బుల్లి తెరపై యాంకర్ల తీరు మారిపోయింది. ఎంతగా ప్రొగ్రామ్ ని మాటతీరుతో రక్తికట్టిస్తే అంత క్రేజ్ అన్నది నిన్నటి మాట.. ఎంతగా హాట్ లుక్స్ తో ఆసాంతం హొయలుపోతూ టీఆర్పీ గుంజడం ఎలా అన్నదే నేటి ఫార్ములా. యంగ్ యాంకరమ్మలు ఎంత హాట్ గా కనిపిస్తే అంతగా ఫాలోయింగ్ పెరుగుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది మరి. వీవర్స్ కి కనువిందు వీనుల విందు రెండూ ఇంపార్టెంట్. రెండు రకాలుగానూ రంజింప చేస్తే ఆ ప్రోగ్రామ్ అంత పాపులర్ అవుతుంది. ఇదే ఫార్ములాని అప్లయ్ చేస్తూ బుల్లితెరపై రచ్చ చేస్తున్నారు పలువురు ట్యాలెంటెడ్ హాట్ యాంకర్స్.
టాలీవుడ్ లో టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలెన్నో ప్రదర్శిస్తూ లైమ్ లైట్ లో నిలవాలని చిన్న పాటి గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. ఈ రేసులో ముందు వరుసలో నిలుస్తున్న యాంకరమ్మలు అనసూయ. ఆ తర్వాత శ్రీముఖి- రష్మీ గౌతమ్- భానుశ్రీ- విష్ణు ప్రియ- మంజూష ఇలా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రోగ్రామ్ లైవ్ లో థైషోస్ కి వెనకాడని నైజం నేటితరం యాంకర్లకు ఉందని నిరూపిస్తున్నారు మరి. హాటెస్ట్ డ్రెస్ అప్పీల్ వీళ్ల ప్రత్యేకత. వీవర్స్ కి ఐఫీస్ట్గా షోని మలచాలని ప్రయత్నంలో భాగమే ఇదంతా. అందుకే ఆ స్థాయిలోనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ఈ అందగత్తెల ప్రత్యేకత. ఇక సీనియర్ బ్యూటీ శ్యామల గ్లామర్ షోతో పాటు ట్రెడిషనల్ లుక్ లోనూ హీట్ పెంచుతూ ఫాలోయింగ్ కొనసాగిస్తోంది.
ఈ విషయంలో ముందు వరుసలో నిలుస్తున్న హాటెస్ట్ యాంకర్ అనసూయ. కాస్ట్యూమ్స్ ఎంత హాట్ గా వుంటే అంత ఛార్జ్ చేస్తుందట. ఒక్కో ప్రోగ్రామ్ కు అనసూయ 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆ తరువాత రేసులో వుంది రష్మీ గౌతమ్. సారీలో వున్నా.. మరే డ్రెస్ లో వున్నా హాట్ నెస్ ని మాత్రం కంటిన్యూ చేస్తూ వుంటోంది. ఎపిసోడ్ వైజ్ ఛార్జీల మోతతో ఈ భామలంతా బాగానే ఆర్జిస్తున్నారన్న సమాచారం ఉంది. రష్మీ ఎపిసోడ్ కి ఛార్జ్ చేస్తున్న మొత్తం లక్ష 50 నుంచి లక్ష 75 వేలు.. ఇక శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంతకు ముందు ఎపిసోడ్ కి 35 వేలు మాత్రమే తీసుకునే శ్రీముఖి ప్రస్తుతం బాగానే డిమాండ్ చేస్తోందట. శ్యామల కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. పెళ్లై పిల్లలున్నా గ్లామర్ డోస్ ని మాత్రం తగ్గించడం లేదు ఈ బ్యూటీ.
బుల్లితెరపై హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోలో రష్మీ ఎంత హుషారుగా స్పాంటెనియస్ గా ఉంటుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తుంటుందన్నది తెలిసిందే. మహిళా సాధికారత.. సామాజిక సేవనంలో ఎప్పుడూ రాజీపడని రష్మీ గౌతమ్ ఆగ్రహం వస్తే అపరకాళికలామారిపోతూ తనని విమర్శించిన వారిపై విరుచుకుపడుతూ వుంటుంది.
లాక్ డౌన్ సమయంలో ఆహారం లభించక ఇబ్బందపడుతున్న వీధి శునకాలకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ వార్తల్లో నిలిచింది. ఈ విషయంలో తనలాగే అంతా స్పందించాలని సోషల్ మీడియా సాక్షిగా ఆకాంక్షించింది. సామాజిక సమస్యల పట్ల బాధ్యతగా స్పందించే రష్మీ గౌతమ్ ని .. మ్యాడమ్ ప్లీజ్ అంటూ.. ఓ నెటిజన్ ఇంటి అడ్రస్ అడగడం ఆసక్తికరంగా మారింది.
ధర్మారెడ్డి అనే నెటిజన్ ఆర్ ఆర్ బీ పోటీ పరీక్షల కోసం కావాల్సిన బుక్స్ కొనే స్థాయిలో తాను లేనని.. తనకు ఈ విషయంలో సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా రష్మీగౌతమ్ ని అభ్యర్థించాడు. దీంతో స్పందించిన రష్మీ గౌతమ్ సదరు నెటిజన్ అడ్రస్ అడిగింది. అడ్రస్ చెబితే తానే ఆ బుక్స్ కొని పంపిస్తానని సమాధానం చెప్పింది. దీంతో రష్మీ గౌతమ్ పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లేడీ సెలబ్రిటీలు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ బిగ్ స్క్రీన్ పై హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో కూడా ఓ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక స్మాల్ స్క్రీన్ పై పలు సీరియల్స్ లో నటించి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తో బాగా పాపులర్ అయిన హరితేజ కూడా బిగ్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ”అ ఆ” సినిమాతో పేరు తెచ్చుకున్న హరితేజ ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలే దక్కించుకుంటోంది.
ఈ క్రమంలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా వెండితెరపై సత్తా చాటాలని చూస్తోంది. అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేసి కొత్త ఒరవడిని సృష్టించిన రష్మీ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అప్ కమింగ్ మూవీలో రష్మీ గౌతమ్ కి ఓ రోల్ ఆఫర్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే అది ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో మాత్రం కాదని తెలుస్తోంది. ‘గుంటూరు టాకీస్’ సినిమాలో బోల్డ్ గా నటించిన రష్మీని కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబోలో రానున్న మూవీలో తీసుకుంటారని సమాచారం.
కాగా స్మాల్ స్క్రీన్ మీద క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ అందరూ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై నిరూపించుకోడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ – సుకుమార్ – కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు కూడా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయకి మైత్రీ మూవీ మేకర్స్.. హరితేజ కు హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. అలానే రష్మీకి గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.