బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ ప్రత్యేకత ఏమిటంటే?

మహమ్మారి క్రైసిస్ లో ప్రారంభించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పై మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఈసారి షో ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరించగలిగింది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక కళ తేనున్నారు. అయితే ఈ నైట్ ప్రత్యేకతలు ఏమిటి? అన్నది ఆరాతీస్తే..

గ్రాండ్ ఫైనల్ లో ముగ్గురు ఫైనలిస్టులను తొలగించనున్నారు. బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం.. ముందుగానే వారికి టోకెన్ అమౌంట్ మొత్తాన్ని అందించే అవకాశం ఉంది. వారు కోరుకుంటే నిష్క్రమించమని కోరతారు. ఫైనలిస్టులలో ఈసారి ఈ ఎంపికకు ఎవరైనా `ఎస్` చెబుతారేమో చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ను ఎవరు గెలుస్తారు? అన్న పోలింగ్ నడుస్తోంది. అభిజీత్ -అలేఖ్య హరిక -అఖిల్ సార్థక్- సయ్యద్ సోహెల్ ర్యాన్- అరియానా కీర్తి .. వీళ్లలో ఎవరు? అన్నది చూడాలి.

ఈసారి షోలో.. రాయ్ లక్ష్మి అదిరిపోయే నృత్య ప్రదర్శనతో డ్యాన్స్ ఫ్లోర్ పై అగ్గిరాజేయనుంది. `ఖైదీ నెంబర్ 150` లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె డ్యాన్స్ నెంబర్ `అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు` అంటూ స్టెప్పులేసిన సంగతి తెలిసినదే. ఈ పాటకు రాయ్ లక్ష్మీ డ్యాన్సులు చేయనుంది. అంతేకాకుండా ఎఫ్ 2తో హీట్ పెంచిన బ్యూటీ మెహ్రీన్ పిర్జదా కూడా తన ప్రత్యేక నృత్యంతో అభిమానుల్ని ఓలలాడించనుంది.

ఈ రాత్రి జరిగే గ్రాండ్ ఫైనల్ లో కమ్ముల `లవ్ స్టోరి` స్టార్లు నాగ చైతన్య- సాయి పల్లవి ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ జంట ఫైనలిస్టులతో సంభాషించడంతో పాటు.. వారి సినిమా ప్రమోషన్ చేసుకుంటారని తెలుస్తోంది. కొంతమంది ఫైనలిస్టులను కూడా తొలగించే పనిని వారికి అప్పగించే అవకాశం ఉంది.

ట్యాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపించనున్నారు. దాదాపు 9 నెలల తర్వాత బిగ్ బాస్ రియాలిటీ గ్రాండ్ ఫైనల్ కోసం ఒక ప్రత్యేక సంగీత కచేరీలో ప్రదర్శన ఇస్తాడు. తమన్ ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇదే విషయాన్ని ధృవీకరించారు.

మెగాస్టార్ చిరంజీవి కొణిదెల మరోసారి ముఖ్య అతిథిగా బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ కు హాజరుకానున్నారు. అతను మాజీ పోటీదారులు ఫైనలిస్టులతో సంభాషించి బిగ్ బాస్ 4 విజేతను ప్రకటించి వారికి ట్రోఫీ అలాగే ప్రైజ్ మనీని అందజేస్తారు. బిబి తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. నాటి ఎపిసోడ్ బంపర్ టీఆర్పీని రాబట్టడంలో చిరు స్టైల్ స్పాంటేనియస్ హ్యూమర్ టచ్ పెద్దగా సహకరించింది. ఇప్పుడు మరోసారి అది రిపీట్ కానుంది. ఫైనల్ షూట్ ఈ మధ్యాహ్నం కిక్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. సాయంత్రం 5 నుంచి బిగ్ బాస్ అభిమాన జనం టీవీలకు అతుక్కుంటారు.

Related Images:

సామ్ జామ్.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్

అక్కినేని కోడలు సమంత వరుసగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సామ్ జామ్ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వరుస ఇంటర్వ్యూల హంగామా గురించి తెలిసినదే. ఇక ఇదే వేదికపై ప్రస్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ఇంటి సభ్యుడు అభిజీత్ కి జాక్ పాట్ తగిలిందని తెలిసింది. అతడు ఇంటి నుంచి బయటికి రాగానే సామ్ జామ్ వేదకపై సందడి చేస్తాడట. ఇక ఈ ఇంటర్వ్యూలో అభిజీత్ గుట్టు మట్లు మొత్తం లీకైపోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ లోటుపాట్లు.. ఆ ఇంట్లో జరిగే చాలా విషయాల్ని ఇలాంటి వేదికలపై సూటిగా చెప్పేయొచ్చు. బిగ్ బాస్ తో పెరిగిన ఇమేజ్ కి అనుగుణంగా సినిమాలకు అతడు సంతకాలు చేసే వీలుంటుంది.

ఇక బిగ్ బాస్ స్టార్లంతా వరుసగా యూట్యూబ్ చానెళ్లు.. టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలలో సందడి చేసేస్తుంటారు ప్రతిసారీ. ఈసారి ఫైనల్ కంటెస్టెంట్స్ లో విజేత ఎవరో తేలాల్సి ఉంది ఇంకా. అభిజీత్ రేస్ లో ఉన్నారు కాబట్టి ఇప్పటికే సామ్ జామ్ నుంచి ఇన్విటేషన్ అందిందట. నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదంటూ హోస్ట్ సమంత అతడి గుట్టంతా రట్టు చేస్తుందన్నమాట. ఫన్ తో పాటు సీక్రెట్స్ ని బయటపెట్టడంతోనే ఈ కార్యక్రమం సక్సెసవుతోంది.

Related Images:

Rowdy Hero Supports His Co-Star In Telugu Bigg Boss 4

The biggest reality show on television, Bigg Boss’ fourth season has come to an end. The show will end in another week. It is known that the top 5 contestants Akhil, Sohail, Abhijeet, Harika and Ariyana have entered the final week. Meanwhile, the fans are also campaigning for votes in a bid to win the favourite contestant anyway. Not just commoners, but also many celebrities are also supporting their favourite contestants in the House.

Abhijeet, one of the strong contestants in the BB house, has a better chance of winning this season. Recently, ‘Arjun Reddy’ fame Vijay Devarakonda has joined the list to support Abhijeet just like Mega brother Nagababu.

It is known that Abhijeet was introduced as a hero in the movie ‘Life is Beautiful’ directed by Shekhar Kammula. In the same movie, Vijay Devarakonda was praised for his role as a gold phase boy. Vijay shared a photo with the Life Is Beautiful team and wrote, “My boys, always wish them the best, Whatever- Wherever.” Abhijeet fans are quite happy that the Rowdy hero has extended his support for their favourite contestant.

Related Images:

‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?

బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తుంటారు కానీ.. అంతకంటే ముందు ఆ వ్యక్తో లేదంటే మరొకరో ‘రియల్ హీరో’ ఇమేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అంతకుముందు ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయం బిగ్ బాస్తో మారిపోతుంటుంది. కొత్తగా అభిమానగణం పుట్టుకొస్తుంది. మెజారిటీ జనం ఆదరణ ఆ వ్యక్తి దక్కించుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ రెండో సీజన్లో కౌశల్ ఇలాగే హీరో అయిపోయాడు. తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక దశ దాటాక అతడిని వ్యతిరేకించేవారు కూడా భారీగానే తయారయ్యారు కానీ.. కౌశల్ తెచ్చుకున్న ఫాలోెయింగ్ మాత్రం అసామాన్యమైంది. గత సీజన్లో వరుణ్ సందేశ్కు ఈ స్థాయిలో కాకపోయినా మంచి ఫాలోయింగే వచ్చింది. ఒక దశలో అతను అందరి ఫేవరెట్గా ఉన్నాడు. చివరి దశలో భార్యను నిలబెట్టడానికి అతను చేసిన కొన్ని పనులు నెగెటివిటీని పెంచాయి కానీ.. లేదంటే అతనే విజేతగా నిలిచేవాడేమో.

ఇక ఈ సీజన్ విషయానికి వస్తే.. షోలో సగం వరకు ఏ ఒక్కరి ఆధిపత్యం కనిపించలేదు. పోటాపోటీగానే సాగింది పోరు. దాదాపు అరడజను మంది టైటిల్ పోటీదారులుగా కనిపించారు. కానీ ఇప్పుడు అభిజిత్ అందరినీ వెనక్కి నెట్టేసినట్లే కనిపిస్తున్నాడు. మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే అతను జెన్యూన్గా స్టేబుల్గా కనిపిస్తుండటమే అందుక్కారణం. ముఖ్యంగా అయిన దానికి కాని దానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం.. ఆవేశపడిపోవడం.. ఏడ్చేయడం లాంటివి అభిజిత్లో కనిపించవు. తమ కుటుంబ సభ్యుల్ని కలిసినపుడు అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ అభిజిత్ మాత్రం స్థిమితంగా కనిపించారు. మిగతా సమయాల్లో అందరూ అతి చేసిన వాళ్లే. ఆవేశపడ్డవాళ్లే. నాటకీయత జోడించిన వాళ్లే. ఎమోషనల్ ప్లే కోసం ట్రై చేసిన వాళ్లే. కానీ అభిజిత్ మాత్రం ఎంతో పరిణతితో స్థితప్రజ్ఞతతో కనిపించాడు. ఇది అతడికి ఫాలోయింగ్ పెంచింది. అమ్మాయిలకు అతను ఫేవరెట్ అయిపోయాడు. కుర్రాళ్లలో కూడా మంచి ఫాలోయింగే ఉన్నట్లుంది. తాజాగా అభిజిత్ మీద హ్యాష్ ట్యాగ్ పెడితే అది ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. అందులో ఒక్కొక్కరి ట్వీట్లు దాన్ని ట్రెండ్ చేసిన తీరు చూస్తే అభిజిత్ను మ్యాచ్ చేసేవాళ్లు ఇప్పుడు హౌస్లో ఇంకెవ్వరూ లేరేమో అనిపిస్తోంది. ఉన్నంతలో సోహైల్ అతడికి పోటీ ఇస్తున్నాడు.

Related Images:

బిబి4 లీక్ : లాస్య ఎలిమినేట్

బిగ్ బాస్ ఎలిమినేషన్ కు సంబంధించి ప్రతి వారం లీక్ వస్తూనే ఉంది. ఈ వారం కూడా లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నది లాస్య అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. మోనాల్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె మరోసారి సేవ్ అయ్యింది. అత్యధికసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన మోనాల్ మరోసారి సేవ్ అయ్యింది. మొన్నటి టాస్క్ లో హారికను మోనాల్ కెప్టెన్ గా చేసిన తీరు అందరికి బాగా నచ్చింది. ఆ కారణంగా ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయనేది కొందరి మాట.

ఏది ఏమైనా నేటి ఎపిసోడ్ లో లాస్య ఎలిమినేట్ అవ్వబోతుంది. ఫైనల్ 5 కంటెస్టెంట్ అంటూ లాస్య పేరు బలంగా వినిపించింది. కాని ఆమె ఇలా బయటకు వస్తుందని ఎవరు ఊహించలేదు. అనూహ్యంగా ఆమె బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఎప్పటిలాగే మోనాల్ ను కాపాడుతూ లాస్యను ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. లాస్య బలమైన కంటెస్టెంట్. ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంది. అయినా కూడా ఆమె ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..

మాస్ న్యూ లుక్ తో `బిగ్ బాస్ 4` కోసం కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్. కింగ్ నాగార్జున అక్కినేని వరుసగా రెండవ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కొనసాగుతుంటే తమిళ బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి కమల్ ఇదిగో ఇలా ప్రిపేరయ్యారు. ఈ షోని సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని ప్లాన్ చేసినా కోవిడ్ వల్ల వాయిదా పడింది. ఇప్పటికి ఈ రియాలిటీ షో ప్రదర్శన ప్రణాళిక ట్రాక్ లో ఉంది.

మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమల్ హాసన్ మరోసారి తిరిగి హోస్ట్ అవతారం ఎత్తారు. అందుకు సంబంధించిన షాకింగ్ లుక్ తాజాగా రివీలైంది. ఫోటోషూట్ నుండి స్టిల్స్ నిన్నటి నుండి ఇంటర్నెట్లో వైరల్ గా మరాయి. `ఇండియన్ 2` స్టార్ హ్యాండిల్ బార్ మీసం.. స్టైలిష్ గుబురు గడ్డంతో ఉప్పు నిప్పులా కనిపిస్తున్నారు మరి. వైట్ హ్యాట్ బ్లాక్ అండ్ బ్లాక్ స్టైలిష్ డ్రెస్ లో ఈ లుక్ చూశాక… ఊబర్ స్టైలిష్ లుక్ బావుందని ….. సూపర్ ఉలగనాయగన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

కమల్ హాసన్ ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో కోసం ప్రోమో వీడియో రెడీ చేశారట. ఇందులో బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని ఇంట్లో 15 మంది పోటీదారులంతా కనిపిస్తారట. ఈసారి తమిళ బిగ్ బాస్ లో రమ్య పాండియన్… పుజ్ఘల్… అతుల్య రవి.. విద్యాలేఖ రామన్ … కిరణ్ రాథోడ్ వంటి సెలబ్రిటీలను సంప్రదించినట్లు సమాచారం.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న `ఇండియన్ 2` షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా నిర్మాతలతో వివాదం తెలిసినదే. కమల్ హాసన్ బిగ్ బాస్ 4 పనిలోనే బిజీ అయ్యారు దీనివల్ల. తదుపరి ఓ రెండు చిత్రాల్లో నటించాలన్న ప్లాన్ తో ఉండగా వాటిలో ఒకదానికి ఆయనే దర్శకత్వం వహించనున్నారు.

Related Images:

No Contestant In Bigg Boss House Tested Positive

After rapper and actor Noel Sean exited the Bigg Boss house, the speculations were rife that Noel might have contracted the novel coronavirus and that’s the reasons, he has been sent out of the house.

The sources have now rubbished the baseless speculations and revealed that Noel is having some health issues which have been kept secret as per his request.

Noel entertained the audience with his performances and has established a decent fanbase among the Bigg Boss viewers.

As the actor has a strong bonding with most of the housemates, everyone bid an emotional farewell to him. Well, it remains to be seen will he come back to the house or not.

Related Images:

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త లెంగ్త్ ఎక్కువ అయ్యిందనే కాని సమంత హోస్టింగ్ పై విమర్శలు రాలేదు. అందుకే ఆమెను మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. స్టార్ మా మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంతతో అయిదు వారాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఈ అయిదు వారాలకు గాను సమంతకు రూ.2 కోట్ల రూపాయల పారితోషికంను ఇస్తున్నారట. శని ఆదివారం ఎపిసోడ్ లకు ఒక్క రోజు షూట్ చేస్తారు. అంటే సమంత ఒక్క రోజుకు గాను రూ.40 లక్షలకు ఎక్కువ పారితోషికం అందుకుంటుంది. నాగార్జున ఈ సీజన్ మొత్తంకు గాను రూ.8 కోట్ల పారితోషికంను అందుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే నాగ్ ఒక్క రోజుకు దాదాపుగా రూ.45 నుండి 50 లక్షల వరకు పారితోషికంగా పొందుతున్నాడు. అంటే సమంతకు కూడా ఈ అయిదు వారాలకు గాను ఏకంగా రెండు కోట్లు ఇస్తూ సమానమైన పారితోషికంను అందిస్తున్నారు.

సమంత గెస్ట్ హోస్ట్ గా వచ్చినా కూడా ఈ స్థాయి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. తెలుగు సరిగా మాట్లాడలేక పోయినా అంటే ఆమెకు తెలుగు మాట్లాడటం ఇబ్బందిగా ఉన్నా కూడా తెలుగు హోస్ట్ గా చేయడం అంటే చాలా కష్టమైన విషయం. అయితే ఆమె హోస్ట్ గా చేస్తే షో కు మంచి హైప్ వస్తుంది. అందుకే ఆమెతో హోస్టింగ్ చేయిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక్క వారం రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసీజన్ లో మాత్రం అయిదు వారాలు గెస్ట్ హోస్ట్ అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Images:

Bigg Boss 4: Nagarjuna To Join The Show This Weekend

Samantha Akkineni had hosted the last weekend episode of Telugu Bigg Boss 4 in the absence of her father-in-law Nagarjuna. The veteran actor had taken a break for the shooting of his upcoming film, ‘Wild Dog’.

Meanwhile, there were speculations that Nagarjuna may not be hosting the weekend episode too as he is completely occupied with the movie shoot.

However, the sources revealed that Nag will return to Hyderabad this Friday. He will host the show as usual. After the last weekend, Bigg Boss received a heavy trolling as netizens commented that the show is turning into a family show of Akkineni.

To put an end to these kinds of trolls, the organisers are making sure to have Nagarjuna’s presence in the show.

Related Images:

One More New Entry In Telugu Bigg Boss 4?

Bigg Boss 4 Telugu had garnered huge TRP ratings during the initial days, but now the TRP’s have decreased gradually. Needless to say, Indian Premiere Leauge 2020 has majorly affected the show ratings. And now, the makers of the show are trying hard to keep some interesting elements in order to fetch good TRP ratings.

The latest buzz is that show makers are in a plan to introduce one more wild card contestant in the show. It is heard that popular singer Mangali is all set to step into the house. It is said that organisers have offered a hefty amount to the singer as she has a huge craze in Telugu states.

However, there is no official confirmation from the Bigg Boss team yet. It remains to be seen whether this buzz turns to be true or not.

Related Images:

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత

మూడు వారాలుగా తెలుగు బిగ్ బాస్ కు ఈ వీకెండ్ కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసారి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ గా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని గత రెండు మూడు వారాలు ఆ పుకార్లు గాలి వార్తలే అని తేలిపోయింది. అయితే ఈసారి నిజంగానే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లాడు. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున ట్విట్టర్ లో వీడియో షేర్ చేసి మరీ చెప్పాడు. దాంతో ఈ వారం గెస్ట్ హోస్ట్ ఖాయం అయ్యింది.

దసరా మరియు గెస్ట్ హోస్ట్ అవ్వడంతో ప్రత్యేకంగా ఉండే ఉద్దేశ్యంతో సమంతను ఒప్పించారు. రేపు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు మూడు గంటల పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సమంత సందడి చేయబోతుంది. సమంత హౌస్ లోకి వెళ్తుందా లేదంటే స్టేజ్ పై నుండే నాగార్జున హోస్టింగ్ చేసినట్లుగా చేస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

గత మూడు నాలుగు రోజులుగా సమంత క్వారెంటైన్ లో ఉందని ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రేపటికి ఎపిసోడ్ కు సమంత హోస్టింగ్ అది కూడా మూడు గంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వబోతున్నారు. నేటి ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే సాగబోతుంది. ఇంటి సభ్యులు తీసిన సినిమా ప్రీమియర్ వేయడంతో సందడి చేయనున్నారు.

Related Images:

Happening Beauty To Host Bigg Boss In Absence Of Nag

The craze for Bigg Boss and King Nagarjuna on Telugu Television is different from the other languages. The show got good reception from the viewers in all the three seasons and now the show has registered a massive TRP of 18.5 points surpassing the previous season records in the first week of the telecast.

On the other hand, the show is severely trying to show it’s dominance at least in the weekends at least due to the unavoidable IPL.

The latest news from close sources regarding Bigg Boss host Nagarjuna and his absence in Bigg Boss house is confirmed. The star veteran actor is busy out of the State for his film commitments and in his absence the show would be hosted by his daughter in law Samantha. The episode would be telecasted soon!

With the regular promos and the latest happenings in the Bigg Boss house, it can be said that there will be ample entertainment these two days!

Related Images:

మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు

బిగ్ బాస్ సీజన్ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్. మోనాల్ తో అఖిల్ .. అభిజీత్ లవ్ ట్రాక్ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే కేవలం వీళ్ల లవ్ ట్రాక్ కోసమే బిగ్బాస్ను చూసేవారూ ఉన్నారు. అయితే ఈ క్రమం లో అఖిల్ ప్రవర్తన మాత్రం మొదటి నుంచి కాస్త వివాదంగా ఉంది. అతడి మాటలు ప్రవర్తనలో కాస్త పొగరు ధ్వనిస్తుందని బిగ్బాస్ చూసే ప్రేక్షకులు ఫేస్బుక్లో ఎన్నోసార్లు కామెంట్లు పెట్టారు. ‘మరీ అంత బలుపు పనికి రాదు బ్రో’అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అఖిల్ దర్జాగా కొనసాగుతున్నాడు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన మాత్రం హౌస్ కొంపముంచినట్టు ఉంది..

ఇంతకీ ఏం జరిగిందంటే.. గత వారం కమెడియన్ కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్లో ఒక్కొక్కరి గురించి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఐతే అఖిల్ గురించి చెబుతూ.. ‘టాస్కుల్లో అఖిల్ ఫుల్ ఎనర్జీగా ఆడుతున్నాడు. బాగా కష్టపడుతున్నాడు కూడా.. కానీ ఫెయిలవుతున్నాడని.. అలాగే ప్రయత్నించాలని అన్నాడు’ అని చెప్పాడు. దీనికి వెంటనే అఖిల్ రియాక్ట్ అయిపోయాడు. ‘నువ్వు టాస్కుల్లో గెలిచినా కూడా బయటికి వెళ్లిపోయావు బ్రో’ అంటూ పంచ్ వేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఓ వ్యక్తిపై అఖిల్ అలా కౌంటర్ వేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తొందర్లోనే అఖిల్ కూడా బయటకు వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టుందని ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు.

Related Images:

బిబి4 : గెస్ట్ హోస్ట్ పోయిన వారం కాదు ఈ వారం?

తెలుగు బిగ్ బాస్ గత సీజన్ లో ఒక వీకెండ్ లో నాగార్జున అందుబాటులో లేక పోవడం వల్ల రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెల్సిందే. ఆమె గెస్ట్ గా వచ్చని ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సీజన్ లో కూడా మరో సారి గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ గత వారం చాలా బలంగా పుకార్లు షికార్లు చేశాయి. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున విదేశాలకు వెళ్లారని ఆయన ఒక్క రోజు షూటింగ్ కోసం తిరిగి రావడం చాలా రిస్క్ తో కూడుకున్న పని కనుక ఈ వారంకు సంబంధించి వీకెండ్ ఎపిసోడ్స్ ను గెస్ట్ హోస్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తీరా చూస్తే పోయిన వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జుననే కనిపించాడు. దాంతో పుకార్లన్నింటికి చెక్ పెట్టినట్లయ్యింది.

గత వారం జరిగిన చర్చ మళ్లీ ఈవారం జరుగుతోంది. అయితే ఈసారి ఇంకాస్త బలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగార్జున సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉన్నారు. అక్కడ నుండి హైదరాబాద్ కు వచ్చే అవకాశం లేదని అందుకే ఈ వారంలో ఖచ్చితంగా గెస్ట్ హోస్ట్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఆ గెస్ట్ హోస్ట్ ఈసారి రమ్యకృష్ణ కాదని.. హీరోయిన్ కమ్ ఎమ్మెల్యే కమ్ బుల్లి తెర షో హోస్ట్ అయిన రోజా ఈ వీకెండ్ ఎపిసోడ్ ను హోస్ట్ చేయబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. నేడు రెండు ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యి ఉంటుంది. మరి కాసేపట్లో ప్రోమో వచ్చే అవకాశం ఉంది. కనుక గెస్ట్ హోస్ట్ వార్తలు నిజమేనా రోజా గారు హోస్ట్ గా దుమ్ము లేపబోతున్నారా లేదంటే గత వారం మాదిరిగానే పుకార్లేనా అనే విషయం మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Images:

బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

రెండు వారాలుగా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ మొహాలకు ఉన్న మాస్క్ లను మొన్నటి శని ఆదివారాల ఎపిసోడ్ లో పూర్తిగా తీయడం జరిగింది. నాగార్జున సేఫ్ గేమ్ ఆడటం సెల్ఫ్ నామినేషన్ వంటి పిచ్చి పనుల వల్ల గేమ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఒకరిపై ఒకరికి ఎంతగా ఉంది కోపం బయటకు ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఆ ఎపిసోడ్ ల్లో క్లారిటీగా చూపించారు. దాంతో నిన్నటి నుండి మొత్తం రచ్చ రచ్చగా ఉంది. మూడవ వారంలో మొదటి రోజు అయిన నిన్న ఎక్కువ శాతం ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్ ను టెలికాస్ట్ చేశారు. అంతుకు ముందు అరియానా సోహెల్ ల గొడవ.. హారిక దివిల ముచ్చట్లు చూపించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది.

గత వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి బిగ్ బాంబ్ ద్వారా టవీ9 దేవిని ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ చేసింది. దాంతో దేవి మొదట నామినేషన్ లోకి వెళ్లి పోయింది. ఇక కెప్టెన్ అయిన నోయల్ కు ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో లాస్యను నోయల్ నామినేట్ చెప్పి దివి విషయంలో ఆమె వ్యవహరించడం సరైనది కాదేమో అన్నట్లుగా అనిపించింది అంటూ కారణం చెప్పాడు. అలా ముందే దేవి మరియు లాస్యలు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వగా నోయల్ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలిమినేషన్ నుండి ఉపశమనం పొందాడు. మిగిలిన వారిలో నుండి అందరు వచ్చి ఎవరిని ఎలిమినేషన్ కు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది.

ఎక్కువ మంది కుమార్ సాయి ఫొటోను మంటల్లో వేశారు. ఆయన ఇంకా కలవడం లేదు అని చెప్పడంతో పాటు రకరకాల కారణాలు చెప్పారు. ఆ తర్వాత మెహబూబ్ మరియు మోనాల్ లకు కూడా ఎక్కువ మంది ఎలిమినేషన్ కు ఓటు వేశారు. అలా మొత్తంగా ఈ వారంలో ఏడుగురు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వారు దేవి.. లాస్య.. కుమార్ సాయి.. మోనాల్.. మెహబూబ్.. అరియానా.. హారిక. లాస్య మరియు అరియానాలు మొదటి సారి ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ వారంలో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప కుమార్ సాయి సేవ్ అవ్వడం కష్టం అన్నట్లుగా ఉంది. ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు అంటూ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. కనుక ఆయనకు ఓట్లు పడటం అనుమానమే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Related Images:

గంగవ్వను ఒంటరిని చేశారా.. ఫ్యాన్స్లో టెన్షన్

భారీ అంచనాలతో మొదలైన బిగ్బాస్ హౌస్ ప్రస్తుతం డీలా పడిపోయింది. వినోదం లేక ప్రేక్షకులకు రోజురోజుకూ ఆసక్తి తగ్గిపోయింది. అయితే హౌస్లోకి అడుగుపెట్టిన గంగవ్వ మాత్రం ఈ షోకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. సోషల్మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మేము బిగ్బాస్ షో చూడలేదు కానీ.. ఇప్పడు గంగవ్వకు ఓట్లేస్తాం అంటూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఆమె రేంజ్ తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన బిగ్బాస్ ఇంటి సభ్యులు ఆమెను టార్గెట్ చేశారేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో గంగవ్వ హౌస్లో ఉండలేకపోతోంది. పైకి అందరూ గంగవ్వతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆమెను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గంగవ్వను ఎలాగైనా బయటకు పంపించాలని కొందరు సభ్యులు ఆలోచిస్తున్నారట. ఆమెకు బయట ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎన్నిసార్లు నామినేట్ చేసినా సేవ్ అవుతోంది.. కాబట్టి హౌస్లో ఒంటరిని చేస్తే గతంలో సంపూర్ణేష్బాబు పోయినట్టు ఆమె వెళ్లిపోతుందని కొందరు కుట్రలు చేశారట.

ఆమె ఆటిడ్యూడే ఫిదా చేసింది
కల్లాకపటం లేని నిర్మల మనసుతో మై విలేజ్ షోతో అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వకు బిగ్బాస్ హౌస్కు వెళ్లాక కూడా ఆదరణ తగ్గలేదు. మిగతా సభ్యుల్లాగా నటించకుండా షోలో ఆమె చాలా సహజంగా ఉండటం కూడా ఎంతోమందికి నచ్చింది. అయితే గంగవ్వ మాత్రం అక్కడ కుదురుకోలేకపోతోంది. అందుకే ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రతీ సారి తనే ముందుడుగు వేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నా వల్ల కాదు బిడ్డ నేను పోతా.. అంటూ పలుమార్లు తన ఆలోచనను బయటపెడుతోంది. గతంలో సంపూర్ణేష్ బాబు కూడా ఇలాగే ప్రవర్తించాడు. బిగ్బాస్తో గొడవపెట్టుకొని మరి ఇంట్లోనుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం గంగవ్వ కూడా అలాగే వస్తుందేమో వేచి చూడాలి.

గంగవ్వపోతే.. బిగ్బాస్ చూసేవాళ్లే ఉండరా!
మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయంటే ఆమెకు ఏరేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి బిగ్బాస్ వంటి షోలపై ఆసక్తి ఉండదు. ప్రస్తుతం గంగవ్వ ఉండటం వల్ల పల్లెటూర్లలో ఈ షోను చాలామంది చూస్తున్నారు. కానీ గంగవ్వ వెళ్లిపోతే బిగ్బాస్కు టీఆర్పీ పడిపోవడం ఖాయం. అందుకే బిగ్ బాస్ ఇప్పట్లో ఆమెను పంపేలా లేడని సమాచారం. అయితే గంగవ్వ షో చివరివరకు ఉండదని మరొక టాక్ వస్తోంది. గంగవ్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Related Images:

బిబి4 : ఎలిమినేషన్ లో ఉన్నవారి బలాలు బలహీనతలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం పూర్తి కాబోతుంది. నేడు రేపు వీకెండ్ ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ డ్రామా ఉండబోతుంది. మొదటి వారంలో మొత్తం 14 మందిలో సగం మంది ఏడుగురు నామినేషన్ అయ్యారు. సోహెల్ అరియానా ఆలస్యంగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కనుక వారు ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు. మొదటి వారంలో ఎలిమినేషన్ లో సూర్య కిరణ్.. అభిజిత్.. గంగవ్వ.. సుజాత.. దివి.. మెహబూబ్.. అఖిల్ సర్తక్ ఉన్నారు. వీరిలో గంగవ్వకు అత్యధికంగా ఓట్లు నమోదు అవుతున్నట్లుగా ట్రెండ్స్ ను బట్టి అర్థం అవుతుంది.

ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో గంగవ్వకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆమె ఇంకొన్నాళ్లు ఇంట్లో ఉండాలనే అభిప్రాయం అందరికి ఉంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఆమె బలంగా చెప్పుకోవచ్చు. ఇక అభిజిత్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో కనుక అతడు కొన్నాళ్ల పాటు ఉంటాడు. అదే అతడి బలంగా చెప్పుకోవచ్చు. మోడల్ కమ్ నటి అయిన దివి అనూహ్యంగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె అవసరం ఉన్న చోట మాట్లాడుతూ తన పని తాను చేసుకు వెళ్తుంది. అదే ఆమె బలం. సుజాత విషయంలో ప్రేక్షకులు కాస్త ఓవర్ యాక్షన్ గా ఫీల్ అవుతున్నారు. అది ఆమె బలహీనత. సూర్య కిరణ్ అందరిని డామినేట్ చేసేందుకు డైరెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది ఆయనకు బలహీనత అవ్వబోతుంది.

మిగిలిన అఖిల్.. మెహబూబ్ ల విషయంలో కొందరు పాజిటివ్ తో ఉన్నారు కొందరు నెగటివ్ గా ఉన్నారు. కాని వీరిద్దరికి సాయి కిరణ్ సుజాతలకు ఉన్నంత వ్యతిరేకత లేదు. కనుక ఈ వారం ఏడుగురిలో సాయి కిరణ్ మరియు సుజాతలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయితే ఆశ్చర్యం లేదు. వీరు కాకుండా మరెవ్వరైనా ఎలిమినేట్ అయితే మాత్రం పక్కాగా షో పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది సంచలనం అవ్వబోతుంది. నేడు ముగ్గురిని సేవ్ చేసి రేపటి ఎపిసోడ్ లో మరో ముగ్గురిని సేవ్ చేసి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంను నాగార్జున ప్రకటించే అవకాశం ఉంది.

Related Images:

Dull Start Forces ‘Bigg Boss’ Team To Change Their Plans!

‘Bigg Boss’ is one of the most popular television reality shows in India. It gets huge TRP’s in all the languages it has been organized. The show got a phenomenal response for the first three seasons. The fourth season started off recently and reports suggest that the reception is quite dull compared to earlier.

Experts are saying that many unknown contestants are the reason behind this dull start. Realizing this, the makers have decided to weave some magic by bringing a well-known personality into the house as a contestant in the coming few days. They are reportedly hoping that it would bring some energy in the house and lift the TRP’s.

Apart from that, they are making plans to bring some movie stars during the weekends and make them interact with Nagarjuna as well as the contestants. Weekend episodes are always considered as huge entertainers, we need to see what else does the makers do to make the show more interesting in the coming days. Currently, there are 16 members in the house and this show is expected to last for 15 weeks.

Related Images:

బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఆమెకు ఉందా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ నిర్వాహకులు షోను ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు షో కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం చాలా కామన్ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో తమిళ బిగ్ బాస్ కూడా ప్రారంభం కాబోతుంది. తమిళ బిబి 4 ను అడ్డుకుని తీరుతాను అంటూ వివాదాస్పద నటి మీరా మిథున్ హెచ్చరిస్తుంది. ప్రతి సీజన్ ఆరంభంకు ముందు ఎవరో ఒకరు ఆందోళనలు చేయడం తమిళ బిగ్ బాస్ కు చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా మీరా మిథున్ బిబి4 వెంట పడుతుంది. ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ఈమె సీజన్ 3 కంటెస్టెంట్. ఆ సమయంలో తనకు జరిగిన అవమానంకు నిరసనగా బిగ్ బాస్ ను నిలిపేయాలంటూ కోరుతున్నట్లుగా డిమాండ్ చేస్తోంది.

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో దర్శకుడు చేరన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ మీరా ఆరోపించింది. వీకెండ్ ఎపిసోడ్ లో కమల్ హాసన్ అందుకు సంబంధించిన వీడియోలను చూపించాడు. అందులో ఎక్కడ కూడా చేరన్ అసభ్యంగా ప్రవర్తించినట్లుగా లేదు. కాని మీరా మాత్రం తన అసలు వీడియోను చూపించలేదు అంటూ విమర్శలు గుప్పించింది. తన అసలు వీడియోను చూపించకుండా తనకు ఆఫర్లు లేకుండా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేసే వరకు బిగ్ బాస్ 4ను మొదలవ్వనివ్వను అంటోంది. మరి ఈమెకు బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఉందా అనేది చూడాలి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది. వారిని క్వారెంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Images:

బిబి4 : ఏంటి దివి ఉన్నావా? లేవా?

ఈసారి బిగ్ బాస్ లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు అంతా కూడా ఎప్పుడు చూడని ఫేస్ లే. చాలా మందికి వారు ఎవరు అసలు వారు ఏ రంగానికి చెందిన వారు అనే విషయాలు కూడా తెలియదు. అయినా కూడా బిగ్ బాస్ వారిని ఎంపిక చేశాడు అంటే ఏదో కారణం అయితే ఉండి ఉంటుందని బిబి అభిమానులు వారి నుండి ఎంటర్ టైన్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు కావాలని కెమెరాకు ఫోకస్ అవుతుంటే మరికొందరు మాత్రం అస్సలు ఫోకస్ లోకి రావడం లేదు. కెమెరా ఫోకస్ లోకి ఎక్కువగా వస్తున్న అమ్మాయిల విషయానికి వస్తే సుజాత.. లాస్య.. హారికలు మాత్రమే. ఇతరులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కాని దివి మాత్రం అస్సలు కెమెరా ఫోకస్ లో ఉండటం లేదు.

ఇంటి సభ్యులతో బాగానే ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. కాని ఆమె ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలో మాట్లాడటం కాని కాస్త వాయిస్ రేజ్ చేయడం కాని చేయలేదు. ఏం జరుగుతున్నా అక్కడ అయితే ఉంటుంది. ఆమె గేమ్ ప్లాన్ అయ్యి ఉంటుందా లేదంటే మరేంటో కాని ఇప్పటి వరకు ఆమె నుండి మంచి ఫుటేజ్ ను ప్రేక్షకులు చూడలేదు. ఎంట్రీ సమయంలో తెగ హడావుడి చేసి అందాలతో అలరించడం ఖాయం అనిపించింది. కాని తీరా చూస్తే ఇప్పటి వరకు కెమెరా ఫోకస్ లోకి రాకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు ఆమె వచ్చింది కనుక జాగ్రత్తగా ఉంటుందా అని కొందరు అంటున్నారు. జాగ్రత్త పేరుతో ఆమె యాక్టివ్ గా ఉండకుంటే ఓట్లు ఎలా పడుతాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వారంలో ఆమె సేఫ్ అయితే తదుపరి వారాల్లో అయినా ఆమె సందడి ఉంటుందేమో చూడాలి.

Related Images: