బిబి4: హారిక – అరియానా ముందే ఔట్

తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. కాని టీమ్ ప్లాన్ చేంజ్ చేసింది. అనూహ్యంగా శనివారం సాయంత్రం సమయంలోనే కొంత భాగంను షూట్ చేసినట్లుగా చెబుతున్నారు. అందులో అరియానా మరియు హారికలను ఎలిమినేట్ చేయడం జరిగింది అంటున్నారు. నెం.4 స్థానంలో అరియానా నిలిచింది అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు నుండి అనధికారిక సమాచారం అందుతోంది.

ఆ ఇద్దరు ఎలిమినేట్ అవ్వడంతో నేడు బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ అభిజిత్ సోహెల్ లు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురిలో విజేత విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అఖిల్ నెం.3 గా నిలువ నుండగా అభిజిత్ విజేతగా సోహెల్ రన్నర్ గా నిలువబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నేటి మద్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుండి షో షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. విజేతను లైవ్ లో ప్రకటించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి షో ఫార్మెట్ ను నిర్వాహకులు మార్చి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఫినాలే ఎపిసోడ్ కు రికార్డు స్థాయి రేటింగ్ కోసం నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Images:

రాత్రి సమయంలో సోహెల్ కథ వేరే ఉంటుందట!

బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ప్రతి సీజన్ లో ఇలాంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఈ సీజన్ కరోనా కారణంగా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులను గ్లాస్ క్యాబిన్ లో కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది. ఆ సమయంలో అంతా చాలా ఎమోషనల్ అయ్యారు. అందరు కూడా వారి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. మళ్లీ వీకెండ్ అయిన శనివారం ఎపిసోడ్ లో కూడా కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశంను ఇంటి సభ్యులకు నాగార్జున ఇచ్చాడు.

ఈసారి స్టేజ్ పై నుండి నాగార్జునతో కలిసి ఇంటి సభ్యులతో మాట్లాడే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. సోహెల్ కోసం అతడి తమ్ముడు మరియు స్నేహితుడు రామారావు వచ్చారు. సోహెల్ కథ వేరే ఉంటుందని రామారావు చేసిన వ్యాఖ్యలకు అంతా నవ్వుకున్నారు. రాత్రి 9 దాటిన తర్వాత అమ్మాయిలతో చాటింగ్ లు ఫోన్ లో మాటలు అంటూ రామారావు చెప్పడంతో బాబోయ్ ఇజ్జత్ తీయ్యకు అన్న అంటూ సోహెల్ విజ్ఞప్తి చేశాడు.

ఆ సమయంలో నాగార్జున మరింత ఆసక్తిని కలుగజేసుకుని ఏం మాట్లాడుతాడు ఏం చాటింగ్ చేస్తాడు అంటూ ప్రశ్నించడంతో అమ్మయిలతో వరుసగా ఎక్కడ ఉన్నావ్ అక్కడ ఉన్నా అంటూ చెప్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఫోన్ పెట్టేసిన వెంటనే మరో అమ్మాయితో అంటూ సోహెల్ గురించి రామారావు చెప్పన సీక్రెట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. హౌస్ లో బుద్ది మంతుడిగా కనిపిస్తున్న సోహెల్ బయట కథ వేరే ఉంటుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్

బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ బిబి హోటల్ సాదా సీదాగా సాగిపోయింది. పెద్దగా వివాదం లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా గేమ్ ఆడారు. గెస్ట్ ల టీం ఇవ్వాల్సిన స్టార్ లను హోటల్ మేనేజర్ అయిన అభిజిత్ కొట్టేయడం వాటిని అ తర్వాత హారిక చేతుల మీదుగా మళ్లీ వాటిని తీసుకుని గెస్ట్ లు ఆ స్టార్స్ ఇచ్చారంటూ అభిజిత్ ప్రకటించడం జరిగింది. టాస్క్ లో భాగంగా హోటల్ వారు ఇచ్చిన ఏ ఒక్క సర్వీసు నచ్చని కారణంగా ఒక్క స్టార్ కంటే ఎక్కువ ఇవ్వలేదని ధనికుల టీం చెప్పింది.

టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ హోటల్ సిబ్బందిని మీకు ధనికుల టీం ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అంటూ ప్రశ్నించగా అయిదు స్టార్స్ అంటూ అభిజిత్ పేర్కొన్నాడు. ఆ సమయంలో ధనికుల టీం మేము మాత్రం ఆ స్టార్స్ ఇవ్వలేదు ఒకే ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాం బిగ్ బాస్ అంటూ చెప్పారు. కొద్ది సమయం చర్చ తర్వాత ఇంటి సభ్యులు కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చినట్లుగా పేర్కొంటూ ధనికుల టీం గెలిచినట్లుగా పేర్కొన్నారు.

గెలుపొందిన ధనికుల టీం నుండి ఒక ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిని ఎంపిక చేయాలంటూ బిగ్ బాస్ చెప్పగా ఇంటి సభ్యులు ఎవరికి వారు తామే బెస్ట్ అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత సోహెల్ మరియు మెహబూబ్ ల మద్య చర్చ జరిగింది. కాయిన్ టాస్క్ లో నీకు నేను సాయం చేశాను కనుక ఈసారి నువ్వు నాకు మద్దతుగా నిలవాల్సిందే అంటూ సోహెల్ డిమాండ్ తో మెహబూబ్ కన్విన్స్ అవ్వలేదు. ఇద్దరి మద్య చాలా సమయం చర్చ జరిగింది. చివరకు మీ ఇద్దరితో పాటు నేను కూడా పోటీలో ఉంటాను అంటూ అరియానా రావడంతో ఆమెకు చోటు కల్పించడం ఎందుకు అనుకున్న మెహబూబ్ సరే అంటూ సోహెల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో సోహెల్ ను మొదటి కెప్టెన్సీ పోటీదారుగా ప్రకటించారు.

హోటల్ సిబ్బంది టీం లో అఖిల్ ఎక్కువ టిప్పు పొందిన కారణంగా అతడిని రెండవ కెప్టెన్సీ పోటీదారుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక సీక్రెట్ టాస్క్ ను విజయవంతంగా నిర్వహించిన అవినాష్ ను మూడవ కెప్టెన్ పోటీ దారుగా ప్రకటించారు. వీరి ముగ్గరురికి మంచు నిప్పు టాస్క్ ను ఇవ్వడం జరిగింది. వెనకాల నిప్పుల కుంపటి వంగి చేతిలో ఐస్ బౌల్స్ పట్టుకోవాల్సి ఉటుంది. ఎక్కువ సేపు ఎవరు నిల్చుంటే వారు విన్నర్స్. అఖిల్ మొదట తప్పుకోగా.. అవినాష్ ఇంకా సోహెల్ లు చాలా సమయం ఉన్నారు. అవినాష్ ఇక తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో సోహెల్ విజేతగా నిలిచాడు. కెప్టెన్ గా సోహెల్ ఎంపిక అయ్యాడంటూ సంజాలక్ అభిజిత్ ప్రకటించి కెప్టెన్ బ్యాండ్ పెట్టాడు.

Related Images:

బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ కు కాలి గాయం కారణంగా ఆయన కూడా అగ్రసివ్ గా లేడు. లాస్య మరి కొందరు కూడా లైట్ గానే ఉన్నారు. ఈ గేమ్ లో అమ్మ రాజశేఖర్.. సోహెల్.. మెహబూబ్.. సుజాత.. అఖిల్.. హారికలు చాలా అగ్రెసివ్ గా పాల్గొన్నారు. వీరు ఒకరి కాయిన్స్ ను మరొకరు దొంగిలించడం లాక్కోవడం వంటివి చేశారు.

ముఖ్యంగా సోహెల్ మరియు మెహబూబ్ లు తెల్ల వార్లు కూడా నిద్ర పోకుండా ఎవరు నిద్ర పోతే వారి వద్దకు వెళ్లి కాయిన్స్ దొంగిలించేందుకు ప్రయత్నించారు. కాయిన్స్ దొంగిలించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వీరిద్దరు టాప్ లో నిలిచారు. అమ్మ రాజశేఖర్ ఈ టాస్క్ లో బాగానే కాయిన్స్ ను దక్కించుకున్నారు. కాని ఆయన పడుకున్న సమయంలో బెడ్ ను లేపి మరీ మొత్తం కాయిన్స్ ను తీసుకు వెళ్లారు. సోహెల్ కాయిన్స్ తీసుకు వెళ్లాడని తెలిసి అమ్మ రాజశేఖర్ చాలా కోపడ్డాడు. కష్టపడి దక్కించుకున్న కాయిన్స్ ను అలా దొంగతనం చేయడం ఏంట్రా అంటూ సోహెల్ ను ఉద్దేశించి అన్నాడు. మాస్టర్ నేను గేమ్ ఆడుతున్నాను అంటూ సోహెల్ అన్నాడు.

కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తి అయ్యేప్పటికి మెహబూబ్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో సోహెల్ నిలిచారు. వీరిద్దరే ఎక్కువ కాయిన్స్ కలిగి ఉంటారని అనుకున్నట్లుగానే వారే ఎక్కువగా కలిగి ఉన్నారు. అయితే ముఖ్యమైన స్విచ్ కాయిన్ మెహబూబ్ కు దొరికితే అది అక్కర్లేదేమో అని వదిలేశాడు. ఆ కాయిన్ ను సుజాతా దక్కించుకుంది. ఆ కాయిన్ వల్ల ప్రత్యేకమైన పవర్ వస్తుందని బిగ్ బాస్ ప్రకటించడంతో మెహబూబ్ వెర్రి మొహం వేశాడు. సుజాత ఆ కాయిన్ ను రాత్రి అంతా చాలా జాగ్రత్తగా దాచుకుంది.

ఇక గేమ్ రెండవ స్టేజ్ కు వెళ్లింది. సభ్యులు అంతా వెల్ ప్రో జాకెట్ లు వేసుకుని ఉంటారు. ఒక కిల్లర్ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ ను వెల్ ప్రో జాకెట్ కు అంటించాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్ కు కాయిన్ అంటి ఉంటుందో వారి వద్ద ఉన్న కాయిన్స్ సగం అవుతాయి. వెల్ ప్రో జాకెట్ గేమ్ మద్యలో కూడా మరోసారి సోహెల్ మరియు అమ్మల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సోహెల్ ఆవేశంతో ఊగి పోయాడు. అదే సమయంలో అవినాష్ కాళికి దెబ్బ తగిలి కిందపడి పోయాడు. అతడిని మెడికల్ రూంకు తీసుకు వెళ్లారు.

ఆ సమయంలో మోనాల్ బాత్ రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండగా ఆమెను తెలుగులో మాట్లాడాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ సమయంలో తనకు తెలుగులో మాట్లాడటం రాదు అంటూ ఆమె బాత్ రూం లోపలకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది. ఆమెను కావాలని టార్గెట్ చేయడం వల్ల కన్నీరు పెట్టుకున్నట్లుగా అనిపించింది. అసలు విషయం ఏంటీ అనేది నేటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Images: