Mega Prince Varun Tej has finally entered wedlock with actress Lavanya Tripathi today in a grand and royal ceremony. It’s a destination wedding at Borgo San Felice in Tuscany, Italy which was attended by family and close friends. The couple got married according to Hindu customs.
Varun Tej and Lavanya Tripathi wore Manish Malhotra outfits for their wedding. While Lavanya draped in a ruby-red Kanchipuram saree, while Varun wore a cream-gold sherwani. Lavanya’s saree with a personalized veil has VarunLav embroidered on it. Ashwin Mawle and Hassan Khan styled the couple.
Chiranjeevi, Ram Charan, Allu Arjun, Pawan Kalyan, Sai Tej, Vaishnav Tej, and the other mega family members were present at the wedding.
The reception that will be held late night today is going to be a glam and glitzy affair.
Actor-turned-politician, Jana Sena founder Power Star Pawan Kalyan is all set to make his come back into Tollywood after nearly seven years with the official remake of Pink, Vakeel Saab.
After this, he has announced a bunch of films, and several pothers filmmakers like Anil Ravppudi and others are waiting for their turn to direct the Power Star, who enjoys God-like status among the fans.
Now it is said that Sensational director VV Vinayak who has a close relation with Megastar Chiranjeevi got an opportunity to work with Power Star, the offer he has been waiting for a long time.
According to the film circles, Vinayak grabbed the opportunity to not direct PK, but to share a screen place with him. Vinayak got the chase in the Tollywood remake of Malayalam hit Ayyappanum Koshiyum.
Director Sagar K Chandra of Appatlo Okadundevadu fame will direct Pawan Kalyan-Rana Daggubati starrer, while Mantala Mantrikudu Tvikiram Srinivas will Penn the script for th venture. With Vinayak reportedly joining the sets, the flick will be more interesting.
Dusky beauty Nidhhi Agerwal got her first big hit with ‘Ismart Shankar’ but she is still waiting for a blockbuster that will take her into the star league. She paired up with the likes of Naga Chaitanya, Akhil and Ram but she needs a chance with big stars to prolong her career.
She even made her debut in Kollywood too and acted with heroes like STR and Jayam Ravi. Sources say that Nidhhi is all set to get her big break and it is going to be a Pawan Kalyan film. The glamorous lady herself confirmed it as per trusted sources. Despite not making it official, the Nidhhi tells IANS, ‘Yes, I am doing a film with Pawan Kalyan and it feels like a dream come true to be a part of this particular project. This is my ninth film, so I am looking at this as my golden film.’
She said that it is an amazing experience to work with him and claims that he is the best. Apart from Pawan’s film, she is working on two films and says, ‘I am shooting between Chennai and Hyderabad. There is a Tamil film being directed by Magizh Thirumeni that I am shooting for in Chennai, and another film that I am shooting in Hyderabad, which will be over in the next couple of days.’
టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒకే పంథాలో ముందుకు సాగుతూ వస్తున్నారు. మొదట్లో ఇద్దరు కూడా సినిమా ఫంక్షన్లకి దూరంగా ఉంటూ.. వారి పనులు వాళ్ళు చూసుకుంటూ రిజర్వుడ్ గా ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరూ తమ పంధా మార్చుకున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి కానీ పవన్ – మహేష్ మాత్రం ఒకరిపట్ల ఒకరు ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. గతంలో మహేష్ నటించిన ‘అర్జున్’ సినిమా పైరసీకి సంభందించి పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి సపోర్ట్ గా నిలిచాడు. అలానే తర్వాత పవన్ నటించిన ‘జల్సా’ కి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి అనుబంధాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో వీరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ప్రతీ సినీ అభిమాని కోరుకుంటాడు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు ఊపందుకున్నాయి. చిన్న హీరోలే కాకుండా స్టార్ హీరోలు సైతం కలిసి నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య రూపొందించిన మల్టీస్టారర్స్ లో చాలా వరకు సూపర్ హిట్ అయినవే. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ – పవన్ క్రేజీ కాంబినేషన్ సెట్ అవబోతోందని న్యూస్ వస్తోంది. మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ లో పవన్ కళ్యాణ్ కూడా కనిపించనున్నాడట. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న వారిని టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన పాత్రలో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. నిడివి తక్కువ అయినప్పటికీ కథలో కీలకమైన రోల్ లో పవన్ అయితేనే బాగుంటుందని డైరెక్టర్ పరాశురామ్ భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతనేది తెలియనప్పటికీ ఈ రూమర్ నిజమైతే మాత్రం అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం అంటే అంత సులువేమీ కాదు. దానికోసం ప్రత్యేకించి ప్రిపరేషన్ కావాలి. పాత్ర పరంగా వైవిధ్యం చూపించేందుకు గెటప్ మార్చాలి. నటన పరంగా వేరియేషన్ కూడా చూపించాలి. భాష.. యాస.. రూపం ప్రతిదీ మారాలి. ఈ తరహా పాత్రల్లోకి పరకాయం చేయడంలో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతే ఎవరైనా అని ప్రూవ్ చేశారు. వెటరన్ హీరోల్లో ఎక్కువమంది ద్విపాత్రల్ని ప్రయత్నించి మెప్పించిన వారు ఉన్నారు.
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అన్నయ్య చిరంజీవిలా ద్విపాత్రాభినయం చేసింది లేదు. తీన్ మార్ లో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని సపరేట్ గా డిజైన్ చేశారు జయంత్ సి ఫరాన్జీ. కానీ పూర్తి స్థాయిలో ద్విపాత్రలు చేసింది లేదు.
ప్రస్తుతం కంబ్యాక్ లో పింక్ రీమేక్ `వకీల్ సాబ్` లో నటిస్తున్న పవన్ తదుపరి క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. క్రిష్ మూవీలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నా ఇందులో ద్విపాత్రాభినయం చేయడం లేదు.
ఇప్పుడు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కి అరుదైన ఛాన్స్ దక్కింది. ఇప్పుడు పవన్ ని ద్విపాత్రల్లో చూపించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. పవన్ ఈ మూవీలో తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తారట పవన్. ఇక హరీష్ శంకర్ మాస్ రోల్స్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది… పాత్రల నడుమ వేరియేషన్ ని అద్భుతంగా డిజైన్ చేయగల సమర్ధుడిగా గుర్తింపు ఉంది. ఇంతకుముందు వరుణ్ తేజ్ ని గద్దల కొండ గణేష్ పాత్రలో పూర్తి మాస్ హీరోగా ఆవిష్కరించిన తీరు కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత డబుల్ ట్రీటిచ్చేందుకు పవన్ – హరీష్ జోడీ రెడీ అవుతుండడం ఆసక్తిని రేపుతోంది.
ఢిల్లీకి వెళ్లిన మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి మీడియాతో కీలక విషయాలు చెప్పుకొచ్చారు. బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంట సేపు పవన్ కళ్యాణ్నాదెండ్ల మనోహర్ తో చర్చించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే నిలబెట్టాలని పవన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం సాగింది. జీహెచ్ఎంసీలో బీజేపీకి సపోర్టు చేసినందుకు తిరుపతి టికెట్ జనసేనకే ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నడ్డాతో భేటి అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడారు.
తిరుపతి ఉప ఎన్నిక గురించే మాట్లాడామని.. ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు పవన్ తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా అభ్యర్థిని పెడుదామని నడ్డా చెప్పారని.. సదురు కమిటీ రిపోర్టుల తర్వాత తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉండాలా? బీజేపీ అభ్యర్థి ఉండాలా అనే దానిపై ఖరారవుతుందని పవన్ తెలిపారు. ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తేలిపోతుందని పవన్ స్పష్టం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికతోపాటు అమరావతి తరలింపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంశాలపై నడ్డాతో చర్చించినట్టు పవన్ తెలిపారు. ఏపీలో బీజేపీ-జనసేనలు కలిసి ముందుకెళ్లాలన్న దానిపై మాట్లాడుకున్నామన్నారు. జగన్ సర్కార్ అవినీతి అక్రమాలు.. దేవాలయాలపై దాడులు.. శాంతి భద్రతల వైఫల్యం తదితర అంశాలపై నడ్డాతో చర్చించినట్టు పవన్ తెలిపారు.
ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నది జనసేన నిర్ణయం అని.. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఢిల్లీకి రాలేదని జనసేన మరో నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Powerstar Pawan Kalyan is making his acting comeback with “Vakeel Saab” after two years of break. Apart from Vakeel Saab, Pawan Kalyan has joined hands with director Krish for a period film and is said to be one of the much-hyped projects in Tollywood now. This will be the first time that Pawan will be playing a periodical role.
As per the reports, the film will have a 15th century Mughal India backdrop and is centred around Kohinoor diamond’s robbery. The 49-year-old is likely to essay the role of a thief in the film.
The latest we hear is happening young beauty Nidhhi Agerwal has been roped as the female lead of the film. Earlier, there were speculations that Bollywood actress Jacqueline Fernandez will be teamed up with Pawan Kalyan in this period magnum opus. An official confirmation regarding the news is expected to be out soon.
Meanwhile, Nidhi Agerwal is making her Tamil debut with Bhoomi. She will also be seen in Eeswaran. Nidhi is also roped for yet another untitled Telugu film under Sriram Aditya direction.
ఓవర్ నైట్ ఫేట్ మారిపోవడం అంటే ఏంటో శ్రుతిహాసన్ కు తెలుసు. ఈ అమ్మడు వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా పాపులరైన క్రమంలోనే సడెన్ గా గబ్బర్ సింగ్ ఆఫర్ అందుకుంది. ఆ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే అమ్మాయిగా శ్రుతి టోన్ డౌన్ నటనకు పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ ఒక్క బ్లాక్ బస్టర్ తో తన ఫేట్ కూడా మారిపోయింది.
ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆఫర్ నే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందుకోబోతోందా? అంటే.. పాత్ర తీరుతెన్నులు .. ఎంచుకున్న స్టోరీ నేపథ్యం వేరే కానీ అంతే ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం అందుకోనుందని ప్రచారమవుతోంది. అందునా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిధికి ఆఫర్ అంటేనే ఎగిరి గంతేయాల్సిన సన్నివేశం ఉంది.
ఇటీవల ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా నిధికి సరైన ఆఫర్ లేదు. డెబ్యూ హీరో సరసన ఛాన్స్ దక్కినా ఆ మూవీ ఉందో లేదో కూడా తెలీని పరిస్థితి. ఇలాంటి సన్నివేశంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27 వ చిత్రంలో నిధి ఆఫర్ దక్కించుకుందన్న ప్రచారం హీటెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమైనా..కథానాయిక ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇన్నాళ్లు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ తో జతకడుతుందని ఊహాగానాలు సాగాయి. కానీ ఇప్పుడు పేరు మారింది. నిధి టీమ్ లో చేరనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుతో నిధి కెరీర్ తదుపరి స్థాయికి చేరుతుందన్న అంచనా పెరిగింది. అయితే దీనిపై దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంటుంది. క్రిష్ ఇప్పటికే ఉప్పెన్ హీరో వైష్ణవ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి పవన్ తో మూవీ షెడ్యూల్ పై పని చేస్తున్నారు.
కొన్నిటికి అర్థాలు వేరుగా ఉంటాయి. అలా మర్మంగా మాట్లాడడం కొందరికే తెలిసిన కళ. ఇందులో స్టార్ డైరెక్టర్ క్రిష్ నిష్ణాతుడు. అతడు ఎంచుకునే కాన్సెప్టుల్లోనే సంథింగ్ ఉంటుంది. మాట తీరులోనూ అంతే మార్మికత ఉంటుంది.
ఇప్పుడు అలానే పవర్ స్టార్ అభిమానులను ఊరించారు. తన ఇన్ స్టా స్టోరీలో “ఈ శనివారం” అంటూ క్యాప్షన్ ఇవ్వడం పవన్ అభిమానుల్లో చర్చకు వచ్చింది. అయితే అంతకు మించి ఇంకేదైనా క్లూ ఇచ్చారా అంటే ఏమీ లేదు.
దీంతో పవన్ అభిమానులు ఎవరికి వారు రకరకాల ఊహాగానాల్లో తేలుతున్నారు. బహుశా అది పవన్ తో సినిమా షెడ్యూల్ మ్యాటర్ చెబుతారనే అంతా భావిస్తున్నారు. ఇంతకీ క్రిష్ ఏం చెబుతారో ఏమో కానీ పవన్ తో సినిమా ఎప్పటికి పూర్తి చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న ఉత్కంఠ మాత్రం అభిమానుల్లో అలానే ఉంది. పవన్ పుట్టినరోజున ఇచ్చిన గ్లింప్స్ తర్వాత ఇంకే అప్ డేట్ లేదు. అలాగే సినిమాని ప్రారంభించాక సముద్రం నేపథ్యంలో కొన్ని సీన్లు తీసారు అన్నారే కానీ వాటిపైనా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఈ శనివారం ఇంతకీ క్రిష్ ఏ గుట్టు విప్పుతారో ఏమిటో? అన్నదే అసలు సిసలు ఉత్కంఠకు కారణమవుతోంది. క్రిష్ మరోవైపు వైష్ణవ్ తేజ్ తాజా చిత్రానికి సంబందించిన అప్ డేట్ చెప్పాల్సి ఉంది.
Pawan Kalyan and Krish started a period drama set in the Independence era. The film was planned on a huge budget and right from the moment go, the film is facing a lot of hurdles and getting postponed. After the clash of Pawan’s dates with ‘Vakeel Saab’ team, Krish was forced to take a long break due to lockdown.
Pawan restarted shooting of ‘Vakeel Saab’ and after that he gave his dates to ‘Aiyyappanum Koshiyim’ remake. Krish repeatedly asked for ten days of Pawan’s time as he wants to finish the portions for which a huge set was erected in the Aluminium Factory. After a lot of meetings, Pawan allotted his dates in the first week of December to ‘Vakeel Saab’ and the last week’s dates to Krish’s film.
But there is a big problem in that. Niharika Konidela’s marriage is in December and Pawan will be attending his brother’s daughter’s marriage. This will affect ‘Vakeel Saab’ plans and if it happens, Krish’s film will also be affected. We need to wait and see how Pawan manages to satisfies all three parties here.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి వెళుతున్నారు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌లోనే వుండిపోయిన జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మంగళగిరిలో వున్న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలతోపాటుగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొన్ని రోజులపాటు జనసేన అధినేత అమరావతిలోనే వుంటారని తెలుస్తోంది.
పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విషయం విదితమే. ఈ కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైందని పార్టీ వర్గాలు అంటున్నారు. కాగా, మూడు రాజధానులు సహా, రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, పోలవరం ప్రాజెక్టు విషయమై చెలరేగుతున్న గందరగోళం నేపథ్యంలో జనసేన – బీజేపీ నేతల సమావేశం కూడా విజయవాడలో జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ – వైసీపీ ఆడుతున్న ‘పొలిటికల్ గేమ్’ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత కోసం డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇదిలా వుంటే, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని 41 మీటర్లకే పరిమితం చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి లీకులు అందుతుండడం, వైసీపీ అనుకూల మీడియాలోనూ అందుకు అనుగుణంగా కథనాలు వస్తుండడం, వీటిపై తెలుగుదేశం పార్టీ ‘డ్రమెటిక్ ఆందోళన’ వ్యక్తం చేయడం, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాజకీయం.. వీటన్నిటి పట్లా ఇటు బీజేపీ, అటు జనసేన అప్రమత్తమయ్యాయి.
ఇంతలోనే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గబోదనీ, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చి, ప్రాజెక్టు ఎత్తుని చంద్రబాబు కొలుచుకోవచ్చంటూ ఎద్దేవా చేయడం గమనార్హం. చంద్రబాబుపై విమర్శల సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రాజెక్టు ఎత్తుకి సంబందించి 41 మీటర్ల చుట్టూనే అధికారులకు దిశా నిర్దేశం చేయడమేంటి.? అసెంబ్లీలో వైఎస్ జగన్ చెప్పినట్లు ‘ఆ పత్రికలో తప్పు రాశారు అధ్యక్షా’ అనుకోవాలా.? ఏమో, అన్ని లెక్కలపైనా జనసేన అధినేత అమరావతి టూర్‌లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.
‘జాతీయ ప్రాజెక్టుపై.. రాష్ట్రంలోని అధికార పార్టీ పెత్తనమేంటి.?’ అన్న బీజేపీ వాదన.. అదే సమయంలో, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలన్న జనసేన ఆలోచన.. వీటన్నిటికీ జనసేనాని అమరావతి పర్యటనలో స్పష్టత రావొచ్చు.
చిరంజీవి కరోనా బారిన పడటంతో మెగా ఫ్యామిలీ ఆందోళనలో ఉంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో త్వరగానే చిరు కోలుకుంటారని అంతా ఆశిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్య విషయమై అభిమానులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆరోగ్యం విషయమై ప్రెస్ నోట్ విడుదల చేశారు. అన్నయ్య చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలంటూ కోరుకుంటున్నాను అంటూ పవన్ పేర్కొన్నాడు.
పవన్ ప్రెస్ నోట్ లో.. అన్నయ్య చిరంజీవి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతతో పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా కూడా విస్తుపోయాం.
ఎలాంటి లక్షణాలు లేవు.. పరీక్షలో మాత్రం పాజిటివ్ అని వచ్చింది. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అన్నారు. సెకండ్ వెవ్ అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ సూచించారు.
పవన్ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా పవన్ గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ నడుస్తుంది. సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అంటూ అభిమానులు చెబుతూ ఉంటారు. దాంతో గతంలో ఒక సారి పవన్ యాంటీ ఫ్యాన్స్ ఆయన చెప్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా లేదంటే ఫామ్ హౌస్ లో ఉన్నా ఆయన వేసుకునే చెప్పుల ఖరీదు వేలల్లో ఉంటుంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. సింప్లిసిటీగా ఉండే వ్యక్తి అంతటి ఖరీదైన చెప్పులు ధరిస్తాడా అంటూ కొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన రోలెక్స్ వాచ్ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది.
పవన్ రోలెక్స్ వాచ్ ధరించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ షూటింగ్ గ్యాప్ లో ఏదో పేపర్లపై రాస్తూ చదువుతూ ఉన్న పవన్ కళ్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్ ఉంది. ఆ ఫొటోలను షేర్ చేసి సింప్లిసిటీ అంటూ ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ రూ.40 లక్షల విలువైన వాచ్ ను ఎలా ఉపయోగిస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కొందరు స్పందిస్తూ ఆయన వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నాడు. కనుక రోలెక్స్ వాచ్ కూడా పాత్ర కోసమే ధరించి ఉంటాడు. అంతుకు మించి ఉండదని పవన్ ఎప్పుడు కూడా రోలెక్స్ వాచ్ ధరించాలనే ఆసక్తిని కనబర్చడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. మొత్తాని పవన్ పెట్టుకుని ఉన్న రోలెక్స్ వాచ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.
Actor-turned-politician Pawan Kalyan enjoys a huge craze among the youth audience and his fans often try to follow his looks and style he shows on screen. However, Pawan’s off-screen looks appear quite in contrast to the onscreen looks.
Pawan Kalyan doesn’t pay much attention to his off-screen looks. Powerstar who sports a long beard usually, surprised everyone with his new slim and trim look.
Powerstar’s new pic with his dear friend and Art Director Anand Sai went viral on social media. In the viral pics, the star can be seen with a trimmed beard and short hair.
On the work front, Pawan Kalyan is currently shooting for his comeback film Vakeel Saab, an official remake of Bollywood Superstar Amitabh Bacchan starrer Pink. Dil Raju and Boney Kapoor are producing the flick.
Other than this, Powerstar has other films in Pipeline. For his 27th film, he has joined hands with Krissh for a periodical drama. Harish Shanker, who gave Pawan Kalyan a memorable hit Gabbar Singh will direct PSPK28.
The Powerstar Pawan Kalyan who is currently in the filming of two films at a time is taking a crisis break from the shoot.
‘Virupaksha’ is the rumoured title of Krish-Pawan first collaboration and is produced by ace producer AM Ratnam who has given many youthful entertainers to both Tamil and Telugu audience.
Latest news is that the makers are said to have figured out the leading lady for this film and it is none other than Pranitha Subhash. She is going to be the love interest of Pawan Kalyan and the film will be having good episodes between them!
On the other side movie makers are also figuring out two new titles for the film namely ‘Bandhipotu’ and ‘Gaja Donga’. These titles are already the hit films of senior NTR and makers are of hope that this film also could be a hit like the old films.
It is evident that the plans of Pawan and Krish were big earlier and the plotline of their film is also said to be a universal subject and has more scope for a pan India film but makers are thinking to cut off the making costs as much as possible!
Tollywood production house Sitara Entertainments has bought the remake rights of ‘Ayyappanum Koshiyum’, the Malayalam blockbuster of this year.
Latest sources suggest that power star Pawan Kalyan was impressed with the film and felt that it’s a safe project for him. He is said to have discussed the same with Trivikram but the latter was not interested in directing the remake, said the source. The film would be directed by Sagar Chandra of ‘Ayyare’ fame.
It is said that Sitara people somehow wanted Pawan Kalyan to act in this film and just asked for his 25-30 days of call sheets and inside sources said that the star was offered a huge remuneration of 30 Crores which means that he is earning close to 1.5 Crore for just a day. Moreover, news reports also said that the star would get a 25% share of the profits. It remains to be seen whether the news is true or not but powerstar’s demand never dies down is the proof!
‘Ayyappanum Koshiyum’ is the story of two egoistic people who do not compromise at all. Written and Directed by Sachy. It’s the debut movie of this maverick writer who earlier scored a massive hit as a writer with the film ‘Driving Licence’.
Power star Pawan Kalyan who is busy balancing the two boats-Politics and Films has recently concluded his Chaturmasa Deeksha. He led a normal life barring the starry looks of an actor.
Now that everything is set for entering the set of his upcoming films, fans of powerstar are eagerly waiting to see their favourite in the new look. They are very curious as to how the star would mould his looks!
The re-entry movie is titled ‘Vakeel Saab’ and was scheduled to hit the screens on May 15 this year which is now in doubt with the Corona outbreak.
The latest sources say that Pawan Kalyan would resume shoot from November and has asked the makers of Vakeel Saab to plan a perfect schedule.
‘Vakeel Saab’ stars Shruti Haasan as Pawan’s love interest in the film. The movie is an official remake of the Bollywood hit ‘Pink’. The movie is produced by Dil Raju and is directed by ‘MCA’ fame Venu Sriram.
On the other side, latest sources have said that Pawan Kalyan has asked producer Dil Raju to plan the promotional content of the film to make the fans happy. It is evident that they are already sulking over the delay in the making and release of the film!
When the news came out that Powerstar Pawan Kalyan is acting in the remake of Ayyappanum Koshiyum, many young actors in the Tollywood have expressed their interest in playing another lead role, which was played by Prithviraj Sukumaran.
Several heroes waiting for the chance to share the screen with Pawan Kalyan. However, Bheeshma boy Nithiin is very keen on this role and he even being in touch with the makers over starring in this film. Buzz is that Nithiin is even ready to act without any remuneration as he is an ardent fan of Powerstar.
Pawan’s nephew Sai Dharam Tej is also rumoured to be playing the role. As he continues to make his own efforts, it is Pawan, who has to decide who fits best for this character.
Initially, Rana Daggubati’s name surfaced, but he has not been announced yet due to lack of acceptance from Pawan. Although Nithiin and Tej are eager to play the role, it is difficult to say who can match the attitude and organism for the role of Koshi.
It is evident that Tollywood production house Sitara Entertainments has bought the remake rights of ‘Ayyappanum Koshiyum’, the Malayalam blockbuster of this year. It is evident that power star Pawan Kalyan was impressed with the film and felt that it’s a safe project for him. He is said to have shown immense interest in the project to make it a quick release!
The latest news suggests that Sitara people are very much keen to star in the Telugu beauty Anjali as Power Star’s wife and reports said that the film would be setup in Araku forest area backdrop and also would have the Alcohol Prohibition in forest area as theme as the original!
It is said that powerstar was impressed with work of Director Sagar K Chandra and fans too felt happy after seeing the initial teaser this Dasara. Rana was supposed to reprise the role of Prithviraj from the original while powerstar essays Biju Menon role. But with Nithiin entering the project, the film has got all the takers on it! Let’s wait for an official announcement to come.
‘Ayyappanum Koshiyum’ is the story of two egoistic people who do not compromise at all. Written and Directed by Sachy. It’s the debut movie of this maverick writer who earlier scored a massive hit as a writer with the film ‘Driving Licence’.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవ ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన తర్వాత చివరకు వకీల్ సాబ్ కోసం హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ నటించబోతున్న మలయాళి మూవీ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో హీరోయిన్ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
అయ్యప్పన్ కోషియమ్ లో హీరోయిన్ పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. తెలుగు రీమేక్ లో హీరోయిన్ పాత్రను కాస్త పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో భాగంగా హీరో హీరోయిన్ మద్య పాటలు మరియు రొమాంటిక్ సన్నివేశాలను కూడా చొప్పించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రకు గాను సాయి పల్లవిని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని అంటున్నారు.
సాయి పల్లవి కాకుంటే మరెవ్వరు ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి పవన్ కు జోడీగా కనిపించబోతున్న ఆ గెస్ట్ హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా హీరోయిన్ డేట్లు కూడా తీసుకోబోతున్నారు.