రామరాజుతో రాకింగ్ దీపావళి అదుర్స్

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ .. మంచు కాంపౌండ్ మధ్య స్నేహానుబంధం గురించి తెలిసిందే. పండగలు పబ్బాల వేళ చిటపటలు ఛమత్కారాలు అభిమానులకు సుపరిచితమే. నేటితరం ఫ్యామిలీ హీరోలు వివాదాలకు తావివ్వకుండా సరదాగా కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సాంప్రదాయాన్ని మెగా – మంచు హీరోలు కొనసాగిస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. సినీపెద్దలుగా టాలీవుడ్ కి దారి చూపిస్తున్నారు ఆ ఇద్దరూ. ఇక మంచు యువ హీరోలు విష్ణు.. మనోజ్.. ట్యాలెంటెడ్ నటి కం హోస్ట్ కం నిర్మాత మంచు లక్ష్మి .. చరణ్ కి ఎంతో క్లోజ్.. ఫ్యామిలీ ఫంక్షన్లు సహా ప్రతి వేడుకకు వీళ్లంతా కలిసి సెలబ్రేట్ చేస్తుంటారు.

మొన్న దీపావళి సంబరాన్ని రాకింగ్ స్టార్ మనోజ్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ తో దీపావళి సంబరాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోజ్.. లక్ష్మీ మంచుతో దీపావళి జరుపుకోవడంపై తన ఆనందాన్ని పంచుకున్నారు చరణ్. # సీతారామరాజు చరణ్ # మనోజ్ మంచు # లక్ష్మిమంచూ.. అంటూ హ్యాష్ ట్యాగ్ లతో చరణ్ ప్రత్యేకంగా తన సెలబ్రేషన్ ని హైలైట్ చేసారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజుతో రాకింగ్ సెలబ్రేషన్ ఇది అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా మంచు మనోజ్ సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో సినిమా చేస్తున్నారు. ఇది మనోజ్ కి కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి.

Related Images:

‘రామరాజు ఫర్ భీమ్’ అప్డేట్ వచ్చేసింది…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చూస్తున్నారు. అందులోనూ టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ గా రామ్ చరణ్ చూపిన ‘రౌద్రం’ శాంపిల్ ప్రేక్షకులకు చూపించారు. ఈ క్రమంలో విప్లవ వీరుడు ‘కొమరం భీమ్’ గా తారక్ చూపించబోయే ‘రుధిరం’ కోసం సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ క్షణం వచ్చేసిందంటూ ‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్ ప్రకటించారు.

కాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇంట్రో వీడియో ‘రామరాజు ఫర్ భీమ్’ అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. షూటింగ్ పునః ప్రారంభం కావడంతో ‘వియ్ ఆర్ ఆర్ ఆర్ బ్యాక్’ అంటూ ఓ వీడియో చేసింది. ఈ వీడియోలో ఏడు నెలలుగా క్లోజ్ చేయబడి ఉన్న సెట్స్ లో టీమ్ మొత్తం అడుగుపెట్టినట్లు.. సినిమా షూటింగ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని కాస్ట్యూమ్స్ – తుపాకులు – కార్లకు పట్టిన దుమ్మును దులుపుతున్నట్లు చూపించారు. అలానే సెట్స్ లో కరోనా గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చూపించారు. చివరగా రాజమౌళి యాక్షన్ చెప్పగా హీరోలు ఒకరు గుర్రం మీద.. ఒకరు బైక్ మీద దూసుకొస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఏదేమైనా ఎన్నాళ్ళో వేచిన తరుణం వచ్చేసిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో అలియా భట్ – అజయ్ దేవగన్ – శ్రియా శరణ్ – ఒలివియా మోరిస్ – అలిసన్ డూడీ – రే స్టీవెన్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నాడు.

Related Images: