హ్యాండ్సమ్ హంక్ గా పిలుచుకునే రానా దగ్గుబాటి తెలుగు హిందీ ఇతర భాషల్లో వరుస విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ క్రమంలో రానా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ”అరణ్య”. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. విష్ణు విశాల్ – జోయా హుస్సేన్ – శ్రియ పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగులో ‘అరణ్య’.. తమిళంలో ‘కాదన్’.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘అరణ్య’ టీజర్ కు అన్ని వర్గాల నుంచి అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘అరణ్య’ సినిమాని 2021 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ మరియు మోషన్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో పడిపోయిన గోడకు ఒక వైపు రానా – విష్ణు విశాల్ కనిపిస్తుండగా.. మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. పోస్టర్ లో గుబురు గడ్డంతో రానా అడవి మనిషిలాగే కనిపిస్తుండగా.. విష్ణు విశాల్ తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. వృక్షాలు అడవులను సంరక్షించుకుందాం అనే మెసేజ్ ను ఈ పోస్టర్ ద్వారా ఇస్తున్నారు. 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథ ‘అరణ్య’. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు మరియు పారిశ్రామికీకరణ.. అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చెప్పబోతోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా “ప్రాణాంతక మహమ్మారిపై పోరాడుతున్న మనం స్ఫూర్తి కోసం మన అడవులపై దృష్టి సారించాలి. భూమికి ఊపిరితిత్తుల్లాంటి మన అరణ్యాలు.. అటవీ నిర్మూలన పారిశ్రామికీకరణ అనే విస్తరిస్తున్న మహమ్మారితో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాయి. వచ్చే 2021 సంక్రాంతికి మీ సమీపంలోని థియేటర్ కు వస్తున్న ‘అరణ్య’తో అడవులను కాపాడదాం” అని చిత్ర బృందం పిలుపునిచ్చారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆస్కార్ అవార్డ్ విజేత రసూల్ పోకుట్టి ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసారు.
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి స్నేహితురాలు మిహీకా బాజాజ్ తో ప్రేమలో వున్నానని తొలిసారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. అప్పటి వరకు మిహీకా అంటే ఎవరికీ తెలియదు. ఆమె ముంబైలో ఓ ఆవెంట్ మేనేజ్మెంట్ సంస్థని రన్ చేస్తోందని ఆమెకూ ఫేజ్ 3 ప్రపంచంలో గొప్ప పాపులారిటీ ఉందని తెలిసింది కొద్దిమందికే. రానా కాబోయే యువతిగా.. ఆ తరువాత ఒక్కసారిగా మిహీకా వార్తల్లో నిలిచింది. ఇలా ప్రకటించి అలా వెంటనే పెళ్లిని పట్టాలెక్కించేందుకు ఏమాత్రం ఆలస్యం చేయలేదు రానా. ఈ ముచ్చటైన జంట వివాహం ఆగస్టు 8న జరిగిన విషయం తెలిసిందే. నవదంపతుల అందచందాలు ఒడ్డు పొడుగు పెళ్లి వేదిక సాక్షిగా చర్చకొచ్చాయి. మిహీక అందచందాల గురించి యువతరం గట్టిగానే చర్చించుకున్నారు.
పెళ్లికి ముందు పెళ్లి తరువాత అందరి దృష్ఠిని ఆకర్షించిన మిహీకా తాజా మరోసారి అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మిహీకా షేర్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసిన సారీని ధరించి తన ఇంటి బాల్కనీలో ఇచ్చిన స్టన్నింగ్ పోజు వైరల్ గా మారింది. డైమండ్ ఇయర్ రింగ్స్.. నాజూకు నడుముకి అలంకరణగా డిజైన్డ్ బెల్ట్.. త్రెడ్ వర్క్ తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సారీ డిజైన్ లో మిహీకా అప్సరసలా మెరిసిపోతోంది. అందాల కథానాయికలు .. దేవతా కన్యకలకైనా కన్ను కుట్టాల్సిందే ఈ అందాన్ని చూశాక. ఆరడుగుల బుల్లెట్టులా ఆకాశహార్మ్యం నుంచి మిహీక ఇచ్చిన ఈ ఫోజు అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఆగస్టు 8న జరిగిన రానా – మిహీకాల వెడ్డింగ్ కి చిత్ర పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. అందులో రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సమంత.. నాగచైతన్య వంటి కొంత మంది దగ్గు బాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా వున్న కుటుంబాలు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నాయి.