
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడమే కాదు..అంతకు మించి గొప్ప మనసు ఉంటుందని ఎంత మందికి తెలుసు? అవును ఈ సన్నివేశం చూసిన తర్వాత తప్పకుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామగా పాపులర్ అయిన మలైకా అరోరా మనసు ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలదా? హీరోయిన్లు అంటే ముఖానికి మ్యాకప్ వేసుకుని తిరిగే వాళ్లే కాదు…ఇలా సమయం వచ్చినప్పుడు మంచి హృదయాన్ని చాటుకుంటారని ప్రూవ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మలైకా అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంది.
ఆమెని చూసిన ఓ చూసిన ఓ ఫిజికల్ ఛాలెజెండ్ పర్సన్ ఆమెతో సెల్పీ దిగాలని ఆశపడ్డాడు.దీంతో అటు గా వస్తున్న మలైకా దగ్గరగా తనకు దేవుడిచ్చిన బలంతోనూ అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లాడు. దాన్ని గమనించిన మలైకా అతన్ని స్వాగతించి దగ్గరకు తీసుకుంది. ఆ సమయంలో ఆ యువకుడు మలైకా నడుం మీద సపోర్ట్ కోసం చేయివేసాడు. మలైకా ఇంచు కూడా కదల్లేదు. ఆ సమయంలోయువకుడి మీద కోపపడటం కానీ..చిరాకు పడడటం కానీ ఏదీ చేయలేదు. నవ్వుతూ అతనితో కలిసి కెమెరా వైపు చూసి ఫోజులిచ్చారు.
ఇది చూసిన నెటి జనులు మలైకా మనసు ఎంత గొప్పది? అంటూ పొగిడేస్తున్నారు. నిజమే ఆసన్నివేశం చూసిన తర్వాత మలైకా మీద అభిప్రాయం అంతా ఎంతో పాజిటివ్ గా మారిపోతుంది. గ్రేట్ మలైకా అనకుండా ఉండలేం. కొంతమంది అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ చూసి దూరంగా జరుగుతారు. ఫోటోలు ఇచ్చినా డిస్టెన్స్ మెయింటెన్ చేస్తుంటారు. కానీ మలైకా ఆటైపు కాదు. దగ్గరకు తీసుకుని ప్రేమని చాటే ప్రయత్నం చేసింది. అలా ఫోటో దిగే సరికి ఆ యువకుడి కళ్లలో పట్టలేని ఆనందం కనిపించింది.
సరిగ్గా ఇదే క్వాలిటీ టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాధ్ కి ఉంది. ముంబైలో ఆయన్ని ఎవరు గుర్తించి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఈయనా ఎంతో సంతోషంగా చేయి అందిస్తాడు. తనమన అదే బేధం లేని దర్శకుడు. జిందగీలో జీవితాన్ని చాలా కూల్ గా..లైట్ గా తీసుకునే దర్శకుడీయన.
స్త్రీని ఆకాశంలో సగం అని వర్ణిస్తారు కవులు. ఆకాశం అయినా అందాలన్న సిద్ధాంతాన్ని చాలామంది మహిళామణులు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పురుషాధిక్యత ఉండే రంగుల లోకంలో దేనికీ ఝడవక ముందుకు సాగుతూ ధీశాలి అనిపించే అరుదైన నాయికలు ఉన్నారు. అలాంటి కాన్ఫిడెంట్ గాళ్స్ ఎవరున్నారు? అన్నది వెతికితే అందులో తొలిగా ఛయ్య ఛయ్యా గాళ్ మలైకా అరోరా పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
లైఫ్ లో ఏ నిమిషాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉండని మలైకా తాను ఏం చేయాలనుకుంటే అది చేసి చూపించారన్నది సన్నిహితుల మాట. లైఫ్ లో రసాస్వాధన లేనిదే ఏదీ లేదని నిరూపించిన నృత్యకళాకారిణి తాను. నచ్చని వారికి దూరం జరిగి నచ్చిన చెలికాడికి చేరువైన డేర్ తనకే సాధ్యమైంది.
ఇక ఆ తర్వాత ఎంతో హ్యాపీ లైఫ్ ని ఆస్వాధిస్తూ నిరంతరం దానిని పబ్లిక్ లోనే ఆవిష్కరిస్తూ తన వర్గంతో ఎంతో జాయ్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ మలైకా తన గేమ్ ని తానే మార్చుకుంది. ప్రస్తుతం సోదరి అమృత అరోరా గోవా 5 బీహెచ్ కే ఇంట్లో ప్రియుడు అర్జున్ కపూర్ తో కలసి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ లో ఉంది మలైకా. అక్కడ స్విమ్మింగ్ పూల్ చెంత యోగాభ్యాసం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోల్ని నిరంతరం షేర్ చేస్తోంది. ఇప్పుడు మరో హాట్ ఫోటోని మలైకా షేర్ చేసింది. అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో ఈ ఫోటో దూసుకుపోతోంది. అందనంత ఎత్తులో ఉన్నా అందుకోవడమే నా స్టైల్ అని లోకానికి చెబుతున్నట్టే ఉంది కదూ?
50 కి చేరువవుతున్నా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కాకలు పుట్టిస్తోంది అందాల సోయగం మలైకా అరోరా. 36 ఏజ్ హీరో అర్జున్ కపూర్ తో లవ్వాయణంలో ఉందంటే అంతగా నవనవల్ని మెయింటెయిన్ చేస్తూ వయసును కప్పి పుచ్చేసే ట్యాలెంట్ ఉంది కాబట్టే.
నిరంతరం యోగా జిమ్ దాంతో పాటే పర్ఫెక్ట్ ఆహార నియమాల్ని పాటిస్తూ ఈ అద్భుత రూపాన్ని సాధించుకుంది మలైకా. దేవతలకు అయితే అమృతం కావాలి కానీ మలైకా అండ్ గర్ల్స్ గ్యాంగ్ కి అలాంటివేవీ అవసరమే లేదన్న కామెంట్లు యూత్ లో వినిపిస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వైఫ్స్ పై ప్రత్యేక సెలబ్రిటీ షోని ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇందులో మలైకా లాంటి ఫేజ్ 3 భామల సొగసరి సోయగాల వెనక దాగున్న రహస్యాల్ని బయట పెట్టేయనున్నారు.
ఈ కార్తీక సోమవారం మలైకా అరోరా స్పెషల్ యోగాసనంతో ఆకట్టుకుంది. ప్రతి వారంలానే ఈసారీ ఇన్ స్టాగ్రామ్ సిరీస్ తో తిరిగి వచ్చింది. ఫిట్ నెస్ స్ఫూర్తితో కొత్త వారాన్ని ప్రారంభించడం కంటే గొప్ప ఇంకేదీ లేదు. మలైకా ప్రతి క్రొత్త పోస్ట్ మన కోసం మాత్రమే చేస్తోంది.
మలైకా అరోరా మూవ్ ఆఫ్ ది వీక్న ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారుతోంది. ఈ వారం ధనురాసనా లేదా బో పోజ్ అనే యోగా భంగిమను ఎంచుకుంది మలైకా. ఇది వెనుకకు వంగే ఆసనం. పాస్టెల్ పింక్ గ్రే స్పోర్ట్స్ బ్రా టైట్స్ ధరించిన మలైకా పర్ఫెక్ట్ భంగిమతో ఫిట్ అయ్యింది. ఈ ఫోటోని ఇన్ స్టాలో పంచుకుంది. పరిపూర్ణ సోమవారం ప్రేరణ! అన్న వ్యాఖ్యతో ఆకర్షించింది.
కోవిడ్ 19 నుండి కోలుకున్న తర్వాత నటి మలైకా అరోరా ఇటీవలే తిరిగి డ్యూటీని ప్రారంభించారు. షో ఇండియా బెస్ట్ డాన్సర్ జడ్జిగా సెట్స్ కి తిరిగి వచ్చింది. యథావిధిగా తిరిగి పనిలో పడడమే గాక ప్రియుడు అర్జున్ కపూర్ తో షికార్లు సాగించడం బయటపడింది. ఇటీవల ఆమె నగరంలో జనసందోహం మధ్యకు వెళితే.. అవసరమైన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. మాస్క్ ధరించి మలైకా తనను తాను సురక్షితంగా ఉంచడానికి అన్నిటినీ పాటిస్తోంది.
ఇక ఫ్యాషనిస్టా కాబట్టి తన గెటప్ చూసేందుకు తలలు తిప్పేలా చేస్తోంది. మంగళవారం మలైకా ఛాయాచిత్రకారులు ఫ్రేమ్ లో వైట్ అండ్ వైట్ రూపంతో తలలు తిప్పి చూసేలా ట్విస్టిచ్చింది. బెలూన్ స్లీవ్ లతో తెల్లటి చొక్కా ధరించి కనిపిస్తుంది. ఆ గెటప్ లో మలైకా నీలిరంగు ముసుగు ధరించి కనిపించడం ఇంట్రెస్టింగ్. ఆమె భవనం నుండి తన కారు వైపు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆమె చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉంది. ఫోటోల కోసం పోజులివ్వడమే గాక అందరినీ దూరంగా ఉండాలని కోరింది.
మలైకా భారతదేశపు బెస్ట్ డ్యాన్సర్ షో చిత్రీకరణలో చేరాక తన పనిలో ఉన్న సరదా గురించి అభిమానులకు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంది. ఇటీవల… ఫరా ఖాన్ ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులతో కలిసి మలైకాతో చేరారు. మలైకా- ఫరా ఒక ఫోటోకు ఫోజిచ్చారు. ఇది మాత్రమే కాదు ఫలై ఖాన్… టెరెన్స్ లూయిస్ … గీతా కపూర్ తన వానిటీ వ్యాన్లో కూర్చుని మెయిన్ హూన్ నా దర్శకుడు తయారుచేసిన రుచికరమైన ఆహారాన్ని రుచి చూసే వీడియోను కూడా మలైకా పంచుకున్నారు.
బాలీవుడ్ హాటీ మలైకా అరోరాకు కొన్ని వారాల ముందే COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దాని నుండి కోలుకుంది. ఈలోగానే ఇదిగో ఇలా వీధుల్లో ప్రత్యక్షమై షేక్ చేయడం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. మలైకా అరోరా ముసుగు వేసుకుని ఇదిగో ఇలా వీధుల్లో వాకింగ్ చేస్తూ ట్రీటిస్తోంది.
ఇదివరకూ అభిమానులు శ్రేయోభిలాషులు మలైకా అరోరా COVID-19 తో బాధపడుతున్నట్లు ప్రకటించినప్పుడు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రియుడు అర్జున్ సహా అందరూ హ్యాపీనే. మొన్నటికి మొన్న సోదరి అమృత అరోరాను కలవడానికి మలైకా తన నివాసం నుండి బయటికి వచ్చింది. స్వతహాగానే ఫిట్నెస్ ఔత్సాహికురాలు కావడంతో.. తన సాధారణ వ్యాయామ దినచర్యను ఇప్పటికే ప్రారంభించేసిందట. అందుకు ఈ తాజా ఫోటోలే రుజువు.
జస్ట్.. కొన్ని గంటల క్రితం బాంద్రా వీధుల్లో నడుస్తున్నప్పుడు మలైకా అరోరా పై ఫ్లాష్ ల మెరుపులు మొదలయ్యాయి. పూర్తిగా జిమ్ వేర్ లో కనిపిస్తున్న ఫోటోలు అంతర్జాలాన్ని చుట్టేశాయి. ఇక ఇంతకుముందు ప్రియుడు అర్జున్ కపూర్ కి కూడా COVID-19 సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని అతడు కూడా వ్యాయామం చేస్తున్నాడట. లాక్ డౌన్ కి ముందు అర్జున్ కపూర్ – మలైకా అరోరా కలిసి రకరకాల కార్యక్రమాల్లో కలిసి కనిపించారు. ఇది వివాహ పార్టీలు లేదా ఫ్యాషన్ షోలు అయినా.. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కలిసే షికార్లు చేశారు. ఇటీవల ఎవరికి వారు వ్యాధి నుంచి కోలుకుని జాగ్రత్తగానే ఉంటున్నారట.
బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ మలైకా అరోరా అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వ్యవహారం గత ఏడాదిన్నర కాలంగా మీడియాలో చర్చనీయాంశంగానే ఉంది. వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని పెళ్లి విషయంలో మాత్రం వీరు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించడం లేదు. అసలు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు వారు చెప్పలేదు. ఇద్దరి మద్య వ్యవహారం ఉందని పలు సందర్బాల్లో వీరు బయట కనిపించడం వల్ల తెలిసింది. తాజాగా కరోనా వల్ల వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.
అర్జున్ కపూర్ తాను కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆయన పాజిటివ్ అంటూ ప్రకటన వచ్చిన కొద్ది సమయం గ్యాప్ తో మలైకా అరోరా కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది అంటూ ఆమె సోదరి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇద్దరికి ఒకే సారి కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వీరిద్దరు కలిసే ఉంటున్నారు అనిపిస్తుంది.
పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో చాలా మంది సహజీవనం సాగిస్తున్నారు. వారిలో వీరు ఒక జంటగా నెటిజన్స్ అంటున్నారు. మలైకా కంటే వయసులో చిన్న అయిన అర్జున్ కపూర్ హీరోగా కెరీర్ ఏమాత్రం సరిగా లేదు. ఇలాంటి సమయంలో ఆమె ప్రేమలో మునిగి తేలుతు కెరీర్ విషయంలో అశ్రద్ద చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మలైకా ఇప్పటికే దాదాపుగా అయిదు పదుల వయసుకు దగ్గరకు వస్తుంది. కనుక ఆమె సినీ కెరీర్ పూర్తి అయినట్లే అంటున్నారు. కరోనా బారిన పడ్డ అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
మాజీ భర్త అర్బాజ్ ఖాన్ డ్రైవర్ కు మలైకా అరోరా డ్రైవర్ తన రహస్యాన్ని లీక్ చేశాడా? అంటే అవుననే గుసగుసలు బాలీవుడ్ లో హీటెక్కిస్తూనే ఉన్నాయి. తన గురించి అర్జున్ కపూర్ గురించి తన సోదరుడు బాబ్లూ (అర్బాజ్ ఖాన్ డ్రైవర్) కు తన ప్రైవేట్ సమాచారాన్ని లీక్ చేశాడని మలైకా అరోరా తన డ్రైవర్ ముఖేష్ ని అనుమానించేవారని టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది.
గత సంవత్సరం నుండి మలైకా అర్జున్ బీచ్ లో ఒకరిపై ఒకరు తమ ప్రేమను బహిరంగంగా చాటింపు వేశారు. అర్జున్ తో ఎఫైర్ కి సంబంధించిన ప్రతి ఫోటో లీకయ్యాయి. ఆ ఇద్దరూ తరచుగా వారి వయస్సు వ్యత్యాసంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నా.. అదేమీ పట్టనట్టు వ్యవహరించారు.
అర్జున్ -మలైకా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పట్ల సల్మాన్ ఖాన్ అలానే బోనీ కపూర్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారమైంది. అర్జున్ ని అతడి తండ్రి బోనీలను కూడా తన ఇంటిలోనికి ప్రవేశించకుండా సల్మాన్ నిషేధించాడని కథనాలొచ్చాయి.
అయితే ఈ లీకులన్నీ ఎవరి వల్ల బయటికి వచ్చాయి? అంటే.. అర్జున్ తో తనకున్న సంబంధం గురించి మలైకా తన డ్రైవర్ ముఖేష్ ఆయన సోదరుడు బాబ్లూకు లీక్ చేశాడని అనుమానించారట. ముఖేష్ మరియు అతని సోదరుడు బాబ్లూను రిక్రూట్ చేసుకుంది అర్బాజ్. వారిని ఇరువురికి డ్రైవర్లుగా నియమించినది ఆర్బాజ్ ఖాన్ నే.
ముఖేష్ మలైకా డ్రైవర్ .. బాబ్లూ అర్బాజ్ కోసం డ్రైవర్ గా పని చేశాడు. ఇద్దరు డ్రైవర్లు ఆ జంట విడిపోయిన తర్వాత కూడా మాజీ జంట కోసం పని కొనసాగిస్తున్నారట. మొత్తానికి ఆ ఇద్దరి వల్లనే అన్ని విషయాలు బయట లీకులు అందాయన్నది మలైకా అనుమానమట.