యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు లుక్ లో వేరియేషన్ చూపిస్తూ వచ్చాడు. కరోనా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన డార్లింగ్.. బయటకు వచ్చిన ప్రతిసారి న్యూ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో లేటెస్టుగా సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చి మరోసారి అభిమానులకు కిక్ ఇచ్చాడు ప్రభాస్. ట్రెండీ డ్రెస్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చొని డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకేముంది ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ చేయనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇక ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించనున్నాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తారు.
ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ ని ఒకే స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కోసారి అదే స్టార్స్ స్క్రీన్ మీద కలిసి నటించకుండా ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటారు. సెంటిమెంట్స్ ని బాగా నమ్మే సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ కలిసి నటిస్తే సినిమా ప్లాప్ అవుతుందని.. వీళ్ళు నటిస్తే హిట్ అవుతుందని.. ఇలా రకరకాల బేస్ లెస్ నమ్మకాలు పెట్టుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి నిజమేమో అనే అనుమానాలు కూడా కలుగుతుంటాయి కూడా. విషయానికొస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయకుండా ఉంటేనే మంచిదని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించనున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే రోజుకో న్యూస్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ చిత్రంలో రాముడు తండ్రి దశరధుడిగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటించనున్నాడని వార్త కలవరపెడుతోందట. ఎందుకంటే కృష్ణంరాజు – ప్రభాస్ గతంలో నటించిన రెండు సినిమా డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. మరోసారి అదే రిపీట్ అవుతుందేమో అని భయపడుతున్నారట.
కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ సినిమాలో కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ ‘రెబల్’ సినిమాలో తండ్రీకొడుకులుగా నటించారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా డెబ్బకు దర్శకుడు లారెన్స్ సైతం మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ధైర్యం చేయలేదు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ – యంగ్ రెబల్ స్టార్ కలిసి నటిస్తే అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి ఈ వార్తలు నిజమై ప్రభాస్ – కృష్ణంరాజు కలిసి నటించి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారెమో చూడాలి.