కెరీర్ పరంగా శ్రుతిహాసన్ డైలమా గురించి తెలిసిందే. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. నాలుగైదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా పరిశ్రమను వదిలి వెళ్లిపోతోందని అనుకుంటే కథంతా అడ్డం తిరిగింది.
అయితే చక్కనమ్మకు రీఎంట్రీలోనూ ఆఫర్లకు కొదవేమీ లేదు. ఇటు తెలుగు అటు తమిళం రెండుచోట్లా క్రేజీ గా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తున్న శ్రుతి రవితేజ సరసన తెలుగులో క్రాక్ మూవీలో నటించింది. తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన వకీల్ సాబ్ లో నటిస్తోంది.
అయితే శ్రుతి ఈ మూవీకి అంగీకరించడానికి ముందు కొన్ని డిమాండ్లు చెప్పిందట. తన పాత్ర పరిధి ఎంతైనా కానీ ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరిందట. అతిథి పాత్ర అయినా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసిందట. అసలే సీనియర్ హీరోలకు కథానాయికల కొరత వేధిస్తోంది. ఇలాంటప్పుడు అమ్మడిని ఒప్పించేందుకు మేకర్స్ అన్ని డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చిందట. బ్రేక్ తర్వాత వచ్చినా పేమెంట్ విషయంలో ఈ భామ ఎక్కడా తగ్గడం లేదన్న గుసగుస ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. పారితోషికంలో రాజీ అన్నదే లేదని ముందే చెప్పేస్తోందట.
కొన్ని రోజుల క్రితం శ్రుతి హసన్ ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రియుడు మైఖేల్ కోర్సలేతో విడిపోవడం గురించి తాను మద్యానికి ఎలా బానిసలైంది అనే దాని గురించి మాట్లాడారు.
తాను మద్యం సేవించడం మానేసిన తరువాత అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని శ్రుతి అంగీకరించింది. తాను విస్కీ ప్రేమికురాలిని అని అన్నారు. ఇటీవల విరామం తీసుకున్నాను.. ప్రతిదీ ఆపాలని నిర్ణయించుకున్నా. ఇదో కొత్త మార్పు.. అంటూ ఎమోషన్ కి గురైంది. మద్యం మానేసే విధానం గురించి మాట్లాడుతూ తాను అనారోగ్యంతో బాధపడుతున్నాని.. ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. ఇది వ్యక్తిగతమైనదని .. తన అనారోగ్యాన్ని బయటి వ్యక్తులతో లేదా స్నేహితులతో పంచుకోలేదని తెలిపింది. మానసిక స్థితిని బాగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించింది.
అంతేకాకుండా తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అల్పాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆమె బాధపడటం లేదని ఆమె నొక్కి చెప్పింది. ఇతర వ్యక్తులు చెప్పేది ఆమె పట్టించుకోదు. ఆమె అదే మరియు ఇలాంటి పాత్రలు చేస్తున్నందున ఆమె ఒక సంవత్సరం విరామం తీసుకుంది.
మైఖేల్ కోర్సలే నుంచి విడిపోవటం పై హోస్ట్ ఆమెను అడిగినప్పుడు.. నటి తాను కూల్ టైప్ అని పేర్కొంది. నేను చాలా అమాయకురాలిని.. ప్రతి ఒక్కరూ నా చుట్టూ బాస్ లా మారారు. తనను సులువుగా స్వాధీనపరుచుకోవచ్చు అంటూ ఎమోషనల్ గా వెల్లడించింది. చివరగా ఇది తనకు చాలా మంచి అనుభవమని శ్రుతి అన్నారు. ఇక క్రాక్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఇటీవలే గోపిచంద్ మలినేనితో కలిసి ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసుకుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న ధీమాను శ్రుతి వ్యక్తం చేసింది. పనిలో పనిగా శ్రుతిహాసన్ లేటెస్ట్ ఫోటోషూట్లపైనా ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఓ హాటెస్ట్ ఫ్రాక్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ప్రతి ఒక్కొరికి పెరిగిన నేపథ్యం అనేది జీవితంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంటుంది. ఒంటరితనం డిప్రెషన్ లాంటి కారణాలు మనిషి మెంటల్ కి కారణం అవుతుంటాయి. అలాంటి రకరకాల కారణాలు మానసిక సమస్యల్ని సృష్టిస్తే ఆ ఒంటరి యువతి ఎలా ప్రవర్తించింది? ఆ యువతి జీవితంలో ప్రవేశించిన మరో మెంటల్ మేన్ కథాకమామీషు ఏమిటి? అతడి వల్ల తన జీవితంలో ఏం జరిగింది? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించారు `మెంటల్ హై క్యా`. ఈ సినిమా టైటిల్ వివాదాస్పదం కావడంతో జడ్జిమెంటల్ హై క్యా అని మార్చారు. ఇక టైటిల్ కి తగ్గట్టే పిచ్చి చేష్ఠల్ని ప్రదర్శించే యువతిగా కంగన రనౌత్ నటన అందరినీ ఆకట్టుకుంది.
అంతేకాదు.. కంగన వేషధారణతో పాటు మెంటల్ కి తగ్గట్టే తన రూపాన్ని డిజైన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్. డార్క్ లిప్ స్టిక్ .. థిక్ కాటుక.. ఐ లైనర్ ప్రతిదీ సంథింగ్ వెరైటీనే. ఇదిగో ఇక్కడ చూస్తున్న శ్రుతిహాసన్ సన్నివేశం కూడా ఇంచుమించు అలానే ఉన్నట్టుంది మరి. కావాలనే చేస్తోందా.. లేక తన మానసిక పరిస్థితిని వ్యక్తపరిచే ప్రయత్నమా? మొత్తానికి ఈ రూపం చూడగానే అందరూ షాక్ తింటున్నారు.
డార్క్ లిప్ స్టిక్ తో విచిత్రమైన ఆహార్యంతో బెదిరించేస్తోంది శ్రుతి. పాశ్చాత్య ధోరణి పక్కాగా కనిపిస్తోంది తన యాటిట్యూడ్ లో. ఏదైతేనేం.. యూత్ ని ఆకర్షించేందుకు సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలాంటి వేషాలే అవసరం. ఇక ఈ ఫోటో చూడగానే శ్రుతికి కూడా మెంటల్ హై క్యా! అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కంగనను మించి మెంటల్ వేషాలేస్తోందనేది కుర్రాకారు కామెంట్. 34 ఏజ్ లో శ్రుతి ఈ వేషాలు చూస్తుంటే భయం వేస్తోందంటూ కామెంట్లు పడిపోతున్నాయ్. `మండే మూడ్` అంటూ అందరికీ మూడ్ చెడగొట్టేసింది .. ప్ఛ్!