నాలుగేళ్ల క్రితం క్లినికల్ డిప్రెషన్ తో బాధపడుతున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎంతమాత్రం సంకోచించలేదు. డిప్రెషన్ పై ఇరాఖాన్ ఏదీ దాచుకోకుండా ఓపెనైంది. తన ఇన్ స్టాగ్రామ్ లో 23 ఏళ్ల ఆమె హృదయాన్ని ఆవిష్కరించింది. తన నిరాశకు కారణమయ్యే కారకాల గురించి మాట్లాడింది.
తాజా వీడియోలో ఇరా తన 14 సంవత్సరాల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. “14 ఏళ్ళ వయసులో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. అది కొంచెం విచిత్రమైన పరిస్థితి. ఆ వ్యక్తికి అదేమిటో తెలుసా అన్నది నాకు తెలియదు. అలా చేయడం… నేను వారికి తెలుసిన దానినే“ అని తెలిపింది.
తల్లిదండ్రులు అమీర్ ఖాన్ – రీనా దత్తాతో కమ్యూనికేట్ చేయడం ద్వారా ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడగలిగానని కూడా ఇరా తెలిపారు. “అసలు వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసునని .. ఏం చేస్తున్నారో నిర్ధారించుకోవడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. నేను వెంటనే నా తల్లిదండ్రులకు ఒక ఇమెయిల్ లెటర్ పంపాను. ఆ తర్వాత ఆ పరిస్థితి నుండి బయటపడ్డాను“ అని ఇరా వీడియోలో పేర్కొంది. తన గత అనుభవాలు తనను భయపెట్టేవి కావని ఇరా అన్నారు. “నేను భయపడలేదు. ఇది నాకు ఇకపై జరగదని భావించాను. అది ముగిసిన కథ. నేను కదిలి వెళ్ళిపోయాను. కాని అది నా జీవితానికి మచ్చలు కలిగించేది కాదు.. నాకు అనుభూతిని కలిగించేది కాదు.. నేను 18-20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను బాధపడ్డాను మళ్లీ“ అని ఆవేదనగా తెలిపింది.
అమీర్ ఖాన్ అతని మాజీ భార్య రీనా దత్తా విడాకులు తనను బాధించలేదని కూడా ఇరా అంది. సోదరుడు జునైద్.. స్నేహితులు ఉన్నారు. పరిపూర్ణత ఉన్న తల్లిదండ్రులు తనవారు అని ఆమె వీడియోలో పేర్కొంది. నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కాని వారి విడాకులు స్నేహపూర్వకంగా ఉన్నందున నాకు బాధ కలిగించే విషయం అనిపించలేదు. వారు మంచి స్నేహితులు.. కుటుంబం మొత్తం ఇప్పటికీ గొప్ప స్నేహితులు. మాది ఎవరితోనైనా కలతలు పెట్టుకునే కుటుంబం కాదు. విడాకుల తరువాత కూడా జునైద్ కు నాకు తల్లిదండ్రులుగానే ఉన్నారు.
అమ్మా నాన్నా విడాకులపై మాట్లాడుతున్నాను. ఇది మీకు మచ్చ కలిగించేది కావచ్చు. కానీ నాకు మచ్చ కాదు. నాకు సరిగా గుర్తు లేదు కానీ నా తల్లిదండ్రుల విడాకులు ఇబ్బందికరం బాధాకరం అని అని నాకు అనిపించలేదు. అది నన్ను బాధపెట్టినా.. చాలా విచారంగా ఉండటానికి కారణం కాదు అంటూ ఇరా ఖాన్ ఎమోషనల్ అయ్యింది.
ఇలా మాట్లాడడం ఒక మంచి మార్గం కాదని భావిస్తే ఈ విషయాలను వివరించడానికి హేతుబద్ధంగా ఎలా ప్రయత్నించగలను? మీరే ప్రయత్నించండి.. పరిష్కరించండి? నేను నా కోసం అలా చేయలేకపోతే? నేను సహాయం కోసం అడగనట్టే కదా? అని అన్నారు ఇరా.
ఇరా ఖాన్ కెరీర్ సంగతికి వస్తే.. గత సంవత్సరం దర్శకత్వం లో ప్రవేశించిన ఇరా ఇప్పటికే స్టేజీ డ్రామా పరంగా అనుభవం ఘడించారు. హాజెల్ కీచ్ ప్రధాన పాత్రలో ఓ స్టేజీ ప్లేకి దర్శకత్వం వహించారు. ఇరా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి.
బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2013లో అనురాగ్ కశ్యప్ రూమ్ కి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (ఐ) 354 341 342 కింద అనురాగ్ పై కేసు నమోదు చేశారు. దర్శకుడుకి సమన్లు జారీ చేసిన పోలీసులు.. గురువారం దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. తనపై పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అవాస్తవాలని కశ్యప్ పేర్కొన్నాడు. 2013లో నటి వేధింపులు జరిగాయని ఆరోపించిన సమయంలో తాను అసలు ఇండియాలో లేనని అనురాగ్ కశ్యప్ ఆధారాలుగా చూపించారని ఆయన తరఫు న్యాయవాది ప్రియాంక ఖిమాని తెలిపారు.
న్యాయవాది ప్రియాంకా ఖిమాని దీనిపై స్పందిస్తూ.. ”నటి ఆరోపణల్ని అనురాగ్ పూర్తిగా ఖండించారు. తన స్టేట్మెంట్ పోలీసులకు అందించారు. 2013 ఆగస్టులో అనురాగ్ తన సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాల్ని పోలీసులకు అందించారు. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. నటి వ్యాఖ్యలు అవాస్తవాలని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు విమర్శలు నా క్లయింట్ ని.. ఆయన కుటుంబ సభ్యుల్ని అభిమానుల్ని బాధించాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కూడా తనకు జరిగిన నష్టానికి చట్టపరంగా వెళ్లాలని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు.. వ్యక్తిగత ఉద్దేశాల కోసం మీటూ ఉద్యమాన్ని వాడుకున్నందుకు నటిపై చర్యలు తీసుకోవాలని కోరారు” అని పేర్కొన్నారు.