వెంకీ.. తరుణ్ ల మూవీ అప్ డేట్

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని సురేష్ బాబు ఓకే చెప్పారు. స్క్రిప్ట్ చర్చలు కూడా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను వెంకీ డేట్ల కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబో మూవీకి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. వెంకీ ప్రస్తుతం చేస్తున్న నారప్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఎఫ్ 3 సినిమాలో నటించేందుకు ఇప్పటికే డేట్లు ఇచ్చేశాడు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంకీకి చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ పడింది. అందుకే మరోసారి అనీల్ రావిపూడికి వెంకీ డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు. ఎఫ్ 3 సినిమాతో మరోసారి ఖచ్చితంగా తనకు అనీల్ సక్సెస్ ను ఇస్తాడనే నమ్మకంతో వెంకీ ఉన్నాడు. అందుకే తరుణ్ భాస్కర్ ను మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందిగా సూచించాడట.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత అంటే వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత లేదా దసరా వరకు అయినా మొదులు పెట్టే అవకాశం ఉంది. అంటే 2022లో వెంకీ తరుణ్ భాస్కర్ ల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాను గుర్రపు పందేలా నేపథ్యంలో రూపొందించబోతున్నాడు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు మరియు ఆయన ఇమేజ్ కు సరిగ్గా సూట్ అయ్యే కథ అవ్వడం వల్ల సురేష్ బాబు వెంటనే ఒప్పుకున్నాడట. తానే స్వయంగా సినిమాను నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాడు. కాని వెంకీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

Related Images:

30 ఏళ్ల తర్వాత మళ్లీ వెంకీ ఆ పాత్రలో..!

వెంకటేష్ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎన్నో పాత్రలు చేశాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దాదాపు 30 ఏళ్ల క్రితం ‘సుందరాకాండ’ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన పాటలు మరియు సన్నివేశాలు ఇప్పటికి చాలా ఫేమస్. లెక్చరర్ గా వెంకీ పండించిన హాస్యం మరియు ఎమోషన్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమా విడుదలైన ఇన్నాళ్లకు మళ్లీ వెంకటేష్ లెక్చరర్ గా నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్న వెంకటేష్ ఆ వెంటనే అంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ ఒక సినిమాను చేయబోతున్నాడు. గుర్రపు పందేలు బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న ఆ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడు అనేది సురేష్ ప్రొడక్షన్స్ వర్గాల మాట.

లెక్చరర్ అయిన హీరో గుర్రపు పందేలపై ఆసక్తితో ఏం చేశాడు అనేది సినిమా కథాంశంగా ఉంటుందని వెంకీ ఇమేజ్ కు తగ్గట్లుగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తరుణ్ భాస్కర్ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. సురేష్ బాబుకు కథ బాగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత షూటింగ్ ప్రారంభం అయ్యి వచ్చే 2022 ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందబోతున్న ఈ సినిమాలో వెంకీ లెక్చరర్ గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

Related Images:

వెంకటేష్ వేసిన బాటలో నడుస్తున్న శర్వానంద్…!

విక్టరీ వెంకటేష్ – కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమా రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ‘నేను శైలజ’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత కిశోర్ తిరుమల ఈ స్టోరీ వెంకటేష్ కి చెప్పడం.. దానికి వెంకీ చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. అదే సమయంలో కిశోర్ తిరుమల ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ సినిమాలు చేసుకుంటూపోయాడు. వెంకటేష్ కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కిశోర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ తో కాకుండా టాలెంటెడ్ హీరో శర్వానంద్ తో చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం.

శర్వానంద్ హీరోగా ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ చిత్రాన్ని దసరాకి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించనున్నారని తెలుస్తోంది. ఇంతకముందు శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని యస్.యల్.వి బ్యానర్ పై నిర్మించనున్నారు. వెంకటేష్ కి చెప్పిన స్టోరీలో శర్వానంద్ కు తగ్గట్లు డైరెక్టర్ చాలా మార్పులు చేశారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మొత్తం మీద వెంకటేష్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ యువ హీరో చేతిలో వచ్చి పడింది. శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమాతో పాటు.. ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ చిత్రాన్ని ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Related Images:

‘నారప్ప’ షూటింగ్ అప్డేట్

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ మూవీని తెలుగులో నారప్ప అంటూ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. ఆరు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న వెంకటేష్ ఇప్పుడు షూటింగ్ కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు సురేష్ బాబు షూటింగ్స్ వద్దనుకున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘నారప్ప’ను షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

షూటింగ్ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించి నవంబర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ పనిమీదే ఉన్నాడట. పూర్తి జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ జరుపబోతున్నారట. కేవలం 25 నుండి 35 మంది మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే నారప్పను విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టకునేలా నారప్ప ఉంటుందంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

Related Images:

34 యేళ్ల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న ‘విక్టరీ వెంకటేష్’..!!

విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడని అందరికి తెలిసిందే. కానీ ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు గడిచిందని ఎంతమందికి తెలుసు. నేటికీ హీరోగా ఆయన కెరీర్ ప్రారంభించి 34 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల సినీ చరిత్ర కలిగిన వెంకటేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ఎందరో గొప్ప దర్శకులతో కలిసి పనిచేసారు. అలాగే ఇన్నేళ్ల సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు. కానీ విక్టరీ వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. సహజమైన నటనతో తెలుగువారి మనసులను గెలుస్తూ వస్తున్నారు వెంకటేష్. అయితే 1986 ఆగష్టు 14న వెంకీ హీరోగా ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు విడుదల అయింది.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందింది. ఈ సినిమాతోనే హీరోయిన్ ఖుష్బూ సినీ కెరీర్ ప్రారంభించింది. తెలుసు కదా.. దర్శకేంద్రుడి సినిమా అంటే రొమాన్స్ మాములుగా ఉండదు. అన్నీ హంగులతో సినిమా రూపొందించారు. ఇదిలా ఉండగా.. తాజాగా వెంకటేష్ హోమ్ ప్రొడక్షన్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ వారు సోషల్ మీడియాలో వెంకీ 34యేళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న కారణంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో వెంకటేష్ లేటెస్ట్ మూవీలతో పాటు ఆయన పోషించిన సూపర్ హిట్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన వెంకటేష్.. ఇటీవలే వెంకీమామ సినిమా విజయంతో జోరు పెంచారు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ తెలుగు నారప్పలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Images: