తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సందడి చేశారు. తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. తనశైలి మ్యానరిజంతో మెస్మరైజ్ చేశారు అనడంలో సందేహం లేదు. ఒక్కో కంటెస్టెంట్ గురించి చిరంజీవి సరదాగా మాట్లాడిన తీరు నిజంగా అభినందనీయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే చిరంజీవి ఫినాలే ఎపిసోడ్ లో సోహెల్.. మెహబూబ్ మరియు దివిలపై వరాల జల్లు కురిపించారు. దివికి తాను చేయబోతున్న ‘వేదాళం’ రీమేక్ లో ఒక ముఖ్య పాత్ర ఇవ్వమని మెహర్ రమేష్ కు చెప్పాను. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంది. ఆమెకు ఇద్దాం అన్నాడు. ఆ తర్వాత ఆమెకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయని చిరంజీవి పేర్కొన్నాడు.
హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్న దివికి మెగాస్టార్ మూవీలో ఛాన్స్ అంటే ఇక ఆమె కెరీర్ సెట్ అయినట్లే అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహబూబ్ కు తనకు వచ్చిన దాంట్లోంచి అయిదు లక్షలు సోహెల్ ఇస్తానంటూ చెప్పండంతో నీకు వచ్చిన దాంట్లోంచి ఇవ్వడం ఏంటీ నేను నీ తరపున మెహబూబ్ కు పది లక్షలు ఇస్తానంటూ స్టేజ్ పైనే చిరంజీవి చెక్ రాసి ఇచ్చారు. అలాగే చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతూ హౌస్ లో ఉన్న వారందరి కంటే బెస్ట్ డాన్సర్ అంటూ కితాబిచ్చారు. మెహబూబ్ ఎనర్జికి ఫిదా అంటూ చిరు పేర్కొన్నారు.
ఇక సోహెల్ కు ఊహించని గిఫ్ట్ ను చిరంజీవి అందించారు. మొదటగా మెహబూబ్ కు ఇస్తానన్న 5 లక్షలు నీ దగ్గరే ఉంచుకోమన్నారు. ఆ తర్వాత నీవు మటన్ కోసం అంతగా తాపత్రయ పడుతుంటే మా ఇంట్లో వారు నీకు మటన్ బిర్యానీ పంపించారు. సురేఖ స్వయంగా చేసిన మటన్ బిర్యానీ అది కూడా అలాల్ చేసిన మటన్ బిర్యానీ నీ కోసం తీసుకు వచ్చాను. నీవు తిని మీ వాళ్లకు కూడా తినిపించవచ్చు అన్నారు. నేను ఒక మంచి సినిమాను చేస్తాను సర్ మీరు నాకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఆసమయంలో చిరంజీవి స్పందిస్తూ నాకు చిన్న రోల్ ఇవ్వు నేను చేస్తాను. సినిమా ప్రమోషన్ కోసం వస్తామని చిరంజీవి మరియు నాగార్జున హామీ ఇచ్చారు. మొత్తానికి ఆ ముగ్గురికి చిరంజీవి వరాల జల్లు కురిపించారు.
కరోనా కారణంగా 2020 సంవత్సరం ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు వచ్చాయి. సినిమాల రికార్డులు ఈ ఏడాది పెద్దగా కనిపించలేదు. కాని అంతకు ముందు వచ్చిన పాటలు రికార్డులు మాత్రం మారుమ్రోగుతూ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలోని మూడు పాటలు ఈ ఏడాది ది బెస్ట్ సాంగ్స్ గా నిలిచాయి. అద్బుతమైన వ్యూస్ ను రాబట్టి ఈ ఏడాదిలోనే కాకుండా ఆల్ టైమ్ రికార్డు గా నిలిచాయి. 2020లో వచ్చిన పాటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న అయిదు పాటల జాబితాలో నాలుగు మెగా హీరోల పాటలు ఉన్నాయి అంటే ఈ ఏడాది మెగా జోరు యూట్యూబ్ లో ఎంతగా నడిచిందో అర్థం చేసుకోవచ్చు.
నెం.1 గా ఎలాంటి డౌట్ లేకుండా బుట్టబొమ్మ సాంగ్ నిలిచింది. ఆ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. యూట్యూబ్ యూనివర్శ్ రికార్డ్ ను కూడా ఈ పాట దక్కించుకుంది. ఇక నెం.2 గా అల వైకుంఠపురంలో సినిమాకే చెందిన రాములో రాములా పాట నిలిచింది. యూట్యూబ్ లో ఈ పాట కూడా మిలియన్ లకు మిలియన్ ల వ్యూస్ దక్కించుకోవడంతో పాటు ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపించింది. ఇక నెం.3గా ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం.. పాట నిలిచింది. ఈ పాటతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అంటే యూట్యూబ్ లో ఈ పాటకు దక్కిన ఆధరణ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
నెం.4గా మళ్లీ ఉప్పెన సినిమా పాట నిలిచింది. నీ కన్ను నీలి సముద్రం పాటతో ఉప్పెన స్థాయి కూడా అమాంతం పెరిగింది. నీలి నీలి ఆకాశం మరియు నీ కన్ను నీలి సముద్రం పాటలు హోరా హోరీగా ఒకానొక సమయంలో శ్రోతలను ఆకట్టుకున్నాయి. నెం.5గా మళ్లీ అల వైకుంఠపురంలోని సామజవరగమన.. పాట నిలిచింది. ఈ పాటకు ఎన్ని కవర్ సాంగ్స్ వచ్చాయో చెప్పలేం. వాటికి కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. మొత్తానికి ఈ ఏడాది టాప్ 5 పాటల్లో మూడు బన్నీ పాటలు కాగా ఒకటి వైష్ణవ్ తేజ్ పాట. ఈ అయిదు పాటల తర్వాత ఆరవ స్థానంలో భీష్మలోని వాట్టే వాట్టే బ్యూటీ… ఏడవ స్థానంలో పలాస సినిమాలోని నక్కిలీసు గొలుసు… ఎనిమిదవ స్థానంలో జాను లోని లైఫ్ ఆఫ్ రామ్ .. తొమ్మిదవ స్థానంలో సవారిలోని ఉండిపోవా నువ్విలా.. పదవ స్థానంలో అనూహ్యంగా కన్నడ మూవీ పొగరు కరాబు మైండ్ కరాబు పాట నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఫిలిం సర్కిల్స్ పెద్ద డిస్కషన్ జరిగింది. ముందుగా ఈ రీమేక్ ని యువ దర్శకుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్నాడు. దీంతో ఈ స్క్రిప్ట్ బాధ్యతలు డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలో పెట్టారని.. ఇప్పటికే రచయిత ఆకుల శివతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినాయక్ ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు తెర పైకి వచ్చింది. ఇప్పటికే పలు రీమేక్ లను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఈ సినిమాకు న్యాయం చేయగలడని తెలుగు నేటివిటికీ తన ఇమేజ్ కు అనుగుణంగా మార్చగలడని చిరంజీవి భావించారట. దీని కోసం ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఇప్పటికే హరీష్ తో చర్చలు కూడా జరిపారట. అయితే హరీష్ శంకర్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. ఎందుకంటే హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ కి డేట్స్ ఇచ్చాడట. దీంతో పవన్ – హరీష్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ నడిచింది. అయితే తాజాగా సినీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇటీవలే పవన్ ని కలిసిన హరీష్.. తమ ప్రాజెక్ట్ విషయమై చర్చించాడట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో క్రిష్ సినిమాతో పాటు ప్యారలల్ గా ఈ సినిమాని కూడా కంప్లీట్ చేద్దామని పవన్ మాటిచ్చాడట. అందుకే హరీష్ శంకర్ మెగా రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట. కాకపోతే చిరంజీవితో త్వరలోనే మంచి స్క్రిప్ట్ తో స్ట్రెయిట్ సినిమా చేస్తానని హరీష్ నమ్మకంగా ఉన్నాడట.
మెగా వటవృక్షం నీడన 11 మంది ఆటగాళ్లు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో దిగితే బంతుల్ని బౌండరీలకు తరలించడంలో మెగా బ్యాట్స్ మన్స్ తర్వాతే. సిక్సర్లు బాదినా.. ఛార్ కా ధమ్కీ కొట్టినా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసినా మెగా చేతివాటమే వేరు. ఆ లెవలే వేరుగా ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగొచ్చాకా బ్యాటింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు. 60 ప్లస్ లోనూ ఆయన అన్ స్టాపబుల్ బౌండరీలతో చెలరేగుతున్నారు. ఖైదీనంబర్ 150తో ఇండస్ట్రీ రికార్డుల్నే తిరగరాసిన తీరు అసాధారణం. ఆ తర్వాత సైరా -నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాలో స్వాతంత్య్ర సమర యోధుడిగా నటించి మెప్పించారు. సైరా.. ఇరుగు పొరుగు భాషల్లో ఆశించినంత ఆడకపోయినా…టాలీవుడ్ బాక్సాఫీస్ ని బంతాడేసిన తీరుప్రముఖంగా చర్చకు వచ్చింది.
ఇక అన్నయ్య తర్వాత తమ్ముడే అన్నంత పేరు తెచ్చుకున్నారు పవన్ కల్యాణ్. ఎప్పుడు వచ్చినా ఆయన తిక్కకో లెక్కుంది! ఆ బ్యాటింగుకో స్టైలుంది!! అంటూ అభిమానులంతా కిక్కులో ఉంటారు. కొంత గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ గా తిరిగొస్తుంటే ఆయన మరోసారి ఇండస్ట్రీ రికార్డును లాక్కుంటారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. చిరు ఫుల్ గా చెలరేగితే టాప్ పొజిషన్ కి వెళ్లిపోతారు..పవన్ కంబ్యాక్ తో తిరిగి దూసుకొచ్చే ఛాన్సుంది.. అన్న చర్చా నిరంతరం మెగాభిమానుల్లో సాగుతూనే ఉంటుంది.
ఇకపోతే మొన్నటి వరకూ రంగస్థలం రికార్డుల్ని బ్రేక్ చేసిన సినిమా రాలేదు. 2020 సంక్రాంతికి ఆ రికర్డును అల్లు అర్జున్- అల వైకుంఠపురములో బ్రేక్ చేసింది. దీంతో అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. రికార్డుల పరంగా టాప్ వన్ పొజిషన్ లో నిలిచారు అల్లు వారసుడు. రంగస్థలం రికార్డులు బ్రేక్ చేయడంతో చెర్రీ రేసులో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
అయితే ఈసారి చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ లో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు. మరోసారి చరణ్ టాప్ స్లాట్ లోకి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే యంగ్ ట్యాలెంట్ అల్లు అర్జున్.. రామ్ చరణ్ కూడా ఓపెనర్ బ్యాట్స్ మన్స్ లాగా మంచి ఫేసింగ్ లో ఉన్నారు. నెక్ట్స్ వచ్చే బ్యాట్స్ మన్ లా ఈ ఏజ్ లోనూ పోటీపడుతున్న చిరంజీవి.. పవన్ కల్యాణ్ ప్రతిసారీ స్ట్రైకింగ్ బ్యాట్స్ మన్స్ అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది.
మెగా బ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మెగా హీరోల్లో ఎవరూ టచ్ చేయలేని కాన్సెప్టులు ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు. బ్లాక్ బస్టర్లు కొడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు వరుణ్. అలాగే సుప్రీంహీరో సాయి తేజ్ పడి లేచిన కెరటంలా మళ్లీ ట్రాక్ లోకొచ్చాడు.. వైష్ణవ్ తేజ్.. శిరీష్.. కళ్యాణ్ దేవ్.. ఇలా ఇతరుల ప్రయత్నాలు తక్కువగా ఏం లేవ్.. అలాగే మెగా కాంపౌండ్ ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత కూడా నటించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. నటిగా నిర్మాతగా నిహారిక మార్క్ వేస్తుందా? అన్నది వేచి చూడాలి. పవన్ వారసుడు నూనూగు మీసాల అకీరా నందన్ రేసులోకి దూసుకొస్తే సన్నివేశం ఎలా మారుతుందా? అన్నది కూడా టాలీవుడ్ లో అంతకంతకు ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల హైదరాబాద్ లో సంభవించిన అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ఈ విపత్తు నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లకు మించి నిధుల్ని విడుదల చేసింది. దాతలు స్పందించాల్సిందిగా కోరింది. దీంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది వరద సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము ప్రకటించిన మొత్తాన్ని సీఎం కేసీఆర్ కు అందించేందుకు చిరంజీవి.. నాగార్జున క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ హెయిర్ కనిపించకుండా బ్లూకలర్ క్యాప్ ధరించి కనిపించడం పలువురిని ఆలోచనలో పడేసింది. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని అందుకే జుట్టు కనిపించకుండా క్యాప్ పెట్టారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల రఘు కుంచె డాటర్ పెళ్లిలోనూ మెగాస్టార్ క్యాప్ తో కనపించారు. దీంతో ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారనే వాదనకు మరింత బలం చేకూరింది. ఈ రోజుల్లో హెయిర్ ప్లాంటేషన్ అన్నది సినీ తారలకు ఫ్యాషన్ గా మారింది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే అది వారికి చాలా అవసరమైంది కూడా.
ఈ రోజుల్లో చాలా మంది సినీ దర్శకులు.. నిర్మాతలు .. నటులు విగ్స్ ఉపయోగిస్తున్నారు. కాని విగ్స్ వారికి పెద్ద తలనొప్పిగా మారాయి. కాబట్టి వారు హెయిర్ ప్లాంటేషన్ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. దర్శకుడు వి వి వినయక్ .. నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల హెయిర్ నేవింగ్ చేయించుకున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి పేరుగాంచిన ఒక అగ్ర దర్శకుడు కూడా తన బట్టతలని కప్పిపుచ్చడానికి ఈ పద్ధతిని అనుసరించాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఘుమాయించే వంట వండడం అన్నది కొందరికే అబ్బే విద్య. అది అందరికీ సాధ్యం కానిది. ఇక్కడ కోడళ్ల సందడి చూస్తుంటే ముచ్చటేయడం లేదూ? నల భీమ పాకం వండేస్తున్నారు. ఇక కోడళ్ల పాక శాస్త్ర నైపుణ్యం ఏపాటిది? అన్నది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
అక్కినేని కోడలు సమంత అక్కినేని.. మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ ఇటీవలే వెల్ నెస్ కి సంబంధించిన ‘యుఆర్ లైఫ్’ వెబ్ సైట్ ని ప్రారంభించి అందులో స్పెషల్ వీడియో ట్రీట్ తో కట్టిపడేస్తున్న సంగతి విధితమే. ఈ వేదిక లక్ష్యం ట్రెండింగ్ ఆరోగ్య చిట్కాలు.. పోషణ… ఆహార ప్రణాళికలు.. జీవనశైలి వగైరా వ్యవహారాలపై విలువైన విషయాల్ని అభిమానులకు షేర్ చేయనున్నారు.
సామ్ ఈ వెబ్ సైట్ కి గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మొదటిసారి తనలోని వంట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఓ వీడియోతో ముందుకు వచ్చారు అక్కినేని కోడలు. ఉపసానతో కలిసి ‘తక్కలి సడం’ అనే తమిళ వంటకం వండడం కనిపిస్తోంది. ఇందుకు ఉపయోగించే పదార్థాలు.. రెసిపీని ఈ వీడియోలో చూపించారు. సమంత – ఉపసన ఎంతో జోవియల్ గా ఈ వంట కార్యక్రమాన్ని రంజింపజేసారు.
సమంత ఇటీవల రూఫ్ టాప్ వ్యవసాయంపై టిప్స్ చెప్పిన సంగతిని మరువలేం. గచ్చిబౌళి ఇంటిపై ఈ ప్రయోగం చేసారు. ఆరోగ్యకరమైన పంటను పండించడమెలానో తెలిపారు సామ్. అలాగే తాను వంటకం కోసం సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ ను ఇష్టపడతానని తెలిపారు. వణక్కం.. రుంభ నల్ల ఇరిక్కుం! అంటూ తమిళంలో ఈ వంటల ప్రోగ్రామ్ ని ఆవిష్కరించారు. ఇకపోతే ఉపాసన అచ్చం తన అమ్మ గారి లానే తమిళం మాట్లాడుతున్నావని కాంప్లిమెంట్ ఇచ్చేసింది సామ్.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య`లో స్పెషల్ రోల్ లో ఎవరు నటిస్తున్నారు? అంటే ఇన్నాళ్లు డైలమా కొనసాగింది. ఈ పాత్ర కోసం మహేష్ ని సంప్రదించినా కుదరలేదు. చివరికి రామ్ చరణ్ నటిస్తే బావుంటుందని కొరటాల- చిరు ఒప్పించారు. ఎట్టకేలకు అధికారికంగా చరణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తానికి మెగాభిమానులకు ఇది తీపి కబురులాంటిదే.
చరణ్ మాట్లాడుతూ-“ 2015లో నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. ఖైదీ నెంబర్ 150లో నేను నాన్నతో కలిసి డాన్స్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో కలిసి నటిస్తున్నాం. నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో కనిపించాలని మా అమ్మ కల. మరోసారి మా కాంబినేషన్ అలరిస్తుందని నమ్ముతున్నాను“ అని చరణ్ తెలిపారు.
చిరంజీవి – చరణ్ మల్టీస్టారర్ ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్- కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ ఇందులో కథానాయక. చిరు బర్త్ డే కి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది. ఇటీవల గుండు లుక్ తో మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది చిరు నటించే వేరొక చిత్రానికి సంబంధించిన ఒక గెటప్ ట్రయల్ అని తెలుస్తోంది. ఆచార్య 2021 సమ్మర్ కి వచ్చేస్తే.. అదే ఏడాదిలో చరణ్ నటించే ఆర్.ఆర్.ఆర్ కూడా రిలీజవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మహమ్మారీ శాంతించకపోయినా జాగ్రత్తలు పాటిస్తూ ఆచార్య పట్టాలెక్కేయడం ఖాయంగా కనిపిస్తోంది.
బొజ్జ గణపయ్యను నిష్ఠతో పూజించడంలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ సవ్యంగా సాగాలని గణపయ్య ముందు మోకరిల్లి మరీ మొక్కుతారు. విఘ్న వినాయకుని ఆశీస్సులతోనే నీలాపనిందలు తప్పించుకోగలరు.
నేడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలంతా వినాయకుని పూజించి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి బర్త్ డే వినాయక చవితి ఒకేరోజు కలిసి రావడం ఆసక్తికరం. మెగా దంపతులు చిరంజీవి-సురేఖ.. రామ్ చరణ్ – ఉపాసన పూజా కార్యక్రమం అనంతరం ఇదిగో ఇలా ఫోటో దిగారు.
అల్లు ఫ్యామిలీలోనూ వినాయక చవితి పూజా కార్యక్రమాలు డీసెంట్ గా జరిగాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – లక్ష్మీ ప్రణతి జంట వినాయకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫోటో అల్లు అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇతర మెగా హీరోలు ఎవరికి వారు.. ఇళ్లలో పూజ పునస్కారాలు కానిచ్చారు.