మహమ్మారి సీజన్ వల్ల రొమాన్స్ మర్చిపోయా..!

కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం మిల్కీ బ్యూటీ తమన్నా తిరిగి సెట్స్ లో జాయినైన సంగతి తెలిసిందే. కన్నడ హిట్ మూవీ `లవ్ మోక్ టైల్` తెలుగు రీమేక్ `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో నటిస్తోంది.

ఈ మూవీ రొమాంటిక్ డ్రామా కాబట్టి తమన్నా కాస్త విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుత మహమ్మారీ పరిస్థితుల కారణంగా తాను తెరపై శృంగారం చేయడం మర్చిపోయానని తెలిపింది. తెర కోసం రొమాన్స్ చేసి చాలా కాలమైందని కూడా మిల్కీ అన్నారు. “నేను ఒక లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయ్యింది. తెరపై రొమాన్స్ చేయడం మర్చిపోయినట్లు అనిపిస్తోంది. అద్భుతమైన స్క్రిప్ట్ కారణంగా నేను ఈ ప్రాజెక్టుకు వెంటనే అవును అని చెప్పాను ” అని తమన్నా మీడియాతో సంభాషిస్తూ చెప్పారు.

ఈ చిత్రంతో పాటు స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ లోనూ నటిస్తోంది. ఆ మూవీలో తెలంగాణ జట్టుకు కబడ్డీ కోచ్ గా కనిపిస్తుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్న బోలే చుడియన్ అనే హిందీ చిత్రంలోనూ తమ్మూ నటిస్తోంది. ఇదే గాక అంధాధున్ రీమేక్ లోనూ నటించాల్సి ఉంది. ఈ మూవీలో టబు పోషించిన పాత్రను తమన్నా చేయనుంది. నితిన్ ఆయుష్మాన్ ఖుర్రానా పాత్రలో నటిస్తారు. నభా నటేష్ .. రాధికా ఆప్టే పాత్రలో చేస్తుంది. తాజాగా తమన్నా రెడ్ హాట్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Related Images:

భారత్ పై మరో మహమ్మారి దాడి…బీ అలర్ట్

కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తో పాటు చాలా ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మొదట జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో కరోనా చాలా దేశాలను కకావికలం చేసింది. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలుసుకునేసరికి నష్టం జరిగింది. ఇంకా కరోనా బారినుంచి ప్రపంచ దేశాలు కోలుకోక కొద్ది రోజుల క్రితం చైనాలో బ్రూసెల్లోసిస్ అనే మరో మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ లోనూ ఈ వ్యాధి ప్రబలే అవకాశాలున్నాయని అప్రమత్తంగా లేకుంటే ఇది కరోనా తరహాలోనే మరో పెను విపత్తుకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రూసెల్లోసిస్ను ‘మాల్టా ఫీవర్’ ‘మెడిటెర్రేనియన్ ఫీవర్’ అని కూడా పిలుస్తారు. జ్వరం తలనొప్పి కడుపు నొప్పి కీళ్లు కండరాల నొప్పి వెన్ను నొప్పిచలి చెమటలు పట్టడం ఆయాసం అలసట ఆకలిగా లేకపోవడం బరువు తగ్గడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. దీని బారిన పడ్డవారు కోలుకునేందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చు. కరోనామాదిరిగానే కొన్ని రకాల యాంటీ బయాటిక్స్తో ఈ వ్యాధిని నయం అవుతుంది. చైనాలోని ఓ ఫార్మాస్యుటికల్ కంపెనీలో పురుడుపోసుకున్న ఈ వ్యాధి… ల్యాన్ఝౌ నగరంలో 3వేల మందికి సోకింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రధానంగా ఈ బ్రూసెల్లో అనే బ్యాక్టీరియా వల్ల బ్రూసెల్లోసిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.మనిషి నుంచి మనిషికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు ఆనవాళ్లు లేవని సీడీసీ తెలిపింది.

పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. పాడిపంటలకు నెలవైన భారత్ లో పశువుల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆవులు గేదెలు పందుల ద్వారా ఈ వ్యాధి మనుషఉలకు సోకుతుందని చెబుతున్నారు. సరిహద్దు దేశమైన చైనా నుంచి ఈ వ్యాధి పొరుగుదేశాలకు జంతువుల ద్వారా మనుషుల ద్వారా సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారితోపాటు స్వదేశంలోని వారిపై కరోనా టెస్టులతోపాటు బ్రూసెల్లోసిస్ నిర్ధారణ పరీక్షలూ చేయాలంటున్నారు. అయితే భారత్ లో గతంలోనూ బ్రూసెల్లోసిస్ కేసులు వచ్చాయని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మాదిరిగా ఇది మరో మహమ్మారిలా మారకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Related Images:

మహమ్మారి మళ్లీ రిటర్న్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల ఫైన్!

ఇంకో ఒకటో దశ కరోనా మహమ్మారి తగ్గక ముందే ఇంగ్లాండ్ లో అప్పుడే రెండో దశ కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండో దశ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 10 000 పౌండ్ల (రూ. 10 లక్షలు ) జరిమానా విధిస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ నిర్ధారణ అయిన వాళ్లు అనవసరంగా బయట తిరగొద్దని 14 రోజులు ఐసోలేషన్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనాపై బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ ‘ కరోనా రెండో దశ మహమ్మారి మొదలైంది. ఫ్రాన్స్ స్పెయిన్ యూరప్ లలో కూడా ఈ ప్రభావం మొదలైంది. ప్రతి ఒక్కరూ మహమ్మారిపై నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలి. అదొక్కటే నివారణకు మార్గం. కొత్త నిబంధనల్లో భాగంగా ఆరుగురు కంటే ఎక్కువగా ఒకచోట గుమిగూడవద్దు. అందరూ నిబంధనలు పాటిస్తే ఐసోలేషన్ లో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడతామనే పరిస్థితులే రావని’ ఆయన సూచించారు. అధికారులు వాయువ్య ఉత్తర మధ్య ఇంగ్లాండ్ లలో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆంక్షలు అతిక్రమిస్తే 1000 పౌండ్ల జరిమానా కాగా పదే పదే ఉల్లంఘించినా అంతర్జాతీయ ప్రయాణాలు చేసి క్వారంటైన్ లో ఉండకపోయినా జరిమానా 10 000 పౌండ్లు విధిస్తామని అధికారులు తెలిపారు. కాగా క్వారంటైన్ లో ఉన్నపుడు ఇంటి నుంచి పనిచేసుకోలేని వారికి ప్రభుత్వం 500 పౌండ్లు చెల్లిస్తోంది. రెండో దశ కరోనా అన్ని దేశాలకు ప్రబలితే ప్రాణ నష్టం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నం అయ్యే పరిస్థితి ఉంది.

Related Images: