మర్డర్ వారి కథ కాదు యూనివర్శిల్ స్టోరీ: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ఇలా అన్నింటిపై రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను చేశాడు. ఈ సినిమా ను ఆపేయాలంటూ అమృత కోర్టుకు కూడా వెళ్లింది. కాని కోర్టుకు వెళ్లిన వర్మ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఈ వారం సినిమాను విడుదల చేసేందుకు సెన్సార్ కార్యక్రమాలు కూడా వర్మ పూర్తి చేయించాడు.

రేపు అంటే 22వ తారీకున మిర్యాలగూడెంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. దాంతో పాటు ఈ సినిమా తీయడంకు కారణం ఏంటీ అనే విషయాన్ని వెళ్లడించాడు. మారుతి రావు.. అమృత ప్రణయ్ ల గురించి చాలా మందికి చాలా రకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు నెగటివ్ థాట్స్ లో కూడా ఉన్నారు. మొదట నేను కూడా నెగటివ్ గా ఆలోచించాను. కాని కాస్త డెప్త్ గా స్టడీ చేసిన సమయంలో తండ్రీ కూతురు మద్య ఉండే రిలేషన్ పై నాకు ఒక అభిప్రాయం వచ్చింది. దానికి సంబంధించిన కథ మాత్రమే.

ఇది యూనివర్శిల్ సబ్జెక్ట్. ఒక్కరికి సంబంధించింది అస్సలు కాదు అంటూ సినిమాపై అందరిలో ఆసక్తిని కలిగించేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు. కుటుంబ గౌరవంను పోగొట్టవద్దనే చిన్న చిన్న గొడవలు మానవ సహజం. అవి హద్దు దాటితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. మిర్యాలగూడెంలో ఎందుకు ప్రెస్ మీట్ అనే విషయాన్ని నేను అక్కడే చెప్తాను అంటూ వర్మ పేర్కొన్నాడు. రేపు మిర్యాలగూడెంలో వర్మ పెట్టబోతున్న ప్రెస్ మీట్ అందరికి ఆసక్తికరంగా ఉంది.

Related Images: