తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లలో ఉంటారు. థియేటర్లు అంతా హౌస్ ఫుల్ తో నిండిపోయేవి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మహమ్మారి కరోనా అన్నింటిని మూతపడేసింది. కరోనా వైరస్ తో అన్ని రంగాలతోపాటు సినీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అన్ని రంగాలు మళ్లీ రికవరీ అయినా సినీ పరిశ్రమ మాత్రం ఇప్పటికీ కోలుకోవడం లేదు.
సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా జనాలు రావడం లేదు.థియేటర్లలో సినిమాలు పడడం లేదు. అన్ లాక్ అయినా థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా భయానికి జనాలు థియేటర్లకు వచ్చే ధైర్యం చేయడం లేదు.దీంతో సినీ నిర్మాతలు కూడా తమ సినిమాలను వాయిదా వేస్తున్నారు. కొందరు ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కన్నడ చిత్ర పరిశ్రమ చొరవ తీసుకుంది. ‘కమ్.. లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్’ అనే పేరుతో ఓ వీడియోను రూపొందించింది. ఇది వైరల్ అయ్యింది.
ఈ వీడియోను షేర్ చేసిన పూరి జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయి. మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్.. మన అమ్మా’ అని పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.
I got tears after watching this 👌🏾. మళ్ళీ ఆ రోజులు రావాలి . విజిల్స్ వెయ్యాలి , పేపర్స్ ఎగరాలి . చొక్కాలు చిరగాలి .. సినిమా థియేటర్ 🔥.. మన అమ్మ 🙏🏽 pic.twitter.com/TAnemU102d
— PURIJAGAN (@purijagan) November 16, 2020
తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి – సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ”బోగన్”. అక్కడ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. హన్సిక మొత్వానీ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఇటీవలే ‘బోగన్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు ‘సింధూర’ సాంగ్ విడుదల చేయబడి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘బోగన్’ చిత్రం నుంచి ‘రా రా ఇటు రా’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘రా రా ఇటు రా రా.. నీ గమ్యం నీలో చూపిస్తా ఇటు రారా’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు ఇమ్మాన్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. దీనికి తగ్గట్టు అశ్విన్ మరియు దీపికా కలిసి ఆలపించారు. ‘కళ్ళల్లోనా గుండెల్లోనా.. నువ్వుండగా.. నేను ఆగేదెట్టాగే..’ అంటూ ఈ ట్యూన్ కి ప్రముఖ లిరిసిస్ట్ భువనచంద్ర మంచి సాహిత్యాన్ని అందించాడు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ రొమాంటిక్ మూడ్ కి తగ్గట్టు విజువల్స్ చూపించాడు. ఈ సాంగ్ లో జయం రవి – హన్సిక ఎంతో అందంగా కనిపిస్తున్నారు. కాగా ‘జయం’ రవి – అరవింద్ స్వామి కాంబోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘బోగన్’ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ”గుడ్ లక్ సఖి”. ఆది పినిశెట్టి – జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు(అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ షూటింగ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సెట్స్ లో కీర్తి సురేష్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపించారు.
తెలుగు తమిళ మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజ్ సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర – శ్రావ్యా వర్మ నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ‘గుడ్ లక్ సఖి’ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్.. ఆరు నెలల తర్వాత హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. సింగిల్ షెడ్యూల్ లో మిగిలిన భాగం చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టేసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ముగింపు దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ఏ వేదికపై విడుదల అవుతుందనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న తహసీల్డార్ కామాంధుడిగా మారాడు. తనతో పాటు పనిచేసే సహోద్యోగితోనే కామవాంఛలు తీర్చుకుంటూ కెమెరా కంటపడ్డాడు. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలో ఓ తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది. కొప్పళ నగరాభివృద్ధి శాఖలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న గురుబసవరాజ్ గతంలో కుష్ఠగి తాలూకా తహసీల్దార్‌గా పనిచేశారు. ఆరు నెలల క్రితమే కొప్పళకు బదిలీపై వచ్చారు.
గతంలో ఆయన పనిచేసిన చోట ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలు జరుపుతున్న వీడియో తాజాగా సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన అధికార వర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. దీనిపై కొప్పళ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో చాలాకాలం నాటిదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ వీడియోను ఎవరైనా దురుద్దేశంతోనే లీక్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.