తన అప్ కమింగ్ మూవీ ‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తోంది తాప్సీ పన్నూ. గతంలో ఎన్నడూ చేయని ఫీట్స్ ఈ చిత్రం కోసం చేస్తోంది. ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్లీ తన కసరత్తులు మొదలు పెట్టింది. ‘రష్మీ రాకెట్’ చిత్రంలో అథ్లెట్ రష్మీ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఈ పాత్ర కోసం అథ్లెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో వేరికో వెయిన్స్ సమస్య ఎదురుకావడంతో చికిత్స తీసుకుంది. 6 వారాల క్రితం జరిగిన ఈ చికిత్స అనంతరం తాజాగా.. మళ్లీ శిక్షణ మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“నేను ఈ శిక్షణ ప్రారంభించడానికి 6 నెలల ముందు నా పాదాలకు వేరికో వెయిన్స్ చికిత్స జరిగింది. ఆ చికిత్స తాలూకు మచ్చలు చూడ్డానికి ఇబ్బందిగా ఉన్నాయి’’ అని ఆ చిత్రానికి క్యాప్షన్ యాడ్ చేసింది. రక్తం సరఫరా చేసే సిరలు ఉబ్బి పోవడంతో ఈ వేరికో వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కొని కూడా శిక్షణ కొనసాగిస్తోంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Tapsee Pannu has cemented her place in Bollywood. Her glamorous heroine act didn’t get the star image she desired in the South but her performances in films like ‘Pink’, ‘Badla’ and others have brought her a lot of name and fame in Hindi. She became synonymous with female-centric films in Bollywood and apart from working on Mithali Raj’s biopic, Tapsee is doing a film called ‘Rashmi Rocket’ where she will be seen as an athlete.
She worked very hard to get into the skin of her character and here is a video she posted which showcases her tough and painful endeavor. She seems to have spent endless hours in the gym and her never give up attitude is one of the main reasons why she became successful. Directed by Akarsh Khurana, the shooting of ‘Rashmi Rocket’ started in November in Pune. The movie is slated to release next year and her fans are eagerly waiting for this sports drama.
As I finish the last athletic training for #RashmiRocket today here’s the journey I was waiting to share with you all….
If it makes you curious then the transformation was worth it 🙂 #MelwynCrasto#MunmunGaneriwal #PrachiShah#SujeetKargutkar pic.twitter.com/7pIHX2IoFD— taapsee pannu (@taapsee) December 16, 2020
సౌత్ హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది బాలీవుడ్ ఆఫర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నా కూడా ఉత్తరాది నుండి పిలుపు కోసం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది హీరోయిన్స్ సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ సౌత్ సినిమాలపై పెద్దగా ఆసక్తిని కనబర్చరు. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే సౌత్ సినిమాల్లో కనిపించేందుకు వారు ఓకే చెప్తారు. కాని బాలీవుడ్ లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న తాప్సి మాత్రం సౌత్ సినిమాలను వరుసగా చేయాలని ఆశ పడుతుంది.
బాలీవుడ్ లో తాను ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఏడాదికి కనీసం ఒక్క సౌత్ సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నట్లుగా తాజాగా తాప్సి పేర్కొంది. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో అయిదు సినిమాలు చేస్తోంది. అయినా కూడా ఈమె సౌత్ నుండి వచ్చే కథలను వింటూనే ఉందట. తనకు సినీ కెరీర్ ను ఇచ్చింది కనుక సౌత్ సినీ పరిశ్రమను వీడను అంటోంది.
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సౌత్ లో కూడా సినిమాలను చేసేందుకు ఆమె ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం. సౌత్ లో ఆమె ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. బాలీవుడ్ ప్రేక్షకులు మేకర్స్ ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. అయినా కూడా సౌత్ ప్రేక్షకులపై సౌత్ సినిమాపై ఆసక్తిని తాప్సి కనబర్చడం నిజంగా అభినందనీయం. ఈ విషయంలో ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటూ తాప్సి అభిమానులు అంటున్నారు.
హార్డ్ వర్క్ క్రమశిక్షణతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేస్తోంది అందాల తాప్సీ. అప్పుడప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ కామెంట్లతో వివాదాల్లోకి వస్తున్నా.. కెరీర్ పరంగా ఈ అమ్మడి దూకుడుకు ఎదురే లేకుండా పోయింది. సౌత్ టు నార్త్ తాప్సీ ప్రయాణం గురించి తెలిసిందే. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకెళుతున్న ఈ భామ మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
తాప్సీ ప్రస్తుతం `రష్మి రాకెట్` కోసం తీవ్రంగా శిక్షణ పొందుతోంది. ఈ చిత్రంలో తాను అథ్లెట్ గా నటిస్తోంది. అందుకు అవసరమైన శిక్షణలో ప్రస్తుతం పూర్తి బిజీగా ఉంది. ఆన్ ట్రైనింగ్ ఫోటోల్ని తాజాగా తాప్సీ అభిమానులకు షేర్ చేసింది.
వీటిలో ట్రైనర్ తో కఠోరంగా వర్కవుట్ చేస్తోంది. బ్లాక్ టాప్ – వైట్ షార్ట్స్ లో తాప్సీ కనిపించింది. శరీరం బలప్రయోగం ఈ ఫోటో చూస్తుంటేనే తాప్సీ ఎంతగా శ్రమిస్తోందో అర్థమవుతోంది. కండరాలపై ‘క్రూరమైన దాడి’ ఇది. థైస్ పై ఒత్తిడి పడుతుందని వెల్లడించింది.
ఇది నాపై దారుణమైన దాడి కాదు.. సాంకేతికంగా నా కండరాలపై మాత్రమే! అని తెలిపింది. తాప్సీ అభిమానులు ఆమె ఎంపికలు అంకితభావంపైనా ఎంతో విస్మయంతో ఉన్నారు. “మామ్ మీరు నిజంగా చాలా కష్టపడుతున్నారు“ అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. “హృదయ రాణి” అంటూ మరొకరు ప్రేమను కురిపించారు.
తాప్సీ తన ఇన్స్టాగ్రామ్ కథలలో ఒక వీడియోను కూడా పంచుకుంది అది ఆమె బృందం రుచికర ఆహారం తినడాన్ని చూసి ఈర్ష్య పడుతోంది. తాప్సీ ప్రస్తుతం మూవీ కోసం కఠినమైన డైట్ లో ఉన్నారు. ఆమె బీచ్ వద్ద ఒక ప్రత్యేక ఎనర్జీ డ్రింక్ తాగుతున్న చిత్రాన్ని కూడా పంచుకుంది.
తాను సేవించే పానీయంలో పసుపు & అల్లం శక్తివంతమైన ఏజెంట్లు కాబట్టి ట్యాబ్లెట్ల అవసరం లేకుండా.. కఠినమైన అథ్లెటిక్ శిక్షణ వల్ల కండరాలలో నొప్పి మంటను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది అని తాప్సీ వెల్లడించింది.
ఈ చిత్రంలో తాప్సీ గుజరాతీ అమ్మాయిగా నటిస్తోంది. ఆమె చాలా వేగంగా నడుస్తుంది.. అందుకే గ్రామస్తులు ఆమెను రష్మి రాకెట్ అని పిలుస్తారు. ఈ చిత్రానికి నందా పెరియసామి- అనిరుద్ద గుహా- కనికా ధిల్లాన్ కథనం అందించారు. ఈ చిత్రంలో భవేష్ జోషి సూపర్ హీరోగా కనిపించనున్నారు. ప్రియాన్షు పెన్యులీ తాప్సీ భర్తగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2021 లో విడుదల కానుంది.
Talented actress Tapsee Pannu who worked on a lot of South projects before going to the North is currently acting in a woman-centric film titled ‘Rashmi Rocket’. The ‘Judwaa 2’ heroine who earned a name for herself in Bollywood with films like ‘Pink’, ‘Badla’, ‘Mulk’, ‘Thappad’ and others will be seen playing the role of an athlete in this film.
She is working hard on her fitness and athleticism for this film. She recently shared a working still from this film. In this click, Tapsee is seen riding the riding a bullet bike without a helmet. This led to her getting fined by the police. She wrote, “Just before I was fined for no helmet”.
On the work front, Tapsee did a Tamil film with Vijay Sethupathi. She is currently focusing on ‘Rashmi Rocket’ and after that, she will be playing the title role in the biopic of Indian woman cricketer Mithali Raj.
అదేదో సినిమా సెట్టింగులా… అసలు ఆ ప్లేస్ చూస్తుంటేనే స్వర్గంలా అనిపిస్తోంది. బులుగు జిలుగు బీచ్ పరిసరాల్లో స్విమ్మింగ్ పూల్ స్నానాలతో గత కొద్దిరోజులుగా తాప్సీ ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు. అయితే ఈ స్వర్గం ఎక్కడ ఉంది? అంటే.. మాల్దీవుల్లో స్పెషల్ ప్లేస్ అని చెబుతోంది ఈ అమ్మడు. ఇక మాల్దీవులు వెళ్లింది మొదలు తాప్సీ ఒంటిపై టూపీస్ తప్ప ఇంకే వస్త్రాలు లేవ్.
బికినీలో జిల్ చిల్ అంటూ ఒకటే అదరగొట్టేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాజాగా ఈ సిరీస్ ఫోటోల్లో స్పెషల్ ఫోటోని తాప్సీ రిలీజ్ చేసింది. గాల్లో ఎగురుతూ గంట కొట్టేందుకు ప్రయత్నిస్తోంది అమ్మడు. సంథింగ్ హాట్ అండ్ స్పైసీ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
మరోవైపు పాయల్ తో వివాదం విషయంలోనూ స్నేహితురాలు రిచా చద్దాకు తాప్సీ బాసటగా నిలుస్తోంది. అనురాగ్ కశ్యప్తో లైంగిక వేధింపుల విషయంలో తన పేరును లాగడంతో రిచా చద్దా ఇటీవల పాయల్ ఘోష్పై పరువు నష్టం దావా వేసింది. చద్దా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి ఎన్సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. స్పందన పొందడంలో విఫలమైన నటి ట్విట్టర్లోకి తీసుకెళ్లి తన ఫిర్యాదు వివరాలను కోరుతూ శర్మను ట్యాగ్ చేసింది.
శుక్రవారం సాయంత్రం.. రిచా తన ట్వీట్ వార్ ను కొనసాగిస్తూ…. ఘోష్ పై విమర్శలు గుప్పించింది. రిచా ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ తాప్సీ పన్నూ పరిస్థితిని పరిశీలించింది. “మీరు కనిపించి మరియు వినిపించేలా దిల్లీకి వెళ్లాలని నేను భావిస్తున్నాను“ అని తాప్సీ తనకు మద్ధతు పలికింది. “రాతపూర్వక ఫిర్యాదుతో పాటు ఫోటో ఆప్ తప్పనిసరి అని ఎన్.సిడబ్ల్యు వెబ్ సైట్ పేర్కొన్నట్లయితే నేను కూడా అదే చేసేదానిని. మహిళల కోసం ‘జాతీయ’ కమిషన్. నా ఫిర్యాదు రసీదు స్క్రీన్ షాట్ ఇదిగో“ అంటూ చూపించింది. మొత్తానికి పాయల్ ఘోష్ ఆరోపణకు వ్యతిరేకంగా రిచా చద్దాకు తాప్సీ మద్ధతుగా నిలవడమే గాక జాతీయ మహిళా కమీషన్ తో టచ్ లో ఉండమని ఫ్రెండు రిచాకు సూచించిందన్నమాట.
సౌత్ నుండి పలువురు హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లారు. కొందరు అక్కడ మంచి సక్సెస్ ను దక్కించుకున్నారు. వారిలో పలువురు మళ్లీ సౌత్ వైపు చూడలేదు. అయితే ఒక్కరు ఇద్దరు మాత్రం మళ్లీ సౌత్ సినిమాల్లో ఒకటి రెండు చొప్పున నటించారు. బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపించరు అనేది కొందరి వాదన. కాని తాను అలా కాదంటూ తాప్సి చెబుతోంది. తనకు సినీ కెరీర్ ను ఇచ్చిన తెలుగు సినిమా పరిశ్రమను ఎప్పుడు మర్చి పోను అని సౌత్ నుండి ఆఫర్స్ వస్తే తప్పకుండా నటించేందుకు ఎప్పుడు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
తెలుగులో మంచు మనోజ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఈమెకు లక్ కలిసి రాలేదు. సక్సెస్ లేకున్నా కూడా ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో ఈ అమ్మడి సందడి కొనసాగింది. ఆ తర్వాత ఆఫర్లు తగ్గాయి. అలాంటి సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కమర్షియల్ పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చోకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను చేస్తూ వచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.
లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ఎక్కువ చేస్తూ స్టార్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తున్న తాప్సి తెలుగులో కూడా క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయట. తెలుగులో నటించేందుకు తాను ఎప్పుడు వెనుకాడను. బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినంత మాత్రాన నేను తెలుగు సినిమాలను వదిలి పెట్టనంటూ చెప్పుకొచ్చింది. కొందరి మాదిరిగా సౌత్ సినిమాల్లో ఆఫర్లను కాదనను అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.
Talented actress Tapsee Pannu proved that she is more than a glam doll in Bollywood with films like ‘Pink’, ‘Naam Shabana’, ‘Manmarziyaan’, ‘Badla’ and others. She gained a good image in Bollywood by playing strong roles. She has earned a fan base for herself in the North but she often does films in the South too.
Sadly, neither Tollywood nor Kollywood realized her acting potential and gave her roles that require nothing but to do skin show and run after the hero. She made her film debut in the Telugu film industry which is why she wants to deliver a solo blockbuster in Tollywood for a very long time. As ‘Pink’ is getting remade as ‘Vakeel Saab’ and Adivi Sesh’s ‘Yevaru’ is loosely based on her film ‘Badla’, Tapsee decided to remake her hit film ‘Thappad’ in Telugu as per sources.
‘Thappad’ was released this February and gained a lot of critical appreciation. This film deals with women empowerment and feminism and how society developed a certain way to look at women. Now, she is planning to remake this film in Telugu as per the talk in tinsel town. The official information regarding this remake is yet to come out.