బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ సౌండ్ వినిపించదేం? అంటూ ఇటీవల ఫిలింసర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తిక చర్చ సాగింది. చాలా గ్యాప్ వచ్చినా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో కీలక సమాచారం తాజాగా రివీలైంది. సందీప్ వంగా ఇప్పటికీ రణబీర్ అండ్ టీమ్ కి టచ్ లోనే ఉన్నారు. గత వారం క్రితమే చిత్ర నిర్మాతల్ని కలిసాడని సమాచారం. అంతేకాదు ఇంతకుముందు ప్రకటించిన `డెవిల్` టైటిల్ ని మార్చాలన్న ప్రతిపాదన తెచ్చారట. ఇప్పుడు `యానిమల్` అని పేరు మారిందట. అయితే టైటిల్ మార్చడానికి కారణమేమిటి? అంటే.. సల్మాన్ వల్లనేనని తెలిసింది.
ఒక నివేదిక ప్రకారం.. డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా రిజిస్టర్ చేయించారట. దీంతో టైటిల్ మార్చాలని సందీప్ వంగా అండ్ మేకర్స్ నిర్ణయించారు. సల్మాన్ నటిస్తున్న `కిక్` సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. సల్మాన్ ఖాన్ నటించిన మొదటి భాగంలో కథానాయకుడు తన అప్రమత్తమైన కార్యకలాపాలను చేపట్టేటప్పుడు `డెవిల్` అనే మారుపేరును ఉపయోగించాడు. దానివల్ల డెవిల్ అన్న పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ తో.. సాజిద్ నాడియాద్వాలా డెవిల్ బిరుదును నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట.
ఫలితంగా సందీప్ రెడ్డి వంగాతో రణబీర్ కపూర్ తదుపరిది మూవీ టైటిల్ ని `యానిమల్` అని మార్చారు. ఇది మోటైన గ్యాంగ్ స్టర్ డ్రామా .. రణబీర్ సందీప్ ను.. చిత్ర నిర్మాతలు భూషణ్ కుమార్ – మురాద్ ఖేతానీలను సందీప్ గత వారం కలుసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
యానిమల్ కు ముందు రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ తో కలిసి నటించిన `లవ్ రంజన్` పెండింగ్ పనిని పూర్తి చేస్తాడు. ఇది దిల్లీ- ఘజియాబాద్- నోయిడాలో .. తరువాత విదేశాలలో చిత్రీకరిస్తారు. దీని మొదటి షెడ్యూల్ జనవరి 6 న ప్రారంభమై జనవరి 14 తో ముగుస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూట్ మే 2021 నాటికి పూర్తవుతుందని ఆ తర్వాత రణబీర్ `యానిమల్` చిత్రీకరణలో జాయినవుతారని చెబుతున్నారు.
2019 లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ వంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. షాహిద్ కపూర్-నటించిన ఈ చిత్రం విమర్శల నడుమ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు వసూలు చేసింది. ఇది షాహిద్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయిన అర్జున్ రెడ్డితోనూ టాలీవుడ్ లో సత్తా చాటాడు. తదుపరి `యానిమల్`తో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగే సందీప్ వంగా ఓటీటీ కోసం పని చేస్తున్నారన్న సమాచారం ఇటీవల అందింది.
`అర్జున్ రెడ్డి` చిత్రంతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. ఆరంగేట్రమే బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే అదే సినిమాని నిర్మించిన టీసిరీస్ కోసం మరో సినిమాకి సంతకం చేశాడు. ప్రభాస్ .. మహేష్ .. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కథలు వినిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు.
ప్రభాస్ తో టీసిరీస్ మూవీకి సందీప్ వంగా దర్శకత్వం వహించాల్సింది. దీనికోసం రణబీర్.. రణవీర్ లతోనూ కొన్నాళ్ల పాటు కథా చర్చలు జరిపాడు. కానీ స్క్రిప్టు వర్కవుట్ కాలేదని గుసగుసలు వినిపించాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే .. ఇక ఏ స్టార్ హీరోతోనూ అతడికి సింక్ కుదిరినట్టు కనిపించడం లేదు. ప్రభాస్ ఇప్పటికే నాగ్ అశ్విన్.. ఓంరౌత్ లాంటి డైరెక్టర్లకు కమిటైపోయాడు. ఇతర స్టార్లు వేరే కమిట్ మెంట్లతో బిజీ.
ఇప్పుడు సందీప్ ముందు ఉన్న ఆప్షన్ … స్టార్ హీరోలు కాకుండా ఎవరైనా కొత్త ముఖంతో అయితే బావుంటుందని అనుకుంటున్నారట. కరోనా వైరస్ విరామంలో సందీప్ వంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసాడట. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇందులో నవతరం హీరోలకు అవకాశం ఇస్తేనే బావుంటుందని భావిస్తున్నారు.. ఒక అగ్ర నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021లో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.