టీవీ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో తవ్వినకొద్దీ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. దేవరాజ్ సాయికృష్ణ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1 ఏ3 వీరి పేర్లను మార్చారు.
కొత్తగా టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ కేసులో ఏ-3 ముద్దాయిగా ఉన్న దేవరాజ్ పేరును ఏ1గా మార్చారు. అలాగే సాయికృష్ణారెడ్డిని ఏ-1 నుంచి ఏ2గా ఏ2గా ఉన్న అశోక్రెడ్డిని ఏ3గా మార్చారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను విచారించామని పోలీసులు తెలిపారు. దేవరాజ్ను ప్రేమించానని శ్రావణి తన కుటుంబ సభ్యులకు చెప్పిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో యాడ్ చేశారు. శ్రావణికి సాయికృష్ణారెడ్డి – అశోక్ రెడ్డితో సంబంధం ఉండడంతో దేవరాజ్ అందుకు అంగీకరించలేదని.. అందుకే గొడవలు జరిగాయని వెల్లడించారు.
కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన శ్రావణి సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ చేరుకుంది. అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అశోక్ రెడ్డిని పరిచయం చేశాడు. ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాలో శ్రావణికి చిన్న రోల్ కూడా ఇప్పించాడు. అలా శ్రావణితో సాయి పరిచయం కొనసాగింది. తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ అవకాశం రావడం ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆమె పేరెంట్స్ బ్రదర్ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారితో కూడా సాయికి పరిచయం ఏర్పడటంతో క్రమంగా ఇంటికి కూడా వచ్చేవాడు.
గతేడాది టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ పరిచయం అయ్యాడు. వారిది ఒకే ప్రాంతం కావడంతో శ్రావణి అతనితో చనువుగా ఉండేది. కొద్దిరోజులు ఆమె ఇంట్లో కూడా అతనికి చోటు కల్పించింది. వీరిద్దరూ క్లోజ్గా ఉండటం.. సాయికి నచ్చలేదు. గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరింది. దీంతో దేవరాజ్ శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆ రోజు సాయి ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధించారని దాడి చేశారని శ్రావణి పేర్కొన్న సంగతి తెలిసిందే.
శ్రావణి తనను పెళ్లి చేసుకోవాలని దేవరాజ్ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన సాయి అశోక్ రెడ్డి శ్రావణిని భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నెల 7వ తేదీన అజీజ్ నగర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రావణిని దేవరాజ్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్లో లంచ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన సాయి శ్రావణిపై చేయి చేసుకుని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. దేవరాజ్ను కలవవద్దని సాయి అశోక్ రెడ్డి కలిసి బెదిరించినట్టు ఇప్పటికే వెల్లడైంది.
కాగా.. దేవరాజ్ను చంపేస్తామని ఆర్థికంగా ఆదుకోబోమని శ్రావణిని వారిద్దరూ బెదిరించారు. ఇక లాభం లేదనుకొని శ్రావణి ఆత్మహత్యకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వెళ్లిపోదామని దేవరాజ్ను అడిగింది. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ అంగీకరించలేదు. దీంతో ఇటు సాయి అశోక్ వేధింపులు.. దేవరాజ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శ్రావణి మనోవేదనకు గురైంది. అక్రమంలోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ఏ1 – ఏ2 – ఏ3 నిందితులుగా వారు మారిపోతున్నారు.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి ఇద్దరిని నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రావణి ఆత్మహత్య కేసులో తాజాగా శ్రీరెడ్డి స్పందించింది.
‘శ్రావణి ఒక అమాయకురాలు అని అర్థమైపోతోంది. ఎమోషన్స్ కు బలైందని తెలిసిపోతోంది. ఈ సాయి దేవరాజ్ అబ్బాయిల మనస్తత్వం ప్రేమ కనపడుతోంది. మిస్ అండర్ స్టాండింగ్ వల్లే అమ్మాయి చనిపోయినట్టు తెలుస్తోంది’ అని చెబుతూ శ్రీరెడ్డి ఒక వీడియోను షేర్ చేసింది.
అబ్బాయిలు నో చెబితే మనం ఎందుకు చనిపోవాలని.. ఎందుకంత ఎమోషనల్ గా వీక్ గా ఉంటున్నారని శ్రీరెడ్డి సూచించింది. ఒక మనిషి లేకపోతే బతకలేమా? పుట్టేటప్పుడు పది మందిని పట్టుకొచ్చామా? ఒంటరిగానే కదా పుట్టాం.. చనిపోయేటప్పుడు ఒంటరిగానే కదా పోతాం’ అని శ్రీరెడ్డి పేర్కొంది.
అందరూ దైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలు చేసుకోకండని.. కలల్లో బతకకండి.. ప్రాక్టికల్ గా ఉండండి అని శ్రీరెడ్డి సలహా ఇచ్చింది. కట్టేకాలే వరకు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా బతకాలని.. ఎందుకు ఉరివేసుకుంటున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు. ఆ ధైర్యాన్ని మీరు బతకడంలో ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు.
రెడ్లలో పుట్టి.. రెడ్ల పరువు తీసేశారు సాయి దేవరాజ్ లు.. ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు చావండని శ్రీరెడ్డి శాపనార్థాలు చెప్పారు. ఆ అమ్మాయి వీడికి ఎంతో సాయం చేసిందని.. కనీసం విశ్వాసం కూడా లేదా అని శ్రీరెడ్డి వాపోయింది. మనం ఎంపిక చేసుకు జీవిత భాగస్వామి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి అని సలహా ఇచ్చింది.
బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ జరిగేకొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిక్ టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న దేవరాజ్ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో దేవరాజ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో మరో అనుమానితుడిగా ఉన్న సాయికృష్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాయి కృష్ణ మరియు శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొడుతున్నారని శ్రావణి తనతో మాట్లాడిన ఆడియోలు దేవరాజ్ పోలీసులకు అందించాడు. ఇందులో తన చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో పోలీసులకు వినిపించాడు. ఈ క్రమంలో గతంలో దేవరాజ్ ను సాయి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలను కూడా పోలీసులకి అందించాడని తెలుస్తోంది. పోలీసుల విచారణలో సాయి గురించి దేవరాజ్ సంచలన విషయాలు బయట పెట్టాడు. సాయికృష్ణ అనే వ్యక్తి కృష్ణా నగర్ లో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ట్రాప్ చేస్తుంటాడని.. అలానే శ్రావణిని సైతం ట్రాప్ చేశాడని వెల్లడించాడు. దేవరాజ్ తో విడిపోవాలంటూ శ్రావణిని సాయి వేధింపులకు గురి చేశాడని.. అతని వేదింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు దేవరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ‘ఆర్ఎక్స్100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చిన కొన్ని గంటలకే కొత్త కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. కొత్త అంశాలు బయటకు రావటమే కాదు.. కొత్త పాత్రలు తెర మీదకు వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న వెంటనే.. వారి కటుుంబ సభ్యులు ‘‘దేవరాజు రెడ్డి’’ పేరును ప్రస్తావిస్తూ.. అతడి వేధింపుల కారణంతోనే తమ కుమార్తె మరణించినట్లుగా ఆరోపించటం సంచలనంగా మారింది.
ఇది జరిగిన కొద్ది గంటలకే తెర మీదకు వచ్చిన దేవరాజు.. తాను అమాయకుడ్ని అని.. తాను.. శ్రావణి ప్రేమించుకున్నామని.. మరణానికి కాస్త ముందు తాము రెస్టారెంట్లో కలిసినట్లు చెప్పాడు. ఆ సమయంలో సాయి అనే వ్యక్తి తనపైనా.. శ్రావణిపైనా దాడి చేసినట్లు వెల్లడించాడు. తనను శ్రావణి వెళ్లిపొమ్మందని.. తాను హ్యాండిల్ చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. షూటింగ్ అయిన మూడు రోజులకు కలుస్తానని చెప్పిందని.. అంతలోనే ఆత్మహత్య చేసుకుందన్నాడు. అంతేకాదు.. తాను శ్రావణికి ఫోన్ చేయనని.. తనే ఫోన్ చేస్తుందని.. తన దగ్గర ఎలాంటి ఫోటోలు లేవని చెబుతూ.. కావాలంటే పోలీసులు చెక్ చేసుకోవచ్చని చెప్పిన వైనం.. ఆత్మహత్య ఎపిసోడ్ వెనుక ఏదో ఉందన్న సందేహాలు కలిగేలా చేశాయి.
దేవరాజు మాటల్ని విన్నప్పుడు అతడు అమాయకుడా? అన్న సందేహం కలిగేలా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రావణి – దేవరాజుకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో తాజాగా బయటకు వచ్చింది. శ్రావణి సూసైడ్ ఉదంతంలో మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఈ ఆడియో క్లిప్ ఉందంటున్నారు. అందులో శ్రావణిని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడినట్లుగా స్పష్టమవుతోంది.
మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలని దేవరాజ్ బెదిరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఒకవేళ రాకుంటే.. జరిగే పరిణామాల గురించి తనను అడగొద్దన్న హెచ్చరిక ఉండటం గమనార్హం. అతగాడి మాటలకు స్పందించిన శ్రావణి.. ‘ఇంతటితో ఆపేయ్.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ఆమె మాటలు ఉన్నాయి. ఈ ఆడియో క్లిప్ కొత్త సందేహాలకు తావిస్తోంది.
ఇదిలా ఉంటే.. సాయి అనే వ్యక్తి మీద దేవరాజ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడు మీడియా ముందుకు వచ్చాడు. తాను శ్రావణి కుటుంబానికి స్నేహితుడినని.. ఆమె జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తాను ఆమె కుటుంబంతోనే ఉన్నట్లుగా చెప్పి.. తానెక్కడికి పారిపోలేదన్నారు. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తే.. పోలీసుల విచారణలోనే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పక తప్పదు.
‘మనసు మమత’ టీవీ సీరియల్ తో తెలుగునాట పాపులర్ అయిన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి తన స్నేహితుడితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది.
ఇక శ్రావణి కుటుంబ సభ్యులు తాజాగా సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు.
ఇక శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 7న తాను శ్రావణి కలిసి డిన్నర్ కు వెళ్లామని.. అక్కడ సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నాడని దేవరాజ్ రెడ్డి వివరించారు.
శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందని.. తాను సంవత్సరం క్రితం శ్రావణికి స్నేహితుడను అయ్యానని దేవరాజ్ రెడ్డి తెలిపారు. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు.
కాగా ఏనిమిదేళ్ల నుంచి మౌనరాగం మనసు మమత సీరియల్స్ లో శ్రావణి నటిస్తోంది.
TV actress Sravani, who was known for her role in the serial Manasu Mamata, has died by suicide. She ended her life in her residence at Madhuranagar in Hyderabad on September 8, 2020, between 9-10 pm. The body of Sravani was shifted to Osmania Hospital for post-mortem.
Meanwhile, the police are investigating the suicide case and the family members blame Devraj Reddy who harassed her a few days ago.
According to reports, Sravani and Devaraj Reddy become friends on Tik Tok and started meeting on a regular basis. As they meet frequently, Devraj clicked some pictures with her and blackmailed her of releasing them online. Devaraj is said to have harassed Sravani and she committed suicide out of that resentment.
Sravani’s family said Devaraj phoned the actress and threatened her that he will damage her reputation. A case has been filed based on the complaint by the family members.