వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకపై వాహనాలకు కూడా నామినీ ఫెసిలిటీని తీసుకురానుందని తెలుస్తోంది.

వెహికిల్ ఓనర్ షిప్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇకపై వాహనదారులు వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఓనర్ తో పాటు నామినీని కూడా యాడ్ చేయవచ్చు. ఒకవేళ వాహనం కొనుగోలు చేసిన సమయంలో యాడ్ చేయకపోతే ఆ తర్వాత అయినా నామినీ పేరును యాడ్ చేయవచ్చు.

ఈ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక మార్పులు చేయడానికి సిద్ధమైంది. వాహనదారులు రిజిస్ట్రేషన్ సమయంలో నామినీ పేరును యాడ్ చేయడం కుదరని పక్షంలో భవిష్యత్తులోనైనా నామినీ పేరును యాడ్ చేసే విధంగా కేంద్రం సవరణలు చేయనుందని సమాచారం. ఈ నిబంధనలు అమలులోకి వస్తే వాహనదారులు చనిపోతే నామినీలకు వాహనం చెందుతుంది.

వాహన యజమాని డెత్ సర్టిఫికెట్ సమర్పించడం ద్వారా వాహనాన్ని సులభంగా నామినీ పేరుకు మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాహనానికి నామినీ లేకపోతే యజమానికి తామే వారసులమని కుటుంబ సభ్యులు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

Related Images:

సామ్ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందని!

అక్కినేని కోడలు సమంత టాలీవుడ్ బెస్ట్ ఫ్యాషనిస్టాగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. సామ్ ఇన్ స్టా లుక్స్ పై నిరంతరం యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఎప్పుడు ఏ కొత్త మోడల్ డిజైనర్ లుక్ బయటకు వచ్చినా ఆ ఔట్ ఫిట్ లో సామ్ మెరిసిపోతుంటుంది. బాలీవుడ్ స్టార్లు అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ తర్వాత సౌత్ నుంచి అంతగా పాపులరైంది సామ్.

ఇక ఇటీవల ఉపాసన కామినేని తో కలిసి ఓ కార్యక్రమం కోసం స్పెషల్ ఫోటోషూట్ తో అదరగొట్టేసింది. ఇదే గాక ఓ కవర్ పేజీలో సామ్ ఔట్ ఫిట్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. అన్నట్టు సామ్ ని ఈ వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో చూడగానే ఏదైనా శుభవార్త చెబుతోందా? హబ్బీతో కలిసి తన ఫేవరెట్ అనుష్క శర్మలా ఆ శుభవార్త చెప్పేస్తుందా? అంటే ఒకటే కామెంట్లు పడిపోతున్నాయ్.

ఇక కెరీర్ సంగతి చూస్తే .. సమంత ప్రస్తుతం నయనతారతో కలిసి విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. అదేగాక.. మాయ .. గేమ్ ఓవర్ దర్శకుడు అశ్విన్ శరవణన్ సమంతా అక్కినేనితో కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసినదే. అయితే ఆ మూవీ ఆగిపోయిందని కథనాలొస్తున్నాయి. అయితే ఇది నిజమా? అని దర్శకుడిని ప్రశ్నిస్తే.. అందులో ఎలాంటి నిజం లేదని కనీసం దర్శకనిర్మాతల్ని అయినా అడక్కుండా అలా రాసేస్తారా? అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని .. త్వరలో సెట్స్ కెళతామని తెలిపారు. ఇక ఇందులో సమంత బదులుగా తాప్సీ నటిస్తుంది అన్నదాంట్లో కూడా ఎలాంటి నిజం లేదు.

అశ్విన్ చిత్రంలో నటిస్తున్నానని సమంత ఇంతకుముందు ధృవీకరించింది. అయితే .. మహమ్మారి కారణంగా.. షూట్ ఇంకా ప్రారంభం కాలేదు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సమంతాతో పాటు స్నేహ భర్త ప్రసన్న ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అన్నీ సరిగ్గా కుదిరితే ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే వీలుంది.

Related Images:

KGF 2 టీమ్ నుంచి అభిమానులకు శుభవార్త

రాక్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. రాఖీభాయ్ హవా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజులో సాగింది. కేవలం కన్నడ ఇండస్ట్రీ నుంచే ఈ మూవీ 100 కోట్ల షేర్ వసూలు చేయడం సంచలనం కాగా హిందీ చిత్రపరిశ్రమ నుంచి అసాధారణ వసూళ్లను తెచ్చింది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ వస్తోంది? అనగానే సర్వత్రా ఒకటే ఉత్కంఠ.

నిజానికి మహమ్మారీ లాక్ డౌన్ అన్నివిధాలా నాశనం చేసింది. కేజీఎఫ్ 2 ఈపాటికే రిలీజవ్వాల్సినది వాయిదా పడింది. రకరకాల కోర్టు కేసులు గొడవల వల్ల కూడా షూటింగ్ వాయిదా ఫర్వంలో సాగడం మైనస్ అయ్యింది. ఎట్టకేలకు కోర్టులు అనుమతించాక షూటింగును పూర్తి చేశారు.

తాజా సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోంది. ఈ మూవీని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. కెజిఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీకి సంబంధించి ఎవరూ అధికారికంగా ఏదీ ధృవీకరించని ఈ సన్నివేశంలో దర్శకనిర్మాతల ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

నేడు (అక్టోబర్ 3) నిర్మాత విజయ్ కిరంగదూర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దృష్టి రిలీజ్ తేదీ పైనే ఫోకస్ అయ్యింది. ఈ సంవత్సరం తమకు అతిపెద్దదిగా ఉంటుందని నిర్మాత హింట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. అంటే దీనర్థం ఈ సంవత్సరమే కేజీఎఫ్ 2 ని రిలీజ్ చేస్తామనేది దర్శకనిర్మాతల ఆలోచన అని అర్థం చేసుకోవాలా? ఒకవేళ ఇదే నిజమైతే ప్రస్తుత కోవిడ్ భయాల నడుమ జనాల్ని థియేటర్లకు రప్పించే సీన్ ఉంటుందా? కేజీఎఫ్ 2 గేమ్ ఛేంజర్ అవుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది.

ఇప్పటికి అంతా గందరగోళంగా ఉంది. థియేటర్లు తెరిచే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తే మేలే. కానీ అలా కాకపోతే బహుభాషా సీక్వెల్ కు ఎదురుదెబ్బ పడినా పడొచ్చు. `కేజీఎఫ్: చాప్టర్ 2` లోనూ రాకీ భాయ్ పాత్రలో యష్ కనిపిస్తాడు. సంజయ్ దత్ అధీరాగా కనిపిస్తున్నారు. విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related Images:

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. డాక్యుమెంట్స్ మర్చిపోయిన నో ప్రాబ్లమ్ !

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీనితో వాహనదారులకు ఊరట కలుగనుంది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అలాగే డిజిటైజేషన్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ను నోటిఫై చేసింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

వీటి ప్రకారం..వాహనదారులు వెహికల్ డాక్యుమెంట్లను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో చూపిస్తే సరిపోతుంది. అది ఎలా అంటే .. వాహనదారులు వారి వెహికల్ రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డిజిలాకర్ డిజి లాకర్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే సరిపోతుంది. మళ్లీ ఫిజికల్ డాక్యుమెంట్లను చూపించాల్సిన పని లేదు. అంతేకాకుండా వాహనదారులు కూడా తప్పులు చేస్తే తప్పించుకోలేరు. రూల్స్ అతిక్రమణలు ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ అవుతూ వస్తాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రూల్స్ను కొంత సవరించింది. ఇప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్స్ ను కూడా వాడచ్చు. అయితే మొబైల్ ఫోన్స్ ను కేవలం దారి తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ను ఉపయోగించాలి. అంటే రూట్ నావిగేషన్కు ఫోన్ ఉపయోగించొచ్చు. ఇతరత్రా వాటికి ఫోన్ వాడితే మాత్రం జరిమానా పడుతుంది.

Related Images:

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ..ఏంటంటే ?

మీ ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉందా ! అయితే మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ఓ కీలక ప్రకటన చేసింది. వాహనాల డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించింది. మోదీ సర్కార్ తాజాగా మోటార్ వెహికల్ డాక్యుమెంట్లు అయిన వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

2020 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో వాహనదారులకు తప్ప్పలు తప్పనున్నాయి. తాజా నిర్ణయంతో ప్రజలకు డాక్యుమెంట్ల రెన్యూవల్ కు ఎక్కువ గడువు అందుబాటులోకి వస్తుంది.

క్లారిటీ గా చెప్పాలంటే వెహికల్ డాక్యుమెంట్లు ఏమైనా ఎక్స్ పైరీ అయ్యి ఉంటే.. ఇప్పుడు అవే డాక్యుమెంట్లు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి. అంటే ఈ ఏడాది లోపు ఎక్స్ పైరీ అయిన డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైరీ అయ్యి ఉంటే దాన్ని కూడా డిసెంబర్ లోపు ఎప్పుడైనా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆర్టీవో ఆఫీసులో గుంపులు గుంపులుగా కాకుండా కొంచెం తక్కువగా వెళ్తారని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Images: