సుప్రీంతో సుక్కూ.. 1970లో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్?

సుప్రీం హీరో సాయి తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ పండగే తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాల తర్వాత అతడు మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ప్రస్థానం దేవాకట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పటికే ఆ మూవీ ప్రిబిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత జీస్టూడియోస్ సాయి తేజ్ మూవీ ఓవరాల్ రైట్స్ ని భారీ మొత్తానికి చేజిక్కించుకుందన్న సమాచారం అందింది.

ప్రస్తుతం సాయి తేజ్ నటించే ల్యాండ్ మార్క్ మూవీ ఎస్.టి.డి 15 కి సంబంధించిన మరో ఆసక్తికర వివరం తెలిసింది. ఈ మూవీని అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ మూవీకి సుకుమార్ స్వయంగా కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ తో టోటల్ స్క్రిప్టును అందిస్తుండడంతో ఒకటే ఆసక్తి నెలకొంది.

సుకుమార్ రైటింగ్స్ ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేస్తోంది. ఈ చిత్రం 1970 నేపథ్యంలో మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ అన్న ప్రచారం సాగుతోంది. ఇది రొటీన్ కి భిన్నంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. మార్మికతతో థ్రిల్లర్ కావడంతో సాయి తేజ్ ఎంతో ఆసక్తిగా ఉన్నారట.

Related Images:

సుప్రీంహీరోకి OTT చేసిన మేలు

OTT ల వల్ల లాభమా నష్టమా? అన్న ప్రశ్నకు డి.సురేష్ బాబు లాంటి అగ్రనిర్మాత బోలెడంత లాభం అనే చెబుతారు. ఒక ఎగ్జిబిటర్ గా ఓటీటీ రిలీజ్ లను సమర్థించారాయన. ఓటీటీ సంస్థలు బోలెడంత పెట్టుబడులు పెడుతూ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు. ఇక ఇదే ఓటీటీ సుప్రీంహీరో సాయి తేజ్ కి చాలా మేలు చేస్తోంది.

ప్రఖ్యాత జీ స్టూడియోస్ సాయి తేజ్ నటించనున్న తాజా సినిమా `రిపబ్లిక్` ను రూ .35 కోట్లకు కొనుగోలు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీ స్టూడియో కే ఇంతకుముందు `సోలో బ్రతుకే సో బెటర్` మొత్తం హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే సంస్థ రిపబ్లిక్ రిలీజ్ కి సంబంధించిన సర్వ హక్కుల్ని అంటే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ .. డబ్బింగ్ రీమేక్ హక్కుల్ని ఓవరాల్ గా 35 కోట్లకు ఛేజిక్కించుకుంటోందిట.

సాయితేజ్ కథానాయకుడిగా ప్రస్థానం దేవకట్టా రూపొందిస్తున్న ఈ మూవీ ఇంకా నిర్మాణ ప్రారంభ దశలో ఉంది. దానిపై బిగ్ బెట్టింగ్ నడుస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమే. సినిమా నిర్మాణం పూర్తయ్యే వరకు వారు నిధులను భాగాలుగా విడుదల చేస్తారు. మొదటి కాపీ సిద్ధమైన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారని తెలుస్తోంది. సాయి తేజ్ తరహాలోనే ఇతర నవతరం హీరోలకు ఓటీటీలు భారీ మొత్తాల్ని చెల్లించి రిలీజ్ హక్కుల్ని కొనుగోలు చేస్తుండడం ఆసక్తికర లాభదాయక పరిణామం. సినిమా ప్రారంభం నుంచే పెట్టుబడులు పెడుతూ ఓటీటీ సంస్తలు నిర్మాణంలో భాగస్వామ్యం అయితే అది నిర్మాత కు ఆర్థిక భారాన్ని చాలావరకూ తగ్గించినట్టే అవుతుందన్న విశ్లేషణ వెలువడుతోంది.

Related Images: