పారితోషికంలో చుక్కలు చూపిస్తోందట!!

కెరీర్ పరంగా శ్రుతిహాసన్ డైలమా గురించి తెలిసిందే. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. నాలుగైదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా పరిశ్రమను వదిలి వెళ్లిపోతోందని అనుకుంటే కథంతా అడ్డం తిరిగింది.

అయితే చక్కనమ్మకు రీఎంట్రీలోనూ ఆఫర్లకు కొదవేమీ లేదు. ఇటు తెలుగు అటు తమిళం రెండుచోట్లా క్రేజీ గా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తున్న శ్రుతి రవితేజ సరసన తెలుగులో క్రాక్ మూవీలో నటించింది. తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన వకీల్ సాబ్ లో నటిస్తోంది.

అయితే శ్రుతి ఈ మూవీకి అంగీకరించడానికి ముందు కొన్ని డిమాండ్లు చెప్పిందట. తన పాత్ర పరిధి ఎంతైనా కానీ ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరిందట. అతిథి పాత్ర అయినా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసిందట. అసలే సీనియర్ హీరోలకు కథానాయికల కొరత వేధిస్తోంది. ఇలాంటప్పుడు అమ్మడిని ఒప్పించేందుకు మేకర్స్ అన్ని డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చిందట. బ్రేక్ తర్వాత వచ్చినా పేమెంట్ విషయంలో ఈ భామ ఎక్కడా తగ్గడం లేదన్న గుసగుస ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. పారితోషికంలో రాజీ అన్నదే లేదని ముందే చెప్పేస్తోందట.

Related Images:

వెబ్ సిరీస్ కోసం రూ.90 కోట్ల పారితోషికం

ఇండియాలో ఓటీటీ మార్కెట్ పెరగడంకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ బిజినెస్ అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరుగుతోంది. దాంతో వందల కోట్లు పెట్టి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల తో భారీ యాక్షన్ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యిందట.

వెబ్ సిరీస్ ను 6 ఎపిసోడ్ లుగా చిత్రీకరించబోతున్నారట. ఆ ఆరు ఎపిసోడ్ లు కూడా అద్బుతమైన యాక్షన్ సీన్స్ ను కలిగి ఉంటాయని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు గాను హృతిక్ రోషన్ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నాడట. ఇండియన్ స్టార్ ఒక వెబ్ సిరీస్ కోసం ఇంత భారీ స్థాయి పారితోషికం అందుకోవడం ఇదే ప్రథమం. రాబోయే నాలుగు అయిదు ఏళ్ల వరకు కూడా ఇదే అత్యధికంగా ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. సాదారణంగా సినిమాకు ఈ స్థాయి పారితోషికం అదుకోవడంలో అతిశయోక్తి లేదు. కాని వెబ్ సిరీస్ కు మరీ ఇంత పారితోషికం ఏంట్రా బాబోయ్ అంటూ నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Images:

‘సామ్ జామ్’ కి సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే ..!

అయితే ఆహాలో సమంత ఓ టాక్ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్. ‘సామ్ జామ్’లో షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు రానున్నాయి. ఈ షో నవంబర్ 13న టాక్షో ప్రారంభమైంది. బాలీవుడ్లో కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఉంటుందని అంతా ఆశించారు. కానీ మొదటి షో చూసిన ప్రేక్షకులతో కొంత డిస్సప్పాయింట్ అయ్యారు.

కాగా సమంత హైదరాబాద్లో కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నది. తన స్నేహితురాళ్లతో కలిసి జూబ్లిహిల్స్లో ఓ ప్రీ స్కూల్ను స్టార్ట్ చేసింది. ఇటీవల శర్వానంద్తో కలిసి నటించిన ‘జాను’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక ’96’ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్లో నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఓ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్ అశ్విన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Related Images:

మిల్కీ బ్యూటీ అంత డిమాండ్ చేస్తోందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా మరో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా. సత్యదేవ్ హీరోగా నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ తెలుగులో రీమేక్. దీంతో పాటు నితిన్ హీరోగా నటుస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా మిల్కీ బ్యూటీ నటించనుంది. ఈ ప్రాజెక్ట్స్ లో అమ్మడిది హీరోయిన్ రోల్ కాకపోయినా సినిమాలో చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు.

కాగా తమన్నా ఈ రెండు సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. సినిమాలైనా వెబ్ సిరీస్ లు అయినా.. పాత్ర నిడివి ఎంతున్నా.. హీరోయిన్ రోల్ అయినా.. నెగెటివ్ రోల్ అయినా.. హీరో ఎవరైనా.. సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా.. బిగ్ స్క్రీన్ మీద అయినా పారితోషకం మాత్రం 2 కోట్లు డిమాండ్ చేస్తోందట. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కోసం ఈ విధంగానే అగ్రిమెంట్ చేసుకుందని టాక్. కాకపోతే ‘అంధాదున్’ మేకర్స్ మాత్రం తమన్నాతో బేరాలాడే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో పారితోషికం విషయంలో తమన్నా ఓ మెట్టు దిగొచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు.

Related Images:

Sai Pallavi Quoted Big Remuneration For Nani’s Film

South star heroine Sai Pallavi is known for her unique and peculiar style of acting. Her films are indeed a visual delight to the audience. She got recognition for her portrayal of Malar in Malayalam film Premam(2015).

It is known news that makers of Nani’s next film Shyam Singha Roy have been considering the name of Sai Pallavi for the female lead’s role. When the makers approached her, she gave a positive response and the other discussions are kept on hold due to the pandemic.

Now, the buzz is that Fidaa girl is demanding Rs 2 crores as remuneration for the film. The makers are planning to negotiate with the actress and will finalize the deal soon.

On the other hand, Sai Pallavi is currently shooting for Sekhar Kammula’s Love Story, which also stars Naga Chaitanya. The director had revealed that Pallavi’s role will come as a surprise for many.

Related Images:

Why Rakul Preet Singh Reducing Her Remuneration

The long-legged beauty of Tollywood, Rakul Preet Singh is busy with few new projects in her kitty. Rakul who was last seen in films like ‘De De Pyaar Se and ‘Marjaavan’ is now all set to act in Krish directorial.

The said film is going to have Panja Vaishnav Tej in the main lead and the film will be extensively shot in Vikarabad forest in a single schedule said the director in a formal announcement.

Now that the actress is enjoying her fitness feats with her friends in Hyderabad, recently news broke that she is reducing her remuneration to star in this Krish film only to revive her falling career, she is in all hopes that if at all the film hits the target, her position in Tollywood will be safe!

The earlier committed ‘Check’ with Nithiin has no update about the shoot or anything! Let’s see and hope Rakul to continue her best journey in Tollywood too!

Related Images:

Samantha Hellbent On Her Remuneration

It is already reported that Samantha Akkineni is gearing up to act in Vignesh Shivan’s directorial venture which has Vijay Sethupathi and Nayantara in the lead role. Apart from this, she is also starring in Ashwin Saravanan’ film.

According to reports, Samantha has to join Ashwin Saravanan’ project first, but she is delaying it. Now, the sources revealed the reason behind the delay. It is heard that Samantha wants remuneration for both the versions of the film that is for Telugu and the Tamil version. Earlier, she used to take Rs 1.5 to 2 Cr for a movie but now she is asking Rs 4 Cr for both the versions.

As Samantha seriously hellbent on remuneration, we have to wait and see whether the makers will accept Sam’s demands or not.

Related Images:

రెమ్యూనరేషన్ తో కంగారు పెట్టేస్తున్న సమంత

సహజంగానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కు రెగ్యులర్ గా కంటే కాస్త ఎక్కువ పారితోషికం అందుతూ ఉంటుంది. హీరోయిన్స్ గా హీరోల పక్కన నటించడం పెద్ద రిస్క్ ఏమీ కాదు. కాని ఎప్పుడైతే సినిమా బాధ్యత మొత్తం మీద పడుతుందో అప్పుడు వారు ఎక్కువ పారితోషికంను డిమాండ్ చేస్తారు. ఈమద్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న సమంత పారితోషికం విషయంలో నిర్మాతలను భయపెడుతుందట. తెలుగు మరియు తమిళంలో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. కనుక అక్కడ ఇక్కడ రెండు చోట్ల సినిమాను విడుదల చేసి క్యాష్ చేసుకుంటారు కనుక మొహమాటం లేకుండా డబుల్ పారితోషికంను డిమాండ్ చేస్తుందట.

ఇటీవలే సమంతతో సినిమాకు ‘గేమ్ ఓవర్’ ఫేం అశ్విన్ శరవనన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పిన సమంత పారితోషికం విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదంటుందట. హీరోలతో నటించే కమర్షియల్ సినిమాల్లో కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు తీసుకున్న సమంత ఇప్పుడు ఈ ద్విభాష లేడీ ఓరియంటెడ్ సినిమాకు మాత్రం దాదాపుగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట.

మీడియం బడ్జెట్ తో అనుకుంటున్న మేకర్స్ కు ఆమె పారితోషికం షాకింగ్ గా అనిపిస్తుందట. దాంతో మరో విధంగా ఏమైనా వర్కౌట్ అయ్యేనా అంటూ దర్శక నిర్మాతలు చర్చరిస్తున్నారట. పారితోషికం తక్కువగా ఇచ్చి సినిమా నిర్మాణ భగస్వామి చేసి లాభాల్లో వాటాను ఇచ్చేందుకు నిర్మాత సరే అన్నట్లుగా తెలుస్తోంది. కాని సమంత ఈ విషయంలో ఏం అంటుందో అనేది చూడాలి.

Related Images:

నిజంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…?

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసాడు. దీంతో పాటు ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీ కూడా ప్రకటించాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా వెలుగొందుతున్న ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ‘రాధే శ్యామ్’ సినిమాని హోమ్ బ్యానర్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మరియు ‘ఆదిపురుష్’ సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కోసం సుమారు 80 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్.. ‘ఆదిపురుష్’ కోసం సుమారు 100 కోట్లు పారితోషకంగా తీసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక హీరో రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో ఉందంటే మాములు విషయం కాదు.

అయితే ‘ఆదిపురుష్’ సినిమాని నిర్మిస్తున్న టీ – సిరీస్ వారు ప్రభాస్ కోసం బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం భారీ రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరో మన డార్లింగ్ అవుతాడని చెప్పవచ్చు.

Related Images: