తెలుగు సినిమా నిర్మాతల్లో అగ్రగణ్యుడు దిల్ రాజు. తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సినిమాల ఎంపిక నుంచి విడుదల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర విజయాలకు బాటలు వేస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించి తమకు అనుకూలంగా మలుచుకోవడమే ఆయన ఆయుధం. అందుకే పరిస్థితులను తనకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భారీ చిత్రాల నిర్మాణానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్రహీరోలతో ఔరా అనిపించుకుంటూ చిత్ర విజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
ఇటీవల కాలంలో పెద్ద సినిమాల విషయంలో టికెట్ల ధరలు భారీగా పెంచుకుంటూ లాభాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పైగా బెనిఫిట్ షోలకు అనుమతులు తీసుకుని సినిమా హిట్ అనిపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టికెట్ల ధరలు పెంచేందుకు కూడా ముందుకు రావడం లేదు. త్వరలో విడుదలయ్యే ఎఫ్3 కోసం రెడీ అవుతున్నా ఇలా టికెట్ల రేట్లు పెంచడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు.
ఎంత పెద్ద హీరో సినిమా అయినా టికెట్ల ధరలు పెంచడం మంచి పద్దతి కాదని తెలిసినా ఇప్పుడు అదో ట్రెండ్ గా మారింది. కానీ గతంలో టికెట్ల ధరలు పెంచే సంస్కృతి ఉండేది కాదు. ఎంత పెద్ద సినిమా అయినా కనీసం కలెక్షన్లు తెచ్చేది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచడం వద్దని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే ఎఫ్ 3 కి టికెట్ల ధరలు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టికెట్ల పెంపుతో ప్రేక్షకులపై భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. వేసవి కాలంలో సినిమా పెద్ద హిట్ కొట్టాలనే ఆశయంతో దిల్ రాజు బెనిఫిట్ షోలు కూడా వేయడం లేదు. వీటితో సినిమా హిట్టా? ఫట్టా? అనేది తొందరగా తెలియడంతో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపుతోంది. అందుకే బెనిఫిట్ షోలకు కూడా నో చెబుతున్నారు. ఇండియాలో అమెరికాలో కూడా ప్రీమియర్ షోలు ఉండటం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుకే దిల్ రాజు అగ్ర నిర్మాతగా ఎదుగుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెనిఫిట్ షోలతో నెగెటివ్ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత్, విదేశాల్లో సైతం ఒకే సమయానికి షోలు వేసేలా చర్యలు తీసుకున్నారు. గతంలో అగ్రనిర్మాతగా ఉన్న రామానాయుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు దిల్ రాజు అదే కోవలో నడుస్తూ అగ్ర నిర్మాతగా మారినట్లు చెబుతున్నారు.
Senior actor-comedian, who is a part of the upcoming comedy entertainer F3, had served delicious Mutton biryani to the cast members and crew, he bought from his home. The picture of the Biryani bowl with cast members is going rounds on social media.
Pataas director Anil Ravipudi, who is directing F3 shared a picture of Biryani bowl along with actors like Ali, Satya, senior character artist Sita, and others. The post is going viral on social media.
“Biryani. Ali Garu served us biryani, he got it prepared at his house,” Anil Ravipudi’s post reads. The post was made in Telugu. A picture of the actors posing for a selfie was attached to the post.
Team F3 resumed it’s shooting earlier on July 2. F3 is the sequel of hit F2. Victory Venkatesh, Mega Prince Varun Tej, Milky beauty Tamannah Bhatia and Mehreen Kaur Pirzada are playing the lead roles in F3.
The upcoming film bankrolled by Dil Raju under his Sri Venkateswara Creations also has Sunil, Anasuya Bharadwaj, and others in key roles.
Director Anil Ravipudi has struck gold last year with ‘F2’. The family entertainer featuring Venkatesh, Varun Tej, Tamanna and Mehreen impressed everyone with its hilarious scenes. Apart from the comedy, both the beauties indulged in a lot of skin show for this film. The glamour feast was garnered well by the masses. Now that Anil Ravipudi is all set to start filming for ‘F3’, Dil Raju has reportedly upped the budget. Venkatesh, Varun Tej, Tamanna and Mehreen are once again roped into the film and sources say that another two heroines will be added to this film.
This indicates that there will two heroines for each hero and there are rumors that a star heroine will be brought onboard for a special song. It looks like the director and producer are stopping at no ends to satisfy the audience once again. With too much of glamour dose, it is to be seen if the families embrace the film in the same way or not.
Young and talented Telugu director Anil Ravipudi is one of the successful directors. Comedy is the key aspect of his films. He has been following the same since his debut Pataas, starring Nandamuri Kalyan Ram. The comedy scenes in his last venture Sarileru Neekevvaru starring Superstar Mahesh Babu received a terrific response from the fans and the audience as well.
Now the director is gearing up for his next venture F3, the sequel to F2. Anil Ravipudi has locked the script and recently went to the Simhachalam temple to perform Pooja for the script.
F3 is expected to start rolling in December this year. It is believed that, while F2 is high on comedy, Anil Ravipudi is going to explore the family emotions in the sequel, F3. As per the grapevine, Anil Ravipudi has given equal importance to fun and sentiment in F3. The film will also be high on sentiment and family relations.
The same cast in F2, Venkatesh, Varun Tej, Tamannah Bhatia, Mehreen Pirzada, and Rajendra Prasad will be playing their roles in the sequel too. Dil Raju will bankroll the project under his Sri Venkateswara Creations.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే బాక్సాఫీస్ నిండుకుండలా కళకళలాడుతుంది. కడుపుబ్బా నవ్విస్తూనే సెంటిమెంట్ డ్రామా యాక్షన్ వగైరా వగైరా ఎంటర్ టైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమాకి బంపర్ కలెక్షన్స్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పక్కా కామెడీ ఎంటర్ టైనర్లతో అగ్రదర్శకుల జాబితాలో చేరారు అనీల్ రావిపూడి.
జంధ్యాల-ఈవీవీ తర్వాత మళ్లీ అంతటివాడేనన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. తెరకెక్కించిన తొలి సినిమా పటాస్ తోనే రావిపూడి సత్తా చాటారు. ఆ తర్వాతా అపజయమెరుగని దర్శకుడిగా వరుసగా విజయాలు అందుకుంటూనే రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. పటాస్ నుండి తన చివరి చిత్రం సరిలేరు నీకేవ్వరు వరకు కామెడీపై గ్రిప్ చెడకుండా తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కడుపుబ్బా నవ్వించడం వల్లనే అంత పెద్ద సక్సెసైంది. ఈ మూవీలో వరుణ్ వెంకీ కాంబో హాస్యానికి చాలా సానుకూల స్పందనలు వచ్చాయి.
ప్రస్తుతం ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నారు రావిపూడి. సీక్వెల్ కాని కథతో ఈ నెలలో సెట్స్ కెళ్లనున్నారు. అతని అన్ని సినిమాల మాదిరిగా కాకుండా అనిల్ రవిపుడి ఇప్పుడు సినిమా ఆద్యంతం కుటుంబ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. F2 అంటే ఫన్ .. నిరాశ. ఈసారి మరో ఎఫ్ జోడించారు కాబట్టి అది `కుటుంబం`(ఫ్యామిలీ) అని తెలిసింది.
నిజానికి ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 తరహా అని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని తెలుస్తోంది. ఈసారి పక్కాగా అనీల్ దీనికి కొన్ని కుటుంబ భావోద్వేగాలను జోడించి స్క్రిప్ట్ రాశారు. చాలా సెంటిమెంట్ ఎలివేట్ చూస్తూనే మానవ సంబంధాల కోణం ఉంటుందని తెలుస్తోంది. సరదాగా నవ్విస్తూనే ఉద్వేగాలతో రగిలిస్తాడట. సరదాకి సెంటిమెంట్ కి మధ్య సమతుల్యతను సాధించాలనుకున్నారట.
వెంకీ -వరుణ్ జోడీతో పాటు చేరే మరొకరు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. తమన్నా భాటియా.. మెహ్రీన్ కౌర్ లతో పాటు మరో నాయిక యాడవుతుందా లేదా చూడాలి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ ఎఫ్ 2 సీక్వెల్ చేసేందుకు ఆసక్తిగా లేరా? వెంకీతో సమానంగా తన పాత్ర పరిధి విస్తరించలేదని అలిగారా? పారితోషికం పరంగా నిర్మాతలతో డీల్ కుదరలేదా? అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందా? గత కొద్ది రోజులుగా ఎఫ్ 2 సీక్వెల్ (ఎఫ్ 3) పై నెలకొన్న సందిగ్ధత సందేహాలు ఇవి. ఇటీవల ఈ ప్రాజెక్టుపై జరుగుతున్న ఈ ప్రచారఆనికి తాజాగా చెక్ పడిపోయింది. వరుణ్ తేజ్ ఆసక్తి చూపకపోవడంతో ఎఫ్- 3 లో భారీ మార్పులు జరుగుతున్నాయని పుకార్లు వచ్చినా అవేవీ నిజాలు కావని తెలిసింది.
ఇదంతా అసత్య ప్రచారం. ఈ సీక్వెల్ కోసం వెంకటేష్ -వరుణ్ తేజ్ ఇద్దరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎఫ్ 2 కి కొనసాగింపు కథతో కాకుండా ఈ మూవీని మరో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించనున్నారు. పురుషుల జీవితంలో మహిళల వల్ల కల్లోలం అన్న థీమ్ ని ఎంచుకున్నా.. ఈసారి మూడో హీరోని యాడ్ చేసి మరోసారి ఆద్యంతం కామెడీ థ్రిల్ కలిగే స్క్రిప్టును రెడీ చేశారట. ఇంతకుముందు ఎఫ్ 3 కోసం కొత్త ఆలోచన తో ముందుకు వెళుతున్నానని రావిపూడి చెప్పారు.
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీ లో కంటిన్యూ అవుతుందిట. సాధ్యమైనంత తొందర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2021లో మూవీ రిలీజవుతుంది.
కొన్ని కాంబినేషన్లు అదరగొట్టేస్తాయి. మామూలు సినిమానే అయినా మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తాయి. ఆ కోవకు చెందిందే ఎఫ్ 2. చిత్రమైన పేరును టైటిల్ గా ఫిక్స్ చేసి.. అంచనాలకు మించిన ఫలితాన్ని సాధించిన ఈ చిత్రం బాక్స్ ఫీసు దగ్గర ఎంతలా సందడి చేసిందో తెలిసిందే. తెలుగులో మల్టీస్టారర్ ఫిలింలు తక్కువన్న అపవాదుకు చెక్ చెబుతూ.. ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు మక్కువ చూపుతారు వెంకటేశ్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2లో వెంకీ.. వరుణ్ తేజ్ ల కాంబినేషన్ అదిరిపోవటమే కాదు.. చక్కటి విజయాన్ని ఇచ్చింది. తాజాగా ఇదే కాంబినేషన్ లో ఎఫ్2కు సీక్వెల్ మీద చాలానే చర్చ జరిగింది.తాజాగా స్క్రిప్టు వర్కు పూర్తి కావటమే కాదు.. ఫైనల్ గా సెట్ల మీదకు వెళ్లేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఎఫ్ 2 మేజిక్ ను మరోసారి రిపీట్ చేసేందుకు అనిల్ రావిపూడి బాగానే కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.
ఫైనల్ స్క్రిప్టుకు వెంకీ.. వరుణ్ తేజ్ లు ఓకే చెప్పారు. డిసెంబరు 14న ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. మొదటి షెడ్యూల్ లోఈ ఇరువురు అగ్ర నటులు పాల్గొంటారని చెబుతన్నారు. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే మేలో థియేటర్లలో సందడి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకుఅవసరమైన డేట్లను వెంకీ.. వరుణ్ తేజ్ లు ఇప్పటికే సర్దుబాటు చేసేసిన నేపథ్యంలో వేగంగా సినిమా షూట్ ను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్2 లతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. తన ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్. ఇటీవలే మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. గతేడాది విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు.
ప్రస్తుతం కరోనా మూలంగా ఇంటి దగ్గరే ఉండి తన రైటింగ్ టీమ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అయితే తను ప్రస్తుతం అనిల్ రెడీ చేసిన స్క్రిప్ట్ ‘ఎఫ్3’ మూవీదేనట. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ సినిమాకు సీక్వెల్ తీసినా సరిగ్గా ఆడవు అనేది ఆనవాయితీగా నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ‘ఎఫ్3’ మీద కూడా సినీ ఇండస్ట్రీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎఫ్3 హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏ సినిమా షూటింగ్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నారప్ప కూడా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే కంప్లీట్ అవుతుందని అన్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ కూడా కరోనా తగ్గేవరకూ షూటింగ్ చేయకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ఓ వైపు ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే!