Zee5 has acquired the rights of Supreme hero Sai Dharam Tej’s ‘Solo Brathuke So Better’ and the film will be released in theatres on December 25th during Christmas.
As per the reports, the entire rights of the film was bagged for approximately 25 crores. Directed by Subbu, ‘Solo Brathuke So Better’ has Thaman’s music and Nabha Natesh is playing the female lead.
Meanwhile, the latest buzz in film circles is that Zee Studio has also bought entire rights of Sai Dharam Tej’s next film, which is to be directed by Deva Katta. The movie rights, which includes theatrical, non-theatrical, dubbing and remake, are bought for a staggering Rs 35 Cr.
If the reports are believed, the Zee Studious will release the funds in a phased manner as the movie is still in pre-production stage and once the first copy is out, then they will pay the remaining. However, there is no official confirmation on this yet.

సౌత్ లో ఇప్పటి వరకు జీ5 ఓటీటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎక్కువ తెలుగు సినిమాలు అమెజాన్.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జీ5 వారు తెలుగు సినమాలను వరుసగా కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ తో పాటు థియేట్రికల్ రైట్స్ ను కూడా వీరు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాను జీ5 కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాను మొదట డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయాలనుకున్నా థియేటర్ల ప్రారంభంకు ఓకే చెప్పడంతో జీ5 వారే థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో మరో సినిమాను జీ సంస్థ కొనుగోలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ సినిమాను జీ5 వారు హోల్ సేల్ గా కొనుగోలు చేశారట. కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. హసిత్ గొలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
ఈ మద్య కాలం లో ఓటీటీ కంటెంట్ కు ఇండియా లో మంచి డిమాండ్ పెరింగి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ విషయంలో పోటీ పడుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ప్రముఖ స్టార్స్ తో వెబ్ సిరీస్ లను తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్ ల విషయం లో జీ5 సంస్థ ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో ఈమద్య పలు పెద్ద సినిమాలను కొనుగోలు చేసిన జీ5 సంస్థ తాజాగా ‘ఎక్స్ పైరీ డేట్’ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల 2 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వెబ్ సిరీస్ అంటే ఈమద్య కాలంలో మినిమం అడల్ట్ కంటెంట్ కామన్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో కూడా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అడల్ట్ కంటెంట్ చాలానే ఉన్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది. ఇల్లీగల్ ఎఫర్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ సాగుతుందట. రెండు జంటల మద్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టిన చిచ్చును ఈ వెబ్ సిరీస్ లో కథనంగా చూపించారని తెలుస్తోంది. పది ఎపిసోడ్స్ గా సాగే ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఫేమ్ స్నేహా ఉల్లాల్ మరియు తెలుగమ్మాయి మధు శాలిని ఇంకా అలీ రెజా మరియు టోనీలుకేలు నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ప్రోమో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జీ5 లో అక్టోబర్ 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి స్టార్ట్ చేసి చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే ఇన్నాళ్లు ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ మూవీని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా జీ 5 ఒరిజినల్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి సుమారు రూ.33 కోట్లకు తీసుకుందని ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే ఇంత భారీ రేట్ పెట్టి మెగా హీరో సినిమాని తీసుకున్నా.. జీ 5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎంత మందికి రీచ్ అవుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జీ 5 యాప్ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. దానికి ఇక్కడ సబ్ స్క్రైబర్స్ గా కూడా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను లిమిటెడ్ ఆడియెన్స్ మాత్రమే చూస్తారని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో జీ 5 వారు ‘సోలో బ్రతుకే..’ చిత్రాన్ని ఏటీటీ పద్ధతిలో పే పర్ వ్యూ ఫార్మాట్ లో అందుబాటులో తీసుకురాబోతున్నారని సమాచారం. ఈ విధంగా జీ 5 యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వారు ఈ సినిమా వరుకు మాత్రమే డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుందట. ఇప్పటి వరకు ప్రముఖ ఓటీటీలల్నీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని సబ్ స్క్రైబర్స్ తీసుకున్న వారికి అనేక చిత్రాలు అందుబాటులో ఉంచుతూ వస్తున్నాయి. అయితే జీ 5 వారు మాత్రం సినిమాని కొన్న డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి ఈ మూవీ వరకు పే పర్ వ్యూ విధానంతో వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ రైట్స్ కూడా జీ 5 వారికే అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో థియేటర్స్ ఓపెన్ చేసాక ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తారేమో చూడాలి. అయితే పాపులర్ యాప్స్ కి కాకుండా జీ 5 వారికి ఇవ్వడం అనేదే తప్పుడు నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Shahid Kapoor’s younger brother Ishaan Khatter and Chunky Panday’s doting daughter Ananya Pandey have worked on a movie together titled ‘Khaali Peeli’. Directed by Maqbool Khan, ‘Khaali Peeli’ is a crime comedy with a lot of action and romance. The trailer looked quite promising despite the number of dislikes it got and the makers of this movie have opted for an OTT release.
‘Zee Plex’ which is an extension of ‘ZEE5’ has reportedly acquired the film’s streaming rights and Bollywood media claim that ‘Khaali Peeli’ is the first film in Hindi to be streamed on a pay-per-view basis. The movie will be premiered on 2nd of October and it will be coming on ‘ZEE5’ after a few days of its release.
The makers are quite confident about this film and both Ananya and Ishaan are sharing good chemistry in the songs. We need to wait and see how the film turns out.
The last leg of shooting for Sai Dharam Tej’s upcoming film ‘Solo Brathuke So Better’ has started recently and news is that the makers decided to go ahead for an OTT release. Apparently, Zee5 streaming service bought this film and sources say that including digital and satellite rights, the film was sold in between 30-35 crores.
Many people are feeling that ‘Zee5’ may not be the right platform to stream Sai Tej’s film. They say that it isn’t popular like Amazon Prime or Netflix and mega fans need to install it and buy a membership to watch this film. As the people who are familiar with this OTT platform are very low, industry experts are assuming that it is a wrong step from Sai Tej and the team.
The ‘Supreme’ hero’s last outing ‘Prathi Roju Pandage’ collected 45 crores just through theatres alone and he is on a hat-trick now. Analysts are saying that Zee5 got a better deal as they got a crazy film like ‘Solo Brathuke So Better’ for a normal rate. It also benefits the OTT platform as they get a lot of memberships due to this film. ‘Solo Brathuke So Better’ is directed by Subbu and Thaman is composing the music. Nabha Natesh will be seen romancing Sai Dharamj in this entertainer.
నాని ‘వి’ సినిమా విడుదల తర్వాత మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటిలో సోలో బ్రతుకే సో బెటర్ మరియు ఒరేయ్ బుజ్జిగా సినిమాలు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ ను కూడా జీ5 దక్కించుకుందట. త్వరలోనే జీ 5 ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతుంది. ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా అమెజాన్ లో విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల అవుతున్నాయి. కాని జీ5 మాత్రం మొదటి సారి తెలుగు ప్రముఖ సినిమాల రిలీజ్ కు సిద్దం అయ్యింది.
ఈమద్య కాలంలో ఓటీటీ ల మద్య పోటీ పెరిగింది. అమెజాన్ భారీ మొత్తాలు పెట్టి తెలుగు సినిమాల రైట్స్ ను కొనుగోలు చేస్తుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలను కూడా టార్గెట్ చేసిన జీ5 భారీ మొత్తాలకు తెలుగు సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. సోలో బ్రతుకే సోబెటర్ మరియు ఒరేయ్ బుజ్జి సినిమాలను అమెజాన్ కంటే ఎక్కువ కోట్ చేసి మరీ దక్కించుకుందట. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా జీ5 పలు తెలుగు సినిమాలపై కన్నేసిందని అలాగే వెబ్ కంటెంట్ పై కూడా దృష్టి పెట్టిందని సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజం అయితే అమెజాన్ కు ముందు ముందు జీ 5 నుండి గట్టి పోటీ తప్పదు. ఈ రెండింటికి ‘ఆహా’ కూడా పోటీకి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.