కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ జరుగుతోంది. అక్కడి నుంచి బన్ని ఫోటోలు సోషల్ మీడియాల్లో రివీలైన సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్ తర్వాత వారణాసి షెడ్యూల్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ఒక పాటను చిత్రీకరించనున్నారు. వారణాసిలో పుష్పపై సాంగ్ చిత్రీకరణ ఏమిటి? అన్న సందేహం కలగొచ్చు. మరి ఎర్రచందనం దుంగలు తరలించే డ్రైవర్ పుష్పరాజ్ కు కాశీ వారణాసి కనెక్షన్ ఏమిటన్నది సుక్కూనే చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పటికే షూటింగ్ పలుమార్లు వాయిదా పడిన సందర్భంగా ఏదీ డిలే కాకుండా సుకుమార్ శరవేగంగా సినిమాని పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు.. మారేడు మిల్లి అడవుల్లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన గిరిజన యువతిగా నటిస్తుండగా.. హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వశి రౌతేలా హాట్ ఐటెమ్ నంబర్ లో నర్తించనుంది. బన్ని-సుక్కూ కాంబోకి లక్కీ ఛామ్ అయిన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Related Images:

‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతోంది. బన్నీ సెట్స్ లో అడ్డుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా షూటింగ్ కోసం బన్నీ తెల్లవారుజామున 4 గంటలకి కసరత్తులు చేసి 5 గంటలకు రెడీ అవుతున్నాడట. ఉదయం 6 గంటకు తొలి షాట్ పెడుతున్నారట. దట్టమైన ఫారెస్ట్ లో చలిలో టీమ్ మొత్తం అష్టకష్టాలు పడుతూ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే సుక్కు పర్ ఫెక్షన్ కోసం రోజుకి ఓ సీన్ తీయడం గగనంగా మారిందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. బన్నీ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు లారీ డ్రైవర్ ‘పుష్ప రాజ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Related Images:

అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి సర్ ప్రైజ్ షాకిచ్చారు

అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి ఊహించని సర్ ప్రైజ్ ట్రీటిచ్చి షాకిచ్చారు. నిన్న రాత్రి తన టీమ్ సభ్యుల్లో ఒకరికి పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసి సడెన్ ట్విస్టిచ్చారట. హైదరాబాద్ లోని 800 జూబ్లీ నైట్ క్లబ్ లో స్టైలిష్ స్టార్ భారీ బర్త డే పార్టీని ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. బన్నీ తన బృందంతో కలిసి సెలబ్రేట్ చేస్తున్న ఛాయాచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బన్ని తన సిబ్బంది కోసం పార్టీ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా తన సిబ్బంది పుట్టినరోజులను జరుపుకోవడానికి ఇలా అద్భుతమైన పార్టీలను ఏర్పాటు చేసి అభిమానం ఉన్న స్టార్ గా గుండెల్లో నిలిచారు. ఇక ఆపదలో పలువురిని ఆదుకుని తన మంచి మనసును చాటుకున్న సందర్భాలు.. కష్టకాలంలో విరివిగా విరాళాలు ఇవ్వడం వగైరా పనులు ఎన్నో ఉన్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా `పుష్ప`లో నటిస్తున్నాడు. ఇందులో తన పాత్ర కోసం బన్ని సిద్ధమవుతున్నాడు.

Related Images:

జిమ్ లో కూడా జంటగానే స్టైలిష్ కపుల్

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ జాబితాలో ముందు వరుసలో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరిద్దరు కలిసి కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబో ఫొటోలు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం. చివరకు వీరిద్దరు జిమ్ లో కూడా కలిసి వర్కౌట్ లు చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

బన్నీ మరియు స్నేహాలు జంటగా వర్కౌట్ చేస్తున్న ఫొటోలను చూసి నెటిజన్స్ మరియు మెగా అభిమానులు మీ జంట.. మీ అన్యోన్యత అభినందనీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను షేర్ చేసిన స్నేహా ట్విన్నింగ్ విత్ ద హజ్బెండ్ అంటూ కామెంట్ పెట్టి లవ్ ఈమోజీని షేర్ చేసింది. ఇద్దరి అప్యాయతకు ఇది నిదర్శనం అంటూ నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇక బన్నీ పుష్ప సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈయన ఆ పుష్ప పాత్ర కోసం బాడీ ని సిద్దం చేసుకుంటున్నాడు. జిమ్ లో సాధ్యం అయినంత ఎక్కువ సమయం గడుపుతున్నాడు. భర్తతో పాటు స్నేహా కూడా వర్కౌట్ లు చేస్తూ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా మారుతుంది.

Spot @alluarjun in this gym pic ✨

Related Images:

సౌత్ లో నెం.1 క్రేజీ స్టార్ అల్లు అర్జున్

సౌత్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ నుండి అత్యధిక వసూళ్లను వరుసగా మూడు సినిమాలకు దక్కించుకున్న ఘనత ప్రభాస్ కే దక్కింది. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కూడా ఉత్తరాదిన వందల కోట్లను వసూళ్లు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి ప్రభాస్ కంటే కూడా సోషల్ మీడియాలో అత్యధిక క్రేజ్ ఉన్న సౌత్ స్టార్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటూ చాలా మంది ఓట్లు వేశారు. ఒక సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో వేలాది మంది పాల్గొన్నారు. వారిలో ఎక్కువ శాతం మంది అల్లు అర్జున్ ను నెం.1 స్థానంలో ఉంచారు.

ప్రభాస్ కు తర్వాత స్థానం దక్కింది. ప్రస్తుతం సౌత్ లో ఉన్న హీరోల అందరి సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలోవర్స్ సంఖ్యతో పోల్చితే అల్లు అర్జున్ నెం.1 స్థానంలో ఉంటాడు. అదే మాదిరిగా ఆయన క్రేజ్ కూడా ఉందంటూ ఆ సంస్థ సర్వేలో వెళ్లడి అయ్యింది. బన్నీ కంటే సీనియర్ హీరోలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు దక్కించుకున్న హీరోలు ఉన్నా కూడా ఆయన్నే క్రేజీ స్టార్ హీరో అంటూ జనాలు ఎందుకు అని ఉంటారు అనేది కొందరు వేస్తున్న ప్రశ్న. బన్నీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మలయాళంలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలను బీట్ చేసే విధంగా బన్నీ వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే బన్నీ సౌత్ క్రేజీ స్టార్ అయ్యాడు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ లేకుండా కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో బన్నీ ఇప్పటికే షూటింగ్ కు రెడీగా ఉన్నాడు. కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వస్తున్న మేకర్స్ ఇక టైం వచ్చిందంటూ రంగంలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారు.

ఈనెలలోనే పుష్ప సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మొదట షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. బన్నీతో మొదట యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడట. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారట. ఆ తర్వాత హీరోయిన్ రష్మిక మందన్నా జాయిన్ అవ్వబోతుంది. బన్నీ.. రష్మికల కాంబోలో సీన్స్ ను కూడా కేరళ అడవుల్లోనే చిత్రీకరించే అవకాశం ఉందట.

ఇప్పటికే షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కనుక ఏమాత్రం బ్రేక్ లు లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాను ముగించేయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించబోతున్నారట. పుష్ప తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే ఏడాది బన్నీ ద్వితీయార్థంలో కొరటాల శివ మూవీలో నటించబోతున్నాడు.

Related Images:

బన్ని డ్యాన్సులంటే పడి చస్తున్న బుట్ట బొమ్మలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ స్కిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ క్లాస్ డ్యాన్సర్లలో బన్ని ఒకరు. బన్ని డ్యాన్సులకు హృతిక్ అంతటి వాడే ఫిదా అయ్యాడు. అతడికి అటు బాలీవుడ్ లోనూ స్టార్లలో వీరాభిమానులున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ఇరుగు పొరుగు పరిశ్రమలలో ఈ నటుడికి భారీ అభిమానులు ఉన్నారు. అన్నట్టు ఆయన అభిమానుల ఖాతాలో ఊర్వశి రౌతేలా కూడా చేరింది.

నేను లేడీ అల్లు అర్జున్ లాగా వ్యవహరించినప్పుడు నా చిత్రం బ్లాక్ రోస్ కోసం నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు అందిస్తున్నాను అంటూ ఓ డ్యాన్సింగ్ వీడియోని అభిమానులకు ట్విట్టర్ లో షేర్ చేసింది ఊర్వశి. అల్లు అర్జున్ తనకు ప్రేరణ అని ఊర్వశి వెల్లడించారు. బాలీవుడ్ నుండి జనాదరణ పొందిన వ్యక్తిత్వాన్ని చూడటం చాలా అరుదు. అయితే ఇలా దక్షిణాది హీరోపై ఉత్తరాది భామ అభిమానం పెంచుకోవడం ఆసక్తికరం.

అదంతా సరే కానీ.. ఊర్వశి మాత్రమేనా? అంటే బన్ని అంటే పడిచచ్చే భామల జాబితాలో చాలామంది ఉన్నారు. తొలిగా ఆర్య లో డ్యాన్సులకు ఫిదా అయిపోయన కాజల్ .. ఓ పబ్లిక్ వేదికపై బన్ని గ్రేట్ డ్యాన్సర్ అంటూ పొగిడేసింది. అంతకుముందు దిశా పటాని కూడా `బుట్ట బొమ్మ` కోసం డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ కు అంకితం చేసింది. దిశా పటానీ మరోసారి టాలీవుడ్ లో అడుగు పెడితే బన్నితో సినిమా చేయాలనుకుంటోందట. ఇకపోతే బుట్ట బొమ్మలో ఒరిజినల్ ప్యారీ పూజా హెగ్డే అయితే బన్ని డ్యాన్సులకు ఏనాడో ఫిదా అయిపోయానని అల.. ప్రమోషన్స్ లో చెప్పింది. ఇలా చూస్తే చాలా మంది బుట్టబొమ్మలకు బన్ని డ్యాన్సులన్నా అతడన్నా విపరీతమైన క్రష్ అని అర్థమైపోతోంది.

Related Images:

ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ

కథలు అందించడం శిష్యుల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించడం అన్నది సుకుమార్ కి ఉన్న అలవాటు. సుక్కూ రైటింగ్స్ ప్రొడక్షన్ లో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే సుకుమార్ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కోసం లవ్ ఆంథాలజీ ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సుకుమార్ స్వయంగా రాసిన 9 విభిన్న చిన్న ప్రేమ కథలు ఉన్నాయని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ తన మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరైన పల్నాటి సూర్య ప్రతాప్ (కుమారి 21 ఎఫ్) .. బుచి బాబు సన (ఉప్పెన ఫేం) లకు అవకాశాలిచ్చారు. ఆ ఇద్దరూ చెరో ప్రేమకథకు దర్శకత్వం వహిస్తారు. మిగిలిన ఏడు ప్రేమకథల్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి. ఓవైపు పెద్ద తెర.. మరోవైపు ఓటీటీ రెండు వేదికలపైనా సుక్కూ భారీ ప్లానింగ్ తో ముందుకు సాగనున్నారు.

Related Images:

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారన్నారు.

ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అక్కడ ఆయన అభిమానుల్ని పలకరిస్తూ ఓపెన్ టాప్ జీపులో కూడా ప్రయాణించారు. కుంటాల జలపాతం వద్ద పార్కులో ఆయన మొక్కలు కూడా నాటారు.

Related Images:

`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ఆ తర్వాత కెరీర్ పరంగా ప్లానింగుని మార్చే ప్రయత్నం చేశారు.

ఈసారి పుష్ప చిత్రంలో ఓ యంగ్ హీరో జాక్ పాట్ కొట్టేశారట. ఇంతకీ ఎవరా ఊహకందని స్టార్? అంటే.. నారా రోహిత్. అల్లు అర్జున్ స్నేహితుడిగా `పుష్ప` చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. బన్నినే స్వయంగా ఆ పేరును సుకుమార్ కి సూచించాడట. అంతేకాదు.. ఆ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువేనట. రంగస్థలం లో ఆది పినిశెట్టి పాత్రలా కీలకంగా ఉంటుందట.

త్వరలోనే పుష్ప రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా కొత్త పేర్లు రివీల్ కావడం ఉత్కంఠను పెంచుతోంది. ఇందులో వేర్వేరు గెటప్పులతో సర్ ప్రైజ్ ట్రీటివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్ .. నవదీప్ పాత్రలతో పోలిస్తే పుష్పలో నారా రోహిత్ పాత్ర పరిధి ఏ మేరకు హైలైట్ అవుతుంది? అన్నది సుకుమారే చెప్పాల్సి ఉంటుంది.

Related Images:

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు వెళితే.. ఇంకొకరు ఇంకోసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు.

ప్రస్తుతం రేస్ లో డార్లింగ్ ప్రభాస్ ఎవరూ అందుకోనంత ఎత్తుకి ఎదిగేస్తున్నాడు. బాహుబలి- సాహో చిత్రాలతో అతడు తన మార్కెట్ రేంజును పాన్ ఇండియా స్థాయికి విస్తరించాడు. ఇరుగు పొరుగునా డార్లింగుకి ఉన్న మార్కెట్ అందరికీ ఓ గుణపాఠం లాంటిది.

ప్రభాస్ కి పోటీగా ఇతర హారోలు కూడా మార్కెట్ రేంజ్ పెంచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రేస్ లో అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. మహేష్ జరంత స్పీడ్ గానే ఉన్నారని చెప్పాలి. వీళ్లంతా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లను క్యూలో పెట్టి వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే చరణ్ మాత్రం ఎందుకనో స్థబ్ధుగా ఉన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో `రౌద్రం రణం రుధిరం` మినహా వేరొక సినిమాకి చరణ్ ఇంతవరకూ కమిట్ కానే లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్.. ఓం రౌత్ లతో పాన్ ఇండియా చిత్రాలకు కమిటయ్యాడు. తారక్ వరుసగా త్రివిక్రమ్- కొరటాల- కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ లతో సినిమాలు చేయనున్నాడు. సుకుమార్ తో `పుష్ప` తర్వాత కొరటాల .. త్రివిక్రమ్ లకు అల్లు అర్జున్ కమిటయ్యాడు. యాత్ర ఫేం మహి.వి. కి కమిట్ మెంట్ ఇచ్చాడు. మహేష్ ఇప్పటికే పరశురామ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాతా అనీల్ రావిపూడి.. పూరీ.. త్రివిక్రమ్ లకు ఆఫర్లు ఇచ్చాడని ప్రచారమవుతోంది. ఏ ఇతర హీరోతో పోల్చినా చరణ్ మాత్రం రేస్ లో వెనకబడి ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం అతడు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి ఆచార్య సెట్స్ కి జాయిన్ కావాల్సి ఉంది.

Related Images:

గోన గన్నారెడ్డి కోసం గుణ ప్రయత్నాలు

ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఆయన తదుపరి చిత్రాన్ని విడుదల చేసింది లేదు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం గుణ శేఖర్ హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించాడు. ఆ సమయంలోనే సినిమాలో రానా నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. వచ్చే యేడాది ఖచ్చితంగా సినిమాను పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో గుణశేఖర్ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు.

ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు మరో హీరో కోసం చర్చలు జరుపుతున్నాడట. తన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ ను హిరణ్య కశ్యప చిత్రం కోసం సంప్రదిస్తున్నాడట. అల్లు అర్జున్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్ర ను ఈ సినిమాలో గుణశేఖర్ అనుకున్నాడట. ఆ పాత్ర చేస్తే మళ్లీ బన్నీకి మంచి గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకంను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాడట.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి ఓకే చెప్తాడా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గుణశేఖర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆయన మరీ ఎక్కువ కాలం టైం కేటాయిస్తున్న నేపథ్యంలో అందరిలో చర్చనీయాంశంగా ఉంది. గెస్ట్ రోల్ లోనే కనుక బన్నీ మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్తాడో చూడాలి.

Related Images:

‘అల్ట్రా స్టైలిష్’ లుక్కులో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న స్టైలిష్ స్టార్..!

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా సినీతారల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఎవరిళ్ళకు వారే అంకితమయ్యారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో అలర్టుగా ఉంటున్నాడు. తనకు సంబందించిన అన్నీ విషయాలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. తాజాగా బన్నీ పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం లుక్ చూసే ఉంటారు. అయితే ఇప్పుడు బన్నీ తన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చి అల్ట్రా స్టైలిష్ లుక్కులో దర్శనమిచ్చాడు. అప్పుడే ఆయన ఆఫీస్ నుండి బయటికి వచ్చి నిలబడి పోజిచ్చినట్లుగా కనిపిస్తున్న స్టైలిష్ లుక్ చూస్తూ ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. బన్నీకి ఇదేం కొత్త కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ బన్నీకి స్టైలిష్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ప్రతీ సినిమాలో కొత్త స్టైల్స్ చూపించినట్లే లాక్ డౌన్ లో కూడా అభిమానులకు ఉత్సాహాన్నిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ ఖరారు చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండీ బ్యూటీ రష్మిక మందానను హీరోయినుగా నటించనుంది. ఈ నేపథ్యంలో బన్నీ సుక్కు ఈ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి బన్నీ ఎప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Related Images: