ఇండస్ట్రీకొచ్చిన ఏ నటికైనా ఓ డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది. సినిమాల నుంచి నిష్క్రమించే లోపు పలానా నటి లాంటి రోల్ లో నటించాలని చాలా మంది హీరోయిన్లు చెబుతుంటారు. ఆ ప్రభావంతోనే చాలా మంది రంగుల ప్రపంచం వైపు అడుగులు వేస్తారు. మోడలింగ్…యాక్టింగ్..బ్రాండింగ్ వెనుక ఆ రోల్ పరోక్షంగా ఎంతో బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కొన్నిసార్లు అలాంటి పాత్ర రావడం ఆలస్యమైతే? నిర్మోహమాటంగా అలాంటి పాత్రలో నటించాలని ఓపెన్ గాచెబుతుంటారు.
కంగనా రనౌత్ ఇటీవల చంద్రముఖి-2 లో చంద్రముఖి పాత్రని పట్టుబట్టి మరీ చేసింది. దర్శక-నిర్మాతలకి ఫోన్ చేసి ఆ పాత్రలో తానే నటిస్తానని అడిగి మరీ చేసింది. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కొన్ని రకాల డ్రీమ్స్ ని పుల్ ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫెయిల్యూర్ లో ఉన్న నాయిక సైతం డ్రీమ్ రోల్ గురించి చెబుతుంటుంది. కానీ అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రం ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవని ఆమె మాటల్ని బట్టి తెలుస్తుంది.
కేవలం ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంది తప్ప! వ్యక్తిగతంగా తాను ఎలాంటి పాత్రలపై ఆశలు లేనట్లు చెప్పుకొచ్చింది. కేవలం మంచి కథలు..మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలు అంతకు మించి నటికి అవసరం ఏముంటుంది? అంటోంది. ప్రస్తుతం అనుఇమ్మాన్యుయేల్ కేవలం జపాన్ అనే సినిమాలోనే నటిస్తోంది. ఆశలన్నీ ఈసినిమాపైనే. తెలుగులో అమ్మడికి అవకాశాలు రాలేదు.
కోలీవుడ్ లో కూడా ఈ మధ్య రాకరాక వచ్చిన అవకాశం ఇది. ఈ సినిమా హిట్ అయితే మరో సినిమాలో ఛాన్స్ అందుకునే అవకాశం ఉంది. అమ్మడు తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది గానీ… వైఫల్యాలు బిజీ నాయికగా మార్చలేకపోయాయి. కాలక్రమంలో పూర్తిగా అవకాశాలే లేకుండాపో యాయి. దీంతో లాభం లేదనుకున్న అను కోలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ ప్రయత్నంలోనే జపాన్ లో ఛాన్స్ అందుకుంది.
అను ఇమ్మాన్యుయేల్ .. అందం ప్రతిభలో ఈ ఎన్నారై గాళ్ కి సాటి లేరు ఎవ్వరూ. కానీ దురదృష్టం ఈ అమ్మడిని వెంటాడిన తీరు ప్రతిసారీ అభిమానుల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. పవన్ లాంటి టాప్ హీరో సరసన `అజ్ఞాతవాసి` చిత్రంలో నటించింది. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ సరసన `నా పేరు సూర్య` చిత్రంలో నటించింది. ఆ రెండూ తన రేంజును అమాంతం స్కైలోకి తీసుకెళతాయని భావిస్తే ఇంకేదో అయ్యింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో ఐరెన్ లెగ్ అని ముద్ర వేసి దూరం పెట్టేసింది పరిశ్రమ.
కొంత గ్యాప్ తర్వాత మరో అవకాశం దక్కినా కలిసి రాలేదు. నాగచైతన్య సరసన నటించిన `శైలజ రెడ్డి అల్లుడు` అయినా ఆదుకుంటుంది అంటే మరో డిజాస్టర్ ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత తమిళంలోనూ ఆశించిన రేంజుకు ఎదగలేకపోయింది. అక్కడ శివకార్తికేయన్ సినిమాలో నటించింది ఈ అమ్మడు. కానీ అది కూడా కలిసి రాలేదు.
వరుసగా ఇంత డిజాస్టర్ కెరీర్ అనూని పూర్తిగా డైలమాలో కి నెట్టేసిందనే చెప్పాలి. అయితే ఇంతగా ఫ్లాపులు ఎదుర్కొన్నా .. అనూ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఇటీవలే టాలీవుడ్ లో ఓ యువహీరో సరసన అనూ నటిస్తోందని ప్రచారమైంది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజాగా అనూ ఇన్ స్టా మాధ్యమంలో వేడెక్కించే ఫోటోషూట్ ని షేర్ చేసింది. అయితే ఇందులో ఎంతో స్లిమ్ లుక్ లోకి మారిపోయి కనిపిస్తోంది. అనూ ఛేంజోవర్ ఆకట్టుకుంటోంది.