దిల్ రాజుకు చేదోడు వాదోడుగా భార్య తేజస్విని

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కథల జడ్జిమెంట్ సూపర్ అంటూ అంతా అంటూ ఉంటారు. ఒక కథను ఆయన ఏదైనా హీరోకు అనుకుంటే అది నిజంగా ఆ హీరో కోసమే రాశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయి.. ఎలాంటి హీరోకు ఎలాంటి కథలు నచ్చుతాయి అనే విషయంలో దిల్ రాజు చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన సక్సెస్ రేటు చాలా ఎక్కువ అనేది అందరి మాట. దిల్ రాజు ఆఫీస్ లో కథా రచయితల టీం చాలా మంది ఉంటారు. ఎంతో మంది కొత్త వారిని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాంటి దిల్ రాజు భార్య తేజస్వినికి కూడా కథల విషయంలో చాలా పట్టు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ఇటీవలే తేజస్విని ఒక యూనిక్ స్టోరీ లైన్ ను దిల్ రాజుకు చెప్పారట. ఆ లైన్ నచ్చడంతో తన వద్ద ఉండే రచయితలకు కథగా డెవలప్ చేయాల్సిందిగా చెప్పాడట. ఆ స్టోరీ బాధ్యతను పూర్తిగా తేజస్వినికి దిల్ రాజు అప్పగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె కూడా కథల విషయంలో దిల్ రాజుకు చేదోడు వాదోడుగా ఉంటే ఆయన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయంటున్నారు. దిల్ రాజు సినిమాల నిర్మాణంకే పరిమితం అవ్వకుండా వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఆ బాధ్యతను భార్య తేజస్వినికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.

Related Images:

దిల్ రాజు భార్య పేరు లేకపోవడానికి కారణం అదేనా…?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టడం వరకే నాయి కాకుండా స్టోరీ దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు.. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అన్నీ తానై చూసుకుంటాడు దిల్ రాజు. కథాబలం ఉన్న మంచి సినిమాలను నిర్మిస్తూ దర్శకుల హీరోల సినిమా అని కాకుండా దిల్ రాజ్ సినిమా కాబట్టి చూడొచ్చు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించాడు. మొదటి సినిమా ‘దిల్’ నుంచి కూడా దిల్ రాజు నిర్మించే ప్రతి సినిమాకి ‘శ్రీమతి. అనిత’ సమర్పించు అని టైటిల్ కార్డులో అతని భార్య పేరు వేసేవారు. అయితే రీసెంటుగా దిల్ రాజు నిర్మించిన ‘వి’ ట్రైలర్ లో ఆమె పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న దిల్ రాజుకు అతని కుటుంబ సభ్యులు ఇటీవల వైగా రెడ్డి అనే ఆ అమ్మాయితో మళ్ళీ వివాహం జరిపించారు. అయితే ఇప్పుడు ‘వి’ ట్రైలర్ లో దిల్ రాజు మొదటి భార్య లేకపోవడంతో అందరూ రెండో పెళ్లి తరువాత ఆయన లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని కామెంట్స్ చేసారు. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కానున్న ‘వి’ ట్రైలర్ లో మాత్రం శ్రీమతి అనిత పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే దీనికి దిల్ రాజుకు సంబంధం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ‘వి’ సినిమాని కొనుక్కున్న అమెజాన్ వారు ఈ సినిమాని సమర్పిస్తున్నట్లు వేసుకుని ఉండొచ్చు.. అందుకే ఆమె పేరు తొలగించి ఉండొచ్చు. ఇటీవల ‘గుంజన్ సక్సేనా’ సినిమాని నెట్ ఫ్లెక్స్ వారు కొన్న తర్వాత ట్రైలర్ లో ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్ పేరు మెన్షన్ చేయలేదు. ఓటీటీలు ఒక్కసారి సినిమా కొన్న తర్వాత వారి సమర్పణలోనే సినిమా రిలీజ్ అవుతుందని ఓటీటీ వర్గాలు చెప్తున్నాయి.

ఇదిలా ఉండగా లేటెస్టుగా దిల్ రాజు అక్కినేని నాగ చైతన్యతో ‘థాంక్యూ’ అనే న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. నేడు కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో ‘శ్రీమతి అనిత’ ప్రజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని ఉంది. దీనిని బట్టి చూస్తే ‘వి’ ట్రైలర్ లో ఆమె పేరు లేకపోవడానికి దిల్ రాజుకు సంబంధం లేదని అర్థం అవుతోంది.

Related Images: