సినిమా స్టార్స్ తో పోల్చితే బుల్లి తెర స్టార్స్ క్రేజ్ విషయంలో అందాల ప్రదర్శణ విషయంలో కాస్త వెనుక ఉంటారు అనేది గతంలో మాట. కాని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హాట్ బ్యూటీలుగా బుల్లి తెర స్టార్స్ కూడా పేరు తెచ్చకుంటున్నారు. ఎంతో మంది బుల్లి తెర ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శణ విషయంలో బాలీవుడ్ హాలీవుడ్ ముద్దుగుమ్మలను సైతం దాటేస్తున్నారు. తాజాగా టీవీ స్టార్ నికిత శర్మ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈమె క్లీ వేజ్ షో కు నెటిజన్స్ మతి పోతుంది.
మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ బుల్లి తెర స్టార్ ఈమద్య కాలంలో అందాల ప్రదర్శనలో రెచ్చి పోతుంది. బోల్డ్ గా కెమెరాకు ఫోజ్ ఇవ్వడంతో పాటు ఆమె నటన విషయంలో కూడా చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. మొత్తానికి బుల్లి తెర స్టార్ అయినా వెండి తెర ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసుపోను అంటూ వారికి పోటీగా నిలుస్తుంది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే వెండి తెరపై కూడా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ కు పోటీగా ఏదో ఒక రోజు వస్తుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నిఖిత శర్మ .. మేధో వర్గానికి చెందిన టాప్ మోడల్ కం నటి. మోడలింగ్ సహా వాణిజ్య ప్రకటనల్లో ఈ అమ్మడు పాపులర్. అంతకుమించి బాలీవుడ్ లో రాణించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోందిట. ఇక ఈ భామ బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్రెస్టింగ్. యంగ్ ఉమన్ అఛీవర్స్ అవార్డు 2016.. ఎక్స్సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డులను గెలుచుకున్న నిఖిత శర్మ.. మైక్రో బయాలజీ స్టడీ చేసి బయోలజిస్టుగా పనిచేసిందిట.
అలాగే అందాల పోటీల్లోనూ తళుక్కున మెరిసిన నిఖిత మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్ గెలుచుకుంది. ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీలో పాల్గొంది. కోకాకోలా- ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం- జియోవాని- టివిఎస్ స్కూటీ – లేస్ వంటి బ్రాండ్ల కోసం వ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. షాజీత్ బాల్ `తేరి యాడ్` అనే మ్యూజిక్ ఆల్బమ్ లో శర్మ కనిపించింది. టీవీ కెరీర్ ను ఛానల్ Vలో V ది సీరియల్ తో ప్రారంభించింది. దీనిలో ఆమె కరణ్ కుంద్రా సరసన నటించింది. వెంటనే.. లైఫ్ ఓకె యొక్క దో దిల్ ఏక్ జాన్ లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. అయాజ్ అహ్మద్ పోషించిన ముంబై గ్యాంగ్ స్టర్ రఘుతో ప్రేమలో పడే అంటారా అనే కాశ్మీరీ అమ్మాయి పాత్రలో ఆమె నటించింది.
అందానికి అందం ట్యాలెంటు ఈ అమ్మడి ప్రత్యేకత కావడంతో సామాజిక మాధ్యమాల్లోనూ నిఖితకు అద్భుత ఫాలోయింగ్ ఉంది. ఇక వేడెక్కించే అందాలతో హీట్ పెంచడం ఈ భామకు కొత్తేమీ కాదు. తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఇదిగో ఇలా చొక్కా బొత్తాలు విప్పేస్తూ టై కూడా తీసేస్తోంది. ఇక రెడ్ ఇన్ వోర్ తో కుర్రకారును పరేషాన్ చేస్తోంది. ఇంతకుముందు మాల్దీవుల ట్రిప్ లో ఇంతకుమించి చెలరేగింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఇటు టాలీవుడ్ లోనూ నిఖిత లాంటి భామలకు ఆఫర్లు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.