‘బద్రి’ సినిమా షూటింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరా నందన్ – ఆద్య అనే ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ‘జానీ’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. పవన్ నటించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. అయితే వీరి జీవితం సాపీగా సాగలేదు. కొన్ని రోజుల తర్వాత వ్యక్తిగత కారణాలతో పవన్ – రేణు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్.. అన్నా లెజ్నేవా అనే రష్యన్ యువతిని మూడో వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ.. ఎందుకో ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. పవన్ నుంచి విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది.
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడిపోయినప్పటికీ పిల్లల కోసం కలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా వీలు కుదిరినప్పుడల్లా రేణు ఇంటికి వెళ్లి అకీరా – ఆద్యలతో సమయం గడిపి వస్తుంటాడు. రీసెంటుగా పవన్ తన పిల్లల కోసం రేణు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లలతో ఆప్యాయంగా గడుపుతున్నాడు. అకీరా – ఆద్య ఇద్దరూ పవన్ ని హత్తుకొని నిద్రపోతున్నారు. ఈ దృశ్యాన్ని తన ఫోన్ లో భందించిన రేణు సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకుంది. ”కొన్ని అందమైన ఫొటోగ్రాఫ్స్ ని షేర్ చేయాలి.. అవి మీ ఫోన్ యొక్క ఫోటో ఆల్బమ్ లో ఉండలేవు.. నా ఫోన్ కెమెరాలో నేను బంధించిన కొన్ని అరుదైన క్షణాలు” అంటూ రేణు దీనికి క్యాప్షన్ పెట్టింది. అలానే ఈ ఫోటోని షేర్ చేసేటప్పుడు రీ పోస్ట్ చేసేప్పుడు దయచేసి ఎవరూ క్రాప్ చేసి నా ఫ్రేమ్ ని చడగొట్టవద్దని కోరింది. రేణు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను“ అంటోంది హృతిరోషన్ మాజీ భార్య సుసానే ఖాన్. జీవితంలో వెనుదిరిగే ప్రసక్తిలేదంటూ ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. నీలిరంగు కోట్.. ఫార్మల్ వేర్ ధరించి పక్కా కాన్ఫిడెన్స్ తో వున్న బిజినెస్ ఉమెన్ లా సుసానే ఖాన్ లుక్ వైరల్ గా మారింది.
భర్త హృతిక్ రోషన్ నుంచి మనస్పర్థల కారణంగా సుసానే 2014లో విడిపోయింది. అప్పటి నుంచి హృతిక్ కి పిల్లలు టచ్ లో వుంటున్నా ఆమె మాత్రం దూరంగా వుంటోంది. సుసానే ఖాన్ ఇంటీరియల్ డిజైనింగ్ లేబుల్ ది చార్ కోల్ అనే పేరుతో ఓ ప్రాజెక్ట్ ని రన్ చేసిన సుసానే ఖాన్ ఆ తరువాత దాన్ని పక్కన పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ దాన్ని తిరిగి ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఫొటో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ ని హృతిక్ సూపర్ అంటూ కామెంట్ చేస్తే లుక్ మార్పు కోసం ప్రయత్నించానని సుసానే ఖాన్ నవ్వుతున్న ఎమోజీలని షేర్ చేసింది. అయితే సుసానే ఖాన్ చేసిన కామెంట్ ఎవరి గురించి? హృతిక్ అవసరం తనకు లేదని.. ఇకపై రాదన్న భావనతోనే సుసానే ఇలా కామెంట్ చేసిందా? అని అంతా ఆరా తీస్తున్నారు.
రెండేళ్ల క్రితం విడిపోయిన ఓ జంట ఇప్పడు తమ డైవర్స్ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తాము విడాకులు తీసుకున్నప్పటికీ సంతోషంగా లేమని.. ప్రస్తుతం తాము కలిసి ఉండాలనుకుంటున్నామని ఆ జంట కోర్టుకు అభ్యర్థించింది. మై తేరా హీరో జిస్మ్ 2 మొహంజోదారో సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2016 డిసెంబర్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం అయ్యింది. అయితే పెళ్లయ్యాక భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. పెంపుడు కుక్కల విషయంలో వీళ్లిద్దరూ గొడవపడ్డారు. అనంతరం విడాకులు కోసం కోర్టుకు వెళ్లగా.. 2019 లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అప్పట్లో వీరి విడాకులు పెను సంచలనంగా మారింది. ఈ పోస్టు ఎంతో వైరల్ అయింది. లీ కెనడాకు వెళ్లిపోయింది. అయితే తాజాగా తమ విడాకులను రద్దు చేయాలంటూ అరుణోదయ్ భార్య లీ ఎల్టన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు తీవ్రమైనవి కావని వెంటనే డివోర్స్ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని లీ విజ్ఞప్తి చేశారు.
కేసును విచారించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలను తమకు సమర్పించాలంటూ కోర్టు లీ ని ఆదేశించింది. ఈ కేసును అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కాగా ప్రేమపెళ్లి చేసుకున్న అరుణోదయ్ గత ఏడాది డిసెంబర్లో తన వైవాహిక జీవితం గురించి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఓ పోస్ట్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ పోస్టును చదివిన లీ ఫిదా అయ్యిందట. దీంతో ఆమెకు మళ్లీ ప్రేమ చిగురించిదట. ఏది ఏమైనా చిన్నచిన్న విషయాలకే ప్రస్తుతం కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుండగా.. విడిపోయిన ఏడాదికి వీరి మధ్య ప్రేమచిగురించడం గొప్పవిషయమే.