రవితేజ ఖిలాడి లో యాక్షన్ కింగ్ ఎంట్రీ

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖిలాడి సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఖిలాడి టైటిల్ తో ఇప్పటికే సినిమా వెయిట్ పెరిగింది. మాస్ కా బాస్ అంటూ పేరున్న రవితేజ అంతకు మించిన మాస్ టైటిల్ ను ఎంపిక చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను రమేష్ వర్మ సన్నిహితుల వద్ద అంటున్నాడు. ఈ సినిమా వెయిట్ ఇంకా పెంచడం కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు.

తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో విలన్ గా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ వర్సెస్ అర్జున్ అన్నట్లుగా సినిమాలో యాక్షన్ సీన్స్ హోరా హోరీగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో అర్జున్ ఉండటంతో ఖచ్చితంగా బజ్ మరింత ఎక్కువ అవుతుందంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అను ఎమాన్యూల్ మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. దసరా సీజన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకు ముందు రవితేజ నటించిన క్రాక్ సినిమాను విడుదలకు సిద్దంగా ఉంది.

Related Images: