మహానటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ చిత్రంలో ఆమె నటన అందరి మన్ననలూ పొందింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితంపై ఎంత డిస్కషన్ జరిగిందో.. ఆమె బాడీ లాంగ్వేజ్ పై అంతకన్నా ఎక్కువ చర్చ సాగింది. గతంతో పోలిస్తే కీర్తి చాాలా బరువు తగ్గడమే ఇందుకు కారణం. కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా పెంగ్విన్ చిత్రాలలో ఆమె బరువు తగ్గి కనిపించారు. ఈ లుక్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఆమె రూపం పట్ల నెగెటివ్ టాకే వినిపించింది. దీంతో.. ఆ ప్రభావం ఆమె లేటెస్ట్ మూవీపై పడుతుందేమోనని నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారట. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. అయితే.. గతానుభవాన్ని గుర్తుపెట్టుకొని కీర్తిని బరువు పెరగాలని సూచించారట ప్రొడ్యూసర్స్.
వస్తున్న ఫీడ్ బ్యాక్ ను గమనించి బరువు పెరుగుతున్నారట కీర్తి సురేష్. ఆమె లేటెస్ట్ పిక్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆమె తాజా ఫొటోలలో అంత సన్నగా కనిపించడం లేదంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే తన మునుపటి రూపాన్ని తిరిగి పొందడానికి కీర్తి ట్రై చేస్తోందని చెబుతున్నారు.
నిజానికి హీరోయిన్ కు కావాల్సింది ఇదే.. అభిమానులు తనను ఎలా చూడాలని కోరకుంటారో.. అలాగే ఉండాలి. అప్పుడే అటు ప్రేక్షకుల్లో ఆదరణ ఇటు ఇండస్ట్రీలో అవకాశాలూ పెరుగుతాయి. సో.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే ప్రిన్సిపుల్ ఫాలోవుతున్నారు. ఇదే నిజమైతే.. రాబోయే ‘సర్కారు వారీ పాట’లో కీర్తి గత బ్యూటీని చూడొచ్చు.
అందాల కథానాయిక కీర్తి సురేష్ ఇటీవల టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత నాయికా ప్రధాన చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి అటు హిందీ పరిశ్రమలోనూ ఓ చిత్రానికి సంతకం చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుత సన్నివేశం పరిశీలిస్తే కీర్తి బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్లతో పని చేయనుంది. కీర్తి సురేష్ డిసెంబర్ – జనవరిలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో షూటింగ్ ప్రారంభించి బిజీ కానున్నారు.
వచ్చే నెలలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన తమిళ-తెలుగు ద్విభాషా చిత్రీకరణను వచ్చే వారం ప్రారంభించనున్నారు. రజనీ హైదరాబాద్ వచ్చి `అన్నాతే` సుదీర్ఘ షెడ్యూల్ ని పూర్తి చేయనున్నారు. డిసెంబర్- జనవరి నెలల్లో ఈ చిత్రానికి కాల్షీట్లు ఇవ్వగలిగేలా ఇతర కమిట్ మెంట్లను షెడ్యూల్ చేయాల్సిందిగా మేకర్స్ కీర్తి సురేష్ ను కోరారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార- మీనా లాంటి అగ్ర నాయికలు నటిస్తున్నారు.
వచ్చే నెలలో సూపర్ స్టార్ మహేష్ `సర్కారు వారి పాట` రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుండగా… కీర్తి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకేసారి ఇరువురు సూపర్ స్టార్లకు తేదీలు కేటాయించడం కీర్తికి కాస్త టన్షనేనని చెప్పాలి. ప్రతిదీ ప్రాధాన్యతా క్రమంలో పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని కరోనా వేవ్ 2 అంటూ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట హైదరాబాద్ లో షూటింగ్ చేయబోతున్నారు.
ఇటీవలే లాంచనంగా సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ను 2021లో ప్రారంభిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. జనవరి లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో చిత్రీకరణ ప్రారంభించేందుకు దర్శకుడు పరశురామ్ సిద్దం అవుతున్నాడు. జనవరి మొత్తం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపనున్నారు. ఆ తర్వాత నెల అంటే ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంకు అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ జులై వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో మహేష్ బాబు ఉన్నాడట. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
దండుపాళ్యం అనగానే కరడుగట్టిన నేరస్తులు గుర్తుకు వస్తారు. ఇప్పుడు అదే గెటప్ లో కీర్తి సురేష్ తన కొత్త సినిమా సాని కాయిదం లో కనిపించబోతుంది. నేరస్తురాలో లేదా మరేంటో కాని గెటప్ మాత్రం అలాగే ఉంది. ఇటీవలే మిస్ ఇండియాలో మోస్ట్ బ్యూటీ ఫుల్ గా కనిపించిన కీర్తి సురేష్ ఉన్నట్లుండి ఈ లుక్ లో కనిపించింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకత్వం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ కూడా ఈ పోస్టర్ లో ఉండటంతో తమిళ ప్రేక్షకులతో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు. తలకు గాయాలతో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా చీర కట్టులో కాళ్లపై కూర్చుని ముందు ఆయుదాలు ఉండటంతో ఇదేదో క్రైమ్ డ్రామా మూవీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈమద్య కాలంలో కీర్తి సురేష్ ఒక వైపు హీరోలకు జోడీగా కమర్షియల్ రొమాంటిక్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అలా అలా ముందుకు సాగుతోంది. ఒక వైపు సర్కారు వారి పాట లో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో కమర్షియల్ రోల్ లో కనిపించబోతున్న ఈ అమ్మడు సాని కాయిదం సినిమాలో దండుపాళ్యం తరహా పాత్రలో కనిపించబోతుండటం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూత్ స్టార్ నితిన్ – ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”రంగ్ దే”. నేడు(అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రంగ్ దే’ నుంచి కీర్తి కి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫొటోలో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఉన్న కీర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే కొద్ది విరామం తరువాత చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లు నితిన్ – కీర్తి సురేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన మరికొన్ని సన్నివేశాలు మరియు ఇటలీలో పాటల చిత్రీకరణతో కొద్ది రోజులలోనే షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు.
కాగా నితిన్ – కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్.వెంకటరత్నం(వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ – వినీత్ – రోహిణి – కౌసల్య – బ్రహ్మాజీ -వెన్నెల కిషోర్ – సత్యం రాజేష్ – అభినవ్ గోమటం – సుహాస్ – గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమాతో దగ్గర అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా ఆ సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ డం దక్కించుకుంది. భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా నిరూపించుకుంటుంది. కీర్తి సురేష్ ను మహానటి సినిమా వరకు కాస్త బొద్దుగా ఉన్న లుక్ లో మనం చూశాం. కాని ఆ తర్వాత ఆమె సన్నబడుతూ వచ్చింది.
ఈ లాక్ డౌన్ లో ఆమె మరీ సన్నబడ్డట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. ఒంటి మీద కేజీ కండ లేదు అన్నట్లుగా కీర్తి సురేష్ ను ఈ ఫొటోలో చూస్తుంటే అనిపిస్తుంది. ఏదైనా కెమెరా ట్రిక్ తో ఇలా సన్నగా అయ్యిందా లేదంటే కీర్తి నిజంగానే ఇంత సన్నగా మారిందా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ నాజూకుగా ఉంటేనే బాగుంటారు. అలా అని ఇలా పీలగా ఉంటే ఏం బాగుంటుందంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కీర్తి సురేష్ తన మంచి లుక్ ను చెడగొట్టుకుందేమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు సైతం కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి కాస్త లావు అవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగులో సీనియర్ అగ్రహీరోలు ఆ నలుగురు కాకుండా.. ఓ పది మందికి పైగా స్టార్డం ఉన్న హీరోలు ఉన్నారు. హీరోలు ఇంత మంది ఉన్నా.. హీరోయిన్లు తక్కువ మంది ఉండడంతో నిర్మాతలకు దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. హీరోల డేట్లు చేతిలో ఉన్నా హీరోయిన్లు మాత్రం దొరకడం లేదు. అందరు హీరోలు పూజా హెగ్డే రష్మిక మందన్న కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి వారినే కోరుకుంటున్నారు. ఆ హీరోయిన్లందరూ తెలుగుతోపాటు హిందీ కన్నడ తమిళ సినిమాల్లో నటిస్తుండటంతో వారి డేట్స్ దొరకడం కష్టంగా మారింది. కియారా అద్వానీ మొదట్లో తెలుగు సినిమాలు వరుసగా చేసినా.. ఆమె ప్రస్తుతం హిందీ సినిమాలకే పరిమితం కావడంతో అందుబాటులో ఉండటం లేదు. సాయి పల్లవి అందరికీ ఆప్షనే అయినా ఆమె మాత్రం వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఆచితూచి తనకు నచ్చిన సినిమాలు మాత్రమే ఒప్పు కుంటున్నారు.
నిధి అగర్వాల్ సభా నటేష్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్నా వారిని ఎందుకు ఆఫర్లు వరించడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య వరుసగా సినిమాలు చేసినా.. ఆ తర్వాత ఆమె తమిళ్ హిందీ సినిమాల వైపు మొగ్గు చూపడంతో తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. అనుపమ పరమేశ్వరన్ మెహ్రీన్ లావణ్య త్రిపాఠి నివేద థామస్ ప్రగ్యా జైస్వాల్ పాయల్ రాజ్ పుత్ అను ఇమ్మాన్యుయేల్ రాశి కన్నా రీతూ వర్మ వంటి వారు అందుబాటులో ఉన్నా..ఫామ్ లో లేకపోవడంతో వారిని ఎంపిక చేసుకునేందుకు మేకర్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు.
ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిందీలో కబీ ఈద్ దివాళి తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప కన్నడలో ‘పొగరు ‘ తమిళ్ లో కార్తీతో సుల్తాన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో సర్కారు వారి పాట నితిన్ తో రంగ్ దే మిస్ ఇండియా గుడ్ లక్ సఖి రజనీ మూవీ ‘అన్నాత్తే’ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి పల్లవి మొదటి నుంచి సెలెక్టెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాగచైతన్య తో లవ్ స్టోరీ రానాతో విరాటపర్వం సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి శెట్టి ఇప్పటికే విడుదలైన ఉప్పెన వీడియో సాంగ్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ ఫైటర్ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మరి ఈ కొత్త భామల యినా విజయాన్ని అందుకొని టాలీవుడ్ కొరత తీరుస్తారేమో చూడాలి.
నేను శైలజ- మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ వల్ల సౌత్ స్టార్ హీరోయిన్ గా విశిష్ఠ గౌరవం అందుకుంది. అయితే మహానటికి ముందే నేను శైలజ ఫేం అంటూ కీర్తి ని మీడియా హైలైట్ చేసింది. నిజానికి నేను శైలజ కీర్తి నటించిన డెబ్యూ సినిమా కాదు. అంతకుముందే `ఐనా ఇష్టం నువ్వు` అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో సీనియర్ నరేష్ కుమారుడు విజయ్ నవీన్ కృష్ణ హీరో. ట్రైలర్ కూడా రిలీజైన ఈ మూవీ రైట్స్ విషయంలో గొడవలతో రిలీజ్ వాయిదా పడింది.
ఇప్పటికే ఐదేళ్లయ్యింది ఈ మూవీ ల్యాబుకి అంకితమై. ఈ సినిమాని నిర్మించిన కళాదర్శకుడు చంటి అడ్డాల ప్రస్తుతం టైటిల్ మార్పుతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. రైట్స్ నావద్ద ఉన్నాయి అంటూ మరో నిర్మాత కం పంపిణీదారుడు నట్టి కుమార్ అడ్డు పడుతున్నారట. చంటి అడ్డాలతో నట్టి గొడవ ఏమిటి? అన్నదానిపై సరైన క్లారిటీ ఏదీ లేదు. కారణం ఏదైనా కీర్తి నటించిన డెబ్యూ సినిమా అలా అప్పట్లో ఆగిపోయింది. ఇప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు.
ఆసక్తికరంగా ఈ మూవీని సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఇంతకీ ఐనా ఇష్టం నువ్వు రిలీజ్ హక్కుల పంచాయితీ తేలేది ఎప్పటికి అన్నది చూడాలి. ఇదే తరహాలో పలువురు కథానాయికలు నటించిన డెబ్యూ సినిమాలు రిలీజ్ చూడక ల్యాబుల్లో ఉన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాజ్యమేలే చాలామంది నటించిన సినిమాలు చాలా కాలం ల్యాబుల్లో మగ్గి తర్వాత రిలీజయ్యాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో మిగతా లీడ్ యాక్టర్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి కనిపించబోతుందని మరో న్యూస్ స్ప్రెడ్ అయింది.
కాగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ కు సిస్టర్ క్యారక్టర్ ఉండగా.. అందుకోసం ‘డర్టీ పిక్చర్’ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదిస్తున్నారట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని కోసం మహేష్ అండ్ టీమ్ స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ‘సర్కారు వారి పాట’కు థమన్ పాటలు అందిస్తుండగా మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ కెరీర్ కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏళ్లకు ఏళ్లు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా తికాణా లేని వాళ్లే ఎక్కువ ఇక్కడ. ఇక అలాంటి అనుభవం మహానటి కీర్తి సురేష్ కే ఎదురైంది! అంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాపులర్ హీరోయిన్ మేనక వారసురాలిగా ఆరంగేట్రం చేసినా టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆరంభమే చుక్కెదురైందట. నిజానికి కీర్తి తొలి సినిమా మిడిల్ డ్రాప్ అయిపోవడం తో ఆ ప్రభావం కూడా తనపై అంతే పడిందన్నది ఇన్నాళ్టికి లోగుట్టు బయటపడింది.
2016 లో రామ్ సరసన `నేను శైలజ` చిత్రం తో టాలీవుడ్ లోకి ప్రవేశించిందని కీర్తి గురించి ప్రచారమైనా.. నిజానికి వాస్తవం వేరే. అంతగా బయటి ప్రపంచానికి తెలియని వేరొక తెలుగు చిత్రానికి కీర్తి సురేష్ సంతకం చేసింది. `ఐనా ఇష్టం నువ్వు` అనేది ఆ మూవీ టైటిల్. ఆర్ట్ డైరెక్టర్ కం నిర్మాత చంటి అడాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్ తొలిసారి ఈ మూవీతో దర్శకుడయ్యారు. అయితే తెలియని కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆసక్తికరంగా ఇదే చిత్రంతో సీనియర్ నరేష్ వారసుడు నవీన్ కృష్ణ హీరోగా పరిచయం కావాల్సింది. అతడికి అది మైనస్ అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ని మార్చి ఇప్పుడు `జానకి నేను` పేరుతో ఆ మూవీని రిలీజ్ చేయనున్నారట. ఈ చిత్రం అక్టోబర్ లో ఒటిటి ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ ఇంకా వివాదాల్లో నానుతోంది. చంటి అడ్డాల నుంచి ఈ మూవీ రిలీజ్ హక్కుల్ని తాను కొనుక్కున్నానని నట్టి కుమార్ వాదిస్తున్నారట. చంటి అడ్డాల నుండి ఈ చిత్ర హక్కులను తాను కొనుగోలు చేశానని నిరూపించడానికి తన వద్ద అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలు ఉన్నాయని నట్టి చెబుతున్నారు. ఈ కొత్త వివాదంతో కీర్తి డెబ్యూ (కావాల్సింది) మూవీ వెలుగు చూస్తుందా లేదా అనేది చూడాలి.
టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమాలకు మార్చి నుండి బ్రేక్ పడ్డ విషయం తెల్సిందే. లాక్ డౌన్ సఢలించి జూన్ నుండి షూటింగ్స్ అంటూ ప్రకటించినా కూడా స్టార్స్ ఎవరు కూడా ఈ మూడు నెలలు ముందుకు రాలేదు. దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరంగా ఉన్న హీరోలు హీరోయిన్స్ మెల్లగా షూటింగ్స్ కు హాజరు అవుతున్నారు. కరోనా భయం ఇంకా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొనాలంటూ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హీరోయిన్స్ వారి సొంత ప్రాంతాల నుండి హైదరాబాద్ కు ఒక్కరు ఒక్కరుగా వచ్చేశారు. ఇంకా వస్తూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కీర్తి సురేష్ ల్యాండ్ అయ్యింది. సింపుల్ లుక్ లో కీర్తి కనిపించింది. మాస్క్ ధరించి.. చేతులకు గ్లౌజ్ లు పెట్టుకుని వైట్ టీ షర్ట్ మరియు బ్లాక్ పాయింట్ ను ధరించి బ్లాక్ షూ వేసుకుని సింగిల్ గా నడుచుకుంటూ కీర్తి సురేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించి అక్కడున్న వారి కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆమె ఏ సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చింది అనే విషయంపై క్లారిటీ లేదు. త్వరలో ఆమె ఏదో ఒక షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడట. వడ్డీ వ్యాపారిగా మహేష్ కనిపించడంతో పాటు ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలను పెద్దలకు కోట్ల రుణాలు ఇచ్చి వారు ఇవ్వలేకుంటే మాఫీ చేయడం వంటి విషయాలను లేవనెత్తూ పాత్ర సాగుతుందట.
కథలో మహేష్ రెండు విభిన్నమైన షేడ్స్ లో ఎందుకు కనిపించాల్సి వస్తుంది. అసలు కథలో ఉండే ట్విస్ట్ ఏంటీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ సాగుతుంది. అందులో మహేష్ పాత్రపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ నుండి పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. అతి థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు. అన్ని విషయాలకు స్పష్టత రావాలంటే సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కేరళ సాంప్రదాయ పండుగ అయిన ఓనం సందర్బంగా హీరోయిన్స్ చాలా మంది సాంప్రదాయ పద్దతిలో కనిపించారు. ఓనం స్పెషల్ సారీ అయిన గోధుమ వర్ణం చీరలను కట్టుకుని చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో సందడి చేశారు. కాని కొద్ది మంది మాత్రమే వావ్ అనిపించేలా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మహానటి ఫేం కీర్తి సురేష్ కూడా నిలిచింది. సాదారణంగానే సింపుల్ అండ్ ట్రెడీషనల్ డ్రస్ లు వేసే కీర్తి సురేష్ ఈసారి మరింత సింపుల్ గా చీర కట్టి హెయిర్ లీవ్ చేస్తే కుర్రాళ్ల గుండె అలా కొట్టుకుంటూనే ఉండి పోయింది.
ఓనం స్పెషల్ గోధుమ వర్ణం చీర మెరూన్ కలర్ బ్లౌజ్ లో కీర్తి సురేష్ ను చూసిన ఎవరు అయినా కొన్ని సెకన్ల పాటు అలా ఆగిపోవాల్సిందే. యాదృశ్చికంగా చూసినా కూడా కళ్లు కొంత సమయం తిప్పకుండా ఉండేలా కీర్తి ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓనం స్పెషల్ గా పోస్ట్ అయిన హీరోయిన్స్ ఫొటోల్లో కీర్తి సురేష్ బ్యూటీ టాప్ లో ఉంటుందంటూ ఆమె అభిమానులు అంటున్నారు. మొత్తానికి ఓనం పండుగతో కీర్తిని స్పెషల్ గా చూసినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు అభిమానులు.
‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో స్థిరపడిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా అందుకుంది. అప్పటి నుంచి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ ‘రంగ్ దే’ ‘అన్నాతే’ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ వంటి సినిమాలలో నటిస్తున్న కీర్తి సురేష్ మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది.
కాగా కీర్తి సురేష్ తాజాగా ‘సాని కాయిదం’ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ భుజానికి పొడవాటి కత్తిని కట్టుకొని.. చేతిలో తుపాకీ పట్టుకొని దుండగులకు ఎదురెళ్ళుతోంది. సెల్వ రాఘవన్ కూడా కత్తి పట్టుకొని నిలబడ్డాడు. మహానటి మరోసారి ఛాలెంజింగ్ రోల్ కనిపించబోతోందని అర్థం అవుతోంది. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.