యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా ”ఆదిపురుష్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో 3డీ లో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో 2022 ఆగస్టు 11న విడుదల చేననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పది తలల ‘లంకేష్’ గా నటించనున్నారు. అయితే ఇటీవల సైఫ్ అలీఖాన్ ఈ సినిమా గురించి వెల్లడించిన విషయాలతో ‘ఆదిపురుష్’ అనవసర వివాదాలను కొని తెచ్చుకునేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.
సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. ”రాక్షస ప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇందులో సీతని అపహరించినందుకు రామునితో రావణుడికి మధ్య యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను.. తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు అతను చేసే ప్రయత్నాలు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్టైనింగ్ గా మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు” అని రావణుడి పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సైఫ్ చెప్పిన విషయాలు ప్రభాస్ ని కాంట్రవర్సీలోకి లాగుతాయేమోనని డార్లింగ్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
ఇతిహాస ‘రామాయణం’ ను మనదేశంలో ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని విషయాల్లో అయోధ్యను పాలించిన రాముడుని ఆదర్శంగా తీసుకుని ముందుకువెళ్తుంటారు. అయోధ్యలో రామమందిరం విషయంలో ఎన్నో ఏళ్లుగా జరిగిన వివాదం గురించి తెలిసిందే. రామాయణం ను ఎంతగా ఆరాధిస్తారో అని చెప్పడానికి ‘రామాయణం’ సీరియల్ ను ఈ లాక్ డౌన్ సమయంలో మూడు దశాబ్దాల తరవాత దూరదర్శన్ రీ-టెలీకాస్ట్ ఏకంగా 77 మిలియన్ల మంది వీక్షించారు. అలానే మణిరత్నం ‘రావణ్’ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తే అప్పట్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ‘అవతార్’ లో పండోరాల గెటప్స్ రాముడిని పోలి ఉన్నాయని.. ఆ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసినవారు కూడా లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు ‘ఆదిపురుష్’ లో రావణుడిని మంచి మనిషిగా చూపిస్తే ఎక్కడో రాముడుని తక్కువ చేస్తున్నారనే అనే భావన వస్తుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రభాస్ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అనవసరంగా కాంట్రవర్సీలోకి వస్తాడేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
వరుస వివాదాలతో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పోరాటం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఇంతకుముందు సత్యం రామలింగరాజు జీవితంపై సిరీస్ ని రూపొందించి కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తోంది. తన అనుమతి లేకుండా సిరీస్ తీశారని మనోభావాల్ని కించపరిచారని నెట్ ఫ్లిక్స్ పై రామలింగరాజు ఫ్యామిలీ పోరాటం సాగిస్తోంది. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.
ఇదిలా ఉండగానే `ఏ సూటబుల్ బాయ్` అనే వెబ్ సిరీస్ ద్వారా మత మనోభావాలను దెబ్బతీసినందుకు నెట్ ఫ్లిక్స్ కి చెందిన ఇద్దరు ప్రతినిధులపై మధ్యప్రదేశ్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఓ ఆలయ ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలను చూపించడమే ఇందుకు కారణమని ఓ అధికారి తెలిపారు. కంటెంట్ (నెట్ఫ్లిక్స్) ఉపాధ్యక్షుడు మోనికా షెర్గిల్.. పబ్లిక్ పాలసీల (నెట్ఫ్లిక్స్) డైరెక్టర్ అంబికా ఖురానా అనే పేర్లను ఎఫ్.ఐఆర్ ప్రకటించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.
నెట్ ఫ్లిక్స్ సిరీస్ రూపకర్తల నుండి క్షమాపణ చెప్పాలని.. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ ఇచ్చిన ఫిర్యాదుపై రేవా పోలీసులు అభియోగాలు మోపారు.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న `ఏ సూటబుల్ బాయ్` సిరీస్ ను సదరు ఆలయంలో చిత్రీకరించారా ? మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందో లేదో తనిఖీ చేయమని నేను అధికారులను కోరాను. ఈ దృశ్యాలు మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పరీక్షా ప్రైమా ఫేసీ కనుగొంది. ఒక ప్రత్యేక మతంపై విమర్శగా ఉంది అంటూ మిస్టర్ మిశ్రా ఒక వీడియో స్టేట్మెంట్లో చెప్పారు.
“గౌరవ్ తివారీ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నెట్ ఫ్లిక్స్ అధికారులపై రేవాలోని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 295 (ఎ) (మతపరమైన భావాలను నమ్మకాలను రెచ్చగొట్టడం అవమానించడం వంటి హానికరమైన చర్యలు) కింద ఎఫ్ఐ.ఆర్ నమోదు చేశారు. మోనికా షెర్గిల్ – అంబికా ఖురానా దీనికి బాధ్యులు” అని అన్నారాయన. రేవా పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేవామని తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
నెట్ ఫ్లిక్స్ సిరీస్ మేకర్స్ దీనికి క్షమాపణ చెప్పాలని `ఎ సూటిబుల్ బాయ్` నుండి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని కోరుతూ గౌరవ్ తివారీ శనివారం రేవా పోలీసు సూపరింటెండెంట్ కు మెమోరాండం సమర్పించారు.
“మధ్యప్రదేశ్ లోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం మహేశ్వర్ ఆలయం లోపల ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమిది. ఇది లవ్ జిహాద్ ను కూడా ప్రోత్సహిస్తోంది“ అని తివారీ పేర్కొన్నారు. అతను తన ఫిర్యాదు దరఖాస్తులో మోనికా షెర్గిల్ .. అంబికా ఖురానా అని పేర్లు పెట్టారు.
ఆరు భాగాల నెట్ఫ్లిక్స్ సిరీస్ కు ప్రఖ్యాత చిత్రనిర్మాత మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలైన `సలాం బాంబే`..`మాన్ సూన్ వెడ్డింగ్` .. ది నేమ్సేక్ లతో సంచలనాల దర్వకురాలిగా పాపులరయ్యారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. ప్రతీ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రతి షాట్ ని అలా తీర్చిదిద్దుతాడు కాబట్టే అందరూ ‘జక్కన్న’ అని పిలుస్తూ ఉంటారు. అపజయం ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్న రాజమౌళి.. స్టోరీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ప్రేక్షకులను మెప్పించే విధంగా తీయడమే కాకుండా.. వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై వివాదం చోటు చేసుకుంది.
‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గా.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ లుక్ ని రివీల్ చేస్తూ టీజర్ ని విడుదల చేశారు. అయితే ఇందులో తారక్ ని ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించినట్లు చూపించడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆదివాసీల నుంచి ఎంపీల వరకు అందరూ రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. ముస్లిం పాలకులపై పోరాడి వారి చేతిలోనే చంపబడ్డ వీరుడు కొమురం భీమ్ పాత్రను వారి వేషదారణలో చూపించడం తగదని.. భీమ్ కి టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. ఈ సినిమాను అలానే రిలీజ్ చేస్తే బరిశెలతో కొట్టి చంపుతామని..థియేటర్స్ తగల బెడతామని హెచ్చరికలు చేశారు.
అయితే ఈ వివాదంపై రాజమౌళి లేదా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందం ఇంతవరకు స్పందించలేదు. రాజమౌళి మొదటి నుంచి ఇది ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తో తీస్తున్న కల్పిత కథ అని చెప్తూ వస్తున్నాడు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ టోపీ ని తీసేయడం కుదిరేపని కాదని తెలుస్తోంది. అయితే ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో రాజమౌళి ఇండస్ట్రీలోని ప్రముఖులతో పలువురు రాజకీయ నాయకులతో ఈ వివాదంపై చర్చిస్తున్నారట. ఇటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలా అనే విషయం గురించి పూర్తిగా డిష్కసన్ చేసిన తర్వాతే ఈ ఇష్యూపై జక్కన్న స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వివాదానికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుండి కొమురం భీమ్ ఫస్ట్ లుక్ మరియు థీమ్ వీడియోను విడుదల చేశారు. నాలుగు అయిదు నెలల క్రితం విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా వేశారు. ఎట్టకేలకు విడుదల అయిన రామరాజు ఫర్ భీమ్ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కింది. అన్ని భాషల్లో కూడా ఈ వీడియోను విపరీతంగా ఆధరిస్తున్నారు. యూట్యూబ్ లో మంచి రికార్డు కూడా సొంతం చేసుకుంది. అద్బుతమైన స్పందన ఈ ప్రోమోకు మొదట కాపీ మరక అంటించారు. ఇప్పుడు ఆదివాసీలు వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీల గోండు వీరుడు అయిన కొమురం భీమ్ పేరుతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూపించడం వరకు ఓకే కాని ఆయనను ముస్లీంగా చూపించడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లీంగా కళ్లకు నల్లరంగు పెట్టుకుని ముస్లీం టోపీ ధరించడంతో చరిత్రను వక్రీకరించినట్లుగా అవుతుంది అంటూ కొందరు జక్కన్న టీం పై ఫిర్యాదుకు రెడీ అయ్యారు. ఉట్నూరు లోని కొమురం భీమ్ యువజన సంఘం నాయకులు ఈ విషయమై నిరసన తెలిపారు. నిజాంపై పోరాటం సాగించిన భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు.
మొదటి నుండి ఈ సినిమాలో హీరోల పాత్రలు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్లు మాత్రమే.. కథ మొత్తం పూర్తి విభిన్నంగా ఉంటుందని ఇది ఒక స్వాతంత్ర్య ఉద్యమ సినిమా కాదని చెప్పారు. అయినా కూడా చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ వివాదం రాజేస్తున్నారు. ముందు ముందు మరెలాంటి వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతాయో చూడాలి.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 51 రోజులపాటు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయిన సంగతి తెలిసిందే.. బాలు మృతిపై దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
అయితే బాలు మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరతీశారు. బాలు చికిత్సకు ఆ హాస్పిటల్ బిల్లు భారీగా వేసిందని సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఎస్పీ బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడు ప్రభుత్వంను ఆశ్రయించగా.. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని.. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తన తండ్రికి చికిత్సనందించిన ఎంజీఎం ఆస్పత్రిపై విష ప్రచారం చేయడం సరికాదని ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి బాధపడుతున్న సమయంలో ఇలా లైవ్ లోకి రావడం దురదృష్టకరమని చరణ్ వాపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అబద్ధమని చరణ్ తెలిపారు. ఇలాంటి వార్తలు తమ కుటుంబానికి బాలుకు చికిత్స అందించిన డాక్టర్లకు ఆస్పత్రికి నష్టం చేకూరుస్తాయని.. తప్పుడు ప్రచారం ఆపాలని చరణ్ తెలిపారు.
త్వరలోనే ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో కలిసి బాలు చికిత్స వివరాలు బిల్లులు బయటపెడుతామని విలేకరుల సమావేశంలో చెబుతామని చరణ్ క్లారిటీ ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కూడా తన నాన్న బాలు కోసం వైద్య పరికరాలు పంపించి సహకరించిందని చరణ్ తెలిపారు.
ఎస్పి బాలు ఆసుపత్రి బిల్లులను తాము చెల్లించామనే ప్రచారంపై ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లపై దీపా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది ఎస్పీ బాలు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని.. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయవద్దని లేదా అలాంటి వాట్సాప్ ఫార్వార్డ్లను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందిన ఎంజిఎం హెల్త్కేర్ హాస్పిటల్ 2 వారాల క్రితమే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారని దీపా అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సర్ మా కుటుంబానికి దగ్గరగా ఉన్నందున ఆసుపత్రి అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల గురించి.. కొన్ని సార్లు నా తండ్రి వెంకయ్యకి కూడా తెలియజేస్తున్నారు ”అని దీప తెలిపారు.