత్రం తక్కువే అనడంలో సందేహం లేదు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళి, కన్నడం, మలయాళి సినిమాల్లో కూడా నటించింది. ఇన్ని భాషల్లో నటించిన అరుదైన రికార్డును దక్కించుకున్న ఈ భామ అందాల ఆరబోతకు ఎప్పుడూ నో చెప్పింది లేదు. రీసెంట్ గా ఓ 18+ కంటెంట్ సీరీస్ లో కూడా నటించి కుర్రకారుకి పిచ్చెక్కించింది.

తాజాగా శ్రద్ధ షేర్‌ చేసిన ఒక వీడియోలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో హాట్‌ కాస్ట్యూమ్స్‌ తో క్లీవేజ్‌ షో చేస్తూ డాన్స్‌ చేస్తూ ఉంది. బెడ్‌ పై దొర్లుతూ ఈ అమ్మడు చేసిన అందాల విందుకి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. బాబోయ్‌ ఈ అమ్మడి రచ్చ ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. స్టార్‌డం లేకున్నా కూడా ఎప్పుడు బిజీగా ఉండే శ్రద్ధ షేర్‌ చేసిన ఈ హాట్ వీడియోని నెటిజన్స్‌ షేర్స్ మీద షేర్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కుర్రకారు మరియు ఆమె ఫాలోవర్స్‌ ఇలాంటి వీడియోలను షేర్‌ చేస్తే నిద్ర పట్టేది ఎలా అంటూ ఫన్నీ కామెంట్‌ లు పెడుతున్నారు.

Related Images:

హంస బ్యూటీకి ఫిదా అవ్వాల్సిందే

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ హంసా నందిని ఐటెం సాంగ్స్ తో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ రెగ్యులర్ గా ఈ అమ్మడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టులు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. థైస్ బ్యూటీని చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. 2017లో జై లవకుశ చిత్రం తర్వాత ఈ అమ్మడు మళ్లీ పెద్ద సినిమాల్లో నటించలేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడు పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

హంసా నందిని ఆఫర్ల కోసం ఇలా థైస్ బ్యూటీని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హంసా నందిని సోషల్ మీడియా పోస్ట్ లతో అయినా మళ్లీ ఆఫర్లు దక్కించుకుంటుందా అనేది చూడాలి. మంచి ఫిజిక్ మరియు అందం ఉన్నా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలు ఎక్కువగా వ్యాంప్ తరహాలో ఉన్నాయి. అందుకే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్లు తక్కువగా వస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

Related Images:

హీరో ఫేస్బుక్ పోస్టుకు మాజీ భార్య ఫిదా.. విడాకులు రద్దు చేయాలంటూ కోర్టుకు

రెండేళ్ల క్రితం విడిపోయిన ఓ జంట ఇప్పడు తమ డైవర్స్ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తాము విడాకులు తీసుకున్నప్పటికీ సంతోషంగా లేమని.. ప్రస్తుతం తాము కలిసి ఉండాలనుకుంటున్నామని ఆ జంట కోర్టుకు అభ్యర్థించింది. మై తేరా హీరో జిస్మ్ 2 మొహంజోదారో సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2016 డిసెంబర్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం అయ్యింది. అయితే పెళ్లయ్యాక భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. పెంపుడు కుక్కల విషయంలో వీళ్లిద్దరూ గొడవపడ్డారు. అనంతరం విడాకులు కోసం కోర్టుకు వెళ్లగా.. 2019 లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అప్పట్లో వీరి విడాకులు పెను సంచలనంగా మారింది. ఈ పోస్టు ఎంతో వైరల్ అయింది. లీ కెనడాకు వెళ్లిపోయింది. అయితే తాజాగా తమ విడాకులను రద్దు చేయాలంటూ అరుణోదయ్ భార్య లీ ఎల్టన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు తీవ్రమైనవి కావని వెంటనే డివోర్స్ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని లీ విజ్ఞప్తి చేశారు.

కేసును విచారించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలను తమకు సమర్పించాలంటూ కోర్టు లీ ని ఆదేశించింది. ఈ కేసును అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కాగా ప్రేమపెళ్లి చేసుకున్న అరుణోదయ్ గత ఏడాది డిసెంబర్లో తన వైవాహిక జీవితం గురించి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఓ పోస్ట్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ పోస్టును చదివిన లీ ఫిదా అయ్యిందట. దీంతో ఆమెకు మళ్లీ ప్రేమ చిగురించిదట. ఏది ఏమైనా చిన్నచిన్న విషయాలకే ప్రస్తుతం కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుండగా.. విడిపోయిన ఏడాదికి వీరి మధ్య ప్రేమచిగురించడం గొప్పవిషయమే.

Related Images:

మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ఎక్కించాడు. ఆవును ఎక్కడికో తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించిన ఎద్దు వాహనంను వెంబడించింది. వాహనంకు అడ్డుగా నిలిచింది. డ్రైవర్ వద్దకు వెళ్లి జాలిగా చూసింది. ఈ మొత్తం వ్యవహారం వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.

జూన్ నెలలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు చూడలేదో లేక మరేంటో కాని సమంత ఇప్పుడు ఆ వీడియోకు స్పందించింది. వీడియోను రీ ట్వీట్ చేసి హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. ఒక్క లవ్ సింబల్ తో సమంత తాను చెప్పాలనుకున్నది చెప్పేసింది. ఆ మూగ జీవుల మద్య ఉన్న అన్యోన్యం మరియు ఆప్యాయత ఎలాంటిదో వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది. మనసున్న ఏ ఒక్కరు అయినా ఖచ్చితంగా వీడియోకు కదిలి పోవాల్సిందే. సమంత కూడా కదిలి పోయి ప్రేమకు చిహ్నం అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. సమంత రీ ట్వీట్ వల్ల మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

True love still exists❤️❤️❤️
Touching story from India

Related Images: