దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రం

రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ జంటగా అమితాబచ్చన్.. నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమా గురించి గత రెండేళ్లుగా బాలీవుడ్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ జాతీయ మీడియాలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు ఖర్చుచేయనంత బడ్జెట్ ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నట్లుగా హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ప్రకటించారు.

ఖచ్చితంగా ఎంత బడ్జెట్ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కాని 2.ఓ… సాహో మరియు బాహుబలిని మించిన బడ్జెట్ తో బ్రహ్మస్త్ర రూపొందుతున్నట్లుగా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల బడ్జెట్ కంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అంటూ వారు చెబుతున్నారు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డిస్నీ సంస్థ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరి కొన్నాళ్లకు పూర్తి అవ్వబోతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related Images:

నాగ్ ‘బ్రహ్మస్త్ర’ నిర్మాతకు థ్యాంక్స్

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మస్త్ర మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ చర్చలు జరిపిందట. భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి డైరెక్ట్ రిలీజ్ హక్కులను అడిందట. ఈమద్య కాలంలో వరుసగా కరణ్ సినిమాలు ఓటీటీలో వచ్చాయి. ఇంకా ఓటీటీ కోసం ఆయన వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాడు. కనుక బిజినెస్ పరంగా చూసుకుని బ్రహ్మాస్త్రను ఓటీటీకి ఇచ్చేస్తాడేమో అంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది.

కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాను ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుంది. ఇలాంటి సినిమాను వెండి తెరపై చూస్తేనే బాగుంటుంది. అలా కాదని సినిమాను సింపుల్ గా ఓటీటీ లో విడుదల చేస్తే ప్రేక్షకులు థ్రిల్ మిస్ అవుతారు అంటూ ఓటీటీ భారీ ఆఫర్ ను సున్నితంగా తిరష్కరించాడట. అమితాబచ్చన్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాను కరణ్ జోహార్ డబ్బుల కోసం చూసుకోకుండా థియేటర్ రిలీజ్ కు వెళ్లాలని అనుకోవడంతో ఆయనుకు సినీ అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. నాగార్జున నటిస్తున్నందుకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాను అక్కడ ఇక్కడ ఒకే సారి భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాగ్ హిందీలో నటించాడు. రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Images: