// Header & Footer Code controls (added by assistant) if ( function_exists('add_action') ){ function tn_customize_header_footer( $wp_customize ) { $wp_customize->add_section( 'tn_header_footer_section', array( 'title' => __( 'Header & Footer Code', 'tnnewstheme2025' ), 'priority' => 200, ) ); $wp_customize->add_setting( 'tn_header_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_header_code', array( 'label' => __( 'Header Code (placed inside
)', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); $wp_customize->add_setting( 'tn_footer_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_footer_code', array( 'label' => __( 'Footer Code (before )', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); } add_action( 'customize_register', 'tn_customize_header_footer' ); function tn_sanitize_unfiltered_html( $val ){ if( current_user_can('unfiltered_html') ) return $val; return wp_kses_post($val); } }
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన మూవీ యానిమల్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికే 800 కోట్లకి పైగా కలెక్షన్స్ కి బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా యానిమల్ నిలిచింది. అలాగే అతనిలోని పెర్ఫార్మెన్స్ ని డిఫరెంట్ షేడ్స్ లో ఈ మూవీ ఆవిష్కరించింది.
ఒక్కసారిగా యానిమల్ రణబీర్ కపూర్ ని సూపర్ స్టార్ ని చేసేసింది. రష్మిక మందనకి కూడా ఈ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి గేట్ వే దొరికినట్లు అయ్యింది. త్రిప్తి డిమ్రిని కూడా యానిమల్ స్టార్ ని చేసేసింది. ఫేడ్ అవుట్ అయిన బాబీ డియోల్ కి తిరిగి యాక్టర్ గా ఊహించని క్రేజ్ ని తీసుకొచ్చింది.
ఇలా యాక్టర్స్ అందరికి కూడా యానిమల్ మూవీ మంచి హైప్ ఇచ్చింది. ఈ సినిమాని టి సిరీస్ భూషణ్ కుమార్ 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే సినిమాకి పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా బడ్జెట్ రికవరీ అయిపొయింది. అయిన భారీ టార్గెట్ తోనే థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ఒక్క తెలుగులో తప్ప అన్ని భాషలలో కూడా భూషణ్ కుమార్ స్వయంగా రిలీజ్ చేసుకున్నారు. రైట్స్ ని ఎవ్వరికి అమ్మలేదు.
ఈ కారణంగా నిర్మాతకి యానిమల్ సినిమా ద్వారా 300 కోట్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే 400 కోట్ల షేర్ ని సినిమా అందుకుంది. ఇందులో ఖర్చులు అన్నిపోగా 300 కోట్లు వరకు మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో యానిమల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సందీప్ రెడ్డి వంగాకి కూడా అందుతుంది. ఈ స్థాయిలో లాభాలు అందిస్తూ ఉన్నాడు కాబట్టి టి-సిరీస్ భూషణ్ కుమార్ సందీప్ రెడ్డితోనే వరుస సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబోలో యానిమల్ సీక్వెల్ ఒకటి ఉంది. అలాగే ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ కూడా చేయనున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.