విజయవాడలో బొమ్మ పడింది

కేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినప్పటికి చాలా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దేశ వ్యాప్తంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఓపెన్ పై ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎట్టకేలకు విజయవాడలో అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో అన్ని మల్టీ ప్లెక్స్లను రోజుకు మూడు షోల చొప్పున నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికి రాష్ట్రంలోని 800 సింగిల్ స్ర్కీన్ థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ లేదు.

ఎనిమిది నెలల తర్వాత విజయవాడలో బొమ్మ పడటంతో ప్రేక్షకులు మెల్ల మెల్లగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. పాత సినిమాలు స్ర్కీనింగ్ చేస్తున్నారు. ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత లేదు. అయినా కూడా మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేశారు. థియేటర్లకు ఎప్పుడు ఓపెన్ చేసే విషయమై ఇంకా స్పష్టత లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో కూడా మొదట మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

Related Images:

కనకదుర్గమ్మ వారి తెప్పొత్సవం 2020 లైవ్

కనకదుర్గమ్మ,తెప్పొత్సవం 2020, లైవ్, Teppotsavam 2020 LIVE Vijayawada Indrakeeladri

https://www.youtube.com/watch?v=-1oa5mlroCQ

Related Images:

విజయవాడలో 40 % మందికి కరోనా !

కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉంది. ప్రతిరోజూ కూడా పది వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతూవస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే .. కొందరికి కరోనా సోకింది తగ్గిపోయింది కూడా తెలియడంలేదు.

తాజాగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సిరో సర్వైలెన్స్ వివిధ రకాల వైరస్ పరీక్షల విశ్లేషణలో దాదాపుగా 40% మందికి అసలు వారికీ తెలియకుండానే కరోనా సోకి తగ్గిపోయినట్లు వైద్యులు గుర్తించారు . అలాగే వీరిలో ఎక్కువ శాతం మందికి అనుమానిత లక్షణాలు లేవని తేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ ఫెక్షన్ రేట్ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునేందుకు వైద్య అధికారులు ఇటీవల ‘సిరో సర్వై లెన్స్’ నిర్వహించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 20 శాతం మందికి కరోనా సోకిన విషయం కానీ తగ్గిపోయిన విషయం కానీ తెలియదు.

విజయవాడ అర్బన్ లో 378 మందికి కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి కరోనా వచ్చింది తగ్గిపోయింది కూడా. అలాగే రాణిగారితోటలో 29 లంబాడిపేటలో 18 రామలింగేశ్వరనగర్లో 18 దుర్గాపురంలో 17 మధురానగర్లో 20 గిరిపురంలో 18 ఎన్టీఆర్ కాలనీ 16 ఆర్ఆర్ పేట 16 లబ్బీపేట 4 పటమటలోని 5 మందిలో కరోనా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలైన కానూరులో 8 మందికి గొల్లమూడిలో 14 మందికి చిన్న ఓగిరాలలో 15 గొల్లపల్లిలో 9 మందికి యాంటీ బాడీలు ఉన్నట్లు వైద్యులు చేసిన నిర్దారణ పరీక్షల్లో గుర్తించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో మే నెలాఖరు వరకు నమోదైన కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కాగా ఇదే విధంగా తమకి కరోనా సోకిన విషయం తెలియకుండానే. కరోనా సోకి తగ్గిపోయిన వారు ఢిల్లీలో 23 శాతం ఉండగా మహారాష్ట్రలోని ఓ మురికివాడలో 43 శాతం ఉందని సిరోస్ సర్వైలెన్స్ విశ్లేషణలో వెల్లడైంది.

Related Images: