ఆరంగేట్రమే భాయ్ కంట్లో పడింది.. ఆఫర్లే ఆఫర్లు!

స్వీడన్ కు చెందిన ఎల్లీ అవ్రామ్ అవార్డుల కార్యక్రమంతో బాలీవుడ్ మేకర్స్ కి బౌన్సర్ వేసింది. స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ అవార్డు ఫంక్షన్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చి తొలి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని క్లీన్ బౌల్డ్ చేసింది. ఆరంగేట్రమే భాయ్ కంట్లో పడింది. ఆ తరువాత బాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించి `మిక్కీ వైరస్`తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

ఐదారేళ్ల కెరీర్ లో ఎన్నో ఐటెమ్ నంబర్లలోనూ నర్తించి హాట్ గాళ్ గా పాపులరైంది. టీమిండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. ఇద్దరూ జోరుగా చెట్టపట్టాల్ అంటూ తిరిగేస్తూ మీడియా కంటపడ్డారు. ఆ తరువాత ఎల్లీకి షాకిచ్చిన హర్థిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడిని లైట్ తీసుకున్న ఎల్లీ కెరీర్ పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం `క్వీన్` రీమేక్ ఆధారంగా రూపొందుతున్నకన్నడ చిత్రం `బటర్ఫ్లై` హిందీలో `రూఅఫ్జా` చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా తను బాలీవుడ్ లోకి ప్రవేశించిన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది ఎల్లీ. స్టార్ టీవీ అవార్డ్స్ ఫంక్షన్ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన ఎల్లీ అవ్రామ్ ఈ వీడియోతో పాటు ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. `2013 నేను బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ఒక అవార్డుల వేడుకలో నా మొదటి ప్రత్యక్ష ప్రదర్శనకుకు సంబంధించిన త్రోబాక్ వీడియో ఇది. ఈ ఫంక్షన్ లో డ్యాన్సులు చేసే సమయానికి చాలా నెర్వస్ గా వున్నాను. చివరికి ఈ ప్రదర్శన కోసం చాలా ఎక్జైట్ అయ్యాను. అంతులేని ఆనందంతో తిరిగి నేను స్వీడన్లోని ఇంటికి తిరిగి వెళ్లాలని కలలుకన్నాను. కలలు కనండి ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేయండి.. అందుకోసం ఆత్మవిశ్వాసం కృషి చిత్తశుద్దితో ధైర్యంగా ముందడుగు వేయండి` అని ఆసక్తికరంగా స్ఫూర్తి నింపే విషయం షేర్ చేసింది ఎల్లీ అవ్రమ్.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

Related Images:

బీచ్ ఇసుకలో హాట్ సైక్లిస్ట్

సైక్లిస్ట్ కం అథ్లెట్ అనగానే శర్మా గాళ్ ఐషా శర్మ పేరు గుర్తుకు వస్తుంది. ఇంతకుముందు నేహాశర్మ సోదరి ఐషా శర్మ సైక్లింగ్ రేస్ లో పోటీపడుతున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. మరో బాలీవుడ్ హాట్ గాళ్ పరిణీతి చోప్రాకి సైక్లింగ్ అంటే అమితాసక్తి.

ఇప్పుడు అదే బాటలో మరో అందాల సుందరి సైక్లింగ్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పేసుకుంటోంది. తాజాగా హార్థిక్ మాజీ లవర్ ఎల్లీ అవ్ రామ్ బీచ్ సైక్లింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కిందిలా. సైక్లింగ్ లో హాట్ బ్యూటీ అందచందాల ఎలివేషన్ ప్రధానంగా చర్చకు తావిచ్చింది.

చేసేది ఏదైనా ఎల్లీ గ్లామరస్ యాంగిల్ ని ఎలివేట్ చేయడంలో తనకు తానే సాటి అని నిరూపిస్తోంది. ఇది మాల్దీవుల సెలబ్రేషన్ నుంచి త్రోబ్యాక్ వీడియో అని అర్థమతోంది.

ఈ భామ నటించిన `పారిస్ పారిస్` మూవీ అర్థాంతరంగా రిలీజ్ వాయిదా పడింది. ఈపాటికే రావాల్సిన ఈ మూవీ వాయిదాకు కారణమేంటో తెలియాల్సి ఉంది. కాజల్ తో కలిసి ఈ మూవీలో నటించింది ఎల్లీ అవ్ రామ్. ఆఫర్లు వస్తే మరిన్ని సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉందిట అవ్ రామ్.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

Related Images:

బికినీలో బంతాడేస్తున్న హాటీ

గత కొంతకాలంగా ఎల్లీ అవ్ రామ్ మాల్దీవుల విహారంలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవుల్లో సూర్యుడు నేను తప్ప ఇంకెవరూ లేరు! అంటూ కుర్రకారును కొంటెగా కవ్వించింది. బికినీ బీచ్ నుంచి సోలో ఫోటోషూట్లు వీడియోల్ని రివీల్ చేస్తూ అంతకంతకు హీట్ పెంచేస్తోంది.

తాజాగా ఇదే కోవలో మరో ఫోటోని ఎల్లీ అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో క్యూబాల్ ఆడుతున్న ఎల్లీ బికినీతో షేక్ చేస్తున్న విధానం బోయ్స్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

అసలు ఎల్లీ ఎవరు? అన్నది ఆరా తీస్తే ఈ అమ్మడు స్వీడన్ కి చెందిన టాప్ మోడల్ సింగర్ డ్యాన్సర్. ఎలిసాబెట్ అవ్రామిడౌ గ్రాండ్ అనేది తన అసలు పేరు. 29 జూలై 1990 లో జన్మించింది. వృత్తిపరంగా ఎల్లీ అవ్రమ్ గా మారింది. తను స్వీడిష్ గ్రీకు నటి .. ఇప్పుడు భారతదేశంలోని ముంబైలో నివశిస్తోంది. ఆమె బాలీవుడ్ చిత్రం మిక్కీ వైరస్ తో తెరకు పరిచయం అయ్యింది. ఇండియన్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న తరువాత అవ్రమ్ పేరు సినీప్రపంచంలో మరింత పాపులరైంది.

ఎల్లీ అవ్రమ్ రామ్ 29 జూలై 1990 న స్వీడన్ నగరం స్టాక్ హోమ్ లో జన్మించింది. ఆమె గ్రీకు తండ్రి.. జన్నిస్ అవ్రామిడిస్ మంచి సంగీతకారుడు. ఇప్పుడు స్వీడన్లో స్థిరపడ్డారు. ఆమె తల్లి మరియా గ్రాన్లండ్ గొప్ప నటి. అవ్ ర్రామ్ ఆరంభం ఫిగర్ స్కేటింగ్.. గానం నృత్యాలపై ఆసక్తి చూపింది. అవ్రమ్ స్వీడన్లోని స్కోన్ కౌంటీలో థియేటర్ నడుపుతున్న ఆమె తల్లి అత్త నుండి నటనలో శిక్షణ పొందారు. అవ్రమ్ తన చిన్నతనం నుంచీ భారత్తో సంబంధాన్ని కలిగి ఉంది.

స్థానిక స్టాక్హోమ్ వార్తాపత్రిక మిట్ ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఐదు సంవత్సరాల వయసులో కూడా భారతీయ నృత్యం .. రంగురంగుల బట్టలు చూసి ఆకర్షితురాలినయ్యాను అని అన్నారు. ఆమె తండ్రి గ్రీకు సంగీత విద్వాంసుడు కాబట్టి కొన్ని గ్రీకు పాటలు భారతీయతకు సంబంధించినవి అని ఆమె కనుగొంది. అవ్రమ్ తన కౌమారదశ నుండి బాలీవుడ్ నటి కావాలని కలలు కంది. ఆమె స్టాక్ హోమ్ లోని ఒక వీడియో స్టోర్ కు వెళ్లి హిందీ సినిమాల సీడీలు అమ్మేది. అక్కడ నుంచే బాలీవుడ్ సినిమా సీడీలు కొనేది. ఆమె యూట్యూబ్ లో హిందీ చిత్రాలను చూసేది. అటుపై అనుకున్నది సాధించుకుంది. హిందీ చిత్రసీమలో ఎల్లీ ఇప్పుడు పాపులర్ నటిగా రాణిస్తోంది.

Related Images: