టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా ‘సైరా నరసింహరెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ ‘ఆచార్య’తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు.
అయితే ఆచార్య సినిమా షూటింగులో ఉండగానే.. సినిమా గురించి చర్చలు వివాదాలు నడిచాయి. ప్రస్తుతం ఆచార్య సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ నుండి ఆచార్య సినిమా నిర్మాణానికి రాంచరణ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని మొత్తం ప్రొడక్షన్ అంతా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారే చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాను రాను ఇలాంటి వార్తలు సినిమాను దెబ్బతీసేలా ఉన్నాయని అప్పుడే మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ విషయం పై స్పందించింది.
“ఆచార్య సినిమా నిర్మాణంలో మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారి బడ్జెట్ ఎంత ఉందో కొణిదెల ప్రొడక్షన్స్ వారిది కూడా అంతే ఉందని తెలిపారు. అంతేగాక ప్రతి ఖర్చులోను నిర్మాత రాంచరణ్ తమతో సగం ఖర్చును షేర్ చేసుకుంటున్నట్లు వివరించారు. అయితే తాజాగా విడుదల చేసిన మెగాస్టార్ ఫస్ట్ లుక్ అలాగే మోషన్ పోస్టర్ లో రాంచరణ్ పేరు కంటే కూడా కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సురేఖ పేర్లు హైలైట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రాంచరణ్ ఆచార్య సినిమాకు కేవలం సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడని.. అంతేగాక సినిమా నిర్మాణంలో ఎలాంటి చురుకుదనం చూపించట్లేదని టాక్. ఎందుకంటే ఇప్పటికే సైరా నరసింహ రెడ్డి మూవీతో లాస్ ఎదుర్కోవడం.. అలాగే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ ఉండటం వలన ఆచార్య నిర్మాణంలో ఆసక్తి చూపట్లేదని సమాచారం. చూడాలి మరి చరణ్ ఏమైనా స్పందిస్తాడేమో..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నాడు. నిజానికి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చెయ్యాలి అని మొదట్లో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సంభవించడంతో ‘ఆర్ఆర్ఆర్’ జనవరికి రావడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉందట. ఇక ఓ వైపు రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య షూటింగులో కూడా పాల్గొనాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలంతా తమ తదుపరి సినీ ప్రాజెక్టులను కూడా వరుసగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ చేస్తూనే నాగ్ అశ్విన్ తో ఓ సినిమా అలాగే ఆదిపురుష్ సినిమాలు ప్రకటించాడు. అలాగే బన్నీ కూడా పుష్పతో పాటు ఐకాన్.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తూనే అయినను పోయిరావలె హస్తినకు కేజీఎఫ్ డైరెక్టర్ తో ఒకటి అట్లీతో ఒకటి అంటూ టాక్ నడుస్తుంది. ఇలా ప్రతీ హీరో నెక్స్ట్ సినిమాలు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే రాంచరణ్ సోలో హీరోగా నెక్స్ట్ సినిమా ఏమిటని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రాంచరణ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందరూ హీరోలు ప్రశాంత్ వైపు చూస్తుంటే ఆయన మాత్రం రాంచరణ్ వైపు చూస్తున్నాడని టాక్. ఎందుకంటే మైత్రి మూవీస్ వారితో రాంచరణ్ మరో సినిమా చేయాల్సి ఉందని.. ఆ ప్రాజెక్ట్ ప్రశాంత్ తో తీద్దామని ఆలోచనలో వరున్నట్లు తెలుస్తుంది. మరి ప్రశాంత్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో అనేది క్లారిటీ వస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.