‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ముంబైలో అడుగుపెడుతున్నా.. దమ్ముంటే అడ్డుకోండి’ అంటూ శివసేన కార్యకర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలోని కంగనా మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన కంగనా.. ‘మహారాష్ట్ర గౌరవం కోసం తాను రక్తం ధారపోయడానికి […]
