లైట్ గా క్లాస్ తీస్కున్నట్టు కనిపిస్తున్నా కానీ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. నేటితరానికి ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. మహేష్ సరసన అతిథి సినిమాలో నటించింది అమృతారావు. ఈ బాలీవుడ్ క్యూట్ గాళ్ కి తెలుగు బెల్ట్ లోనూ అభిమానులేర్పడ్డారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. అయితే అతిథి సమయంలో ఇక్కడ సరిగా పీఆర్ ని మేనేజ్ చేయలేక విఫలమైందా? అంటే తనకు తెలిసొచ్చేసరికే ఫేమ్ పోయిందనే చెప్పాలి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతిథి పీఆర్ మేనేజ్ మెంట్ సోషల్ మీడియా ప్రభావం గురించి క్లాస్ తీస్కుంది. ఇప్పుడు నటన ప్రతిభ కంటే ప్రచారమే ముఖ్యం. దానిని సవ్యంగా చేసుకుంటే పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంటుందని అంగీకరించింది. అమృత రావు మాట్లాడుతూ 2002 లో తాను బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంతో పోల్చితే నేటితరానికి విజిబిలిటీ ప్రచారం చాలా అవసరమైంది. సోషల్ మీడియా అనేది టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థల అవసరాన్ని కూడా మార్చివేసిందని నేటి అడ్వాన్స్ మెంట్ పై చెప్పుకొచ్చింది. ఒక రకంగా సోషల్ మీడియా ఉంటే మేనేజర్లకు పని తగ్గిందన్న భావనను వ్యక్తం చేసింది.
నేటి తరంతో పోలిస్తే పీఆర్ లు మెషినరీ యుగానికి ముందు ఎవరైనా నటి లేదా నటుడికి ప్రజాదరణ హోదా అనేవి ప్రతిభకు సింబాలిక్ గా ఉండేవి. నన్ను అలానే గుర్తించారు అప్పట్లో. ఇష్క్ విష్క్-మస్తీ-మెయిన్ హూ నా సినిమాల్లో నా నటనే ప్రజల్లో గుర్తింపు తెచ్చింది. మెయిన్ హూన్ నాలో షారూఖ్ ఖాన్ -సుశ్మితా సేన్ లాంటి దిగ్గజాలు నటించినా నన్ను గుర్తించారంటే నట ప్రతిభ వల్లనే అని చెప్పుకొచ్చింది. ఈరోజుల్లో నటన కంటే సోషల్ మీడియా వల్లనే గుర్తుంటున్నారని షాకిచ్చింది.
సోషల్ మీడియాలో జనాదరణ పొందిన సెలబ్రిటీగా మారడంలో తప్పు లేదు కానీ కళాకారులుగా నైపుణ్యాలను పదునుపెట్టుకోవడం చాలా అవసరం అని నేననుకుంటాను అని అంది. ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు! ఒక విధంగా ఇది మంచి సాంస్కృతిక మార్పు ఇది కళాకారులకు ఉద్యోగ అవకాశంతో పాటు భద్రతను కలిగిస్తుంది అని అమృత వివరించారు. తనను మాత్రం ఇప్పటికీ కాలేజ్ పిల్లలు ఫలానా చిత్రంలో నటి అంటూనే గుర్తుంచుకుంటున్నారట.
ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ బాంబు పేల్చింది. ఓ మంత్రి గారి రాసలీలల బండారాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తెలంగాణ మంత్రి రాసలీలల విషయాన్ని బ్రేక్ చేసింది. స్నేహితురాలితో మంత్రి చాటింగ్ వ్యవహారం మొత్తాన్ని ఆ చానెల్ బట్టబయలు చేసింది.. చాటింగ్ లో మంత్రిగారి కోరికలు వలపు చిలిపి కోరికలన్నింటిని టీవీ చానెల్ బయటపెట్టి సంచలనం సృష్టించింది.
ప్రముఖ న్యూస్ చానెల్ కథనం ప్రకారం.. తెలంగాణ మంత్రి కోరికలు తీర్చేందుకు సినిమాల్లో నటిస్తున్న యువతితో మంత్రి గారి సన్నిహితురాలు బేరసారాలకు దిగినట్టు సదురు చానెల్ పేర్కొంది.. సినిమాల్లో నటించిన ఆ యువతి అంటే మంత్రికి మోజు ఉందని.. మంత్రితో సాన్నిహిత్యం మంచిదంటూ మంత్రిగారి సన్నిహితురాలు సదురు సినీ నటికి వల వేసిందని.. ఇలా ఉంటే మంచిదంటూ ఆమె సినీ నటికి ఆఫర్ ఇచ్చారని చానెల్ లో పేర్కొన్నారు.
అయితే మంత్రి గారి కోరిక తీర్చేందుకు సదురు సినీ నటి ససేమిరా అనడంతో ఆమె వ్యక్తిగత చిత్రాలను కూడా రహస్యంగా చిత్రీకరించారని చానెల్ తెలిపింది.. ఈ ఫొటోలు తీసే క్రమంలో మంత్రి సన్నిహితురాలితో సినీ నటి గొడవ పడిందని. ఆ సినీ నటే మొత్తం మ్యాటర్ అంతా సోషల్ మీడియాలో షేర్ చేసిందని పేర్కొంది. మంత్రి చేసిన చిలిపి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటూ కథనం ప్రసారం చేసింది.
మంత్రి గారి బండారం బయటపడిందని తెలిసి సదురు సినీ నటితో రాజీ ప్రయత్నాలు షూరూ చేసినట్టు సదురు చానెల్ తెలిపింది. కానీ అవేవీ వర్కవుట్ కాలేదని.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని పేర్కొంది.. ఇప్పుడు స్క్రీన్ షాట్స్ బయటకు రావడంతో మంత్రి గారి సీన్ అంతా రివర్స్ అయ్యిందంటూ సంచలన కథనాన్ని న్యూస్ చానెల్ వండివార్చింది.
మంత్రిగారి వ్యవహారం సిన్ టు సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని న్యూస్ చానెల్ తెలిపింది.. మంత్రి సన్నిహితురాలితో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయని… దీనిపై మంత్రి మాత్రం స్పందించలేదు. ఖండించలేదని న్యూస్ చానెల్ తెలిపింది.
ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వకు మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్. గంగవ్వను ఫైనల్ వారం వరకు ఇంట్లోనే ఉండేలా ఆమెకు ఓట్లు వేస్తామన్నారు. షో చూడని వారు కూడా ఈసారి గంగవ్వ ఎలిమినేషన్ లో ఉంటే ఓట్లు వేస్తున్నారు. అది మొన్నటి వరకు మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. గంగవ్వ షో లో ఉండలేక పోతుంది. ఆమెకు అక్కడి వాతావరణం పడటం లేదు.
ఊర్లో ఉండేగ గంగవ్వకు అక్కడ ఏసీల్లో ఉండాలంటే వసపడటం లేదు. నన్ను బయటకు పంపండి అంటూ పలు సార్లు గంగవ్వ బిగ్ బాస్ కు విజ్ఞప్తి చేసింది. అయితే బిగ్ బాస్ నియమాల ప్రకారం అలా బయటకు పంపడానికి లేదు. ప్రేక్షకులు మాత్రమే కంటెస్టెంట్స్ ను బయటకు పంపించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో గంగవ్వకు ఓట్లు వేయవద్దంటూ ప్రచారం మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పీఆర్ టీం సభ్యుడు అయిన రమేష్ హజారీ కూడా సోషల్ మీడియా పేజ్ లో గంగవ్వను బయటకు తీసుకు రావాలంటూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు.
పచ్చని పొలాల మద్య హాయిగా జీవితాన్ని సాగించే గంగవ్వను జైలు వంటి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లమన్నది ఎవరు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి కాని మనసున్న మనుషులు మాత్రం ఉండరు అనే విషయం ఆమెకు తెలియదు. రేటింగ్ కోసం అక్కడ ఏడిపించడం మనం చూస్తూ ఉంటాం. మానవ సంబంధాల మద్య పరీక్షలు పెట్టే గేమ్ షో అంటూ రమేష్ హజారీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. నీ ఏడుపుకు పైసలు కురుస్తున్నాయని వారు సంతోషంగా ఉన్నారు. అందుకే నిన్ను అందులోనే ఉంచాలని కోరుకుంటున్నారు. జైలు వంటి బిగ్ బాస్ నుండి గంగవ్వను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అందరం కలిసి గంగవ్వను జన జీవన స్రవంతిలోకి తీసుకు వద్దాం అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో ఆమె బయటకు అతి త్వరలోనే వస్తుందేమో అనిపిస్తుంది. వచ్చే వారంలో కూడా ఒక వేళ గంగవ్వ ఎలిమినేషన్ లో ఉంటే ఆమెకు ఓట్లు వేయవద్దంటూ ప్రచారం చేసే అవకాశం ఉంది.
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే భారీగా ఫాలోయింగ్ ఉన్న అనుష్క సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు.
ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నేరుగా అభిమానులతో టచ్ లో ఉంటుంటే.. అనుష్క మాత్రం కాస్త దూరంగా ఉంటుంది. ఫేస్ బుక్ లో 14.4 మిలియన్.. ఇన్స్టాగ్రామ్ లో 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ అనుష్క అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్ ఇస్తుంటుంది. ఇక ట్విటర్ లో అయితే ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో మరి ట్విటర్ లోకి ఎప్పుడు వస్తారని స్వీటీని ప్రశ్నిస్తే.. నాకు సిగ్గు ఎక్కువ అందుకే దూరంగా ఉన్నానని సమాధానం చెప్పింది.
”నాకు కొంచెం సిగ్గెక్కువ. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను. సినిమాలు తప్ప వేరే విషయాల గురించి పట్టించుకోను. టైం కుదరకపోవడం వల్లే సోషల్ మీడియా మాధ్యమాలకు దూరంగా ఉంటున్నా. ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. అభిమానులు ట్విటర్ లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అటు వైపు రాకపోవడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. నిజం చెప్పాలంటే నాకు సోషల్ మీడియా మీద పెద్దగా అవగాహన లేదు. ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు ట్విటర్ లోకి కచ్చితంగా వస్తా. అప్పటి నుంచి అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా” అని అనుష్క చెప్పుకొచ్చింది.

Heroines growing social media followers
సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ ని తమ ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ లో మరో రికార్డు అందుకుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయింది నిధి అగర్వాల్. ‘మున్నా మైఖెల్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని సరసన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోనూ నటించింది నిధి. ఇక పూరీ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటిస్తోంది.
కాగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ ఫేస్ బుక్ లో 8.5 మిలియన్ ఫాలోవర్స్ ని రీచ్ అయింది. మరోవైపు ఈ బ్యూటీకి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నిధిని ఇంస్టాగ్రామ్ లో 5.4 మిలియన్స్ ఫాలో అవుతుండగా.. ట్విట్టర్ లో 5 లక్షలమంది అనుసరిస్తున్నారు. మొత్తం మీద నిధి ఈ తరం హీరోయిన్స్ లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ కలిగిన వారి సరసన నిలిచింది.