డ్రగ్స్ దర్యాప్తు ఇంతకీ తాప్సీ ఆవేదన ఏమిటంటే..!

మీటూ ఉద్యమం తర్వాత కథానాయికల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయనడానికి అలాగే మహిళా యునైటీ కూడా బలపడిందనడానికి ఇటీవల డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి దర్యాప్తులో ఎదురైన సంఘటనలే ఎగ్జాంపుల్. రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలను సేవించడం.. సరఫరా చేయడం వగైరా కేసుల్లో ఇరుక్కున్నా బాలీవుడ్ లో తన సన్నిహితులు సహా పలువురు నాయికలు బహిరంగ మద్థతును పొందగలిగింది. ఈ కేసులో తనని బలిపశువును చేస్తున్నారన్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారన్న వాదన వినిపించారు. కరీనా.. లక్ష్మీ మంచు.. తాప్సీ పన్ను వీళ్లంతా తనని బలిపశువును చేస్తున్నారనే కోణంలో మీడియా వైఖరిని ఖండించే ప్రయత్నమే చేశారు. ఇంకా ఎవరు దోషి ఎవరు నిర్ధోషి అన్నది తేలక ముందే రియాను దోషిగా డిక్లేర్ చేసేస్తారా? అన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

తాజాగా తాప్సీ పన్ను మీడియాపై గరంగరంగా స్పందించింది. సహనాన్ని కోల్పోయిన తాప్సీ మీడియా ఇలా అండర్ ట్రయల్ చేయడం ఏం బాలేదని సీరియస్ అయ్యింది. అసలింతకీ మీడియా నిజంగా ఏం కోరుకుంటోంది? అసలు అపరాధికి శిక్ష పడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భంలో నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే ఆమె(రియా) ఎవరో నాకు తెలియకపోయినా.. పరస్పరం కలవకపోయినా తనకు మద్ధతుగానే నిలుస్తాను అని ధైర్యంగా ముందుకొచ్చింది తాప్సీ. సున్నితమైన విచారణలో ఇప్పటికే రియాపై తీర్పు ఇచ్చేస్తున్నారు అందరూ.

ఏదైనా తప్పు చేస్తే నిందించేందుకు చాలా ముందుంటారు. అన్నిచోట్లా జరుగుతున్నవే ఇవి అయినా.. కానీ రియాపై మీడియా ట్రయల్ .. కొన్ని చోట్ల శారీరక వేధింపుల విధానం చాలా షాక్ ని ఇచ్చింది. అందుకే తన గురించి మాట్లాడాల్సి వచ్చిందని తాప్సీ తెలిపింది.

Related Images:

షీనా బోరా హత్య కేసు నిందితురాలితో రియా జైలు షేరింగ్?

సుశాంత్ సింగ్ కేసులో వరుస ట్విస్టులు మెంటలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ తో కలిసి రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్స్ చేసేదని నార్కోటిక్స్ అధికారులు ప్రకటించారు. అలాగే ప్రమాదకర డ్రగ్స్ దుర్వినియోగం సరఫరా వంటి కేసుల్లో పలు సెక్షన్ల కింద చిట్టా పద్దు రెడీ చేసి జైలుకు తరలించారు. ఇంతకీ రియాను ఏ జైలుకు పంపారు? అంటే..

తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రెండ్రోజుల క్రితం డ్రగ్స్ సేకరించిన ఆరోపణలపై ఎన్సిబి ఆమెను అరెస్టు చేయగా..ఇప్పుడు ఆమెను బైకుల్లా జైలులోని ప్రత్యేక సెల్ లో ఉంచారని సమాచారం. ఈ సెల్ జైలు గ్రౌండ్ ఫ్లోర్ సాధారణ బ్యారక్స్ దగ్గర ఉంది. ఈ సెల్ ప్రత్యేకించి ఎంపిక చేసినది. 2016 సంవత్సరం నుండి ప్రముఖ వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా ఇక్కడే ఉన్నారని సమాచారం.

ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు .. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో సహ కుట్రదారు. ఇప్పుడు రియా చక్రవర్తిని ఇంద్రాణి ముఖర్జియాకు సమీపంలో ఉన్న సెల్ లో ఉంచారు. ఇంతకుముందు జనరల్ బ్యారక్స్ కు పంపినా రియా భద్రతా సమస్యల కారణంగా తన సెల్ ను మార్చాల్సి వచ్చింది. అలాగే రియా విందులో బియ్యం- పప్పు- 2 చపాతీలు మరియు ఒక సబ్జీ ఉన్నాయని తెలిసింది. రియా మాత్రమే కాదు.. ఆమె సోదరుడు షోయిక్ – శామ్యూల్ మిరాండా- దీపేశ్ సావంత్ లను కూడా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

రియా ఆమె సోదరుడు గురువారం జరిగే విచారణను బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు తరలించారు. ఎన్.డి.పి.ఎస్ చట్టం 1985 లోని సెక్షన్లు 8 (సి) 20 (బి) (ii)- 22- 27 ఎ -28- మరియు 29 సెక్షన్ల కింద రియాపై అభియోగాలు మోపారు. ఇంతలోనే మరో ట్విస్టు బయటపడింది. తాజా సమాచారం ప్రకారం.. రియా మాదక ద్రవ్యాల కోణానికి సంబంధించి ఆమె ఇంతకుముందు ఒప్పుకున్నది నిజం కాదని అనడం వేడెక్కిస్తోంది. వాటిని (డ్రగ్స్) తయారు చేయమని ఎన్.సి.బి అధికారులు ఆమెను బలవంతం చేశారని రియా ఆరోపించిందని తెలుస్తోంది.

Related Images:

సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. న్యాయం ఓడిపోయింది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇల్లీగల్ మందులు వాడి డ్రగ్స్ కూడా అలవాటు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది. అలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు రియాను మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒకేసారి మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను టార్గెట్ చేయడంతో న్యాయం ఓడిపోయింది.

విచారణ పేరుతో ఆమెను తీవ్రంగా హింసించారు.. వెంటాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఒక లాయర్ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. వారు నిర్దోషులు అయితే నిరూపించి బయటకు తీసుకు రమ్మంటూ సుశాంత్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.

Related Images:

సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?

గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సుశాంత్ అనుమాస్పద మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్ వ్యవహారం బయటకు పొక్కడంతో శాండిల్ వుడ్ లోనూ దీని ప్రతిధ్వనులు వినిపించాయి. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టి పలువురిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్ మరియు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్.. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిండా.. దీపేష్ సావంత్.. డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం లను అరెస్ట్ చేసింది. తాజాగా రియా ని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రియాను విచారించిన అధికారులు పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లను రాబట్టినట్టు సమాచారం.

మరోవైపు శాండిల్ వుడ్ లో అనేకమంది సినీ నటీనటులు మ్యూజిషియన్లు కూడా నిషేధిత డ్రగ్ యూజర్లేనని తేలింది. బెంగుళూరులోని ఓ హోటల్లో పలువురిని అరెస్టు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరు సినీ నటులకు సంగీత దర్శకులకు విద్యార్థులకు రకరకాల మత్తు మందులను సప్లయ్ చేస్తారని సమాచారం రాబట్టారు. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ.. తాజాగా హీరోయిన్ సంజన గల్రానీ ని కూడా అరెస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత మంది నటీనటుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే అసలు సినీ సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు?.. ఎప్పుడూ వారే తెరపైకి ఎందుకు వస్తుంటారనే అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కాగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ.. వర్క్ టెన్షన్ తో.. ఫ్యామిలీ టెన్షన్స్ తో మాదకద్రవ్యాలు తీసుకుంటారని.. దాని వల్ల ఉపశమనం పొందుతారనే భ్రమలో ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్ కి బానిసలుగా మారి వాటి నుంచి బయటపడలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో వారి వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది డ్రగ్ డీలర్స్ ఇతర దేశాల డ్రగ్ వ్యాపారులతో డీలింగ్స్ పట్టుకొని.. ఇక్కడ సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి దింపుతారని తెలుస్తోంది. ఈ మధ్య హీరోయిన్ కంగనా రనౌత్ సైతం బాలీవుడ్ లో 99 శాతం డ్రగ్స్ తో నిండి ఉందని.. మాదకద్రవ్యాలు లేకుండా పార్టీలు ఉండవని.. నీళ్లలా తీసుకుంటారని.. రణవీర్ సింగ్ – విక్కీ కౌశల్ వంటి హీరోలపై డ్రగ్స్ ఆరోపణలు చేసింది. ఇక టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ దందా నడుస్తుందని హీరోయిన్ మాధవీలత కామెంట్స్ చేసింది. డ్రగ్స్ అనేది చాలా చోట్ల ఉన్నప్పటికీ.. సెలబ్రిటీల మీద అందరి ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు హైలైట్ అవుతుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ డ్రగ్స్ కేసులో రానున్న రోజుల్లో ఎంతమంది పేర్లు బయటకి వస్తాయో చూడాలి.

Related Images:

రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన NCB

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు సహా సుశాంత్ సింగ్ వ్యక్తిగత స్టాఫ్ అరెస్టవ్వడం సంచలనమైంది. గత కొద్ది రోజులుగా రియాపైనా సీబీఐ – నార్కోటిక్స్ బృందాలు .. ఈడీ దర్యాప్తు సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు టీమ్ లో రియాను మూడోసారి పిలిపించి దర్యాప్తును కొనసాగించాయి. నేడు నార్కోటిక్స్ అధికారుల ముందు రియా హాజరయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు రియాను ఎన్.డి.పి.ఎస్ లోని వివిధ విభాగాల కింద అరెస్టు చేశారు. రియా చక్రవర్తి .. ఆమె సోదరుడు షోయిక్ మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి రియాను అదుపులోకి తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భావించారు. రియాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవలే రియా సోదరుడు షోయిక్ చక్రవర్తి .. మేనేజర్ శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత రియా చక్రవర్తి కుటుంబం ఈ కేసులో తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. సుశాంత్ మరణంలో రియా ప్రమేయం గురించి సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు నిధుల మళ్లింపుపైనా దర్యాప్తు సాగింది. సుశాంత్ సింగ్ క్రెడిట్ కార్డుల వినియోగంపైనా చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Related Images:

ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ ..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారణ ప్రారంభించి పలువురిని అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో ఇవాళ రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ విచారణకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. కనీసం ముందుకు కదలలేని పరిస్థితుల్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఈ ఘటనపై మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఓ స్త్రీ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

కాగా మంచు లక్ష్మి ట్వీట్ లో ”ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మనం మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలము? ఓ మనిషి పట్ల ఎలాంటి గౌరవం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూడటం చాలా హృదయ విదారకం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకముందు కూడా మంచు లక్ష్మి రియా కు మద్ధతు తెలుపుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. మీడియా ఓ అమ్మాయిని భూతంగా చూపిస్తోందని.. న్యాయ వ్యవస్థలపై నమ్మకముంచి నిజానిజాలు బయటపడే వరకు ఆమెను వదిలేయాలని కోరింది. ఇప్పుడు మరోసారి రియాకు బాసటగా నిలుస్తూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు రియా పై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది రియా పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించిన రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని విచారణాధికారులు ఆదివారం విచారించారు. ఈ కేసును ఇటు సీబీఐ అటు ఎన్సీబీ వేగవంతం చేశాయి. ఎన్సీబీ ఆధికారులు ఆమెకు సమన్లు జారీ చేయగా విచారణకు హాజరైంది. నేడు ఉదయం గం.10.30 సమయానికి ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. ఆమెను 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా రియా డ్రగ్స్కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

తాను డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు రియా ఒప్పుకుందని తెలుస్తోంది. షోవిక్ మిరండాల ద్వారా డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. అలాగే సుశాంత్ కోసం కూడా డ్రగ్స్ను కొనుగోలు చేశానని ఆమె అంగీకరించిందని తెలుస్తోంది. విచారణ సందర్భంగా అధికారులకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే సోమవారం కూడా ఆమెను విచారించనున్నారు.

కాగా సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో డ్రగ్స్ కేసు కూడా వెలుగు చూసింది. షోవిక్ చక్రవర్తి – దీపేష్ సావంత్ – శ్యామూల్ మిరండాలను అరెస్ట్ చేశారు. ఈ రోజు రియా కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు విచారణకు హాజరైన సమయంలో రియా లాయర్ సతీష్ మాన్ షిండే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ కేసులో మంత్రగత్తెను వెంటాడినట్టు రియాను వెంటాడుతున్నారని – అయితే ఆమె అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నారని – తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దమని – ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారన్నారు.

Related Images:

రియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం ఆ కేసుతో రియాకు సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవ్వడం ఆ తర్వాత ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటివి చకచక జరిగి పోయాయి. ఈ కేసులో రియా కుటుంబ సభ్యలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. కేసుతో సంబంధం లేకున్నా ఇప్పటికే వారిని మీడియా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. తాజాగా ఎన్ సీ బీ వారు శోవిక్ ను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఇంద్రజిత్ మాట్లాడుతూ కంగ్రాట్స్ ఇండియా. నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇక తర్వాత అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అనేది నాకు తెలుసు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సమర్థవంతంగా నాశనం చేయగలిగారు. న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఈ కేసులో రియా కుటుంబంను అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇంద్రజిత్ వ్యాఖ్యలు చాలా మందికి ఆవేదన కలిగిస్తున్నాయి. రియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అవ్వడం వల్ల ఆమెను ఇలా టార్గెట్ చేశారంటూ ఆమె సన్నహితులు మరియు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Related Images:

సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో ట్విస్టులు మలుపుల గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనేషిందే పేరు హైలైట్ అవ్వడం చర్చకు వచ్చింది. ఆయన రియాకు ఉచిత సేవలందిస్తున్నారనేది నెటిజనుల అభియోగం.

అయితే అదంతా ఉత్తుత్తే.. అంటూ.. న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని .. నా క్లైయింట్ ఫీజు ఇస్తుందా లేదా? అన్నది మా వ్యక్తిగతం అని అన్నారు. అలాగే ఈ కేసులో తన తరపున వాదించేందుకు నేనుగా తనని సంప్రదించాననేది కూడా అబద్ధం అని అన్నారు.

ఈరోజు సుశాంత్ కేసు విషయమై రియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పిలిపించడంతో లాయర్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందం ఇంకా విచారణ సాగిస్తోంది. అలాగే తన క్లయింట్ అయిన రియాను డిపెండ్ చేస్తూ.. ఇప్పటివరకు తనపై ఎటువంటి నేరారోపణలు లేవని అన్నారు.

రియా (28) మాదకద్రవ్యాలను తీసుకునేదని.. తన ప్రియుడు సుశాంత్కు నిషేధిత పదార్థాలను కాఫీలో కలిపి ఇచ్చేదనే మీడియా వాదనల్ని ఆయన ఖండించారు. రియా తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. ఆమె రక్త పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. రియాపై అనవసర ప్రచారం సాగుతోంది!! అని లాయర్ సతీష్ మాన్ సిండే వ్యాఖ్యానించారు. ముంబై పోలీస్.. బిహార్ పోలీస్.. తర్వాత ఈడీ.. ఇప్పుడు సీబీఐ విచారిస్తున్నారు. ఇంతమంది అవసరమా? అంటూ అతడు వ్యంగ్యంగా సెటైర్ వేసే ప్రయత్నం చేశారు.

Related Images:

సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది.

సుశాంత్ చనిపోయాడని తెలియగానే షాక్ కు గురయ్యా.. ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడ తనను రానీయలేదు. కేవలం సుశాంత్ శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు 3-4 సెకండ్లు మాత్రమే చూశాను అంటూ రియా వాపోయింది. నా స్నేహితులు వారిని ప్రాధేయపడ్డా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సుశాంత్ మరణం తనను కలిచివేసిందని ‘సారీ బాబు’ అంటూ రియా వాపోయింది. తను మరణించాడని.. జీవితాన్ని కోల్పోయాడని.. కానీ అతడి మరణాన్ని జోక్ లా చేశారని రియా ఆవేదన వ్యక్తం చేసింది. క్షమించమని కోరడం తప్ప నేను ఏమీ చేయలేనని.. అతడి పాదాలను తాకానని.. ఏ భారతీయుడైనా దీన్ని అర్థం చేసుకోవాలని రియా తెలిపింది.

Related Images:

సుశాంత్ రాజులా బతికాడు : రియా చక్రవర్తి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముందుగా సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ.. చివరికి సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. రియా తన కొడుకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్లిపోయిందని.. సుశాంత్ ను తమకు దూరం చేసిందని.. ఆమె కారణంగానే ఇదంతా జరిగుంటుందని ఆరోపించాడు. అప్పటి నుంచి రియానే సుశాంత్ మరణానికి కారణమనే రీతిలో నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారించారు. ఇక ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

కాగా రియా చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ కు సంబంధించి పలు విషయాలు వెల్లడించింది. రియా మాట్లాడుతూ ‘సుశాంత్ రాజులా బతికాడని.. అతడు భారీగా ఖర్చు చేసేవాడని’ చెప్పింది. ఫ్యాషన్ బ్రాండ్ ఈవెంట్ కోసం ఒంటరిగా పారిస్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నానని.. దానికి వసతి మరియు బుకింగ్ లు కంపెనీ వారే చేసారని.. అయితే సుశాంత్ ఆలోచనతో అది యూరప్ ట్రిప్ గా హాలిడేగా మారిందని.. తన బుకింగ్స్ మొత్తాన్ని రద్దు చేసి సుశాంత్ ఇష్టప్రకారం కొత్త బుకింగ్స్ చేశాడని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ ట్రిప్ వెళ్లాడని.. దాని కోసం ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు చేసాడని.. ఓ ప్రైవేట్ జెట్ బుక్ చేసుకున్నాడని రియా చక్రవర్తి చెప్పారు. ఇలాంటివి చాలా ఉన్నాయని.. సుశాంత్ ఖర్చు గురించి వెనుకాడేవాడు కాదని.. ఎప్పడూ భారీగా ఖర్చు చేస్తూ ఉండేవాడని రియా వెల్లడించింది. అంతేకాకుండా తాను సుశాంత్ భార్యభర్తల్లా కలిసి ఉన్నామని.. సుశాంత్ డబ్బుతో తాను జల్సాలు చేయలేదని.. ఆ ట్రిప్ లో అందరితో పాటే తనకు ఖర్చు చేసాడని రియా చెప్పుకొచ్చింది.

Related Images:

#సుశాంత్.. సీబీఐ దర్యాప్తు ఇరువర్గాలకు ఓకేనా.. అదెట్టా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు హీట్ పెంచేస్తున్నాయి. ఓవైపు రియాచక్రవర్తిపై మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు.. సంచలనం కాగా.. బిహారీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాంగణంలో మూడవ సారి విచారణలో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసింది.

ఈ నిర్ణయాన్ని దివంగత నటుడైన సుశాంత్ కుటుంబం .. స్నేహితులు సహా సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే సీబీఐకి కేసును బదలాయించడంపై అటు సుశాంత్ కుటుంబీకులతో పాటు రియా కూడా సంతోషం వ్యక్తం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజా పరిణామంతో ముంబై పోలీసులు.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తరహాలోనే రియా సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కేసును ఏ ఏజెన్సీ దర్యాప్తు చేసినా తన క్లైంట్ ఎలాంటి తప్పు చేయలేదనే రియా తరపున న్యాయవాది ప్రకటించారు.

బుధవారం నాడు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడమే కాకుండా.. కోర్టు సాక్ష్యాలను అందజేయాలని ముంబై పోలీసులను సుప్రీం కోరింది. ఈ ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం ముంబై పోలీసులకు లేకుండా చేసింది సుప్రీం. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రమేయాన్ని నిరాకరించింది. దీనిపై స్పందించిన సుశాంత్ కుటుంబ న్యాయవాది ఈ తీర్పును ప్రశంసించారు. “ఇది సుశాంత్ సింగ్ రాజ్పుత్ కుటుంబానికి సాధించిన విజయం. సుప్రీం మాకు అనుకూలంగా అన్ని అంశాలపై తీర్పు ఇచ్చింది. పాట్నాలో నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ సరైనదని కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది“ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిందే ఒక ప్రకటన విడుదల చేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పును `కోరుకున్న న్యాయం` అని గౌరవ వచనంతో ప్రస్థావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. “కేసు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తరువాత సుప్రీం తీర్పు సముచితమైనదే. గతంలో సిబిఐ దర్యాప్తుకు రియా స్వయంగా పిలుపునిచ్చినందున అది `కోరుకున్న న్యాయం` అవుతుందని గమనించాలి“ అని ఆయన అన్నారు. మొత్తానికి సుప్రీంలో కూడా రియాకు న్యాయం జరుగుతుందని రియా చక్రవర్తి న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేయడం ఆసక్తికరం. ఓవైపు సుశాంత్ కుటుంబీకులు కూడా సీబీఐకి దర్యాప్తును బదలాయించడంతో తమకు న్యాయం జరుగుతుందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎవరి వాదన ఎలా ఉన్నా అసలు సిసలు నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బరువు సీబీఐపై పడింది.

Related Images: