రూం రెంట్ కోసం ఆ సినిమాలు చేశా

విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న అడవి శేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ప్రస్తుతం ఈయన చేస్తున్న మేజర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమా వివరాలను వెళ్లడించారు. ఈ సమయంలోనే ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడాడు. అమెరికాలో మంచి ఉద్యోగంను సినిమాల కోసం వదిలేసి వచ్చిన నేను నా వద్ద ఉన్న డబ్బులతో సినిమాను నిర్మించి తప్పు చేశాను. మొదటి సినిమాతోనే నా వద్ద ఉన్న డబ్బులు అన్ని కూడా పోగొట్టుకున్నాను. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

నాన్న సినిమాల్లో రాణించాలని అనుకున్నారు. కాని ఆయన చిన్నతనంలోనే యాక్సిడెంట్ వల్ల సినిమాల్లోకి రాలేక పోయారు. నాకు సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఆయన నుండి ప్రేరణ పొంది సినిమాల్లో నటించేందుకు వచ్చాను. హీరోగా చేస్తున్న సమయంలోనే పంజా సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అడిగారు. ఆ సమయంలో నా స్నేహితులు చాలా మంది నటించమంటూ ప్రోత్సహించారు. దాంతో పంజాలో నటించాను. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నా కెరీర్ మళ్లీ మొదటికి వచ్చనట్లయ్యింది.

పంజా సినిమా నిరాశ పర్చినా కూడా ‘కిస్’ సినిమాను చేశాను. ఆ సినిమాకు నేను పెట్టబడి పెట్టాను. సినిమా నిరాశ పర్చడంతో ఒకానొక సమయంలో నేను రూం రెంట్ కట్టలేక ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నేను ఎంపిక చేసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క సినిమాను చేశాను. ఆ సమయంలో కొన్ని ఇష్టం లేకుండా కూడా చేయాల్సి వచ్చింది. డబ్బు కోసం చేసిన సినిమాలు ఆడలేదు అన్నాడు. ప్రస్తుతం రియల్ హీరో మేజర్ ఉన్ని కృష్ణనన్ బయోపిక్ లో చేస్తున్నాను. మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల ఉంటుందని అడవి శేష్ అన్నాడు.

Related Images:

అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..!

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన ‘మేజర్’ లుక్ టెస్ట్ వీడియో కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

నేడు(డిసెంబర్ 17) హీరో అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మేజర్’ ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్.. ‘మేజర్’ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ట్వీట్ చేసాడు. తెలుగు – ఇంగ్లీష్ – హిందీ భాషల్లో రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ లో అడవి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. శత్రువులకు గన్ ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయినట్లు అర్థం అవుతోంది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Images:

‘మేజర్’ లుక్ టెస్ట్ వెనుకున్న స్టోరీని రివీల్ చేసిన అడవి శేష్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల – బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేపాయి. ఈ క్రమంలో ‘మేజర్’ సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాలు వెల్లడిస్తూ అడవి శేష్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ”మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తనకు 2008 నుంచి మైండ్ లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. అక్కడ న్యూస్ ఛానల్స్ లో 27న మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు. అప్పుడు సడెన్ గా ఆయన్ని చూసి ఎవరా అనుకున్నాను. చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్య లా అనిపించారు. ఆయన కళ్ళలో ఒక స్పిరిట్ ఉంది. ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్ ను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంటర్వూస్ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని చూసుకునే వాడిని. వాటితోనే పదేళ్లు గడిచి ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘మేజర్’ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఆయన పేరెంట్స్ ను కాంటాక్ట్ చేశాను. పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నారా అని వారు నమ్మలేదు. వారితో మాట్లాడిన నాలుగైదు రోజుల తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని 10 శాతం నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు ఈ సినిమా కచ్చితంగా చేయాలని మొండి పట్టు పట్టాను. మేజర్ సందీప్ గారి ఐకానిక్ ఫోటో కోసం నవ్వు ఆపుకుంటూ పాస్ పోర్ట్ ఫోటో దిగారట. ఆ కళ్ళలో ఉన్న స్పిరిట్ ఇన్నేళ్ళుగా ట్రావెల్ అయ్యేలా చేసింది. సందీప్ అమ్మగారు నన్ను చూసి సందీప్ లా ఉన్నావు అన్నారు. సందీప్ పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చిన తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను. మహేష్ బాబు గారు మరియు సోని పిక్చర్స్ సహకారంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం” అని చెప్పుకొచ్చాడు.

‘మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు’ అని లుక్ టెస్ట్ కి వెళ్లి మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా అంటూ పాస్ పోర్ట్ సైజు ఫోటోని రివీల్ చేశాడు. ఇందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ పేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. దీనికి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత ఇంపాక్ట్ ఇవ్వడంతో పాటు గూస్ బమ్స్ కలిగించింది. ఈ సందర్భంగా ”మేజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Related Images:

ఓటు హక్కుపై గూఢచారి కామెంట్ వేడెక్కించిందిగా

కథ కంటెంట్ ప్రతిభను నమ్ముకుని ఎదిగే హీరోలకు టాలీవుడ్ లో కొదవేమీ లేదు. సినీనేపథ్యం లేకపోయినా వీళ్లను ఆదుకునేది ఈ క్వాలిటీనే. ఆ కోవకే చెందుతాడు అడవి శేష్. గూఢచారి… ఎవరు… క్షణం ఇవన్నీ అతడి ఫేట్ ని మార్చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.

ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్న శేష్.. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు గూఢచారి 2 సన్నాహాలు చేస్తున్నాడు. మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల గురించి కాకుండా ఊరు పర్యావరణం ఎన్నికలు అంటూ శేష్ చేసిన కామెంట్ వేడెక్కిస్తోంది. “ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ నిర్మాణాలు సిమెంటు రోడ్లతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి“ అని అన్నారు.

ఓటు హక్కు విలువ గురించి శేష్ వేడెక్కించే కామెంట్ చేశారు. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా దొరక్కపోయినా నాయకులకు మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమే అంటూ హాట్ కామెంట్ చేశారు శేష్. గ్రేటర్ ఎన్నికల వేళ అతడి కామెంట్లు యూత్ లో వైరల్ గా మారాయి. యువహీరో ప్రాపంచిక జ్ఞానానికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మంచి మాట చెప్పాడంటూ పొగిడేస్తున్నారు.

Related Images:

‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో యువ హీరో అడవి శేష్..!

న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని ‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో చోటు సంపాదించారు హీరో అడివి శేష్. ఆర్ట్స్ – మీడియా – కల్చర్ లకు చెందిన ఆసియాలోని భారత్ పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తుల విజయ కథలను ప్రపంచ వేదికపై జరుపుకోవడం.. వారిని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ జాబితాలో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అగ్ర స్థానంలో నిలిచారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు సోనూ నిగమ్ – రహత్ ఫతే అలీ – అద్నాన్ సమీ – జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి మహావడి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉండటం విశేషం. ఈ జాబితాను రెడీ చేయడానికి జర్నలిస్ట్ కిరణ్ రాయ్ యూకే నుంచి జూమ్ ద్వారా 400 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలుస్తోంది. అడివి శేష్ ని ఇంటర్వ్యూ చేసి ఆర్ట్స్ సెక్షన్ లో ఈ జాబితాకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా అడవి శేష్ ఓ వీడియో విడుదల చేశారు. “కోవిడ్ సమయంలో మీరందరూ జాగ్రత్తగా ఉన్నారని భావిస్తున్నాను. ఆసియాలో 400 అత్యంత ప్రభావవంతుల జాబితాలో నన్ను ఎంపిక చేసినందుకు కిరణ్ రాయ్ గారికి ధన్యవాదాలు. ఎ.ఆర్.రెహమాన్ గారు సోనూ నిగమ్ గారు.. వంటి చాలా మంది గొప్పవాళ్లతో పాటు నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది” అని శేష్ పేర్కొన్నారు. కాగా అడవి శేష్ ప్రస్తుతం మహేష్ బాబు నిర్మిస్తున్న ”మేజర్” అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన చిత్రాలు విలక్షమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టింగ్ తో పాటు స్టోరీ – స్క్రీన్ ప్లే విషయాల్లో కూడా మంచి పట్టున్న అడవి శేష్ మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు దక్షిణ ఆసియాలోని ‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

Related Images: