ఆర్జీవీని అంతా లైట్ తీసుకున్నట్లేనా..!

రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే ‘శివ’ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత తెలుగులో ‘గాయం’ ‘క్షణక్షణం’ ‘అంతం’ ‘రాత్రి’ ‘గోవిందా గోవిందా’.. హిందీలో ‘సత్య’ ‘కంపెనీ’ ‘రంగీలా’ ‘భూత్’ ‘సర్కార్’ ‘సర్కార్ రాజ్’ వంటి సినిమాలు తీసాడు. అయితే వర్మ ఉన్నట్టుండి క్రియేటివ్ సినిమాలు తీయడం మానేసి ‘ఐస్ క్రీమ్’ ‘అనుక్షణం’ ‘ఆఫీసర్’ ‘నగ్నం’ ‘క్లైమాక్స్’ వంటి నాసిరకం సినిమాలు చూపించాడు.

ఇండస్ట్రీకి కొత్తదారి చూపించిన ఆర్జీవీ.. ఇప్పుడు బూతు సినిమాలు.. ఎవరినో టార్గెట్ చేస్తూ ఫిక్షనల్ రియాలిటీ సినిమాలు.. యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒకప్పటిలా రామ్ గోపాల్ వర్మ ని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యాన్ని తీసుకొని తీసిన ‘కరోనా వైరస్’ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ అనే కుటుంబ కథా చిత్రమ్ తీసి రిలీజ్ కి రెడీ చేసినా ఎవరూ కేర్ చేయడం లేదు. ఇక ఇప్పుడు ఆర్జీవీని ఇన్ స్పైర్ చేసే ఇన్సిడెంట్లు బయట ఏమీ జరగలేదు. మహా అయితే ఆర్జీవీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మీదనో లేదా తెలంగాణలో బీజేపీ హవా మీదనో సినిమాలు తీయాలి తప్పితే ప్రస్తుతానికి వర్మ దగ్గర కాన్సెప్ట్స్ అయితే లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Images:

60 ఏళ్లు వస్తున్నా ఇంకా 16 మంది అమ్మాయిలు కావాలా వర్మ?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా వర్మ చేసే వ్యాఖ్యలు కనీసం వారం పది రోజులు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని సరదాగా అన్నవి ఉంటాయి.. కొన్ని వివాదాస్పదం అన్నవి ఉంటాయి. మొత్తానికి ఏదో ఒక విధంగా మాత్రం వార్తల్లో నిలిచేలా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటాడు. తాజాగా వర్మ రూపొందించిన మర్డర్ సినిమాతో పాటు కరోనా వైరస్ ఇతర సినిమాలు థియేటర్ లో రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. రేపు కరోనా వైరస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వర్మ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడాడు.

మీ వల్ల పేరు వచ్చిన అరియానా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ లో ఉంది. ఆమె ఫైనల్ వరకు వెళ్లేలా ఉంది అంటే ఆమెను గెలిపించేందుకు ఓటు వేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరో ఇంటర్వ్యూలో తనకు బిగ్ బాస్ గురించి పెద్దగా తెలియదు. గతంలో సన్నీలియోన్ ఉన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూశాను. తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు కూడా చూడలేదు. బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తి లేదు అంటూ చెప్పిన వర్మ కంటెస్టెంట్ గా వెళ్లేందుకు సిద్దం అన్నాడు. అయితే మొత్తం 16 మంది అమ్మాయిలు నేను ఒక్కడినే ఉండాలని అన్నాడు. 500 కెమెరాలు ఉన్నా పర్వాలేదు అంటూ వర్మ కాస్త రొమాంటిక్ గా వ్యాఖ్యలు చేశాడు. రామ్ గోపాల్ వర్మ మరో ఏడాది రెండేళ్లలో అరవైల్లో పడుతాడు. ఇప్పటికే తాత కూడా అయిన వర్మ ఇంకా అమ్మాయిలు అది కూడా 16 మంది అమ్మాయిలు కావాలంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముసలి వయసు వచ్చినా కూడా ఇంకా ఆ యావ తగ్గలేదా అంటూ మరి కొందరు వర్మను ప్రశ్నిస్తున్నారు.

Related Images:

రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

వివాదాస్పద టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

‘దిశ-ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కుమారులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఇప్పుడు మళ్లీ సినిమాలో వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతారని నిందితుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాది క్రుష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో ఉండనివ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే జ్యూడిషియల్ కమిషన్ విచారణ సాగుతున్న కేసుపై సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరాడు. దీంతో కోర్టు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈనెల 26న దిశ సినిమా విడుదలకు రాంగోపాల్ వర్మ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో హైకోర్టు ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం. నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

కాగా ఈ సినిమాను ఆపాలంటూ గతంలో ‘దిశ’ తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు. గత ఏడాది నవంబర్27న షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లిలో దిశ హత్యాచారం జరగింది. పోలీసులు నిందితులను డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ చేశారు.

Related Images:

వర్మ దయతో సెటిలయ్యిన ముద్దుగుమ్మలు

రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. ప్రముఖ దర్శకులు పలువురు ఆయన శిష్యులు అనడంలో సందేహం లేదు. ఆయన వద్ద ఒక్క సినిమాకు పని చేయాలని టెక్నీషియన్ మరియు నటీనటులు కోరుకునే వారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఏదో ఒక వివాదం నేపథ్యంలో కొనసాగుతుంది. అందుకే ఆయనతో సినిమా అంటే ఏరి కోరి వివాదాన్ని కొని తెచ్చుకోవడమే అని కొత్త వారు తప్ప పాత వారు ఆసక్తి చూపడం లేదు. ఈమద్య కాలంలో ఈయన శ్రీ రాపాక మరియు అప్సర రాణి అనే ఇద్దరు మద్దుగుమ్మలను తీసుకు వచ్చాడు. వీరిద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. కాని సరైన అవకాశాలు రాక లైమ్ లైట్ లోకి రాలేక పోయారు.

వర్మ ఎప్పుడైతే ఎన్ఎన్ఎన్ అంటూ శ్రీరాపాకతో సినిమాను తీశాడో అప్పుడే ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఆమెకు ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. అలాగే సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అప్సర రాణి.. ఈ అమ్మడిని థ్రిల్లర్ సినిమాలో నటింపజేసి ప్రస్తుతం డేంజరస్ సినిమాలో కూడా నటింపజేస్తున్నాడు. వర్మ ఇచ్చిన ఆఫర్లతో పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా సక్సెస్ అయితే అప్సర ఐటెం సాంగ్ లతో సెట్ అయ్యి ఆ తర్వాత హీరోఇయన్ గా కూడా టర్న్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Related Images: