షూటింగ్ లోనే కుప్పకూలిన బాలీవుడ్ స్టార్!
బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి షూటింగ్ చేస్తుండగానే కుప్ప కూలారు. అనారోగ్యానికి గురైన మిథున్.. చిత్రీకరణ మధ్యలోనే కిందపడిపోయారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. తాజాగా.. ఈ షూటింగ్లో పాల్గొన్న నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించిన మితున్.. షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో అర్ధంతరంగా చిత్రీకరణ నిలిపి వేశారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగిందని […]
