Actress And Her Newborn Son Tests Positive For Virus

Late Kannada actor Chiranjeevi Sarja’s wife Meghana Raj and their newborn son have unfortunately tested positive for coronavirus. Meghana on Tuesday evening released a statement that her infant son as well as her parents have also contracted the virus.

She wrote in her post: “Hello all, my father, mother, myself and my little one have been tested positive for COVID… We have informed everyone who have come in contact with us during the past few weeks about our results.”

She further urged Chiranjeevi’s and her fans to not worry. She assured them that they are all doing fine and are currently under treatment. She also said Junior C is fine and keeping her occupied every second.Meghana assured that as a family they will fight this battle and will come out of it victorious.

Chiranjeevi passed away at the age of 36 in Bengaluru on June 7 this year. Chiranjeevi and wife Meghana Raj welcomed a baby boy on 22 October 2020.

Related Images:

శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య సినీ నటి రాధిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్ కుమార్ అలాగే తనయ వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియిన్ సెల్వన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇకపోతే ఒకప్పుడు రోజూ లక్ష కరోనా కేసులు వచ్చిన ఇండియాలో నిన్న కొత్తగా 26567 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 9703770కి చేరింది. నిన్న కొత్తగా 385 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 140958కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 39045 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 9178946కి చేరింది. రికవరీ రేటు దేశంలో 94.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 383866 ఉన్నాయి. నిన్న కొత్తగా 1026399 టెస్టులు జరగ్గా… మొత్తం టెస్టుల సంఖ్య 148814055కి చేరింది.

Related Images:

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కాకపోతే రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం గమనించదగ్గ విషయ. ఇక కరోనా సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్ట లేదు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. వారిలో చాలామంది కరోనాను జయించి బయటపడ్డారు. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందని గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిర్ధారణ చేస్తూ తనకు కరోనా సోకిందని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ”ఇన్ఫెక్షన్ అనేది ఎల్లప్పుడూ బాధగా ఉండాలి.. దీన్ని మీరు తోటివారికి సహాయపడే అవకాశంగా మార్చుకోవచ్చు” అని చెప్తూ కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని.. కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తానని ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై మెగా అభిమానులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. నాగబాబు గత కొన్ని రోజులుగా ఓ ఛానెల్ లో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Related Images:

మంత్రి హరీష్ రావుకు కరోనా

తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు.

తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా తనకు కరోనా రావడంతో తనను కలిసిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నేతలు అధికారులకు హరీష్ రావు సూచనలు చేసినట్టు సమాచారం.

అయితే హరీష్ రావుకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done

— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 5, 2020

Related Images: