క్రేజీ మల్టీస్టారర్ లో సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో విజయ్ నటించబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో ఒక క్రేజీ మల్టీస్టారర్ రూపొందబోతుంది. ఆ సినిమాలో ఒక హీరోగా సూర్య నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

సూర్యతో పాటు ఆ మల్టీస్టారర్ లో ఆర్య మరియు అథర్వ మురళి కూడా నటించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను బాలా ప్లాన్ చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు బాలా గతంలో పలు మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించాడు. సూర్యతో 18 ఏళ్ల క్రితం పితామగన్ సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో సూర్యకు స్టార్ డం దక్కింది. ఆ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాలా దర్శకత్వంలో సూర్య మల్టీస్టారర్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Related Images:

హిస్టరీలో నిలిచిపోయే మల్టీస్టారర్ కు ఆదిలోనే బ్రేక్

ప్రస్తుతం మల్టీస్టారర్ హవా అంతకంతకు పెరుగుతోంది. స్టార్లు ఈగోలు వదిలేసి స్నేహవాతావరణంలో సాటి హీరోలతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తుండడం బాలీవుడ్ తరహాలో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలతో సౌత్ లో సినిమాలు తీస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. అయితే మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీ కొత్తేనా? అంటే అలాంటిదేమీ లేదు.

అప్పట్లోనే ఎన్టీఆర్-ఏఎన్నార్ అద్భుతమైన మల్టీస్టారర్లు చేశారు. ఆ తర్వాత జనరేషన్ లో కృష్ణ- చిరంజీవి.. చిరంజీవి- మోహన్ బాబు .. కాంబినేషన్ సినిమాలు చూశాం. ఇటీవల మహేష్ – వెంకటేష్ … పవన్ – వెంకటేష్ .. వంటి క్రేజీ కాంబినేషన్లు వచ్చాయి. ప్రభాస్ – రానా ల మల్టీస్టారర్ బాహుబలి సంచలనాలు తెలిసినదే. రామ్ చరణ్ – రామారావు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే వీటన్నిటి కంటే క్రేజీ మూవీని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా కాలం క్రితం ప్రయత్నించారు. చిరంజీవి-నాగార్జున- వెంకటేష్ ముగ్గురు అగ్ర హీరోల్ని కలిపి అదిరిపోయే మల్టీస్టారర్ చేయాలని అనుకున్నారు. 2002 లో ఈ ప్రయత్నం సాగింది. కానీ దురదృష్ఠవశాత్తూ అది వీలుపడలేదు. చిన్నికృష్ణ కథతో తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా `త్రివేణి సంగమం` అనే టైటిల్ తో సినిమా తీయాలని అనుకున్నా దర్శకేంద్రుడు చేయలేకపోయారు. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ నాయుడుగారితో అల్లు అరవింద్- అశ్వనీదత్ కలిసి నిర్మిస్తారని ప్రచారమైంది. అయితే ఎందుకని ఆగిపోయింది? అంటే ఆ సినిమా క్లైమాక్స్ అలాగే కొన్ని సీన్స్ సరిగా కుదరలేదట. మొత్తానికి అలాంటి అరుదైన అవకాశాన్ని రాఘవేంద్రుడు మిస్సయ్యారన్నమాట.

ఇక దీంతో పాటే మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలయికలో త్రివిక్రమ్ దర్శకుడిగా అశ్వనిదత్ – టీఎస్సార్ నిర్మించాలనుకున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇంతవరకూ ప్రకటనలకే పరిమితమైంది కానీ తెరకెక్కించే ప్రయత్నం సాగకపోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. హిస్టరీలో నిలిచిపోయే మల్టీస్టారర్లకు ఆదిలోనే బ్రేక్ పడిపోవడం దురదృష్టం అనే చెప్పాలి. నెవ్వర్ బిఫోర్ ట్రీట్ ని తెలుగు ఆడియెన్ మిస్సయినట్టే ఈ ఫెయిల్యూర్స్ వల్ల.

Related Images: