Allu Arjun Fans Ready To Create A Massive Feat On January 12

One cannot deny the fact that ‘Ala Vaikunthapurramuloo’ was the biggest blockbuster hit of 2020. The film, directed by Trivikram Srinivas, was released on January 12 during Sankranti last year and created many records. It becomes the highest-grossing film in Stylish star Allu Arjun’s career.

This is the hattrick movie made in the combination of Allu Arjun and Trivikram Srinivas. Needless to say, the songs became a sensational hit on social media even before the release of the film. It is no exaggeration to say that the music provided by S Thaman was a big advantage for the film.

Apart from Allu Arjun, the film also featured Pooja Hegde, Sushanth, Nivetha Pethuraj, Tabu, Jayram, Sachin Khedekar and Samuthirakani. The film made a huge collection of Rs 185 Cr at the box office.

Now, the film crew hopes to hold a grand celebration on January 12, the day the film completes its year. Allu Arjun fans are also all prepared to create a record on Twitter by trending the name of ‘Ala Vaikunthapurramuloo’.

On the work front, Allu Arjun is currently working for a pan-India project, ‘Pushpa’. It is being directed by Sukumar and it marks the third collaboration of the duo after Arya and Arya 2. Rashmika Mandanna is the leading lady.

Related Images:

చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి కేసు రాలేదు. రోజుకో కొత్త విషయం ఈ కేసు గురించి బయటకు వస్తున్న నేపథ్యంలో రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ చనిపోవడానికి ముందు తన సోదరితో చేసిన ఛాటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందు తన సోదరి మీతూ సింగ్ కు ఎస్ ఓ ఎస్ లో భయంగా ఉంది. నన్ను చంపేస్తారేమో అనిపిస్తుంది. నన్ను ఏదో ఒక దాంట్లో వారు నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో నీతో మాట్లాడాలని ఉంది అంటూ పేర్కొన్నాడట. ఆ సమయంలో ఆయన్ను మానసికంగా చాలా హింసించారని వారు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది అంటూ ప్రముఖ జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఆ ఒత్తిడి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు లేదంటే ముందుగా ఎవరి వల్ల అయితే ప్రమాదం ఉందని సోదరికి చెప్పాడో వారే సుశాంత్ ను చంపేసి ఉంటారేమో అంటూ జాతీయ మీడియా వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

ప్రతిదానికీ ఫిల్మిండస్ట్రీనే టార్గెట్ చేయడం తగదన్న బ్యూటీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొంపలంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ లింకులతో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీగ మొత్తం పట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ముఖ్యంగా బాలీవుడ్ శాండల్వుడ్ సహా పలు ఇండస్ట్రీలతో ముడిపడిన డ్రగ్స్ రాకెట్ గుట్టు మట్లు పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సహా శాండల్వుడ్ లో పరిస్థితి చూస్తుంటే అట్టుడికిపోతోంది.

అయితే ప్రతిదానికి సినిమావాళ్లనే అనడం చాలామందికి నచ్చడం లేదు. అందులో హైదరాబాదీ అమ్మాయి అదితీరావ్ హైదరీ కూడా ఉంది. తాజా ఇంటర్వ్యూలో అదితీ రావు సినీ పరిశ్రమకు దాపురించిన తాజా పరిస్థితుల గురించి విచారం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ సాఫ్ట్ కార్నర్ గా మారడం విచారకరం అని ఆవేదనను వ్యక్తం చేసింది అదితీ.

“మేం ఎవరైనా సంబంధిత సమస్య గురించి మాట్లాడితే అందులో ఒక తప్పు పదం దొరికినా వెంటనే టార్గెట్ అయిపోతాం. ప్రతి ఒక్కరూ తప్పు మాట్లాడినవారిపై బౌన్స్ అవుతారు. అలాగని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరూ బలవుతారు. ప్రతిదానికి చిత్ర పరిశ్రమనే బలి చేస్తారా? ఇది సరైంది కాదు“ అంటూ అదితీ ఆవేదన వ్యక్తం చేసింది. మహమ్మారి సమయంలో కూడా ప్రజలకోసం చాలా మంది తారలు చాలా మంచి పనులు చేస్తున్నారని తెలిపింది. మంచిని దాచి చెడును ప్రతికూలతను హైలైట్ చేస్తున్నారు. ప్రజలు దాని గురించి మాత్రమే మాట్లాడుతారు. అందరూ ప్రతికూలంగా కాకుండా సానుకూలతపై ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను“ అని అదితీ అన్నారు. అన్నట్టు అదితీరావ్ నటించిన వి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. పలు క్రేజీ చిత్రాల్లో అదితీ నటిస్తోంది.

Related Images:

షీనా బోరా హత్య కేసు నిందితురాలితో రియా జైలు షేరింగ్?

సుశాంత్ సింగ్ కేసులో వరుస ట్విస్టులు మెంటలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ తో కలిసి రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్స్ చేసేదని నార్కోటిక్స్ అధికారులు ప్రకటించారు. అలాగే ప్రమాదకర డ్రగ్స్ దుర్వినియోగం సరఫరా వంటి కేసుల్లో పలు సెక్షన్ల కింద చిట్టా పద్దు రెడీ చేసి జైలుకు తరలించారు. ఇంతకీ రియాను ఏ జైలుకు పంపారు? అంటే..

తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రెండ్రోజుల క్రితం డ్రగ్స్ సేకరించిన ఆరోపణలపై ఎన్సిబి ఆమెను అరెస్టు చేయగా..ఇప్పుడు ఆమెను బైకుల్లా జైలులోని ప్రత్యేక సెల్ లో ఉంచారని సమాచారం. ఈ సెల్ జైలు గ్రౌండ్ ఫ్లోర్ సాధారణ బ్యారక్స్ దగ్గర ఉంది. ఈ సెల్ ప్రత్యేకించి ఎంపిక చేసినది. 2016 సంవత్సరం నుండి ప్రముఖ వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా ఇక్కడే ఉన్నారని సమాచారం.

ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు .. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో సహ కుట్రదారు. ఇప్పుడు రియా చక్రవర్తిని ఇంద్రాణి ముఖర్జియాకు సమీపంలో ఉన్న సెల్ లో ఉంచారు. ఇంతకుముందు జనరల్ బ్యారక్స్ కు పంపినా రియా భద్రతా సమస్యల కారణంగా తన సెల్ ను మార్చాల్సి వచ్చింది. అలాగే రియా విందులో బియ్యం- పప్పు- 2 చపాతీలు మరియు ఒక సబ్జీ ఉన్నాయని తెలిసింది. రియా మాత్రమే కాదు.. ఆమె సోదరుడు షోయిక్ – శామ్యూల్ మిరాండా- దీపేశ్ సావంత్ లను కూడా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

రియా ఆమె సోదరుడు గురువారం జరిగే విచారణను బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు తరలించారు. ఎన్.డి.పి.ఎస్ చట్టం 1985 లోని సెక్షన్లు 8 (సి) 20 (బి) (ii)- 22- 27 ఎ -28- మరియు 29 సెక్షన్ల కింద రియాపై అభియోగాలు మోపారు. ఇంతలోనే మరో ట్విస్టు బయటపడింది. తాజా సమాచారం ప్రకారం.. రియా మాదక ద్రవ్యాల కోణానికి సంబంధించి ఆమె ఇంతకుముందు ఒప్పుకున్నది నిజం కాదని అనడం వేడెక్కిస్తోంది. వాటిని (డ్రగ్స్) తయారు చేయమని ఎన్.సి.బి అధికారులు ఆమెను బలవంతం చేశారని రియా ఆరోపించిందని తెలుస్తోంది.

Related Images:

సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. న్యాయం ఓడిపోయింది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇల్లీగల్ మందులు వాడి డ్రగ్స్ కూడా అలవాటు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది. అలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు రియాను మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒకేసారి మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను టార్గెట్ చేయడంతో న్యాయం ఓడిపోయింది.

విచారణ పేరుతో ఆమెను తీవ్రంగా హింసించారు.. వెంటాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఒక లాయర్ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. వారు నిర్దోషులు అయితే నిరూపించి బయటకు తీసుకు రమ్మంటూ సుశాంత్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.

Related Images:

రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన NCB

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు సహా సుశాంత్ సింగ్ వ్యక్తిగత స్టాఫ్ అరెస్టవ్వడం సంచలనమైంది. గత కొద్ది రోజులుగా రియాపైనా సీబీఐ – నార్కోటిక్స్ బృందాలు .. ఈడీ దర్యాప్తు సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు టీమ్ లో రియాను మూడోసారి పిలిపించి దర్యాప్తును కొనసాగించాయి. నేడు నార్కోటిక్స్ అధికారుల ముందు రియా హాజరయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు రియాను ఎన్.డి.పి.ఎస్ లోని వివిధ విభాగాల కింద అరెస్టు చేశారు. రియా చక్రవర్తి .. ఆమె సోదరుడు షోయిక్ మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి రియాను అదుపులోకి తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భావించారు. రియాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవలే రియా సోదరుడు షోయిక్ చక్రవర్తి .. మేనేజర్ శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత రియా చక్రవర్తి కుటుంబం ఈ కేసులో తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. సుశాంత్ మరణంలో రియా ప్రమేయం గురించి సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు నిధుల మళ్లింపుపైనా దర్యాప్తు సాగింది. సుశాంత్ సింగ్ క్రెడిట్ కార్డుల వినియోగంపైనా చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Related Images:

రియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం ఆ కేసుతో రియాకు సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవ్వడం ఆ తర్వాత ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటివి చకచక జరిగి పోయాయి. ఈ కేసులో రియా కుటుంబ సభ్యలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. కేసుతో సంబంధం లేకున్నా ఇప్పటికే వారిని మీడియా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. తాజాగా ఎన్ సీ బీ వారు శోవిక్ ను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఇంద్రజిత్ మాట్లాడుతూ కంగ్రాట్స్ ఇండియా. నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇక తర్వాత అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అనేది నాకు తెలుసు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సమర్థవంతంగా నాశనం చేయగలిగారు. న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఈ కేసులో రియా కుటుంబంను అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇంద్రజిత్ వ్యాఖ్యలు చాలా మందికి ఆవేదన కలిగిస్తున్నాయి. రియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అవ్వడం వల్ల ఆమెను ఇలా టార్గెట్ చేశారంటూ ఆమె సన్నహితులు మరియు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Related Images:

రియా అరెస్ట్ ఖాయమేనా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాకు తాజాగా ఆదివారం సమన్లు జారీ చేశారు.

ముంబైలోని ఆమె ఇంటికి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఎన్.సీ.బీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు..ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా బయలు దేరారు. ఏ క్షణమైనా రియా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కాగా ఈ విషయంపై రియా స్పందించింది. ‘ఒకరిని ప్రేమించడం తప్పు కాదని.. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని రియా తెలిపింది. అందుకే అరెస్ట్ అయ్యే చాన్స్ ఉన్నా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదని భావోద్వేగానికి గురైంది.

కాగా ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ అరెస్ట్ అయ్యారు. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో రియాకు ఉచ్చు బిగుసుకుంటోంది.

Related Images:

సుశాంత్ ఇష్యూను ఇంకా వాడుకునే ప్రయత్నం చేస్తోంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించిన వెంటనే ఆయన అభిమానులు చాలా మంది రియా కారణంగా మృతి చెందాడు అంటూ ఆరోపించడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం బ్యాచ్ అని వారు ఒక మాఫియాగా ఏర్పడి ప్రతిభ ఉన్న వారిని తొక్కేస్తూ తమ వారికి ఆఫర్లు ఇచ్చుకుంటుందని విమర్శలు చేయడం ప్రారంభించింది.

సుశాంత్ కేసులో మొదట్లో ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్ గా పరిగణించే వారు. ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉందేమో అనుకున్నారు. కాని ఆ తర్వాత సుశాంత్ కేసు పేరుతో తనకు కక్ష ఉన్న కరణ్ జోహార్.. మహేష్ భట్ వంటి ప్రముఖుల పేర్లను పదే పదే ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించడంతో సుశాంత్ మృతిని తన వ్యక్తిగత అజెండాకు ఉపయోగించుకుంటుందని కొందరు అనుమానించడం మొదలు పెట్టారు. ఇప్పటికే సుశాంత్ కుటుంబం తరపు వాదిస్తున్న లాయర్ ఈ విషయంలో కంగనా మరీ ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తుందని.. తన వ్యక్తిగత అజెండాను ఈ విషయంలో జొప్పించే ప్రయత్నం చేస్తుందంటూ చురకలంటించాడు. దాంతో కాస్త సైలెంట్ అయినట్లుగా అనిపించిన కంగనా మళ్లీ నేడు ట్విట్టర్ లో రెచ్చి పోయింది.

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అతడు హత్య చేసి యద్దేచ్చగా తిరుగుతున్నాడు అంటూ ఏకంగా ప్రధాని మోడీని ట్యాగ్ చేసి ట్వీట్ చేసింది. ఇక తనను ట్రోల్ చేసిన వారి ట్వీట్ ను ముంబయి పోలీస్ కమీషనర్ లైక్ చేయడం అత్యంత దారుణం అంటూ కంగనా ఆరోపించింది. అయితే ఆ విషయాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అందుకు సంబంధించిన సైబర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు. ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించింది.

Related Images:

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ఏమిటో వీడటం లేదు. సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లో ఆర్థిక లావీదేవీలకు సంబంధించిన కీలక సమాచారం బయటపడింది. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లలో ఒకదాన్ని పరిశీలించారు.

ఈ అకౌంట్ ద్వారా డబ్బు అత్యధిక శాతం ప్రయాణాలు.. వ్యక్తిగత విలాసాలు.. చారిటీలకు సహాయం .. దాతృత్వ ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇందులో కొంత మొత్తం రియా సోదరుడి కోసం ఖర్చు చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ సందర్భంగా కనోడియా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ని మేం పరిశీలించినప్పుడు వివిద హెడర్ ల కింద ఈ ఖర్చుల్ని వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని ఇందులో రియా ఆమె సోదరుడు కూడా వున్నారని స్పష్టం చేశారు.

గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్లు ఖర్చు చేశాడు. దానిలో ప్రయాణానికి సుమారు 4.2 కోట్లు.. పవానా ( మహారాష్ట్ర)లోని ఓ ఫామ్ హౌజ్కు 33 లక్షలు ఖర్చు చేయగా.. వ్యక్తిగత విలాసాలకు 1. 1 కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు తాము గుర్తించామని ఆయన తెలిపారు. ఇక రియా కోసం.. ఆమె సోదరుడి కోసం 9.5 లక్షలు ఖర్చు చేశారట. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1. 7లక్షల రూపాయలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్ ఖర్చు కోసం.. 3. 4 లక్షలు రియా షాపింగ్.. మేకప్ ఇతర ఖర్చుల కోసం వాడినట్లు గుర్తించినట్టు కనోడియా క్లారిటీ ఇవ్వడంతో రియా అసలు రంగు బయటపడింది. మొత్తానికి కోట్లలో ఖర్చు చేయించేసిందన్న ఆరోపణలకు బలం చేకూరకపోయినా.. లక్షల్లో మాత్రం సుశాంత్ కి ఖర్చయ్యింది.

Related Images:

సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది.

సుశాంత్ చనిపోయాడని తెలియగానే షాక్ కు గురయ్యా.. ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడ తనను రానీయలేదు. కేవలం సుశాంత్ శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు 3-4 సెకండ్లు మాత్రమే చూశాను అంటూ రియా వాపోయింది. నా స్నేహితులు వారిని ప్రాధేయపడ్డా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సుశాంత్ మరణం తనను కలిచివేసిందని ‘సారీ బాబు’ అంటూ రియా వాపోయింది. తను మరణించాడని.. జీవితాన్ని కోల్పోయాడని.. కానీ అతడి మరణాన్ని జోక్ లా చేశారని రియా ఆవేదన వ్యక్తం చేసింది. క్షమించమని కోరడం తప్ప నేను ఏమీ చేయలేనని.. అతడి పాదాలను తాకానని.. ఏ భారతీయుడైనా దీన్ని అర్థం చేసుకోవాలని రియా తెలిపింది.

Related Images:

బ్రేకింగుల్లో రికార్డులు సృష్టించిన సుశాంత్ మిస్టరీ కేసు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్ప మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లకే బ్రేకింగ్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ కి సంబంధించిన కథనాలు గత కొన్ని వారాలుగా టాప్ ట్రెండింగులో నిలవడం విస్మయానికి గురిచేస్తోంది. సుశాంత్ మృతి చెందిన తరువాత ఇంతకుమించిన చాలా చాలా బ్రేకింగ్ వార్తుల బయటికి వచ్చాయి. కానీ అవేవీ సుశాంత్ మృతికి సంబంధించిన వరుస కథనాల్ని బీట్ చేయలేకపోయాయి. వాటన్నింటినీ సుశాంత్ డెత్ మిస్టరీ సెన్సేషన్స్ కప్పేయడం చర్చనీయాంశంగా మారింది.

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్- నెల్సన్ సంస్థలు చేసిన మార్కెటింగ్ రీసెర్చ్ సర్వేలో ఈ సంచలన విషయం బయటపడింది. ప్రైమ్ టీవీ న్యూస్ విభాగంలో సుశాంత్ డెత్ న్యూస్ గత నాలుగు వారాలుగా టాప్ వార్తల్లో నంబర్ 1గా నిలవడం విశేషంగా చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న తన అపార్ట్ మెంట్ లోని బెడ్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ముందు ఇది ఆత్మ హత్య అని ముంబై పోలీసులు తేల్చారు. కానీ ఆ తరువాత నుంచి సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ దాగివుందని వరుస ట్విస్ట్ లు మొదలయ్యాయి.

ప్రతీ రోజు ఏదో ఒక వార్త ప్రైమ్ టైమ్ న్యూస్ గా హల్ చల్ చేస్తూనే వుంది. ప్రతీ రోజూ సుశాంత్ కు సంబంధించిన ఓ వార్త హెడ్ లైన్స్ లో నిలుస్తూనే వుంది. ప్రతీ వారం ఓ కీలక మలుపు తిరుగుతూ హెడ్ లైన్స్ లో నిలుస్తూనే వుంది. ముఖ్యంగా జూలై 25 నుంచి ఆగస్టు 21 వరకు వివిధ బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ లో రామమందరానికి సంబంధించిన భూమి పూజ జరిగింది. అయితే ప్రధాన ఛానల్స్ మొత్తం ఈ వార్తని ప్రసారం చేసినా ప్రధానంగా సుశాంత్ కేసుపైనే దృష్టి సారించాయి. ఆ తరువాత కోజికోడ్ ఏయిర్ క్రాఫ్ట్ క్రాష్ దుర్ఘటన.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. ఎం.ఎస్ థోనీ రిటైర్మెంట్ వంటి అంశాలని మించి సుశాంత్ డెత్ బ్రేకింగ్స్ టాప్ లో నిలిచింది. టీవీ వ్యూవర్ షిప్ లాక్ డౌన్ తరువాత 200 శాతం పెరిగితే అందులో అత్యధిక శాతం సుశాంత్ డెత్ కేసు వల్ల పెరగడం గమనార్హం.

Related Images: