మహాబలేశ్వరం కొండ కోనల్లో RRR షూటింగ్

పచ్చని కొండ కోనలు అడవులతో ఆధ్యాత్మిక స్థలంగానూ మహాబలేశ్వరం ఎంతో ప్రసిద్ధి. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఈ పవిత్ర స్థలం ఉంది. అలాంటి చోట షూటింగ్ అంటే చిత్రబృందానికి అంతకంటే థ్రిల్లింగ్ మ్యాటర్ ఇంకేం ఉంటుంది. అయితే చలికాలం ప్రవేశించాక హిల్ స్టేషన్ కి వెళ్లడమే ఇక్కడ ఆసక్తికర పాయింట్.

ఇంతకీ ఎవరు వెళ్లారు? అంటే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా రామ్ చరణ్ – తారక్ సహా నాయికల బృందం మహాబలేశ్వరానికి బయల్దేరిందట. ఇటీవలే ఈ పాన్ ఇండియా మూవీ సుదీర్ఘ నైట్ షెడ్యూల్ ని ముగించి యూనిట్ చిన్న విరామం తీసుకుంది. తాజా షెడ్యూల్ మహాబలేశ్వర్ లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాలలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొంటున్నారు.

చరణ్- ఎన్టీఆర్ గత వారం చెన్నై వెళ్లి షెడ్యూల్ కోసం సిద్ధమయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా బృందం మహాబలేశ్వర్ నుండి ఆన్ లొకేషన్ వీడియోను పోస్ట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ త్వరలో పూణేలో ప్రారంభం కానుంది. అలియా భట్ ఈ షెడ్యూల్ లో సెట్స్ పైకి చేరనున్నారు. చరణ్ – ఆలియాపైనా కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం.

Related Images:

షూటింగ్ లో ఉండగా హీరోకు బ్రెయిన్ స్ట్రోక్

బాలీవుడ్ లో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఎంత మంది బాలీవుడ్ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగిసి పోతుంది అంటూ ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్ అభిమానులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. రొమాంటిక్ హీరోగా పేరున్న రాహుల్ రాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

కార్గిల్ లో షూటింగ్ లో ఉండగా రాహుల్ రాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లుగా చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం కార్గిల్ లో ఉన్న వాతావరణం అంటూ వైధ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులే రాహుల్ అనారోగ్య పరిస్థితికి కారణం అయ్యి ఉండవచ్చు అంటూ వైధ్యులు పేర్కొనడంతో వెంటనే ముంబయి లీలా వతి ఆసుపత్రికి తరలించినట్లుగా ఆయన సోదరుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్యం విషయంలో ఆందోళన ఏమీ లేదని.. ట్రీట్మెంట్ కు రాహుల్ స్పందిస్తున్నాడు. త్వరలోనే రాహుల్ మామూలు మనిషి అవుతాడనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

1990 సంవత్సరంలో అషికి సినిమాతో రాహుల్ హీరోగా పరిచయం అయ్యాడు. మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాతో రాహుల్ స్టార్ అయ్యాడు. మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో ఆయన తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎల్ ఏ సీ సినిమా షూటింగ్ కోసం కార్గిల్ లో ఉన్న సమయంలో రాహుల్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Images:

డిసెంబర్ నుంచి కోబ్రా షూటింగ్ స్పీడ్

ప్రయోగాల హీరోగా చియాన్ విక్రమ్ కి గుర్తింపు ఉంది. అతడు నటిస్తున్న తాజా సినిమా కోబ్రా. ఇదివరకూ రిలీజైన టైటిల్ లుక్ కి అద్భుత స్పందన దక్కింది. కోబ్రా ఫస్ట్ లుక్ అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది. విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడని అర్థమైంది.

కోబ్రా టైటిల్ కి తగ్గట్టే విక్రమ్ ఏడు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారని సమాచారం. కోబ్రా ఏడు గెటప్పులపైనా ఇటీవల చర్చ సాగింది. శాస్త్రవేత్త- ప్రొఫెసర్- రాజకీయనాయకుడు- మతబోధకుడు- కార్పొరెట్ వోనర్.. ఇలా ఏడు రూపాలు దేనికదే స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

ఇక ఇందులో భీకరాకారంతో కండలు మెలితిరిగిన రూపం సినిమా ఆద్యంతం కథను నడిపించనుందిట. ఇటీవల ఈ సినిమాలో విక్రమ్ ఏడు రూపాల్లో కాదు మొత్తం 20 రూపాల్లో కనిపించి షాకిస్తాడని కూడా ప్రచారమైంది.

దశావతారంలో కమల్ హాసన్ 10 రూపాల్లో కనిపిస్తేనే అభిమానులు థ్రిల్లయ్యారు. ఇప్పుడు చియాన్ ఫ్యాన్స్ పూర్తి ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళం- తెలుగు- హిందీ సహా పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి కథానాయిక. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రధారి. స్వరమాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. కరోనా మహమ్మారీ ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ వేసింది. రష్యా లాంటి చోట్ల తీయాల్సిన సీన్స్ ని ఇప్పుడు ఇండియాలోనే పూర్తి చేస్తున్నారట. ఈ డిసెంబర్ నుంచి కోబ్రా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతోందని తెలిసింది. విక్రమ్ – నిధి సహా అగ్ర తారాగణం ఈసారి షూటింగులో పాల్గొననుందని తెలిసింది.

Related Images:

పవన్ క్లీన్ షేవ్.. షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడా?

పవన్ కళ్యాణ్ కాస్త విభిన్నమైన గెటప్ లో కనిపిస్తే సోషల్ మీడియాలో చర్చ మొదలు. పవన్ క్లీన్ షేవ్ తో కనిపించినా.. గడ్డంతో కనిపించినా.. బారు గడ్డంతో కెమెరా ముందుకు వచ్చినా ఇలా ప్రతి దానికి కూడా సోషల్ మీడియాలో చాంతాడంత విశ్లేషణలు వస్తూ ఉంటాయి. మొన్నటి వరకు రఫ్ లుక్ లో కాస్త గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ మీటింగ్ సందర్బంగా క్లీన్ షేవ్ తో కనిపించాడు. ఉన్నట్లుండి పవన్ క్లీన్ షేవ్ తో కనిపించడం వెనుక కారణం ఏంటా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

వకీల్ సాబ్ సినిమా కోసం రఫ్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపించాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దాంతో ఎన్నికల్లో పోటీకి సిద్దం అంటూ జనసేన ప్రకటించింది. ఎన్నికల హడావుడి నేపథ్యంలో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని.. అందుకే పవన్ ఇలా నీట్ షేవ్ తో కనిపించాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొత్తానికి పవన్ క్లీన్ షేవ్ లో కనిపించడంతో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది దర్శకుడు లేదా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు. వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ మూవీలో చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం పవన్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాల్సి ఉంది. ఆ సినిమా ఇంకా చాలా రోజులే ఉంది కనుక ఇప్పటి నుండే క్లీన్ షేవ్ లో ఉండటం కుదరదు. అందుకే ఇది క్రిష్ మూవీ కోసం కాదు అనేది కొందరి వాదన.

Related Images:

షూటింగ్ లో స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వలిమై’ చిత్ర షూటింగ్ లో బైక్ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ చేతులు మరియు కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వలిమై’ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఇందులో అజిత్ డూప్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం అజిత్ తన సొంత బైక్ ను ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

అజిత్ కు బైక్స్ అన్నా బైక్ రైడింగ్ అన్నా ఇష్టమనే విషయం తెలిసిందే. ఆయన దగ్గర అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. అజిత్ స్పోర్ట్స్ బైక్ లపై రైడింగ్ కి వెళ్లిన వీడియోలు.. ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై ప్రయాణించారు. ఇక ‘వలిమై’ సినిమా విషయానికొస్తే ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Images:

సందీప్ కిషన్ స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ షూటింగ్ పూర్తి..!

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఏ1 ఎక్స్ ప్రెస్”. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారని తెలుస్తోంది. తెలుగులో గ్రాండ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలతో షూటింగ్ జరిగి సినిమాని కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సందీప్ కిషన్ స్టేడియంలో నటుడు రాహుల్ రామకృష్ణ తో ఉన్న ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో హాకీ ప్లేయర్ గా ఉన్న సందీప్ గోల్ కొడుతూ కనిపించాడు.

కాగా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పతాక సన్నివేశాలను చండీగఢ్ లోని మొహాలీ నేషనల్ స్టేడియంలో చిత్రీకరించారని తెలుస్తోంది. ఇంతకముందు హాకీ నేపథ్యంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ సినిమా షూటింగ్ కూడా ఇదే స్టేడియంలో జరుపుకుంది. ఇక స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే సినిమా కావడంతో సందీప్ కిషన్.. పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ గా కనిపించడం కోసం కొన్నాళ్లు ఆటలో శిక్షణ తీసుకున్నారు. అలానే డైలీ కఠినమైన వర్కౌట్స్ చేస్తూ సందీప్ ఈ చిత్రం కోసం 12 కిలోల బరువు తగ్గాడు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలో అనేక సర్ప్రైజులు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం సమకూరుస్తున్నారు. మురళీ శర్మ – రావు రమేష్ – రాహుల్ రామకృష్ణ – మహేష్ విట్టా – ఖయ్యూమ్ – భూపాల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ – వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – సందీప్ కిషన్ – దయా పన్నెం కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Images:

ఎట్టకేలకు షూటింగ్ లో జాయినయిన కత్రిన

కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తన సోదరి ఇసాబెల్లా కైఫ్ తో కలిసి గత కొన్ని నెలలుగా ఇంట్లో గడిపారు. అన్ లాక్ దశ తర్వాత చాలా మంది స్టార్లు తిరిగి ఆన్ లొకేషన్ పనిని ప్రారంభించగా.. కత్రిన ఇంకా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు ఇప్పటికి విరామాన్ని వీడి ఈ రోజు తన బృందంతో తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అందుకు రుజువుగా తన ఫోటోను పంచుకుంది. లాక్ డౌన్ లో కత్రిన తన సోదరితో ఫోటోలు వీడియోలను పంచుకునేది.

ఇప్పుడు వర్క్ ప్లేస్ నుంచి ఒక అందమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలో.. కత్రిన పసుపు రంగు దుస్తులు ధరించి ఇంటి మెట్లపై హాయిగా కూర్చుని కనిపించింది. సింపుల్ గా అందమైన చిరునవ్వుతో మంత్రముగ్దులను చేసింది. దానితో పాటు తన టీమ్ ను వ్యక్తిగతంగా కలవడం ఎంత ఆనందంగా ఉందో ఫీలింగ్ ని షేర్ చేసుకుంది. అయితే ఎంతో విచారకరమైన ఎమోటికాన్ తో జూమ్ కాల్ సెషన్ ను కోల్పోయానని అంది.

“ప్రతిరోజూ నా బృందంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది …. (జూమ్ లాగా అందరినీ వ్యక్తిగతంగా కలిపిన బంధం) అంటూ కత్రినా ఫోటోకు వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటోను పంచుకున్న వెంటనే అభిమానులు ప్రశంసా పూర్వక వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. జీరో.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి డిజాస్టర్ల కు భిన్నంగా కత్రిన సల్మాన్ సరసన నటించిన టైగర్ జిందా హై పెద్ద సక్సెసైంది. కానీ ఆ తర్వాత భారత్ చిత్రం ఫెయిలైంది. ప్రస్తుతం కత్రిన సూపర్ గాళ్ తరహా పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కత్రిన తదుపరి ఇషాన్ ఖత్తర్.. సిద్ధాంత్ చతుర్వేది వంటి నవతరం హీరోలతో కలిసి `ఫోన్ బూత్` అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

Related Images:

సినీ ఇండస్ట్రీలో విషాదం: షూటింగ్ లో గాయపడ్డ అసిస్టెంట్ దర్శకుడి మరణం

ఓ అసిస్టెంట్ దర్శకుడి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదంలో కూరుకుపోయింది. షూటింగ్ స్పాట్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశువులు బాసాడు. ప్రముఖ దర్శకుడి దగ్గర పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అతడు..తాజాగా దర్శకత్వం చేసే అవకాశం కూడా దక్కిన సమయంలో అనుకోకుండా ఇలా ప్రమాదం బారిన పడి మరణించడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకుని పలువురు నటీ నటులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ డైరక్టర్ సుధీర్ వర్మ దగ్గర ప్రవీణ్ రణరంగం తదితర సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసారు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహా ఓటీటీలో ఓ చిన్న సినిమా తెరకెక్కించే అవకాశం ప్రవీణ్ కు దక్కింది.

కొద్ది రోజుల కిందటే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించి చిత్రీకరణ దాదాపు పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలు మిగిలి ఉండగా వాటిని షూటింగ్ చేస్తున్నారు. చివరగా షూటింగ్ జరుగుతుండగా కారు నడపాల్సిన సీన్ ఒకటి చిత్రీకరించాల్సి ఉంది. సీన్ వివరించే క్రమంలోనో ..లేకుంటే స్వయంగా తానే కారు నడిపినా సరిపోతుందని భావించడం వల్లో ప్రవీణ్ స్వయంగా కారు డ్రైవింగ్ చేశారు. దానిని షూటింగ్ చేస్తుండగా అనుకోని విధంగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పాట్ లో ఉన్న సహచరులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశారు. వర్ధమాన దర్శకుడి మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. పలువురు దర్శకులు నటీనటులు ప్రవీణ్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

Related Images:

షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన రకుల్… అందుకేనా?

గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు శాండిల్ వుడ్ లో నటీమణులు రాగిణి ద్వివేది – సంజన గల్రాని అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రియా బయటపెట్టిన జాబితాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కుడా ఉందని నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలావుండగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ – పంజా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో రకుల్ పై సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కూడా షూటింగ్ కు వెళ్లిన రకుల్.. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లిపోయునట్లు సమాచారం. అయితే రకుల్ పై వస్తున్న ఆరోపణలను ఆమె మేనేజర్ ఖండిస్తూ.. ఆమె పై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే రియా వెల్లడించిన 25 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Related Images:

బాలీవుడ్ బ్యూటీ డిమాండ్ తో షూటింగ్ లొకేషన్ మారిపోయింది…!

కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయి కళ తప్పిన సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నూతనోత్సాహం మొదలైంది. మహమ్మారికి భయపడి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా సెట్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ షూటింగ్ కోసం ఇటీవల స్కాట్లాండ్ వెళ్ళాడు. అక్షయ్ డేర్ చేసాడు కానీ చాలామంది స్టార్స్ కేవలం ఇండోర్ షూటింగ్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్స్ కోసం స్క్రిప్ట్ ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే అవుట్ డోర్ షూటింగ్ కి రాలేనని చెప్పడంతో ఆమె నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

కాగా దీపికా పదుకుణే – అనన్య పాండే ప్రధాన పాత్రలతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కపూర్ అండ్ సన్స్’ డైరెక్టర్ షకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చిలో ప్రారంభమై కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలతో ఈ నెల రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. కాకపోతే మొదట శ్రీలంకలో అనుకున్న షెడ్యూల్ ఇప్పుడు గోవాకు మారింది. దీపికా పదుకుణే షూటింగ్ సెట్ లో సందడి చేయడానికి రెడీ అయినప్పటికీ శ్రీలంకలో షూటింగ్ అయితే రాలేనని చెప్పిందట. దీంతో ఈ స్టోరీ నేపథ్యాన్ని మార్చేసి గోవాలో చిత్రీకరణ పెట్టుకుంటున్నారట. అయితే ఇది కేవలం దీపికా విషయంలోనే కాకుండా స్టార్స్ నటిస్తున్న చాలా సినిమాల విషయంలో జరుగుతోందని తెలుస్తోంది.

Related Images: