ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం?

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. దుబాయ్ లో ఆటగాళ్ల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బయటకు రాకుండా.. వారి వద్దకు ఎవరిని దరిచేరకుండా చూస్తున్నాయి.

అయితే ఇంత కఠినంగా ఉన్నా బుకీలు మాత్రం వారి ప్రయత్నాలు ఆపడం లేదు. ఇటీవల ఓ ఆటగాడిని ఫిక్సింగ్ కోసం బుకీలు సంప్రదించినట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని సమాచారం. దీంతో ఆ ఆటగాడు ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. దీంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

‘ఓ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని మా దృష్టికి వచ్చింది. అయితే తమ ప్రొటోకాల్ ప్రకారం ఆ క్రికెటర్ ఎవరనే విషయాన్ని మేము వెల్లడించలేం. విచారణ కొనసాగిస్తున్నాం. ఐపీఎల్ జరిగే దుబాయ్ లో బుకీలు ముందే చేరుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ముందుకు సాగనివ్వము’ అని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ తోపాటు స్థానిక పోలీసులతో కూడా కలిసి ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Related Images:

ఐపీఎల్ కోసం వచ్చి గుండెపోటుతో క్రికెట్ దిగ్గజం మృతి

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. మ్యాచ్ లు మొదలై టీంలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో క్రికెట్ జోష్ నెలకొంది. అయితే ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చిన ప్రఖ్యాత కామెంటేటర్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు.

యూఏఈలో జరుగుతున్న మెగా టీ 20 క్రికెట్ లీగ్ లో స్టార్ స్పోర్ట్స్ తరుపున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఇక్కడి నుంచే లైవ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుుదిశ్వాస విడిచారు.

మెల్ బోర్న్ లో పుట్టి పెరిగిన డీన్ జోన్స్ ఆస్టేలియా తరుపున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3631 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 216 సాధించగా 11శతకాలు నమోదు చేశారు. ఇక వన్డేలో మ్యాచ్ లు ఆడిన ఆయన 6068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు 46 అర్ధశతకాలు ఉన్నాయి.

Related Images:

కళ తప్పిన ఐపీఎల్… రీజనేంటో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మనమంతా పొట్టిగా ఐపీఎల్ అని పిలుచుకునే పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీ శనివారం నుంచే ప్రారంభమైపోయింది. ఐపీఎల్ అంటే… కిర్రెక్కించే చీర్ గాళ్స్ తో పాటు మతి పోగొట్టే ఫిమేల్ కామెంటేటర్లు సర్వ సాధారణమే కదా. అయితే కరోనా పుణ్యమా అని ఈ సారి చీర్ గాల్స్ తరహా ఎంటర్టైన్ మెంట్ లేకపోగా… తాజాగా ఐపీఎల్ ఫ్యాన్స్ కు స్టార్ స్పోర్ట్స్ మరో బ్యాడ్ న్యూస్ వినిపించింది. తనదైన శైలి అందంతో పాటుగా మేటి క్రికెటర్లనే తలదన్నేలా కామెంట్లతో క్రికెట్ లవర్స్ ను ఇట్టే ఆకట్టుకుంటున్న స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతి లాంగర్ ఈ టోర్నీకి దూరంగా ఉండిపోయిందట.

మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ భార్య అయిన మయంతి ఒక్క ఐపీఎల్ లోనే కాకుండా చాలా ఈవెంట్లకు ప్రజెంటర్ గా వ్యవహరించి సదరు టోర్నీలకు ప్రత్యేకమైన కళ తెచ్చిన సంగతి తెలిసిందే. ఫిమేల్ స్పోర్ట్స్ ప్రజెంటర్లు అర్చనా విజయ షిబానీ దండేకర్ లాంటి వారు ఎందరున్నా… మయంతి లుక్కే వేరని చెప్పక తప్పదు. గ్లామర్ తో పాటు క్రికెట్ లో తలలు పండిన ఆటగాళ్లకు మించిన పరిజ్జానంతో వ్యాఖ్యానం చేసే మయంతి ప్రత్యేకించి ఐపీఎల్ కు ఓ ప్రత్యేకమైన కళనే తెచ్చిందని చెప్పాలి. అయితే కరోనా నేపథ్యంలో ఈ దఫా ఐపీఎల్ దుబాయిలో జరుగుతుండగా… మయంతి మొత్తంగా టోర్నీకే దూరంగా ఉండేందుకు నిర్ణయించుకుంది.

ఇందుకు కారణమేంటంటే… ఇటీవలే మయంతి బిడ్డకు జన్మనిచ్చిందట. ఇటీవలే ప్రసవం జరగడం చిన్న బిడ్డతో కలిసి దుబాయికి రావడం అంత సేఫ్ కాదని మయంతి భావించిందట. దీంతో తాను ఈ ఐపీఎల్ కు ప్రజెంటర్ గా వ్యవహరించలేనని చెప్పేసిందట. ఇదే విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించేసింది. మొన్నటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్లన్నింటిలో మయంతి తనదైన శైలి ప్రజెంటేషన్ తో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకోగా.. ఇప్పుడు ప్రసవం నేపథ్యంలో ఆమె టోర్నీకి దూరమైపోయింది. దీంతో మయంతి లేని ఐపీఎల్ కళ తప్పినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related Images:

బ్యాట్ తో బంతిని కొడితే.. రోడ్డు మీద వెళ్లే బస్సును తాకిందే

బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి వస్తే చాలు సిక్సర్లతో బౌలర్లను చీల్చి చెండాడే బ్యాట్స్ మెన్లు కొందరు ఉంటారు. హెలికాఫ్టర్ షాట్ అన్నంతనే ధోనీ గుర్తుకు వస్తే.. సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు రోహిత్ శర్మ. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి.. బలంగా బంతిని మోదితే చాలు.. నేరుగా వెళ్లి స్టేడియంలోని ప్రేక్షకులు కూర్చున్న ఏదో ఒక చోటుకు దూసుకురావటం మామూలే.

అలాంటి రోహిత్ శర్మ ఐపీఎల్ సాధనలో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా ఒక బంతిని ఆయన బలంగా తాకటం.. అది కాస్తా గాల్లో ఎగిరి స్టేడియం బయట రోడ్డు మీద వెళుతున్న బస్సును తాకటం విశేషం. త్వరలో షురూ కానున్న ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ముంబయి ఇండియన్లు పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఒక బంతిని బలంగా మోదిన రోహిత్ శర్మ దెబ్బకు.. స్టేడియం బయట వెళుతున్న బస్సును బంతి తాకటం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రాక్టీస్ లోనే ఇంత జోరు మీద ఉన్న రోహిత్.. మ్యాచ్ సందర్భంగా మరెన్ని ఆసక్తికర షాట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారో?

 

View this post on Instagram

 

🙂 Batsmen smash sixes 😁 Legends clear the stadium 😎 Hitman smashes a six + clears the stadium + hits a moving 🚌 #OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @rohitsharma45

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

Related Images:

ఐపీఎల్ నుంచి సురేష్ రైనా తప్పుకోవడానికి అసలు కారణం అదేనా?

చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ప్రకటించాడు. దాంతో.. ఆ కారణాలేంటి..? అని పెద్ద ఎత్తున అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని ప్రశ్నించడంతో.. ఎట్టకేలకి సమాధానం లభించింది.

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆగస్టు 21న యూఏఈకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆరు రోజులు క్వారంటైన్లో ఉంది. ఆ క్వారంటైన్ గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్తో పాటు 10 మంది టీమ్ స్టాఫ్కి కరోనా పాజిటివ్గా శుక్రవారం తేలింది. దాంతో.. సురేశ్ రైనా శుక్రవారం రాత్రి తీవ్ర భయాందోళనకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం చెన్నై టీమ్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కి కూడా కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే.

ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవడంతో శుక్రవారం రాత్రి భయాందోళనకి గురైన రైనా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హెడ్కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్తో పదే పదే చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాను ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుని.. ఇండియాకి వెళ్లిపోతున్నట్లు వారితో రైనా స్పష్టం చేశాడట. కానీ.. రైనా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధోనీ.. అతనికి చాలాసేపు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయిందని చెన్నై టీమ్ అధికారి ఒకరు తెలిపారు. దాంతో.. ఢీలా పడిపోయిన రైనాని బలవంతంగా టీమ్తో ఉంచడం మంచిదికాదని భావించిన చెన్నై ఫ్రాంఛైజీ.. అతడ్ని భారత్కి పంపే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చెన్నై టీమ్లో కరోనా ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్ని కూడా సందిగ్ధంలో పడేసింది.

టోర్నీ నుంచి రైనా వైదొలగడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఇటీవల గుర్తు తెలియని దుండగుల దాడిలో అతని మామ చనిపోగా.. అత్త పరిస్థితి తీవ్రంగా ఉందట. దాంతో.. అతను ఇండియాకి వచ్చేస్తున్నట్లు చెప్తున్నారు.

Related Images: