కొందరు కళ్లతోనే కోటి భావాలు పలికిస్తారు. పలువురు హీరోలకు నయనాలు ప్రధాన ఆకర్షణ. ఇంకా చెప్పాలంటే కంటి చూపుతోనే పడేస్తారు. తమదైన ప్రతిభతో కోట్లాదిగా అభిమానుల్ని సంపాదించుకున్నా హీరోయిక్ అప్పియరెన్స్ కూడా అందుకు ఒక కారణం అవుతుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కళ్లు ఎంతో అందమైనవి అని అభిమానులు అంటారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ .. మహేష్ లాంటి స్టార్ల కళ్లకు అభిమానులున్నారు.
అటు కోలీవుడ్ కి వెళితే స్టార్ హీరో సూర్య కళ్లకు ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు. అతడికి ఆ నయనాలే ప్రధాన ఆకర్షణ. అది మరోసారి ఇదిగో ఇలా మాస్క్ వల్ల క్లియర్ కట్ గా బయటపడింది. కళ్లతోనే కోటి భావాలు పలికించడంలో సూర్య కు ఉన్న ప్రత్యేకతే వేరని.. అలా మాస్క్ ధరించి చిరునవ్వులు చిందిస్తుంటే ఆ నయనాల అందం మరింతగా హైలైట్ అయ్యిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
మాస్క్ హైలైట్ చేసిన అందమైన కళ్ళు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. సూర్య చాలా స్టైలిష్ గా నీలిరంగు టీ-షర్టు .. ముదురు నీలిరంగు ప్యాంటులో తన ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు ఇలా క్లిక్ మంది ఫోటో. ఈ గెటప్ లో అతని పొడవాటి జుట్టు పెద్ద ఆకర్షణగా నిలిచింది. అన్నిటినీ మించి అతని రూపంలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా హాట్ గా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. చాలా ప్రయత్నాల తర్వాత ఆకాశమే నీ హద్దురా చిత్రంతో సక్సెస్ అందుకున్న సూర్య తదుపరి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు.
హీరో సూర్య ప్రయోగాత్మక చిత్రం `ఆకాశం నీ హద్దురా` ఇటీవల ఓటీటీలో రిలీజై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీ అనేక సవాళ్లని అధిగమించి చివరికి సూర్యకు తిరుగులేని సక్సెస్ ని అందించింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సూర్యకు తన కెరీరలోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. సాహసోపేతమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారన్న ప్రశంసలు దక్కాయి.
ఈ మూవీ తరువాత సూర్య ఎలాంటి చిత్రం చేయబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ తరువాత సూర్య మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. దీని కోసం ఇప్పటికే పల్లెటూరి నేపథ్యంలో ఓ కథని అనుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజం కాదని తెలిసింది.
`ఆకాశం నీ హద్దురా` తరువాత సూర్య కొత్త తరహా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు హరికి వివరించి శ్రీలంక నేపథ్యంలో సినిమా చేద్దామని ఐడియా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సూర్య ఇచ్చిన ఐడియాని హరి స్క్రిప్ట్ గా మలిచే ప్రయత్నాల్లో వున్నారట. శ్రీలంక – తమిళ వర్గాల మధ్య తరాలుగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ తమిళ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసక్తితో పాటు వివాదాల్లో కూడా చిక్కుకునే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో విజయ్ నటించబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో ఒక క్రేజీ మల్టీస్టారర్ రూపొందబోతుంది. ఆ సినిమాలో ఒక హీరోగా సూర్య నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
సూర్యతో పాటు ఆ మల్టీస్టారర్ లో ఆర్య మరియు అథర్వ మురళి కూడా నటించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను బాలా ప్లాన్ చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు బాలా గతంలో పలు మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించాడు. సూర్యతో 18 ఏళ్ల క్రితం పితామగన్ సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో సూర్యకు స్టార్ డం దక్కింది. ఆ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాలా దర్శకత్వంలో సూర్య మల్టీస్టారర్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గజిని’ ‘సెవెంత్ సెన్స్’ ‘యముడు’ ‘సింగం’ ‘సింగం 2’ ‘బ్రదర్స్’ ’24’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడిపోతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. దీంతో తెలుగులో మళ్లీ సూర్య మార్కెట్ పుంజుకుంటోంది.
తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇచ్చిన జోష్ లో సూర్య ఇప్పుడు చిన్న పెద్ద సినిమాలు కలిపి మొత్తం పది సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అందులో తాను హీరోగా నటించే సినిమాలు.. సతీమణి జ్యోతిక తో తీయబోయే సినిమాలు.. వేరే హీరోలతో చేసే సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. సూర్య ‘2డి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని కూడా సూర్య స్వయంగా నిర్మించాడు. ఏదేమైనా వరుస ఫ్లాపులతో కోలుకోలేని స్థితికి వెళ్లిపోయిన సూర్యకు ఈ సినిమా పది సినిమాలు లైన్ లో పెట్టే కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.
స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొనడం కామన్ గా కనిపిస్తుంది. కాని గెస్ట్ లుగా వెళ్లిన సమయంలో సింపుల్ గా వెళ్లి వధు వరులను ఆశీర్వదించి వచ్చేస్తుంటారు. కాని తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం తన సినిమాకు దర్శకురాలిగా చేసిన సుధ కొంగర కూతురు వివాహ వేడుకలో పాల్గొనడమే కాకుండా అక్కడ పెళ్లి పనుల్లో కూడా భాగస్వామ్యం అవ్వడం అందరి దృష్టని ఆకర్షించింది. తెలుగు దర్శకురాలు అయిన సుధ కొంగర ఇటీవల సూర్యతో సూరారై పోట్రూ సినిమాను తెరకెక్కంచింది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సూరారై పోట్రు సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకురాలు సుధ కొంగరను ఆకాశానికి ఎత్తేలా మాట్లాడిన సూర్య ఇప్పుడు ఆమె ఇంట జరిగిన పెళ్లి వేడుకలో కీలకంగా ఉండి ఇలా పెళ్లి కూతురుకు పట్టే పందిరిని తాను పట్టుకున్నాడు. ఈ ఫొటోలో జీవీ ప్రకాష్ కూడా ఉన్నారు. ఒక దర్శకురాలి కూతురు పెళ్లికి ఇలా స్టార్ హీరో పందిరిని పట్టుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ఫొటో సూర్య సింప్లిసిటీని చూపిస్తుంది అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్లు మూత పడ్డ కారణంగా బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. చిన్నా పెద్ద కలిసి అక్కడ చాలా సినిమాలో ఓటీటీ దారి పట్టాయి. అయితే సౌత్ లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఇన్ని రోజులు ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించలేదు. కాని ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న మేకర్స్ మరియు స్టార్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. తెలుగులో నాని ‘వి’ సినిమా విడుదలను ప్రకటించిన విషయం తెల్సిందే. అటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన ఆకాశమే నీహద్దురా సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అయినట్లుగా అఫిషియల్ గా ప్రకటించాడు.
సూర్య నటించిన ఈ చిత్రంను అమెజాన్ లో వచ్చే నెల 30వ తారీకున విడుదల చేయబోతున్నారు. దాంతో ఇతర తమిళ స్టార్ హీరోలు కూడా ఓటీటీ వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుకోవని ఒక వేళ తెరుచుకున్న వసూళ్ల విషయంలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. అందుకే ముందు ఉన్న ఓటీటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. సూర్య చిత్రం తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
భారీ బడ్జెట్ సినిమాలకు సౌత్ లో ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని ‘ఆకాశమే నీ హద్దురా’ విడుదలతో చూసి ఆ తర్వాత విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విజయ్ ఈమద్య కాలంలో నటించిన ప్రతి సినిమా కూడా వంద కోట్లను దాటింది. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా థియేటర్ లో విడుదల అయితే మినిమం 250 కోట్లను వసూళ్లు చేసేది అనేది ఆయన అభిమానుల మాట. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయి వసూళ్లు అంటే మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు. అందుకే ఓటీటీ విడుదలకు విజయ్ మొగ్గు చూపే అవకాశం ఉందని సూర్య సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే దాన్ని బట్టి విడుదల ప్లాన్ చేస్తాడని అంటున్నారు.
తమిళ స్టార్స్ పై గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిసిటీ కోసమో లేక మరేంటో కాని మీరా మరీ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారతిరాజా వంటి ప్రముఖులు హెచ్చరించారు. రజినీకాంత్.. విజయ్.. సూర్య వంటి స్టార్స్ ను టార్గెట్ చేసిన విమర్శలు చేసిన మీరా మిథున్ ఆమద్య విశాల్ ను గురించి కూడా కామెంట్స్ చేసింది. మీరా మిధున్ మాజీ మేనేజర్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో విశాల్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన రెండు మూడు సంవత్సరాలుగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాని నాకు మాత్రం డబ్బున్న వారిని పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ ఆ వీడియోలో మీరా చెప్పింది.
స్టార్స్ పై మీరా మిధున్ వ్యాఖ్యలు చేయడంను నెటిజన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్న వారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆమె దిష్టి బొమ్మను తగులబెట్టారు. చెన్నైలో విజయ్ మరియు సూర్య అభిమానులం అంటూ కలామ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మీరా మిథున్ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఆ విజువల్స్ ప్రముఖ తమిళ మీడియాల్లో వచ్చాయి. ఈ విషయంతో ఆమె మరింత సీరియస్ అయ్యింది.
కలామ్ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ తో ఇలాంటి పనులు చేయడానికి బుద్ది లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనీసం మీరు ఆ పేరును అయినా మార్చుకోండి. కలామ్ జీ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా. ఇలాంటి పనులు చేస్తున్న మీకు ఆయన పేరు వాడుకునే అర్హత లేదు. ఈ ఘటనకు పూర్తిగా విజయ్ మరియు సూర్యలే కారణం అంటూ మీరా మళ్లీ విమర్శలు మొదలు పెట్టింది. ఇటీవల ఆమెకు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారట. మీరా తన విమర్శలకు పదును పెడుతున్నా కొద్ది ఆమెను నెటిజన్స్ మరియు ఆయా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఎక్కువ అవుతుంది.